Intinti Gruhalakshmi December 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను నా కోడల్ని గుండెలకి హత్తుకోటానికి వచ్చాను మమ్మల్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటుంది తులసి. ఇప్పుడిప్పుడే ఇంట్లో మనుషులందరూ కుదురుకుంటున్నారు మళ్ళీ కొత్తగా సమస్యలు తేవద్దు దయచేసి వెళ్ళిపో అంటాడు నందు. ఇప్పటికీ తులసిదే పెద్దలు నా బతుకు ఇంతేనా అంటుంది లాస్య.
తండ్రి మీద తిరగబడ్డ ప్రేమ్..
అంతే నీ మెంటాలిటీ ఈ ఇంట్లో ఎవరికీ నచ్చదు అంటాడు ప్రేమ్. పెద్దవాళ్లతో అలాగే మాట్లాడేది అని కొడుకు మీద చేయెత్తుతాడు నందు. అడ్డుపడిన తులసి పెద్దవాళ్లతో ఇలా మాట్లాడటం తప్పు సారీ చెప్పు అంటుంది తులసి. ముందు వాళ్ళ ఆవిడని నీకు సారీ చెప్పమను తర్వాత నేను ఆవిడకి సారీ చెప్తాను అంటాడు ప్రేమ్. ఆవిడ చేత నీకు సారీ చెప్పించడం చేతకాదు కానీ మనమీద అరుస్తాడు అంటూ తండ్రిని నానా మాటలు అంటాడు ప్రేమ. ఆ మాటలకి కోపంతో ప్రేమ్ ని కొట్టబోతాడు నందు.
అడ్డుపడిన సామ్రాట్, ప్రేమ్ ఆవేశంలో ఉన్నాడు నువ్వు కొంచెం తగ్గు అని చెప్తాడు. నన్ను బెదిరిస్తున్నావా వాడికి తినిపిస్తున్నావా అంటాడు నందు. ఆవేశం వద్దు అని ఇద్దరికీ చెప్తున్నాను తీసుకొని కాసేపు పక్కకు వెళ్ళు అంటాడు సామ్రాట్. నేను వెళ్ళను తగ్గేదే లేదు అయినా ఇదంతా తులసి వల్లే వచ్చింది, వద్దన్నా కావాలని వచ్చి మనల్ని చెడ్డవాళ్ళం చేసి తను హైలైట్ అవ్వాలని చూస్తుంది అంటుంది లాస్య. పిచ్చిగా మాట్లాడొద్దు నాకు ఆ ఉద్దేశమే ఉంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండే దానివి కాదు అంటుంది తులసి.
నందుని వెనక్కి తగ్గమన్న సామ్రాట్..
వాళ్ల మాటలు ఏమీ పట్టించుకోకు నువ్వు లోపలికి రా అంటాడు ప్రేమ్. సామ్రాట్ గారు నేను ఇక్కడికి వచ్చింది ఈ గొడవ చూడ్డానికి కాదు మనం వెళ్ళిపోదాం రండి అంటూ సామ్రాట్ చెప్పిన వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. సామ్రాట్ కూడా ఆమె వెనక వెళ్లిపోతాడు. చూసావా పెద్ద చిన్న లేకుండా ప్రేమతో ఎలా మాట్లాడుతున్నాడో అని తండ్రికి కంప్లైంట్ ఇస్తాడు నందు. వాడి ఆవేశానికి అర్థం ఉంది నీ ముహూర్తానికి అర్థం లేదు ఒకసారి ఆ ఇల్లాలని బయటకి పంపించి తప్పు చేశాం.
ఆ పాపం కడుక్కోడానికే మనకి జీవితకాలం చాలదు మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసావ్ అది ఈ ఇంటికి మంచిది కాదు ఆ విషయం పోను,పోను నీకే తెలుస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పరంధామయ్య దంపతులు. ఇదంతా నీ వల్లే నీకు ఎందుకు పక్షపాతం శుభవార్త అందరికీ సమానంగా చెప్పొచ్చు కదా అంటాడు నందు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు అంటుంది శృతి. నువ్వు ఎవరికి ఏ ఎక్స్ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు అంటూ భార్యని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు ప్రేమ్.
శృతికి సారీ చెప్పిన ప్రేమ్..
గదిలోకి తీసుకువచ్చి భార్యకి సారీ చెప్తాడు ప్రేమ్. నువ్వెందుకు సారీ చెప్పటం అని శృతి అడిగితే మొదటిసారి తెల్లవుతున్న క్షణాలు ఎంతో మధురంగా ఉంటాయి కానీ భర్తగా నీకు అలాంటి మొదటి క్షణాలు లేకుండా చేశాను అని బాధపడతాడు ప్రేమ. ఆనంద భాష్పాలు రావలసిన నీ కంట్లో కన్నీళ్లు వచ్చేలాగా చేస్తున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను అంటాడు ప్రేమ్. ఇందులో నువ్వు చేసిన తప్పు ఏముంది ఉంటుంది శృతి. భార్యకి ఏ కష్టం వచ్చినా భర్త వైపే కదా చూస్తుంది.
నా దరదృష్టానికి నువ్వేం చేస్తావు అని శృతి అంటే నన్ను పెళ్లి చేసుకోవటమే నీ దురదృష్టం అంటాడు ప్రేమ్. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇంకా మంది ప్రేమను పొందగలుగుతున్నాను అంటుంది శృతి. అసలు ఇదంతా నా వల్లే జరిగింది నేను కేవలం నా తృప్తి కోసమే ఆలోచించాను కానీ ఎదుటి వాళ్ళు తృప్తి కోసం నటించాలన్న ఆలోచన మనసులోకి రాలేదు అంటుంది శృతి. ఇవన్నీ ఆలోచించి ఉంటే ఆంటీ కి ఎంత అవమానం జరిగి ఉండేది కాదు అంటుంది శృతి.
భర్తకి సర్ది చెప్తున్న శృతి..
గొడవలు పెట్టుకోవడానికి కూడా సమయం సందర్భం ఉండక్కర్లేదా? లాస్య పంతం మన ఆనందంలో నీళ్లను పోసింది అంటాడు ప్రేమ్. సంతోషం మన దగ్గరికి రానప్పుడు మనమే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్దాం అంటుంది శృతి. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నామని తెలిసినప్పుడు చాలా ఏడ్చాను కానీ ఏం జరిగింది నాకు దక్కాల్సింది నాకే దక్కింది అలాగే ఇప్పుడు మన సంతోషం కూడా మనకే దక్కుతుంది అంటూ ప్రేమ్ కి ధైర్యం చెప్తుంది శృతి. సీన్ కట్ చేస్తే తులసిని ఎందుకు వెనక్కి తగ్గారు అని అడుగుతాడు సామ్రాట్.
నా పిల్లలు వాళ్ళ తండ్రికి దూరం అవ్వడం ఇష్టం లేదు అంటుంది తులసి. నా పిల్లల కేవలం నాతోనే ఉండాలి అనుకుంటే అది ఎప్పుడో సాధించుకునేదాన్ని, కానీ వాళ్లకి ఎవరో ఒకరి ప్రేమను దూరం చేయడం అంటే వాళ్లకి అన్యాయం చేసినట్లే అవుతుంది అంటుంది తులసి. నేను పోరాటం చేస్తుంది నేను పైకి ఎదగడం కోసం అంతేకానీ వాళ్ళ మనసులు గాయం చేయడం కోసం కాదు అంటే వాళ్ళ మనసులు ఎప్పుడో గాయపడ్డాయి అంటాడు సామ్రాట్. ఇదంతా లాస్య వల్లే అంటుంది తులసి. ఏది అనుకున్నట్టు జరగడం లేదు తప్పు ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు అంటుంది తులసి.
తులసిని పద్ధతి మార్చుకోమంటున్న సామ్రాట్..
కచ్చితంగా మీ వైపు అయితే లేదు అంటాడు సామ్రాట్. ఇప్పటికే జీవితంలో చాలా త్యాగాలు చేశారు పద్ధతి మార్చుకోండి అంటూ సలహా ఇస్తాడు సామ్రాట్. కాసేపు ఆఫీస్ కి వెళ్దామా మైండ్ డైవర్ట్ అవుతుంది అంటాడు సామ్రాట్. తల పట్టుకుని బాధపడుతున్న తులసితో కాఫీ పెట్టి తీసుకొని వస్తాను దెబ్బకి మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటూ కాపీ పెట్టడానికి వెళ్తాడు సామ్రాట్. అక్కడ కాఫీ పెడుతుంటే సామ్రాట్ చెయ్యి కాలుతుంది. కంగారుగా పండుగకు వచ్చిన తులసి చేతకాని పని చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఆ చేతికి మందు రాస్తుంది తులసి.
ఇంట్లో ఆడవాళ్లు లేరు కదా వంటలన్నీ నేర్చుకోవాలి కదా అంటూ సామ్రాట్ ని మందలిస్తుంది. నేనొకటి చెప్పనా అని సామ్రాట్ అంటే ఏంటి బిర్యానీ చేస్తారా అని అడుగుతుంది తులసి. కాదండి నేను కావాలనే చేయి కాల్చుకున్నాను మీరు అలా మూడీగా ఉంటే నాకు బాలేదు మిమ్మల్ని అక్కడి నుంచి ఎలాగైనా కదపాలని ఈ పని చేశాను. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా నేను హ్యాపీ అంటాడు సామ్రాట్. ఆ మాటలకి సామ్రాట్నే చూస్తూ ఉండిపోతుంది తులసి. మరోవైపు ప్రేమ్ అన్న మాటల్ని తలుచుకుంటాడు నందు.
మనం తప్పు చేసామేమో అంటున్న నందు..
అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటుంది. జరిగిందని గురించి ఆలోచిస్తున్నాను అంటాడు నందు. తులసిని పెళ్లి చేసుకోవడం గురించా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. నేను మాట్లాడుతుంది శృతి ప్రెగ్నెన్సీ గురించి హ్యాపీగా పండగ చేసుకోవాల్సిన అకేషన్ ని గొడవలతో స్పాయిల్ చేసుకున్నామనిపిస్తుంది అంటాడు నందు. దానికి మనం ఏం చేస్తాం నందు అంతా ఆ తులసి వల్లే అంటుంది లాస్య.
ఇంట్లో ఉన్న నేను ఎవరి కళ్ళకి ఆనట్లేదు, ఎక్కడో ఉన్న తులసికి ఫోన్ చేసి మరి పిలిపించుకుంటున్నారు అంటుంది లాస్య. తులసి వాళ్లకి అమ్మ అని నందు అంటే నువ్వు తండ్రివి నేను నీకు భార్యని అంతేగాని పరాయిదాన్ని కాదు కదా అంటుంది లాస్య. నన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగమనట్లేదు కనీసం మినిమం ఇంపార్టెన్స్ అయిన ఇవ్వాలి కదా అంటుంది లాస్య. ఎటు మాట్లాడలేకపోతున్నాను లాస్య, ఎవరికి చెప్పలేకపోతున్నాను అంటాడు నందు.
నందు కోసం ఏమైనా చేస్తానంటున్న లాస్య..
నిన్ను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు నందు, నీ కన్నా ఎక్కువగా నేను ఈ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. మంచి రెస్టారెంట్ లో శృతి,ప్రేమ్ కి పార్టీ ఇద్దాం అంటుంది లాస్య. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది అని నందు అంటే అంతకంటే విలువైన భార్య నీ పక్కన ఉంది, నీకోసం ఏమైనా చేస్తుంది. డబ్బు కోసం నేను ఏదో ఒకటి చేస్తాను ఎందుకంటే నీ కుటుంబం దృష్టిలో నువ్వు హీరోగా ఉండాలి కానీ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అంటుంది లాస్య. ఏంటది అని నందు అడిగితే తులసి పాలిటిక్స్ కి మన వాళ్ళని దూరంగా ఉంచాలి అంటుంది లాస్య.
నువ్వు నేను ఎంత మంచిగా ఉండాలని ట్రై చేసిన తులసి అడ్డం పడుతుంది అంటుంది లాస్య. సరే అంటాడు నందు. మరోవైపు తను పెట్టిన కాఫీని తనే మెచ్చుకుంటాడు సామ్రాట్. నేను కాఫీ బాగా పెట్టాను కదా అంటాడు సామ్రాట్. ఏంటి కాఫీ మీరు పెట్టారా స్టవ్ వెలిగించినంత మాత్రాన కాపీ పెట్టినట్లు కాదు అందులో కాఫీ పొడి చక్కర వేసింది నేను, ఆన్ చేత నేనే కాఫీ పెట్టినట్టు లెక్క అంటుంది తులసి. అసలు స్టవ్ వెలిగించకపోతే కాఫీ ఎలా రెడీ అవుతుంది మగవాళ్ళని ఎదగనివ్వరు, తొక్కేస్తారు ఈ ఆడవాళ్లు మీకు కుళ్ళు ఉంటాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi December 28 Today Episode: ఆడవాళ్లు మాయా లేడీలు అంటున్న సామ్రాట్..
చిటికెడంత పనిచేసి కొండంత పేరు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ మగవాళ్ళు మాయగాళ్లు అంటుంది తులసి. కాదు మీరే మాయ లేడీ లు అంటాడు సామ్రాట్. తరువాయి భాగంలో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తులసి ఇంటికి వెళ్లారని తెలుసుకున్న నందు ఆవేశంగా అక్కడికి బయలుదేరుతాడు. తులసి ఇంట్లో జరుగుతున్న సెలబ్రేషన్స్లో కాలుజారి పడిపోతుంది శృతి.