Intinti Gruhalakshmi December 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పార్టీలో ఎంజాయ్ చేస్తూ కాలు జారి పడిపోతుంది శృతి. బాధతో విలవిల్లాడిపోతుంది శృతి. అత్తయ్య సమయం కాదు అర్జెంట్గా హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అంటుంది అంకిత. అందరూ హామీని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. అప్పుడే తులసి ఇంటికి వచ్చిన నందుని పిల్లల్ని ఏమీ అనకు నందు ఇదంతా తులసి ప్లాన్.పిల్లలకి నచ్చచెప్పి తీసుకొని వెళ్దాం అంటుంది లాస్య.
కోపంతో తులసికి ఫోన్ చేసిన నందు..
కానీ అక్కడ ఎవరూ ఉండరు. నందు తులసిని పిలుస్తాడు. ఇంకెక్కడ తులసి ఇక్కడ పార్టీలో బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు లంచ్ కోసమే ఎక్కడికో బయటికి వెళ్లిపోయి ఉంటారు అంటుంది లాస్య. ఎక్కడ ఉందో తులసికే ఫోన్ చేసి అడుగుతాను అంటూ తులసికి ఫోన్ చేస్తాడు నందు. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపంతో మళ్లీ చేస్తాడు. మరోవైపు శృతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ వచ్చి పేషెంట్ కాలిక మీరేనా ఆమెకు ఏమైంది అంటే బెలూన్ మీద కాలు వేసి పడిపోయింది.
అప్పటినుంచి కడుపు నొప్పితో గిలగిల్లిలాడిపోతుంది తనకి ఏమీ కాకుండా చూసుకోండి ప్రెగ్నెన్సీ గురించి కంగారుపడుతుంది అంటుంది తులసి. ఏ విషయం నేను టెస్ట్లు చేసి చెప్తాను అంతా మంచే జరగాలని కోరుకుందాం అంటుంది డాక్టర్. బయట కంగారు పడుతున్న తులసిని మీరు ఇలా బాధపడుతుంటే పిల్లలు ఇంకా టెన్షన్ పడతారు అంటాడు సామ్రాట్. డాక్టర్ గారు చూసుకుంటానని చెప్పారు కదా అంతా మంచే జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకోండి అంటాడు సామ్రాట్.
కోడలు కోసం ఏడుస్తున్న తులసి..
శుభవార్త తెలిసిన రోజే ఈ అనర్థం జరగడం ఏంటి, అందరికంటే ముందుగా మీకే శుభవార్త చెప్తున్నాను ఆంటీ అంటూ సంతోషంగా ఫోన్ చేసింది. అంతలోనే ఆ దేవుడు ఎందుకిలా ఏడిపిస్తున్నాడు అంటూ ఏడుస్తుంది తులసి. పొద్దున్న హారతి చెజారినప్పుడే నేను కంగారు పడ్డాను ఇప్పుడు నా భయమే నిజమైంది అంటుంది తులసి. తల్లికి ధైర్యం చెబుతున్న ప్రేమతో మీ అమ్మ దురదృష్టవంతురాలని తెలుసు కదా ఎందుకు మా ఇంటికి తీసుకువచ్చావ్ అంటూ ప్రేమ్
ని మందలిస్తుంది.
ఆ వేడికి ఏదో ఆ ఇంట్లోనే జరిగి ఉంటే ఇలాగా జరిగేది కాదు అని బాధపడుతున్న తల్లిని నువ్వు దోషివి కాదు అలా ఆలోచించకు అంటాడు ప్రేమ్. ఇది చాలా మంచి హాస్పిటల్ శృతికి ఏమి కాకుండా డాక్టర్లు చూసుకుంటారు కాసేపు దేవుని తలచుకొని ప్రశాంతంగా ఉండు అంటాడు అభి. మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చిరాకు పడిపోతుంటాడు నందు. ఏమైంది తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని గ్లాస్ అడిగితే తులసే కాదు ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు అంటాడు నందు. తల్లి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ఉంటుంది పిల్లలు పాటిస్తున్నారు అంటుంది లాస్య.
జరిగిందంతా తండ్రికి చెప్పిన అభి..
చిన్న విషయాన్ని పెద్దది చేస్తుంది తులసి ఎన్నాళ్ళని అవాయిడ్ చేస్తుంది వాళ్లు వచ్చేవరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటాడు నందు. మనం వెయిట్ చేయటం కాదు నందు వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కొని మనమే అక్కడికి వెళ్దాం ఒకసారి అభికి కాల్ చెయ్ అంటుంది లాస్య. నందు, అభి కి ఫోన్ చేస్తే అభి లిఫ్ట్ చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు మీరందరూ ఒకే దగ్గర ఉన్నారని నాకు తెలుసు నాతో మాట్లాడొద్దని మీ అమ్మ చెప్పిందా అంటాడు నందు. నేను మళ్లీ మాట్లాడతాను అంటాడు అభి.
నేను తులసి ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి రావాలి నేనేనా మీ దగ్గరికి రావాలి అంటాడు నందు. అప్పుడు అది జరిగిందంతా చెప్తాడు. ప్రస్తుతం మేము హాస్పిటల్లో ఉన్నాం అని అభి చెబితే లాస్య పదా అని బయలుదేరుతాడు నందు. లాస్య ఎక్కడికి అని అడిగిన వినిపించుకోడు. ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత నీ టెన్షన్లో ఏదో తేడా కనిపిస్తుంది అభి లోపల్నుంచి అంకిత ఫోన్ చేసిందా శృతి గురించి ఏమైనా చెప్పిందా అని అడుగుతుంది తులసి.
అభిని నిలదీసిన తులసి..
అలాంటిదేమీ లేదు అంటాడు అభి. మరి ఎందుకు కంగారు పడుతున్నావు ఇంతకుముందు ఫోన్ చేసింది ఎవరు అంటుంది తులసి. డాడీ ఫోన్ చేశారు అంటాడు అభి. ఏమి చెప్పలేదు కదా అంటాడు ప్రేమ్, చెప్పాల్సి వచ్చింది అంటాడు అభి. ఎందుకు చెప్పావురా అలా ఇంటికి మనం ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు ఎక్కడికి వచ్చి కూడా తను గొడవ చేస్తుంది చూడు అంటుంది దివ్య. దానికి ఉన్న ఆలోచన కూడా నీకు లేదు అంటుంది తులసి.
చెప్పకూడదని అనుకున్నాను సెంటిమెంట్ ప్లే చేసి నాతో చెప్పించారు అంటాడు అభి. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండాల్సింది అంటాడు సామ్రాట్. ఈ మూడులో వాళ్లతో గొడవ పడే ఓపిక లేదు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతున్న తులసికి కోపంగా ఉన్న నందు ఎదురవుతాడు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు బయట ఉండి కూడా మా ఇంట్లో నీచక్రమే తిప్పాలి అనుకుంటున్నావా? నీ మాజీ మొగుడు ఒక చేతకాని వాడు కుటుంబాన్ని ఒకటిగా ఉంచుకోలేక చేతులు జోడించి నన్ను సహాయము అడిగాడు.
తులసి మీద రెచ్చిపోయిన నందు..
వాడు ఇక కట్టు బానిస పట్టించుకోక్కర్లేదు అనుకుంటున్నావా అంటూ కోపంగా అరుస్తాడు నందు. నీకోసం రెండు మెట్లు తగ్గిన మాట నిజమే కానీ నన్ను ఇలా వెన్నుపోటు పొడుస్తావనుకోలేదు అంటాడు నందు. వెన్నుపోటు ఏంటి అంటుంది తులసి. నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏంటి వెన్నుపోటు కాదా అంటాడు నందు. నా కోడలు నా కుటుంబానికి వారసుడిని అందివ్వబోతుంది అది నీకు సంబంధం లేని విషయం, నువ్వెందుకు మధ్యలో ఎంటర్ అవుతున్నావ్, నువ్వెందుకు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావ్ అంటాడు నందు.
నా ఇంట్లో జరగవలసిన సంబరం నీ ఇంట్లో జరగడాన్ని ఏమంటారు, వాడు కడుపులో ఉండదని మా అందరికీ దూరమయ్యే పరిస్థితికి తీసుకొని వచ్చావు నిన్ను వదిలిపెట్టను అంటూ ఆమె మీద చెయ్యి ఎత్తుతాడు నందు. అడ్డుపడతాడు సామ్రాట్. అడ్డు తప్పుకో సామ్రాట్ నన్ను రెచ్చగొట్టొద్దు అంటాడు నందు. రెచ్చిపోవడం నీకే కాదు నాకు వచ్చు కానీ ఇది హాస్పిటల్ పబ్లిక్ ప్లేస్ ఆవేశం తగ్గించి మనిషిగా మాట్లాడు అంటాడు సామ్రాట్. నువ్వు ఎవడు మా మధ్యలో మాట్లాడటానికి అంటాడు నందు. మైండ్ యువర్ లాంగ్వేజ్ నందగోపాల్, నేను కూడా నీకు లాగా నోరు జారి మాట్లాడితే తట్టుకోలేవు అంటాడు సామ్రాట్.
సామ్రాట్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్న లాస్య..
ఏ హక్కుతో తన మీదకి వస్తున్నావు అంటే తను నా మాజీ భార్య అంటాడు నందు. మాజీ భార్య అంతేకానీ భార్య కాదు రోడ్డుమీదకి లాగుతున్నది నీ భార్య బుద్ధి చెప్పాలంటే తనకి చెప్పు అంటాడు సామ్రాట్. నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకొని మా మీద చిచ్చు పెడుతున్నావ్ ఆవిడకి నోరు లేదా నీకు చెవుడా? అందరి ముందు చాలెంజ్ చేసి వెళ్ళిపోయింది అప్పుడు నువ్వు ఉన్నావు కదా అంటుంది లాస్య. శ్రుతి విషయంలో తులసి తప్పు చేసింది. అడిగే హక్కు నందు కి ఉంది.
తులసి మీద ఉంది మీ హీరోఇజం ఇక్కడ కాదు మీ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు చూపించు అంటుంది లాస్య. కోపంగా లాస్య మీద అరుస్తాడు సామ్రాట్. అలాగేనా మాట్లాడటం అంటాడు ప్రేమ్. నన్ను ఏ హక్కుతో మాట్లాడుతున్నావ్ అని అడుగుతున్నారు అసలు నువ్వు ఏ హక్కుతో తులసి కి అడ్డుపడుతున్నావు అంటాడు నందు. ఉందిగా పరమ బోరింగ్ ఆన్సర్ ఫ్రెండ్షిప్ అని, నమ్మే వాళ్ళు అమాయకులైతే నమ్మించే వాళ్ళు ఎన్నైనా చెప్తారు అంటుంది లాస్య.
తులసిని బ్లెయిమ్ చేస్తున్న నందు..
ఇప్పుడు ఓపిక నాకు లేదు శృతి ఆరోగ్యం కోసం బాధపడుతున్నాను అంటుంది తులసి. నువ్వు ఎప్పుడు ఏది చేయాలంటే అప్పుడు చేస్తావు కానీ ఎదుటి వాళ్ళు చేయాలంటే మాత్రం ముహూర్తాలు పడతావు అంటాడు నందు. నా వారసుడికి ఇలా జరగడానికి కారణం నువ్వే అంటాడు నందు. నేను కాదు అంటుంది తులసి. అంత త్వరగా ఒప్పుకుంటే తను తులసి ఎందుకు అవుతుంది తను ఒకప్పటి తులసి కాదు అంటుంది. ఎంత తెగించకపోతే నాకు చెప్పకుండా పిల్లలందరినీ నీ ఇంటికి రప్పించుకొని శృతి ప్రెగ్నెన్సీ ని సెలబ్రేట్ చేస్తావ్ అంటాడు నందు.
Intinti Gruhalakshmi December 30 Today Episode
వాళ్లు వచ్చేవరకు నాకు కూడా తెలియదు అంటుంది తులసి. తెలిసాకైనా పిల్లలకి ఎందుకు నచ్చ చెప్పలేదు అంటాడు నందు. వినలేదు తను పిలవకుండా మేమే వెళ్ళాము అంటాడు ప్రేమ్. తను తెలవదు కానీ వచ్చేలాగా చేసుకుంటుంది అదే మీ అమ్మ స్పెషాలిటీ అంటాడు నందు. తను అలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి భరించవలసిన అవసరం మీకేంటి అంటాడు సామ్రాట్.
మరోవైపు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన శృతికి ఏమేమి, తినలో ఎప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలో చెప్తుంది అంకిత . తులసి ఆంటీ నీకు గ్లూకోజ్ కూడా పంపించింది అంటుంది అంకిత. తులసి ఇంటర్ఫియర్ నాకు ఇష్టం లేదు అంటాడు నందు. మంచి ఎవరు చెప్పినా మంచే అంటుంది అనసూయ.