Intinti Gruhalakshmi December 31Today Episode : ఈరోజు ఎపిసోడ్ లో అన్ని మాటలు అంటుంటే విని ఊరుకుంటారేం అంటాడు సామ్రాట్. నీ కొండ చూసుకొని తను అలా రెచ్చిపోతుంది అంటాడు నందు. గొడవ పెంచొద్దు అంటూ సామ్రాట్ కి,నందుకి చెప్తుంది తులసి. నేను ఊరుకోను నా వారసుడు గురించి ఏమైనా చెడ్డ వార్త తెలిసింది అంటే నాకంటే రాక్షసుడు ఉండడు అంటాడు నందు.
తులసిని బెదిరిస్తున్న నందు..
ఎలాంటి చెడు వార్త వినకుండా చూడు దేవుడా అంటూ దండం పెట్టుకుంటుంది తులసి. అంతలోనే బయటకు వచ్చిన అంకితను ఏమైంది అని అడుగుతాడు నందు. టెస్టులు అయ్యాయి రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయమైనా తెలుస్తుంది అంటుంది అంకిత. నీకేమనిపిస్తుంది అంటుంది తులసి. శృతి సంతోషంగా తిరిగి రావాలని అనుకుంటున్నాను అంటుంది అంకిత. మరోవైపు నందు చెప్పింది నిజమో కాదో తులసిని కనుక్కోండి అంటూ భర్తకు చెప్తుంది అనసూయ.
తులసికి ఫోన్ చేసిన పరంధామయ్య నేను విన్నది నిజమేనా అని అడుగుతాడు. నిజమే మావయ్య అంటూ జరిగిందంతా చెప్తుంది తులసి. ప్రమాదమేమీ లేదు కదా అంటే లేదనే అనుకుంటున్నాం అంటుంది తులసి. మీకు ఎవరు చెప్పారు అంటే నందు చెప్పాడు అంటారు వాళ్ళు. నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది తులసి. నీ మీద నమ్మకం లేక కోడల్ని అడిగి తెలుసుకుంటున్నారు అంటూ నందుకు కంప్లైంట్ చేస్తుంది లాస్య.
లాస్యకు చివాట్లు పెడుతున్న అభి, దివ్య..
ఎందుకు మిస్ లీడ్ చేస్తారు మీ మీద నమ్మకంతో కాదు కంగారు ఆపుకోలేక అలా చేశారు అంటాడు అభి. శృతి కూడా అదే అంటుంది. ఇప్పుడు ఏం తప్పు మాట్లాడానని అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటుంది లాస్య. అసలే చిరాగ్గా ఉంది ఆర్గు్ చేయొద్దు అని అరుస్తాడు నందు. అంతలోనే డాక్టర్ బయటకు వచ్చి శ్రుతి రిపోర్ట్స్ అన్ని బాగున్నాయని, కడుపులో బిడ్డ గురించి కంగారు పడవలసిన పనిలేదని చెప్తుంది. దేవుడు ఉన్నాడు అంటూ సంతోష పడతాడు ప్రేమ్.
తను ఉన్నాను అని రుజువు చేయడానికి మనల్ని ఇంత ఏడిపించాలా? ఈ వార్త విన్నంతవరకు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగం లాగా గడిచింది. దేవుడు దయ చూపించాడు కాబట్టి సరిపోయింది, ఫలితం తిరగబడి ఉంటే ఈపాటికి నీ తల్లి చనిపోయి ఉండేది అంటుంది తులసి. ఛాన్స్దొరికిందని సెంటిమెంట్ ప్లే చేస్తుంది అనుకుంటుంది లాస్య. శృతిని చూడొచ్చు కదమ్మా అంటాడు నందు. చూడొచ్చు అంటే శృతివైపు వెళ్ళబోతాడు నందు.
భర్త దుమ్ము దులిపిన తులసి..
ఒక్క నిమిషం ఆగండి నందగోపాల్ గారు ఇందాక నన్ను అన్ని మాటలు అన్నారు ఇప్పుడు పిల్లి లాగా పారిపోతున్నారు ఎందుకు అంటుంది తులసి. పారిపోవడం ఏంటి అంటే మా ఊర్లో దీన్ని పారిపోవడం అని అంటారు. ఇందాక భయం లో ఉన్నాను అందుకే మీరు ఏమన్నా మౌనంగా భరించాను. ఇప్పుడు రిలాక్స్ అయ్యాను మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను అంటుంది తులసి. నాకు వినే ఓపిక లేదు అంటే విని తీరాలి అంటుంది తులసి.
నేను కుటుంబం విడిపోకూడదని పిల్లలు మీ ప్రేమకి దూరం కాకూడదని ప్రయత్నిస్తుంటే మీరు అర్థం చేసుకోవడం లేదు అర్థం చేసుకుందామన్న మీ పక్కనే ఉన్న శని అడ్డుపడుతుంది అంటుంది తులసి. కోపంతో అరుస్తుంది లాస్య. గొంతు తగ్గించు నేను నీ పని మనిషిని కాదు అంటుంది తులసి. పైసా సంపాదనలేని మీ మొగుడు పెళ్ళాల్ని నేను పోషించాను మీరు తెప్ప తగలేశారు. దాన్ని వెన్నుపోటు అంటారు.
నాక్కూడా హక్కు ఉందంటున్న తులసి..
మోసం చేసి మీ ఆవిడ ఇల్లు రాయించుకుంది దాన్ని వెన్నుపోటు అంటారు. మీ వారసుడి మీద మీకే కాదు నాకు కూడా హక్కు ఉంది అంటుంది తులసి. ప్రేమ్ కూడా ముందు నీకే మనవడు తర్వాతే ఆయనకి మనవడు అంటాడు. అంతా మీ ఇష్టమేనా అంటుంది లాస్య. నీ ఇష్టం మాత్రం కాదు అసలు ఈ గొడవ అంతా నీదే శృతిని చూడ్డానికి వచ్చినప్పుడు నన్ను రానిచ్చిఉంటే ఇంత గొడవ జరిగేది కాదు.
ఇంకొకసారి మా స్నేహబంధం గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ సామ్రాట్ కి సారీ చెప్తుంది తులసి. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ కుటుంబాన్ని అంతటినీ కలిపి ఉంచడానికి మీరు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో నాకు తెలుసు అలాంటి మీ మీద దౌర్జన్యం చేయబోతుంటే చూడలేకపోయాను అంతే అంటాడు సామ్రాట్. మీరే లేకపోతే వీళ్ళు మా అమ్మని ఎక్కడికో దూరంగా పారిపోయేలాగా చేసేవారు అంటాడు ప్రేమ్.
అమ్మతో వెళ్లిపోతానంటున్న ప్రేమ్..
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే శృతిని తీసుకొని నీ దగ్గరికి వచ్చేస్తాను అంటాడు ప్రేమ్. అదెలా కుదురుతుంది అంటాడు నందు. మా అమ్మకి గౌరవం లేని చోట మేము ఉండవు అంటాడు ప్రేమ్. ప్రేమ ఇస్తే ప్రేమ తిరిగి వస్తుంది అంటుంది తులసి. గడువు తీరాక పరిస్థితుల్లో మార్పు రాకపోతే నేనేమీ చేయలేను అంటుంది తులసి. ఇక వెళ్లి మీ కోడల్ని చూడండి అంటుంది తులసి. అందరూ క్షేమంగా ఉన్న శృతిని చూసి సంతోషిస్తారు. తులసి సామ్రాట్ తో కలిసి వెళ్ళిపోతుంది.
కారులో వెళ్తూ భర్త అన్న మాటలకి బాధపడి కారుని ఒకసారి పక్కకి ఆపమని సామ్రాట్ ని అడుగుతుంది తులసి. మొహం కడుక్కొని మంచినీళ్లు తాగుతుంది. చెప్పాల్సినవన్నీ నందగోపాల్ మొహం మీరే చెప్పేశారు తలదించుకోవాల్సింది ఆయన కానీ మీరు కాదు అంటాడు సామ్రాట్. నాకు ఆయన్ని కలవాలని కానీ గతాన్ని తప్పుకోవాలని కానీ లేదు కానీ అన్నీ ఆయనే బలవంతంగా చేయిస్తున్నారు అంటుంది తులసి. మనిషి మారారేమో అని సంతోషపడ్డాను కానీ చాలా పొరపాటు పడ్డాను అంటుంది తులసి.
నా వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలుసంటున్న తులసి..
మీ అత్తయ్య వాళ్ళని మీ దగ్గరికి తెచ్చేసుకుంటారా అంటాడు సామ్రాట్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనుకోవటం లేదు అంటుంది తులసి. అలాగని వాళ్ళకి దూరంగా ఉండాలని కూడా అనుకోవటం లేదు అంటాడు సామ్రాట్. నా మొండితనం నటన, నా ప్రేమ నిజం అంటుంది తులసి. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు అంటాడు సామ్రాట్. నాకుగా నేను గడువు పెట్టుకున్నాను అప్పటివరకు ఓపిక పడతాను. ఆ తర్వాత నాకు నా వాళ్ళ కోసం ఏం చేయాలో చేసి తీరుతాను అంటుంది తులసి.
మీరు వేడిగా ఉన్నారు చల్లబడతారేమో అని టీ ఆర్డర్ చేశాను అంటూ టీ ఇస్తాడు సామ్రాట్. ఆ మాటకి నవ్వుతుంది తులసి. మీరు చల్లబడ్డారు బాగుంది కానీ టీ చల్లబడితే బాగోదు తాగండి అంటాడు సామ్రాట్. రేపు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది గుర్తుందా అంటాడు సామ్రాట్. సారీ మర్చిపోయాను అంటుంది తులసి. నాకు కావలసింది సారీ కాదు రేపు మీటింగ్ ని మీరే డీల్ చేయాలి. బాధ్యతని పూర్తిగా నీ మీద వదిలిపెడుతున్నాను అంటాడు సామ్రాట్.
తులసి పెత్తనం నాకిష్టం లేదంటున్న నందు..
నా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారేమో అంటే అవును నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతున్నాను అంటాడు సామ్రాట్. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటుంది తులసి. మరోవైపు డిశ్చార్జ్ అయిన తులసిని ఇంటికి తీసుకుని వస్తారు. మనవరాల్ని పలకరించిన అనసూయ ఎలా ఉంది ఇంకా రెండు రోజులు హాస్పిటల్ లోనే ఉండకపోయావా వాళ్ళైతే బాగా చూసుకుంటారు కదా అంటుంది. మీరేమీ కంగారు పడకుండా అమ్మమ్మ నేను ఉన్నాను కదా చూసుకోవడానికి అంటుంది అంకిత.
ఏ మాత్రలు ఎప్పుడు వేసుకోవాలో తులసి ఆంటీ వీటి మీద రాసిచ్చారు వాటిని ఫాలో అవ్వు అంటూ శృతికి చెప్తుంది అంకిత. నువ్వు డాక్టర్ వే కదా ఏ మందులు ఎప్పుడు వేయాలో నీకు తెలియదా? మధ్యలో తులసి చెప్పడం ఎందుకు ఉంటాడు నందు. మంచి ఎవరు చెప్పినా వినాలి అంటుంది అనసూయ. మధ్యలో తనకేంటి సంబంధం తను చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాడు నందు. మన ఇంట్లో తులసి చెప్పింది విని తలాడించడమే కానీ తులసికి చెప్పే చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.
Intinti Gruhalakshmi December 31Today Episode : తులసిని వెనకేసుకొస్తున్న అనసూయ..
హైరానా పడకు నీ మాట ఎవరు వినరు అంటుంది లాస్య. తులసి ముగ్గురు పిల్లల్ని కానీ పెంచింది ఆ అనుభవంతోనే కోడలికి జాగ్రత్తలు చెప్పి ఉంటుంది అందులో తప్పేముంది అంటుంది అనసూయ. అదేంట అత్తయ్య మీరు మాత్రం పిల్లల్ని కనలేదా మీకు తెలియదా జాగ్రత్తలు అలాంటప్పుడు ఆవిడే చెప్పాలా పెత్తనం ఆవిడ చేతిలో పెట్టడం ఎందుకు అంటుంది లాస్య. పెత్తనం అంటే బీరువా తాళాలు లాక్కోవడమా? తులసి ఎప్పుడూ అలా చేయలేదు అంటుంది అనసూయ.ఈరోజు జరిగిన గొడవకి కారణం తులసి అంటాడు నందు. తను పిలవలేదు మేమే వెళ్లాం అంటుంది శృతి.
ఈ ఇంటికి పెద్దవాడిని నేను ఉన్నాను కదా నాకు చెప్పాల్సిన అవసరం లేదా అంటాడు నందు. చెప్తే వెళ్ళనిచ్చే వాడివా అంటాడు పరంధామయ్య. వెళ్లకుండా ఇంటికి తాళం వేసేవాడిని అంటాడు నందు. అందుకే చెప్పలేదు అంటాడు పరంధామయ్య. తరువాయి భాగంలో బెనర్జీ గారి గురించి ఎంక్వయిరీ చేస్తుంది తులసి. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయబోతున్న సామ్రాట్ ని ఆపుతుంది.