Intinti Gruhalakshmi February 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను నిర్ణయం తీసుకోగలను కానీ ఏ మూలనో స్వార్థం నా చేత సరియైన నిర్ణయాన్ని తీసుకోనివ్వదు అందుకే నిన్ను సలహా అడుగుతున్నాను అంటే మీ వల్ల అందరూ ఏదో ఒక విధంగా సహాయం పొందారు కానీ మీ వల్ల ఏ సహాయం పొందనిది మీ మనవళ్ళు, మనవరాలు.

అదిరిపోయే సలహా ఇచ్చిన తులసి..

అనుకోకుండా వచ్చిన ఈ ఆస్తిని వాళ్ళ పేరు మీద రాస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటుంది తులసి.సరైన సలహా ఇచ్చావు నేను ఆ దిశగా ఆలోచించనే లేదు. వాళ్ళ నాన్న ఎలాగూ వాళ్లకోసం ఏమి చేసే పొజిషన్లో లేడు, ఒకవేళ చేద్దామన్న లాస్య చేయనివ్వదు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ నాన్న చేయలేని పని నేను చేస్తాను అంటాడు పరంధామయ్య. మరింకేమి సమస్య తీరిపోయింది కదా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోండి అంటుంది తులసి.

మరోవైపు తండ్రి దగ్గరికి వచ్చిన నందుని ఏంటి అలా నిలబడ్డావు అని అడుగుతాడు పరంధామయ్య. నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అని అంటే నేను కూడా నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటాడు పరంధామయ్య. రాస్తే నా పేరు మీద రాశాను అని చెప్పడానికే నేమో అంటూ ఆనంద పడిపోతాడు నందు, ముందుగా ఆయన్ని చెప్పమంటే సరిపోతుంది లేకపోతే నేను బయట పడినట్లుగా అయిపోతుంది అనుకొని ముందు మీరే చెప్పండి నాన్న అంటాడు నందు. ముందు నీకే చెప్తున్నాను ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు అంటాడు పరంధామయ్య.

నందు దంపతులకు షాకిచ్చిన పరంధామయ్య నిర్ణయం..

మీరు ఇలా చెప్తున్నారు అంటే శుభవార్త అయి ఉంటుంది నందు నోట్లో వేయడానికి చక్కెర తీసుకొస్తాను అంటుంది లాస్య. అందరికీ చెప్పినప్పుడు అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటూ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని అదృష్టమో నా అదృష్టమో తెలీదు కానీ ఆ భగవంతుడు నాకు ఆస్తి వచ్చేలాగా చేశాడు. దాన్ని ఎలాగా ఉపయోగించాలో అర్థం కాక తులసిని సలహా అడిగాను మంచి సలహా ఇచ్చింది అంటాడు పరంధామయ్య.

పర్వాలేదు ఎప్పుడు గోతులు తీసే తులసి నందుకు ప్రాపర్టీ ఇవ్వమని చెప్పి ఉంటుంది అంటూ ఆనందపడుతుంది లాస్య. ఈ ఆస్తిని మన వాళ్ళ పేరుమీద మనవరాలు పేరు మీద రాయమని చెప్పింది మంచి సలహా ఇచ్చింది కదా అంటాడు పరంధామయ్య. ఆ మాటలకి షాక్ అవుతారు నందు దంపతులు. నేను ఎప్పటినుంచో నా కాళ్ళ మీద నిలబడాలని ప్రయత్నిస్తున్నాను, బిజినెస్ కి పెట్టుబడి దొరకడం లేదు అనుకోకుండా ఈ ఆస్తి కలిసి వచ్చింది కదా అందుకని నా పేరు మీద పెట్టండి అంటాడు నందు.

తులసిని రిక్వెస్ట్ చేయమంటున్న లాస్య..

ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను, దానిమీద వెనక్కి వెళ్ళాలని లేదు. అయినా నేను రాసేది నీ పిల్లలకే గాని పరాయి వాళ్ళ పిల్లలకి కాదు కదా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పరంధామయ్య. మరోవైపు ఆలోచనలో ఉన్న నందు దగ్గరికి వచ్చిన లాస్య ఇంట్లో అందరూ తులసి ఏది చెప్తే అది ఫాలో అయిపోతున్నారు ఇదేంటి అని అడగడానికి లేదు, ఒకానొకప్పుడు మీ నాన్న కోసం మీ అమ్మని కూడా ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పావు, కానీ ఆయన మాత్రం నీకు ఆవగింజంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వటం లేదు నీకోసం అస్సలు ఆలోచించకుండా నాస్తి మొత్తం పిల్లలకే అంటూ కరాకండిగా చెప్పేశారు.

తులసి సలహా అంటూ అదేదో దేవుడు రాసిన తలరాత లాగా ఫీల్ అవుతూ మార్చటానికి వీల్లేదు అంటున్నారు అంటుంది లాస్య. తులసి ఆస్తి తన పేరు మీద రాయమంటే అది స్వార్థం అవుతుంది కానీ పిల్లల పేరు మీద రాయమంది అందులో తప్పేముంది నేను చేయలేని పని తను చేసింది అందుకు సంతోషించాలి అంటాడు నందు. మనం సమస్యల్లో ఉన్నాం కాబట్టి మనకి తులసి ఇచ్చిన సలహా తప్పుగా అనిపిస్తుంది అంటాడు. నువ్వు కూడా గొర్రెల మందలో కలిసి పోయావా అంటుంది లాస్య.

అయోమయంలో నందు..

నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు ఇది నా అభిప్రాయం అంటాడు. మరి ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చేస్తావు ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఆ తులసి చేతుల్లో ఉంది ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతే అంటుంది లాస్య. ఆల్రెడీ మావయ్య తులసి ఒక డెసిషన్ తీసుకున్నారు ఇక మిగిలింది పిల్లలు మాత్రమే, కాబట్టి ఆస్తిని నీకు ఇవ్వమని పిల్లల్ని రిక్వెస్ట్ చేయమని తులసిని అడుగు అంటుంది లాస్య. తులసిని అడగాలా అంటూ అయోమయంలో పడతాడు నందు.

తప్పదు ఇంట్లో అందరూ కలిపి మనల్ని అష్టదిగ్బంధనం చేశారు అంటుంది లాస్య. మరోవైపు తులసికి హెల్ప్ చేద్దామని వస్తాడు నందు. మీరు వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి కాదు వచ్చిన విషయం చెప్పండి అంటుంది తులసి. అదే వచ్చిన ఆస్తి పిల్లల పేరు మీద రాయమని చెప్పావంట కదా అంటాడు నందు. అది నా సలహా మాత్రమే నిర్ణయం ఆయన మీదే వదిలేసాను అంటుంది. ఆయన సంగతి తెలిసిందే కదా నువ్వు ఏది చెప్తే అదే వేదం అంటాడు నందు. చెట్టు బలంగా ఉండాలంటే దాని కాండాలు కూడా బలంగా ఉండాలి.

తులసిని రిక్వెస్ట్ చేస్తున్న నందు..

ఆ ప్రాపర్టీ నేను బిజినెస్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. పెట్టుబడి లేక బిజినెస్ ఐడియా డ్రాప్ చేసుకున్నాను. నువ్వు పిల్లలతో మాట్లాడి ఆ ప్రాపర్టీ నాకు ఇప్పించే లాగా మాట్లాడితే బాగుంటుంది అంటాడు నందు. పర్మినెంట్గా ఇవ్వద్దు మూడు ఏళ్లలో తిరిగి ఇచ్చేస్తాను రిక్వెస్ట్ చేస్తాడు నందు. ఏం చూసి మిమ్మల్ని నమ్మాలి నా జీవితంలో మిమ్మల్ని నమ్మితే మీరు ఏం చేశారు ఒకటి చెప్పండి అంటుంది తులసి. అది ముగిసిపోయిన జీవితం దానికి దీనికి ముడి పెట్టొద్దు అంటాడు నందు.

ప్రాపర్టీ కి గ్యారెంటీ చూపించమని అడుగుతారు నన్ను ఏం చూపించమంటారు అని అడుగుతుంది తులసి. అంటే ప్రాపర్టీని నాకు ఇవ్వద్దు అని పిల్లల సలహా ఇస్తావా అంటాడు నందు. నాకోసం పిల్లల్ని రిక్వెస్ట్ చేయొచ్చు కదా అంటాడు నందు. ఆ పని చేయమని చెప్పి సలహా ఇచ్చిందే నేను మళ్లీ నేనే మీ నాన్నకి అవసరం అంట ఇవ్వండి అని ఎలా చెప్తాను. పిల్లలు చిన్నవాళ్లు కాదు పెళ్లిళ్లు అయ్యి సంసారాలు చేసుకుంటున్నారు.

నాకు సంబంధం లేదంటున్న తులసి..

మీరు మీ భార్య వింటున్నట్లే వాళ్ళు వాళ్ళ భార్య మాటలే వింటున్నారు అంటుంది తులసి. నువ్వు చెప్తే వాళ్ళు వింటారు అంటాడు నందు. నిజమే కానీ దాన్ని వాడుకొని నా మాట వినండి అంటూ వాళ్ళని శాసించలేను కదా అంటుంది తులసి. అసలు నన్ను అడగటం ఎందుకు మీరే అడగొచ్చు కదా ఇష్టపడి ఇస్తే సంతోషంగా తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు, అది వాళ్లకి మీకు సంబంధించిన విషయం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. తర్వాత సీన్లో అందరూ భోజనాలు చేస్తుండగా ఆస్తిని మీ పేరు మీద రాస్తున్నాను అంటూ మనవళ్ళకి చెప్తాడు పరంధామయ్య.

చిన్నప్పుడు నా బాధ్యతల వల్ల నా పిల్లల ఆటపాటలు చూసుకోలేకపోయాను, కానీ ఆ లోటుని మీతో తీర్చుకున్నాను. మీరందరూ నా మనసుకి దగ్గరయ్యారు అందుకే నా ఈ చిన్న బహుమతి అంటాడు పరంధామయ్య. మొహం మాడ్చుకున్న నందు దంపతులని గమనిస్తుంది తులసి. ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోండి ఆస్తిని పోగొట్టుకోవడం చాలా సులభం కానీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం ఈ విషయంలో మీరు మీ నాన్న అనుభవాన్ని పాఠంగా తీసుకోండి అంటాడు పరంధామయ్య.

పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్న నందు..

కావాలని ఎవరు బిజినెస్ ని పాడు చేసుకోరు మా తరఫున తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, అయినా మన చేతిలో లేని విషయాలు కూడా మనల్ని కంట్రోల్ చేస్తాయి అంతే తప్పితే ఇందులో నందు నిర్లక్ష్యం ఏమీ లేదు అంటుంది లాస్య. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించినా నాకు జాబ్ దొరకట్లేదు, అందుకే నేను ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ పెట్టుబడి దొరక్క ఆగిపోయాను ఇలాంటి సమయంలో ఆస్తి నాన్న చేతికి రావడం దాన్ని మీకు రాసేవ్వడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే నా వైపు నుంచి ఆలోచించి చూడండి.

నా బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మీ ప్రాపర్టీని కొంతకాలం నాకు ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు నందు. నేను ఎదిగితే మీకు అండగా ఉంటాను ఈ కుటుంబానికి సహాయంగా ఉంటాను అంటాడు నందు. మీరు నోరు విప్పి అడిగితే వాళ్ళు మాత్రం కాదని ఎలా అనగలరు మీకు వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉందో వాళ్లకి మీ మీద కూడా అంత బాధ్యతే ఉంది అంటుంది లాస్య. ఏమంటావ్ అని నందు అడిగితే మీ పరిస్థితికి నాకు జాలిగనే ఉంది కానీ నా అవసరాలు నాకు ఉంటాయి కదా మీకులాగే నాకు కూడా చాలా టార్గెట్స్ ఉన్నాయి.

మీ మీద నమ్మకం లేదంటున్న ప్రేమ్..

కానీ చేతిలో డబ్బులు లేక ఆగిపోయాను ఇప్పుడు వాటి గురించి ఆలోచించాలి అనుకుంటున్నాను అంటాడు అభి. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నాకు ఫస్ట్ సపోర్ట్ చేసేది నువ్వే అనుకున్నాను కానీ ఇలాంటి సపోర్ట్ చేస్తావ్ అనుకోలేదు అంటాడు నందు. నువ్వు ఏమనుకుంటావో అని అది ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు అంటుంది లాస్య. అభి నాకోసం ఆలోచించి ఉంటే మా జీవితాలు ఇంకొకలాగా ఉండేవి, ఈ విషయంలో మాత్రం డెసిషన్ అభిదే అంటుంది అంకిత.

మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడటం నాకు చేతకాదు మీ మీద మీ పక్కనున్న ఆవిడ మీద నాకు నమ్మకం లేదు. నా ప్రాపర్టీని మీ చేతుల్లో పెట్టి రిస్క్ తీసుకోలేను శృతి డెలివరీ కోసం నేను ఎవరి ముందు చేయిచాలి అనుకోవట్లేదు నా అవసరాలు నాకు ఉన్నాయి అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు ప్రేమ్. అవసరంలో ఏ ఒక్కరూ సహాయ పడరా ఎందుకు ఇలాగా కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నారు పెద్దవాళ్లు పక్కన పెట్టినట్లు పిల్లలు కూడా ఆయన్ని పక్కన పెడితే ఎలా అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi February 1 Today Episode: కోపంతో రగిలిపోతున్న నందు..

అలాంటప్పుడు అమ్మ చూపించిన ఉద్యోగం చేయాలి కదా ఎందుకు ఆయనకి అంత ఈగో ప్రాబ్లం అంటాడు ప్రేమ్. ఆ మాటలకి బాధతో వెళ్లిపోతాడు నందు. మరోవైపు పిల్లల మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ గులాబీ ముళ్ళని చేత్తో గట్టిగా పట్టుకుంటాడు. అతని చేతి నుంచి రక్తం కారడాన్ని గమనించిన తులసి బాధపడుతుంది. ముందు చేయి వదలండి రాను రాను ఎందుకు ఇలాగా తయారవుతున్నారు అంటూ భర్తని మందలిస్తుంది.

తరువాయి భాగంలో నన్ను మనసారా ఏడవనీ అంటాడు నందు. మీ పరిమితిలో మీకు నవ్వే కెఫే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటూ సలహా ఇస్తుంది తులసి. అదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్తే పులికి గాయమైందని చికిత్స చేస్తే కోలుకున్న వెంటనే అది చేసే మొదటి పని వైద్యం చేసిన వాడిని తినేయడమే ఎందుకంటే అది క్రూర మృగం కాబట్టి అంటాడు ప్రేమ్.