Intinti Gruhalakshmi February 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఈ నెక్లెస్ నీ చేతులతోనే నా మెడలో వెయ్యు అంటుంది లాస్య. నందు తన మెడలో నెక్లెస్ వేస్తే బ్లెస్స్ మీ అంటూ తన పాదాలకి దండం పెడుతుంది. మెడలో నెక్లెస్ బరువు పడితేనే కానీ మొగుడు పాదాలు పట్టుకోవడానికి నడుము వంగలేదు అంటూ అనసూయ దెప్పుతుంది. తర్వాత వంతు ప్రేమ్ వాళ్ళది వస్తుంది. ప్రేమ్ చీటీ తీస్తే అందులో తన పార్ట్నర్ మీద ఉన్న ప్రేమని అందరి ముందు నిరూపించుకోవాలి అని వస్తుంది.

 

ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్ కి ఎమోషనల్ అయిన శృతి..

 

అప్పుడు ప్రేమ్ ఒక గిఫ్ట్ ఇచ్చి ఇది ఓపెన్ చేస్తే నువ్వంటే నాకు అంత ఇష్టమో నీకే తెలుస్తుంది అంటాడు. దాన్ని ఓపెన్ చేసిన శృతి ఎమోషనల్ అవుతుంది. శృతి వాళ్ళ నాన్నగారు 10 ఏళ్ల నుంచి వేసుకున్న కడియం చాలా రోజుల నుంచి కనిపించలేదు దాని కోసం శృతి బెంగపెట్టుకుంది ఆరు నెలలు కష్టపడి దీన్ని వెతికి సంపాదించాను అంటాడు ప్రేమ్. అందరూ చప్పట్లు కొడతారు.

 

ఇక అయిపోయింది కదా అందరికీ భోజనాలు పెట్టేస్తాను అని తులసి అంటే తప్పించుకోవాలని చూస్తున్నావా నువ్వు కూడా చీటీ తీయు అంటాడు ప్రేమ్. మాకంటే లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారు నీకు ఎవరు ఉన్నారు అంటుంది లాస్య. నాకు లైఫ్ పార్ట్నర్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావు నాక్కూడా లైఫ్ పార్టనర్స్ ఉన్నారు అంటూ చీటీ తీస్తుంది తులసి. మీ పార్టనర్ కి రోజా పువ్వు ఇవ్వాలి అంటూ ఆ చీటీలో ఉంటుంది.

 

తులసి లైఫ్ పార్టనర్ ఎవరు?

 

కొంపదీసి సామ్రాట్ కి ఇవ్వదు కదా అంటూ టెన్షన్ పడతాడు నందు. కానీ తులసి అత్తమామలతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి ఆ రోజ్ ని ఇస్తుంది. వీళ్లే నా లైఫ్ పార్ట్నర్స్ ఇదే నా కుటుంబం. జీవితంలో అన్ని పోగొట్టుకొని ఒంటరిగా నిలబడిన సమయంలో మీ అందరిని నీకోసం ఉన్నామంటూ నాకోసం నిలబడిన వీళ్ళందరూ నా లైఫ్ పార్టనర్సె. వీడియో లేకపోతే నేనులేను నన్ను లైఫ్ లో మీరు ఎవరు వదిలేసి వెళ్ళిపోరు కదా అంటూ ఎమోషనల్ అవుతుంది.

 

అందరూ ఆమె చుట్టూ చేరి ఆమెని ఓదారుస్తారు. మరోవైపు అత్తగారి దగ్గరికి వచ్చిన అభి డల్ గా ఉంటాడు. త్వరలో కాబోయే ఎన్ఆర్ఐ డాక్టర్ వి నువ్వు ఎంత హుషారుగా ఉండాలి మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా, ఆ ఇల్లు వదిలే వరకు నీకు ఈ తలనొప్పులు తగ్గవు. మా అమ్మాయిని కంట్రోల్ చేయడం నీవల్ల కాదు అని ఆశ వదిలేసుకున్నాను నా కూతురు ఇంకా ఆ ఇంటి పనిమనిషి అని డిసైడ్ అయిపోయాను కానీ కథలో భలే ట్విస్ట్ ఇచ్చావు యూఎస్ తీసుకెళ్లడానికి నా కూతుర్ని ఒప్పించి మొగుడిగా నీకు కెపాసిటీ నిరూపించుకున్నావు.

 

అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన అభి..

 

నువ్వు యూఎస్ వెళ్లే లోపులా నీకు సన్మానం చేస్తాను అంటుంది. నేను ఇన్ని మాట్లాడుతున్న ఎందుకు నువ్వు డల్ గా ఉన్నావు నీకు డబ్బు ఏమైనా కావాలా అంటుంది గాయత్రి. నేను డబ్బు కోసం రాలేదు డబ్బు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అంటే 10 లక్షలు ఆమె చేతిలో పెడతాడు అభి. డబ్బులు తిరిగి చేయడమేంటి అని గాయత్రి అడిగితే ఒక పుణ్యకార్యాన్ని పాపపు డబ్బుతో చేయటం నాకు ఇష్టం లేదు అంటాడు అభి. మమ్మల్ని మా ఫ్యామిలీ నుంచి వేరు చేయడానికి మీరిచ్చిన డబ్బు పాపకు డబ్బే అంటాడు.

 

నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడినుంచి వచ్చాయి అని గాయత్రి అంటే ప్రతి మంచి పనికి ఒక టైం వస్తుంది అంటాడు అభి. నీకు ఎవరో చేతబడి చేశారు అని గాయత్రి అంటే కాదు మా భార్యాభర్తల్ని కలిసి ఉంచే మార్గం చూపించారు అంటాడు అభి. మీ ఫ్యూచర్ ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని గాయత్రి అంటే అందరిని ఏడిపించి నేను ఎదగడం నాకు ఇష్టం లేదు అలాంటి ఫీచర్ నాకు అక్కర్లేదు అంటాడు అభి. నా సహాయం లేకుండా నువ్వు యూఎస్ వెళ్లలేవు అంటే నేను సంపాదించిన డబ్బులతోనే నా భార్యని యూఎస్ తీసుకువెళ్తాను.

 

కేఫ్ దెబ్బతీయాలన్న ప్లాన్లో గాయత్రి..

 

 

మీరు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పొద్దులు గాని డబ్బులతో ప్రేమని కొలవలేము నేను మారాను మీరు కూడా మారండి ప్రేమతో మీ కూతురు మనసు గెలుచుకోండి అంటూ ఆమె చేతిలో డబ్బు పెట్టేసి వెళ్ళిపోతాడు అభి. కేఫ్ సక్సెస్ అయింది సంపాదన పెరిగి తులసి, నందులలో కాన్ఫిడెన్స్ పెరిగింది అందుకే ఈ ఎదురు తిరగడం చెప్తాను కేక్ మూతపడేలాగా చేస్తే ఆటోమేటిక్గా అందరి నోర్లు మూతపడతాయి ఇకమీదట అదే పనిలో ఉంటాను అనుకుంటుంది గాయత్రి.

 

మరోవైపు అందరూ భోజనాలు దగ్గర కూర్చుంటారు. ఏమో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడే వచ్చినా లాస్య మేం లేకుండా చూసి నవ్వుకుంటున్నారేంటి అని అంటే నువ్వు వస్తే ఆ ఛాన్స్ ఇవ్వవు కదా అంటూ చురక పెడతాడు ప్రేమ్. నేను ఇప్పుడే చెప్తున్నాను రేపు ఎవరు ఏ పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండండి అంటుంది తులసి. అయితే హాయిగా తొమ్మిది వరకు ముసుకుని పడుకోవచ్చు కదా అని ప్రేమ అంటే రెస్ట్ తీసుకోవాల్సింది కడుపుతో ఉన్న మీ ఆవిడ నువ్వు కాదు అని నవ్వుతుంది అనసూయ.

 

తాతగారిని ఆట పట్టిస్తున్న ప్రేమ్..

 

ఇంట్లో ఎందుకు ఉండాలి ఏంటి స్పెషల్ అని అంకిత అడిగితే రేపు శివరాత్రి ఇంట్లో పూజ ఉంటుంది అంటుంది తులసి. అయితే ఇంట్లో స్పెషల్స్ వండుతారు అనమాట అని ఆనందంతో చెప్తాడు ప్రేమ్ అలా ఏం కాదు రేపు ఉపవాసం అంటుంది తులసి. అలాంటివి నాకు పెట్టకండి కావాలంటే నా బదులు తాతయ్య చేస్తాడు అంటాడు ప్రేమ్. నన్ను ఇరికించొద్దు అంటూ నవ్వుతాడు పరంధామయ్య. ప్రతి శివరాత్రి రోజు కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని శివ పూజ చేసుకోవడం ఆనవాయితీ అంటుంది అనసూయ.

 

మా తర్వాత కూడా మీరు దీన్ని కంటిన్యూ చేయండి మేము ఎక్కడ ఉన్నా చూసి సంతోషిస్తాము అంటాడు పరంధామయ్య. మీరు ఎక్కడికి వెళ్లరు నిండు నూరేళ్లు మాతోనే ఉంటారు అని తులసి అంటే ముసలిప్రాణాలు ఎక్కువ కాలం బ్రతికి ఉండడం ఎవరికీ మంచిది కాదు అంటాడు పరందామయ్య. నువ్వు అర్జెంట్గా పైకి వెళ్లి ఏం చేయాలి రంభ, వూర్వశిలతో డాన్స్ చేయాలా అంటూ తాతయ్యని ఆటపట్టిస్తాడు ప్రేమ్. ఇంతలో అభి వచ్చి అమ్మ దగ్గర అన్నం పెట్టమనట్లుగా నోరు చాపుతాడు.

 

అసలు నిజాన్ని అంకితకి చెప్పిన అభి..

 

ఆశ్చర్యపోతూ అతని నోట్లో ముద్ద పెడుతుంది తులసి. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లొచ్చావు అని తులసి అడిగితే నా మనసుని నమ్మేస్తున్న మాయాపొరల్ని తొలగించుకోవడానికి మా అత్తగారింటికి వెళ్లొచ్చాను అంటాడు అభి. పొద్దున్నే వెళ్లి ఆవిడ గారికి హారతి ఇచ్చేస్తేనే గాని ప్రశాంతంగా ఉండదా దేశం విడిచి వెళ్ళిపోతున్న కూడా నీలో కొంచెం కూడా మార్పు రావట్లేదు అంటే కేకలు వేస్తుంది అంకిత. ఏం పని మీద వెళ్లావు అని తులసి అడిగితే ఇకపై ఆవిడ దగ్గర ఏ అవసరం లేదని చెప్పటానికి వెళ్ళాను వీసా కోసం ఆవిడ ఇచ్చిన పది లక్షలు ఆవిడకే తిరిగి ఇచ్చేసాను అంటాడు అభి.

 

బరువు దించేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది అని అభి అంటే నాకు ఏమీ అర్థం కాలేదు అంటుంది అంకిత. నేను నీతో ఒక అబద్ధం చెప్పాను నేను నేను కష్టంతో సంబంధించిన డబ్బులతో కాకుండా మీ మమ్మీ ఇచ్చిన డబ్బులతో నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను అది ఎంత పెద్ద నమ్మకద్రోహమో మామ్ చెప్పేక నాకు తెలిసింది. మన మధ్య నమ్మకం సమాధి అయిపోతే మన మధ్య ప్రేమ కూడా సమాధి అయిపోతుంది అని తెలుసుకున్నాను అందుకే మీ మామ కి డబ్బు తిరిగి ఇచ్చేసాను అంటాడు అభి.

 

అభి మాటలకి ఎమోషనల్ అయిన అంకిత..

 

అందుకు అందరూ సంతోషిస్తారు. నా కష్టార్జితంతోనే నిన్ను న్యూ ఇయర్ తీసుకువెళ్తాను నా మాట నమ్ము అంటాడు అభి. ఆ మాటలకి ఎమోషనల్ అయిన అంకిత వెళ్లి అభిని హాగ్ చేసుకుంటుంది. సో లవ్ బర్డ్స్ లాగా అమెరికా వెళ్ళిపోతున్నారన్నమాట అంటూ ఆట పట్టిస్తాడు ప్రేమ్. మరోవైపు కెఫెలో నందు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను జాబ్ కోసం వచ్చాను అని చెప్తాడు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమీ లేదే అంటాడు నందు.

 

మరి నన్ను ఎందుకు పిలిచారు అని ఆ వ్యక్తి అంటే నేనేమీ పిలవలేదే అంటాడు నందు. అంతలోనే అక్కడికి వచ్చిన లాస్య నేనే రమ్మన్నాను అంటుంది. ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అయినా ఇక్కడ ఉన్న చెఫ్ బానే చేస్తున్నాడు కదా అను నందు అంటే బానే అంటే జస్ట్ అడ్జస్ట్ అవుతున్నాము అంతే కానీ ఇతను అరవింద్ ముంబైలో గ్రేట్ చెఫ్ కాంటినెంటల్ నుంచి చైనీస్ వరకు అన్ని చాలా బాగా చేస్తాడు. ఇలాంటి వాళ్లు ఒకరు ఉంటే చాలు మన కేఫై రేంజ్ పెరిగిపోతుంది.

 Intinti Gruhalakshmi February 16 Today Episode:లాస్య మాట కాదన్న నందు..

 

పాపులారిటీ కూడా పెరిగిపోతుంది రేపు జాయిన్ అయిపోవటానికి వచ్చేయండి అంటూ ఆ వ్యక్తితో చెప్తుంది లాస్య. ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు కావాలంటే కాల్ చేస్తాను నెంబర్ మేడం గారి దగ్గర ఉంది కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ లాస్య కూడా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చందు ని పిలిచి మీకు ఇక్కడ అన్ని పనులు అలవాటయ్యాయి కదా మేము లేకపోయినా కూడా మీరు కెఫేని నడిపించగలిగిన కెపాసిటీ వచ్చి ఉండాలి అంటుంది తులసి.

 

అంతలోనే చందు కి గాయత్రి ఫోన్ చేయడంతో ఈ టైంలో ఫోన్ చేస్తుంటే ఏంటి నా కొంపములుగేలాగా ఉంది అని కట్ చేసేస్తాడు. వీడు నా కాల్ కట్ చేసేసాడు ఏంటి అప్పుడే కొమ్ములు వచ్చేసాయా అంటూ కోపంతో తగిలిపోతుంది గాయత్రి. తరువాయి భాగంలో కేఫ్ మూయించడమే నా టార్గెట్ అని చెప్పి ఏదో ప్లాన్ చెప్తుంది గాయత్రి. దాని ప్రకారం బర్గర్ ని మార్చి పెడతాడు చందు ఈ లోపల ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు వచ్చి శాంపిల్స్ ని తీసుకెళ్తారు. ఈ శాంపిల్స్ లో ఏమైనా తేడా వస్తే కనుక మీ కేఫ్ ని సీజ్ చేయాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇస్తారు.