Intinti Gruhalakshmi February 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చేతికి ఉన్న రక్తాన్ని చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరిని సాధిద్దామని అసలు మీకు మైండ్ పనిచేస్తుందా అంటూ కేకలు వేస్తుంది తులసి. నీకు నా చేతి నుంచి వచ్చినా రక్తమే కనిపిస్తుంది నా గుండెల్లో కారిన రక్తం మీకు కనిపించడం లేదు అంటాడు నందు. చేతికి కట్టు కట్టి చేతికి గాయం చేసుకుంటే గుండెల్లో గాయం పోతుందా సమస్య తీరిపోతుందా, మొన్న ఇలాగే చేశారు అప్పుడు చెప్తే సరే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ పిచ్చి పని అంటుంది తులసి.

నందు కి చివాట్లు పడుతున్న తులసి..

నా ఏడుపు నన్ను ఏడవని నన్ను వదిలేయ్ అంటాడు నందు. నేనేమీ మీ మీద ప్రేమతో కట్టు కట్టలేదు, ఏదో బంధం ఉంది అని కట్టుకట్టలేదు కానీ నా తోటి మనిషి బాధపడుతుంటే నేను చూడలేను. నాతో మాట్లాడటం నా ప్రశ్నలకి సమాధానం చెప్పటం మీకు చిరాగ్గా ఉంటే మీ ఆవిడని పంపిస్తాను పక్కన కూర్చొని ఓదారిస్తుంది, మీ కన్నీరు తుడుస్తుంది అంటుంది తులసి. రియలైజ్ అయిన నందు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది అంటాడు నందు.

మీరు ఇదంతా కావాలని తెలిసే చేస్తున్నారు. కన్న తండ్రి మీరే ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా మీ పిల్లలు నీ నుంచి ఏం నేర్చుకుంటారు అంటుంది తులసి. నాకు వాళ్లకి ఏం సంబంధం ఉందని వాళ్ళు నా నుంచి నేర్చుకోవడానికి, నా మీద నమ్మకం లేదు గౌరవం లేదు అంటాడు నందు. అది మీ అసలు సమస్య ఇప్పుడు బయటపడ్డారు. ఆస్తులు ఇస్తేనా పిల్లలా, మిమ్మల్ని నమ్మి ఆస్తులు ఇవ్వనంత మాత్రాన వాళ్లు మీకు ఏమీ కార అసలు మన డైవర్స్ అయిన తర్వాత వాళ్లకోసం మీరు ఏం చేశారు చెప్పండి ఏమి చేయలేదు.

అదిరిపోయే సలహా ఇచ్చిన తులసి..

కానీ వాళ్ళు మీకు గౌరవం ఇస్తున్నారు నాన్న అని పిలుస్తున్నారు కానీ మీరు మాత్రం వాళ్లు ఆస్తులు ఇవ్వలేదని కోపగించుకుంటున్నారు బంధాన్ని వదిలేసుకునేంతలాగా ఫీలవుతున్నారు మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా అంటుంది తులసి. నాకు నా పిల్లల మీద ఎలాంటి ద్వేషము లేదు కాకపోతే విలువ పోగొట్టుకొని కూర్చున్నాను అదే బాధగా ఉంది అంటాడు. అదే పాట ఎన్నాళ్ళు పడతారు మీ బిజినెస్ కి సరిపడా డబ్బు లేనప్పుడు అందుబాటులో ఉన్న బిజినెస్ చేయండి అంటూ కెఫే బిజినెస్ గురించి చెప్తుంది తులసి.

అక్కడ నుంచి వెళ్ళిపోతున్న తులసికి లాస్య ఎదురవుతుంది. అడక్కుండా సలహాలు ఇవ్వటం నీకు ఏమైనా జబ్బా అని అడుగుతుంది. నీకేమీ ఇవ్వలేదు కదా అని అడిగితే నందుకు ఇస్తున్నావ్ కదా అంటుంది లాస్య. బాగుపడితే చూద్దామని అంటుంది తులసి. తప్పుడు సలహాలు ఇస్తున్నావు అంటుంది లాస్య. అదే విషయాన్ని మీ ఆయనకి చెప్పు ఆ పిచ్చిది ఏదో సలహాలు ఇస్తుంది వాటిని పట్టించుకోకండి అని చెప్పు, అయినా నా మీద పడి ఏడవడం మానేసి అదేదో ఉత్తమ ఇల్లాలు అనిపించుకుందామని ప్రయత్నిస్తున్నావు కదా దాని సంగతి చూడు అంటూ అక్కడఅక్కడినుండి వెళ్ళిపోతుంది తులసి.

పంతంతో అడ్డుపడుతున్న లాస్య..

మరోవైపు కెఫే స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను అంటాడు నందు. చాలా సంతోషం ఇంతకుముందు పనిచేసిన అనుభవం ఇప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది కాకపోతే అప్పుడు పెట్టుబడి నీది కాదు ఇప్పుడు నీది అంటాడు పరంధామయ్య. అది మాత్రం తక్కువ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది ముఖ్యంగా స్థలం దొరకడం చాలా కష్టం అంటుంది అనసూయ. ఒకవేళ దొరికిన చాలా డిపాజిట్ కట్టాలి అంటాడు అభి.

సంకల్పం ఉంటే అన్ని పనులు అవే సంకరుతాయి మావయ్య గారు ప్రేమకి ఇచ్చిన స్థలంలో మ్యూజిక్ స్టూడియో కట్టాలని అనుకుంటున్నారు కదా అందులో కొంచెం ప్లేస్ మిగులుతుంది, అది రద్దీగా ఉండే ఏరియా కాబట్టి అక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటుంది తులసి. ఈ ఐడియా నాకు రానేలేదు అంటాడు నందు. అందుకే కదరా మేమందరం తులసి సలహాలు మీద ఆధారపడేది అంటాడు పరంధామయ్య. నాకు ఈ ప్రపోజల్ నచ్చలేదు అంటుంది లాస్య.

ఆలోచించి అడుగు వెయ్యమంటున్న లాస్య..

నీకు రెగ్యులర్ ప్రొఫెషన్ కాదని కెఫెలో పనిచేసి నీ పరువు తీసుకున్నావు సరిపోలేదా మళ్లీ ఎందుకు దానివైతే మొగ్గుచూపుతున్నావో అర్థం కావట్లేదు. తులసి సలహా ఇచ్చిందా అంటుంది లాస్య. సాఫ్ట్ వేర్ సైడ్ జాబ్స్ రావడం లేదు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అంటాడు నందు. నీ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ని మధ్యలో బ్రేక్ చేస్తే లైఫ్ లో మళ్ళీ సాఫ్ట్వేర్ జాబు దొరకదు ఇది అన్ని ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యు.

ఒకవేళ నీ బిజినెస్ లో లాస్ అయితే ఆ లాస్ ని భరించడానికి మీ వాళ్ళు ఎవరు ముందుకు రారు నేరాన్ని నీ మీదే తోసేస్తారు అంటుంది. నేను లాస్ అవుతానని నీకు అంతా నమ్మకమా ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తావు కష్టపడే వాడికి ఎప్పుడూఅదృష్టం వెంట ఉంటుంది. ఇది నాకు ఉద్యోగం కాదు నా జీవితం. నా వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని ఉద్యోగం లేకపోతే వేరే దారి చూసుకోవాలి కదా ఎంతకాలం ఖాళీగా కూర్చోవాలి ఎంతకాలం నా పిల్లలకి బరువుగా ఉండాలి. ఏదో ఒక ప్రయత్నం చేయని నా కాళ్ళ మీద నన్ను నిలబడని అంటాడు నందు.

ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటున్న నందు..

తొందరపడకు ఆలోచించు అంటుంది లాస్య. ఆలోచించడానికి ఏమీ లేదు ఇదే నా ఫైనల్ డెసిషన్ అంటాడు నందు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు ప్రేమ్ కూడా కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతాడు. ప్రేమ్ గదిలోకి వెళ్లిన తులసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటుంది. అంటే ప్రశాంతంగా ఉండి తీసుకునే నిర్ణయాలు అన్ని సరైనవేనా, నాన్న నువ్వు పెళ్లి చేసుకోవాలని ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా నిర్ణయం తీసుకున్నారు అది సరైనదేనా అని అడుగుతాడు ప్రేమ్.

పాతికేళ్ళు కాపురం చేసాము ముగ్గురు పిల్లల్ని కన్నాము సరైన నిర్ణయం కాకపోతే ఇవన్నీ ఎలాగా జరుగుతాయి. ప్రతి నిర్ణయానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మా పెళ్ళికి సంబంధించిన నిర్ణయానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటుంది తులసి. ఇప్పుడు మనం చర్చించవలసింది దాని గురించి కాదు ఇప్పుడు మీ నాన్నగారికి బిజినెస్ పెట్టుకోవడం కోసం ప్లేస్ ఇవ్వడం గురించి అంటుంది తులసి. నా స్టూడియో పక్కన అయినా కేఫై పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు ప్రేమ్.

ప్రేమ్ కి నచ్చ చెప్తున్న తులసి..

ఆయన ఇష్టం లేదా అయినా బిజినెస్ పెట్టుకోవడం ఇష్టం లేదా అంటుంది తులసి. సమాధానం మీకు తెలుసు అంటాడు ప్రేమ్. నీలో ఆయన రక్తం ప్రవహిస్తుంది అని తులసి అంటే కానీ బుద్ధులు మాత్రం కావు ఆయన రుణం తీర్చుకోవాలి అంటే ఆయన కన్నందుకు కాదు నీలాంటి మంచి తల్లిని ఇచ్చినందుకు. మనిషికి జాలీ ఉండొచ్చు కానీ దానికి కూడా ఒక పరిమితి ఉండాలి పులికి గాయమైందని దానికి వైద్యం చేస్తే ఆ గాయం తగ్గగానే పులి చేసే మొదటి పని వైద్యం చేసిన మనిషిని మింగేయటం ఎందుకంటే అది క్రూర జంతువు.

నాన్న కూడా అంతే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు అవసరం తీరేక మరొక లాగా బిహేవ్ చేస్తాడు. ఆయనలో మనం అంచనా వేయలేని మనిషి దాక్కున్నాడు అంటాడు ప్రేమ్. ఎదుటివాడు ఎలాంటివాడో అంచనా వేసి సహాయం చేయడం కాదు వాళ్ళ అవసరాన్ని బట్టి మనం సహాయం చేయాలి. ద్వేషిస్తున్న మనుషుల్ని కూడా ఆ దేవుడే సృష్టించాడు అంటుంది తులసి మనం దేవుళ్లను కాదు, ప్రతి మంచితనం గొప్పతనం కాదు పిచ్చితనం అంటాడు ప్రేమ్. పోనీలే నేను పిచ్చిదాన్ని అనుకో అంటుంది తులసి.

ఎప్పుడో ఆయనతో బంధాన్ని తెంచేసుకున్నామన్న ప్రేమ్..

నిన్ను రాచి రంపాన పెట్టిన ఆయన వైపు ఎందుకు నిలబడుతున్నావు, ఎందుకు మా అందరినీ బాధ పెడుతున్నావు అని ప్రేమ్ అడిగితే ఎందుకంటే ఆయన నా పిల్లలకి తండ్రి కాబట్టి మిమ్మల్ని మీ తండ్రి నుంచి దూరం చేయకూడదు కాబట్టి అంటుంది తులసి. ఆయన ఎప్పుడైతే నీకు డైవర్స్ ఇచ్చేశారు అప్పుడే ఆయనతో బంధాన్ని తెంచేసుకున్నాం పని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ్. మరోవైపు నందుని చూసి జాలిపడతాడు పరంధామయ్య.

కానీ వాడి వెనక ఉన్న భూతాన్ని చూసి వాడికి సాయం చేయటానికి ఎవరు ముందుకు రావడం లేదు అంటుంది అనసూయ. ఉన్నంతలో తులసి మంచి సలహానే ఇచ్చింది అంటాడు పనుందామయ్య. కానీ వాడి అదృష్టానికి లాస్య ప్రేమ్ అడ్డుపడుతున్నారు, అయినా ఆ లాస్యకి ఏం పోయేకాలం మొగుడు ఏదో ఒకలాగా సంపాదించమే కదా కావాల్సింది, వాడు జాబ్ లేక నిరాశలో కూలికి పోతున్నాడు ఇదేమీ పట్టదా ఆ లాస్యకి అంటుంది.

నందు కోసం తపన పడుతున్న తల్లిదండ్రులు..

పంతం ఆ తులసి సలహా ఇవ్వటం ఏమిటి అని పంతం. ప్రాపర్టీ వాడి పేరు మీద రాయలేదు కదా అది తన పంతం. మనల్ని బెదిరించడానికి ఈ అలక. ఆ మాత్రం కూడా వారికి నాతో చెప్పుకోలేడా అంటుంది అనసూయ అదే వాడి బలహీనత, తన ముందు వాడు గట్టిగా నోరత్తలేకపోతున్నాడు అంటాడు పరంధామయ్య. మరి ఇప్పుడు ఎలాగా అంటుంది అనసూయ. నువ్వు వెళ్లి బ్రెయిన్ వాష్ చెయ్యు ఈ అవకాశం వదులుకుంటే మళ్లీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదని చెప్పు అంటాడు పరందామయ్య.నాకు దాని మొహం చూడటమే ఆశయము వాడి జీవితం సగం పాడవడానికి కారణం అదే అంటుంది అనసూయ.

మనం ఆలోచించవలసింది లాస్య గురించి కాదు నందు గురించి. నేను నందితో మాట్లాడి నందుని ఒప్పిస్తాను అంటాడు పరంధామయ్య. అంతా సర్దుకున్నాక ప్రేమ్ ఆ స్థలం ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఏం చేయటం అంటుంది అనసూయ. వాడు ఎంత ఎగిరినా తులసి ముందు తలవంచాల్సిందే ముందు నువ్వు వెళ్లి లాస్య సంగతి చూడు నేను నందు దగ్గరికి వెళ్తాను అంటూ నన్ను దగ్గరికి వెళ్లి ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది తొందరపడు అంటాడు.

Intinti Gruhalakshmi February 2 Today Episodeకొడుక్కి ధైర్యం చెబుతున్న పరంధామయ్య..

అది నా చేతుల్లో లేదు నాన్న అని నందు అంటే అలా అని ముడుచుకొని కూర్చుంటే ఎలాగా నీ గొంతు ప్రయత్నం నువ్వు చేయాలి కదా అది నీ ప్రాబ్లం ఏది మంచిదే అనిపిస్తే అది చెయ్యు ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కేజీ పెట్టుకోవడం పరువు తక్కువ పని కాదు, లాస్య సంగతి పక్కన పెట్టు ప్రేమ్ సంగతి తులసి చూసుకుంటుంది అంటూ కొడుక్కి ధైర్యాన్ని ఇస్తాడు. మరోవైపు చిరాకులో ఉన్న లాస్య పిల్లో కవర్ ని గుమ్మం వైపు విసిరిస్తుంది.

మీ కోపం తగలెట్టా కొంచెం చూసుకోవచ్చు కదా, కంపుకొట్టే కవర్లు నామీద విసిరితో ఎందుకు కావాలంటే వెళ్లి మీ ఆయన మీద విసురు అంటుంది అనసూయ. విసిరేస్తానని భయపడి ఎక్కడో దాక్కున్నాడు అంటుంది అనసూయ. దాకోలేదు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు అంటుంది అనసూయ. నా దగ్గరకు వస్తే నేను పీకుతాను కదా అంటుంది లాస్య.

తరువాయి భాగంలో కొడుకుని స్థలం ఇవ్వటం కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. శృతి కూడా తులసికే సపోర్ట్ చేస్తుంది. ప్రేమ్ కూడా కరిగిపోయి స్థలం ఇవ్వటానికి ఒప్పుకుంటాడు. లక్కీ పేరు పెట్టడానికి అందరూ ఫిక్స్ అవుతారు.