Intinti Gruhalakshmi February 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో డ్రైవర్ తో కొబ్బరి బొండం తీసుకు రమ్మని చెప్తాడు విక్రమ్. ఇందులో ఓ తల్లి ఇతను కూతురికి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచివాడు కాదు పెళ్లి చేసుకుంటే జీవితాంతం అని చెప్తుంది. ఇతను నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తనని వాడు వీడు అనొద్దు అంటూ పొగరుగా మాట్లాడుతుంది ఆమె కూతురు. ఆ మాటలు విన్న విక్రమ్ కోపంతో రగిలిపోతాడు ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు.

ఆనందంతో ఎగ్జైట్ అవుతున్న తల్లి కూతుర్లు..

వాడు వీడు ఏంటి మర్యాదగా మాట్లాడు అంటుంది. నువ్వు తల్లిని అవమానకరంగా మాట్లాడొచ్చు కానీ నేను వాడిని అవమానకరంగా మాట్లాడకూడదా? అయినా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా అంటూ ఆ అబ్బాయిని అడుగుతాడు విక్రమ్ తనకోసం ప్రాణమైన ఇస్తానంటాడు అతను అయితే ఉండు అని మెడ మీద కత్తి పెట్టి నేను కూడా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నువ్వు ప్రాణాలు ఇస్తానన్నావు కదా ఇచ్చేయ్ అంటాడు విక్రమ్. తను ఉద్యోగం చేస్తుంది కొని తిని కూర్చోవచ్చు అని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

తనకోసం ఎందుకు ప్రాణాలు ఇస్తాను అని అక్కడినుంచి పారిపోతాడు ఆ వ్యక్తి. అది వాడి నిజ స్వరూపం ఇదే మాటని మీ అమ్మ చెప్తే నడిరోడ్డు మీద ఎదిరించి మాట్లాడవు మీ అమ్మ మంచిది కాబట్టి సరిపోయింది అదే ప్లేస్ లో నేను ఉండి ఉంటే చెంప పగలగొట్టే వాడిని ముందు అమ్మని గౌరవించడం నేర్చుకో అంటాడు విక్రమ్. ఆ తల్లి విక్రమ్ కి దండం పెట్టి కూతురు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు దివ్య తులసికి ఫోన్ చేసి నీ కూతురికి ఉద్యోగం వచ్చింది అని చెప్తుంది. నిజంగానా ఎంత మంచి వారితో చెప్పావు నేను అక్కడ ఉండి ఉంటే నీ మొహం లో ఉన్న సంతోషం చూసి ఉండేదాన్ని అంటూ ఎగ్జైట్ అవుతుంది తులసి.

తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన విక్రమ్..

నేనైతే నిన్ను గట్టిగా హాగ్ చేసుకునేదాన్ని చూసావా అమ్మతో వస్తే నాకు ఎలా తెలుసు వచ్చిందో అయినా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది దివ్య మీ నాన్న ఎందుకు అర్జెంటుగా కెఫీకి రమ్మంటే వెళ్తున్నాను అంటుంది తులసి సరే అయితే ఇంట్లో కలుద్దాం అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య. మరోవైపు రోడ్డుమీద పిల్లలు ఆడుకుంటుంటే అటువైపుగా కారు చాలా ఫాస్ట్ గా రావడం గమనించిన తులసి వాళ్ళకి అడ్డుగా వెళ్లి నిల్చుంటుంది. విక్రమ్ కారు డ్రైవర్ చాలా రేష్ గా డ్రైవ్ చేయడంతో బురద పిల్లల మీద పడవలసింది దివ్య కోటు అడ్డు పెట్టడం వల్ల దాని మీద పడుతుంది.

దివ్య ఆ డ్రైవర్ని గట్టిగా మందలిస్తుంది. దివ్య ని చూసిన విక్రమ్ ఆమెని చూసి అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఆమెని క్యాచ్ చేయబోతాడు కానీ ఆమెని అందుకో లేకపోతాడు. అందమైన పిల్ల తన రూపాన్ని కళ్ళలో నింపుకోగలిగాను కానీ మాట కలిపి లోపే మాయం అయిపోయింది మళ్లీ ఎప్పుడు కలుస్తానో ఏంటో దేవుడా నాకు ఏంటి పరీక్ష అనుకుంటాడు. దేవుడు అంటే గుర్తొచ్చింది మా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడికి ఫోన్ చేసి నీ షాపింగ్ అయిపోయిందా నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్.

అసలు విషయం చెప్పి తులసికి షాక్ ఇచ్చిన నందు దంపతులు..

మరోవైపు కెఫీకి వెళ్లిన తులసి ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నారు అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడే అక్కడ నందు దంపతులు వేరే దంపతులతో మాట్లాడుతూ ఉంటారు. తులసికి వాళ్లని పరిచయం చేసి నిన్ను ఇక్కడికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి రమ్మన్నాను దివ్య పెళ్లి సెటిల్ అయిపోయింది అని చెప్తుంది లాస్య. ఆ మాటకి షాక్ అవుతుంది తులసి. వీళ్ళ అబ్బాయి తోనే పెళ్లి తాంబూలాలు పుచ్చుకోవటమే లేటు అంటుంది లాస్య. అదేంటి దివ్యకి చెప్పకుండా నాతో డిస్కస్ చేయకుండా ఈ పెళ్లి ఎలా చేస్తారు అంటుంది తులసి.

ఆమె సరదాగా అంటుంది విషయం ఏంటంటే మీ అమ్మాయిని అనుకోకుండా ఢిల్లీలో చూసాము తనే మా ఇంటి కోడలు అయితే బాగుంటుంది అని మాకు అనిపించింది అందుకే సంబంధం కుదుర్చుకోవటానికి మీ దగ్గరికి వచ్చాము అంటారు ఆ దంపతులు. అది ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తుంది జాబులు చేస్తేనే కానీ లైఫ్ అంటే ఏంటో తెలీదు అంటుంది తులసి. పెళ్లయ్యాక ఆడదానికి బర్త్డే ప్రపంచం అంటుంది లాస్య. కాలం మారింది పిల్లల ఆలోచన విధానం కూడా మారింది అంటుంది తులసి నువ్వు చెప్తే తను వింటుంది అంటాడు నందు.

నాకు లేని ఆత్రుత నీకెందుకు అంటున్న తులసి..

తనకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి తనని చిన్న పిల్ల కాదు వేలు పెట్టి నడిపించడానికి అంటుంది తులసి. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు అంటుంది లాస్య. తన తల్లిని నాకు లేని ఆరాటం నీకెందుకు అంటుంది తులసి. దివ్య తల్లిగా మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తున్నాను కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మా అబ్బాయిని తీసుకొని సరదాగా మీ ఇంటికి వస్తాము పెళ్లి చూపుల కోసం కాదు జస్ట్ గెట్ టుగెదర్ మా అబ్బాయిని చూడండి మీ అమ్మాయికి నచ్చితే అప్పుడు మీకేమీ అభ్యంతరం ఉండదు కదా అంటాడు ఆ వ్యక్తి.

అందుకు తులసి ఒప్పుకుంటుంది. మరోవైపు ప్రసూనాంబ భర్త మొక్కలకి బాధ్యతలు తగ్గుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసూనాంబ మనకు ఏంటి కర్మ అంటుంది. ఇప్పుడు మనం ఎవరి ఇంట్లో ఉంటున్నాం దానికి ఏదో ఆ నడ మంత్రం సిరి కలిసొచ్చి పెంకుటి నుంచి ఇంద్ర భవనం లాంటి ఇంట్లోకి వచ్చింది ఏదో చిన్న చిన్న సలహాలు ఇచ్చుకుంటూ దాని నీడలో బ్రతికేద్దామని వచ్చాము. తిని కూర్చుంటే అదేమైనా ఫీల్ అవుతుందేమో అని మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాను ఇందులో తప్పేముంది అంటాడు అతను.

పునాదులు కదపటానికి వచ్చానంటున్న బసవయ్య..

మీ అక్క కట్టు వదిలేసిన పట్టు చీరలు కట్టుకోవడమేనా లేక నా మొగుడు నాకు పట్టు చీరలు కట్టేది ఏమైనా ఉందా అంటూ నిలదీస్తుంది ప్రసూనాంబ. చెప్పేది విను నీ మొగుడు ఇక్కడకి ఊరికే రాలేదు పునాదులు కదపటానికి వచ్చాడు కాకపోతే కాస్త అటు ఇటు అవుతుంది అంతే అంటాడు అతను. మరోవైపు పనివాడు అటువైపుగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ప్రసునాంబ భర్త. కొంచెం జ్వరంగా ఉంది చిన్న బాబు దగ్గరికి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకుందామని అంటాడు ఆ పనివాడు.

ఆ మాత్రానికే చిన్న బాబు ఎందుకు నేనున్నాను కదా అంటూ ఒంగోపెట్టి వాడుకొక పెద్ద ఇంజక్షన్ చేయబోతాడు ప్రసూనాంబ భర్త . పాపం వాడి పని అయిపోయింది అనుకుంటుంది. అది చూసిన పనివాడు ప్రాణం భయంతో పరిగెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ ఏం జరుగుతుంది? ఎందుకలా పరిగెడుతున్నావ్ అని అడుగుతాడు. ప్రాణాల మీదికి వచ్చినప్పుడు మరి ఎలా పరిగెడతారు అంటాడు పక్క వ్యక్తి. వీడికి నోటి దూల నావేంది మందు వేస్ట్ అయిపోకుండా వీడికి పొడుస్తాను ఇంజక్షన్ అంటాడు బసవయ్య.

Intinti Gruhalakshmi February 24 Today Episode విక్రమ్ ని నిలదీస్తున్న ఆమె తల్లి..

ఇదేమీ బాగోలేదు నువ్వు పశువుల డాక్టర్ వి అలాగే ఉండు అంటాడు విక్రమ్. మరోవైపు రాజ్యలక్ష్మి కొడుకు ఆమె దగ్గరికి వచ్చి మనం కొత్తగా ఆర్డర్ చేసిన ఎమ్మారై మిషన్ వన్ వీక్ లో డెలివరీ ఇస్తానన్నాడు అంటాడు. అది రాగానే పబ్లిసిటీ పీక్లో ఉండాలి పేషెంట్లు క్యూ కట్టాలి మన హాస్పిటల్ ముందు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఎప్పుడో ఒకప్పుడు నేను వైద్యరంగంలో ఆస్కార్ అవార్డు కొట్టేస్తాను అంటాడు బసవయ్య. నీకు అంత సీన్ లేదు ఎందుకంటే అది సినిమా వాళ్ళకి ఇస్తారు అంటాడు విక్రం.

అమ్మ లోపల ఉందా నాకోసమే వెయిటింగా అంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని దేవుడికి మొక్కింగ్ అంటూ నవ్వుతాడు బసవయ్య. మరోవైపు గుమ్మం వరకు వచ్చి ఆగిన విక్రమ్ ని చూసి అక్కడే ఆగిపోయావేమి లోపలికి రా అంటుంది రాజ్యలక్ష్మి. ఏమి మాట్లాడకుండా ఆమె కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతుంటాడు విక్రమ్. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్ నా మీద కోపమా మరి ఎందుకు నా వైపు సరిగ్గా చూడకుండా మాట్లాడకుండా అలా ముభావంగా వెళ్ళిపోతున్నావు ఎందుకు.

వస్తూ వస్తూనే నా పక్కన కూర్చొని బోల్డు విషయాలు చెప్పేవాడివి నన్ను కూడా బోలెడు విషయాలు అడిగేవాడివి మరి ఎందుకు ఇప్పుడు వంటి ముట్టనట్టుగా అలా ప్రవర్తిస్తున్నావు నావల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని కొడుకుని అడుగుతుంది రాజ్యలక్ష్మి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.