Intinti Gruhalakshmi February 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలవు నందు చేత కేఫ్ స్టార్ట్ చేయించి లైఫ్ సెటిల్ చేశావు అంటుంది లాస్య. పిల్లలు కూడా సెటిలైపోయారు అంతా నీ ప్లానింగ్ అంటాడు నందు. మిగిలిన ఒక రెస్పాన్సిబిలిటీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మన బాధ్యత తీరిపోతుంది అంటాడు.

దివ్య ని కన్వెన్స్ చేయమంటున్న నందు దంపతులు..

పిల్లల మనసులో మన తీగ లాంటివి తాడు కట్టి సరైన డైరెక్షన్ ఇస్తే అతుక్కుపోతాయి దివ్య విషయంలో ప్రస్తుతం మనం అదే చేయాలి అంటాడు నందు. దివ్య ఏముందో విన్నారు కదా అంటుంది తులసి. దివ్యది ఇంకా చిన్నతనం మంచో చెడో మనం చెప్పాలి అంటుంది లాస్య. చెప్పి చూడండి తను ఒప్పుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటుంది తులసి. మావల్ల పని జరిగితే ఇంత ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటాడు నందు.

తన లైఫ్ ని నాశనం చేయాలని మనం అనుకోము కదా షరతు నా బెస్ట్ ఫ్రెండ్ దివ్యని కావాలని తన కోడలు చేసుకోవాలని నా దగ్గరికి వచ్చాడు అంటాడు నందు. పైగా వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళకి కలిస్తే ఎంతో బాగుంటుంది మన బిజినెస్ ఎక్కడికో వెళ్తుంది అంటుంది లాస్య. అంటే కేవలం మన బిజినెస్ బాగుపడటం కోసం దివ్యకి ఇష్టం లేకపోయినా ఆమె మీద ఒత్తిడి తీసుకు రమ్మంటారా అంటుంది తులసి. కూతురు జీవితం బాగోవాలన్నది నందు ఆరాటం, ఏ పుట్టలో ఏ పాము ఉందో చూద్దాం కలిసి రాకపోతే అప్పుడే ఆలోచిద్దాం అంటాడు నందు.

ఈ పరిస్థితికి నువ్వే కారణం అంటున్న విక్రమ్..

ఆలోచించి నువ్వు కన్విన్స్ అయ్యాకే ఆమెని ఒప్పించు లేకపోతే లేదు అంటాడు నందు. మరోవైపు అయ్యగారు ఇంతకుముందు తినేవారు ఇప్పుడు అసలు తినటం మానేశారు మందులు కూడా వేసుకోవటం లేదు పని వాళ్ళని అంతకుమించి ఏం చేయగలవు మీరే ఏదో ఒకటి చేయండి అంటూ విక్రమ్ కి చెప్తుంది ఆ ఇంటి పనిమనిషి. ఆ మాటతో భోజనం ప్లేట్ తనే తీసుకు వెళ్తాడు విక్రమ్. కాలు చేయకపోతే పోయింది నోరు కూడా తీసేసాడు.

ఆ మనసులో బాధ కూడా చెప్పుకోవడానికి లేదు ఇంతకంటే నరకం మరొకటి ఉండదు అనుకుంటాడు దేవుడు. తండ్రి దగ్గరికి వచ్చిన విక్రమ్ నీ కన్నీళ్లను నువ్వు తుడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు దీనికి కారణం నువ్వే, నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మని అవమానించావు అనుమానించావు ఇప్పుడు నష్టం ఎవరికి అంటాడు విక్రమ్. తన ప్రవర్తన వల్ల వేరేవరో నష్టపోతే నేను ఏమీ అనే వాడిని కాదు కానీ ఆ నష్టం జరగబోయేది నీకే అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అని మనసులో అనుకుంటాడు విక్రమ్ తండ్రి.

మనసులో బాధని పైకి చెప్పుకోలేకపోతున్న విక్రమ్ తండ్రి..

అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది నా కన్నతల్లి కూడా నన్ను ఎంత బాగా చూసుకోదేమో, దేవత లాంటి అమ్మని ఇచ్చావు అని విక్రమ్ అంటాడు. అది దేవత కాదురా దెయ్యము నిన్ను ఒక్కసారిగా చంపటం మానేసి కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ లాగా నిన్ను తినేస్తుంది. అది నీకు తెలియడం లేదు అనుకుంటాడు. ఎందుకు తిండి తినటం లేదు అంటే జరుగుతున్న ఘోరాలని చూసి తట్టుకోలేక అనుకుంటాడు అతని తండ్రి. నేను మహారాజు లాగా బ్రతుకుతుంటే మీరేమో ఎవరూ లేని అనాధ లాగా ఒంటరిగా బ్రతకడం నాకు ఏమీ నచ్చలేదు అంటాడు విక్రమ్.

మహారాజుని అని నువ్వు అనుకుంటున్నావు కానీ అమ్మని నన్ను మోసపోతున్నావు అనుకుంటాడు అతని తండ్రి. కొంచెం అన్నం తిను నువ్వు ఇలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను అంటూ తండ్రికి భోజనం తినిపిస్తాడు విక్రమ్. ఆరోజు నేను తీసుకున్న నిర్ణయం నీ పాలిట శాపంగా మారుతుంది అనుకోలేదు అనుకుంటాడు విక్రమ్ తండ్రి. పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి నువ్వు భోజనం చేయలేదు కనీసం పాలైన తాగు అంటాడు విక్రం తండ్రి అమ్మ వస్తుందని చెప్పు అప్పుడే తాగుతాను అని విక్రమ్ అంటే అమ్మని ఇంక మనం జ్ఞాపకాల్లోనే చూడగలం అంటాడు అతని తండ్రి.

కొడుక్కి తెలియని రాజ్యలక్ష్మి లో మరో కోణం..

కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్ అదే విషయాన్ని వల్ల తాత గారికి చెప్తే ఎక్కువ నీ కొడుకు కోసం ఆలోచిస్తున్నావు నేను నా కొడుకు కోసం ఆలోచిస్తున్నాను నీకు భార్య లేకపోయినా విక్రమ్ కి తల్లి కావాలి పెళ్లి చేసుకో అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. అప్పుడే రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకొని వచ్చి నీ కొత్త అమ్మ అని పరిచయం చేస్తాడు అతను తండ్రి. కానీ విక్రమ్ అక్కడినుంచి పారిపోవడంతో దిగులు పడకండి వాడిని నేను మెల్లగా మజ్జిగ చేసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు తల్లి కోసం బాధపడుతూ ఉంటాడు విక్రమ్. నేను నిన్ను పిలుస్తున్నాను ఎందుకు రావట్లేదు వచ్చి ఒక్కసారి నన్ను విక్కీ అని పిలు అని తల్లి ఫోటోతో మాట్లాడుతుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యలక్ష్మి విక్కీ ఒక్కడే ఉన్నాడు తనని జాగ్రత్తగా చూసుకో అని మీ అమ్మే నన్ను పంపించింది మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుందో నేను కూడా అంతే ప్రేమగా చూస్తానుఈరోజు నుంచి నేనే మీ అమ్మని అంటుంది రాజ్యలక్ష్మి.

రాజ్యలక్ష్మిని పొల్యూట్ చేసిన అతని తమ్ముడు..

నన్ను ఒకసారి అమ్మ అని పిలవను అంటే కాదు పిన్ని అని పిలుస్తాను అంటాడు విక్రమ్. దేవుడి దగ్గరికి తీసుకొచ్చి తల్లి మీద బెంగతో నా బిడ్డ మూసిన కన్ను తెరవడం లేదు ఎలా అయినా నా బిడ్డని బ్రతికించు కావాలంటే నా కడుపులో బిడ్డని బలి తీసుకో అంటూ వేడుకుంటుంది రాజ్యలక్ష్మి. అమ్మ చాలా మంచిది అనుకుంటాడు. రాజ్యలక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటే విక్రమ్ రాజ్యలక్ష్మి కి దండం పెట్టి ఇకనుంచి పిన్ని అని కాదు అమ్మా అని పిలుస్తాను అంటాడు.

మరోవైపు రాజ్యలక్ష్మి కి కొడుకు పుట్టడంతో రక్తం పట్టించుకోని పుట్టిన బిడ్డ వచ్చాడు విక్రమ్ని పట్టించుకోను అని మీరు దిగులు పడుతున్నారేమో అలా ఎప్పటికీ జరగదు, విక్రమ్ నా పెద్ద కొడుకు నాకు తలకొరివి పెట్టేది వాడే అంటూ భర్తకి చెప్తుంది రాజ్యలక్ష్మి. విక్రమ్ కి రాజలక్ష్మి సేవలు చేస్తుంటే చూసి ఓర్వలేకపోతాడు ఆమె తమ్ముడు. నిన్ను ఈ ఇంటికి రెండో భార్యని చేసింది ఎందుకు బావకి బోల్డంత ఆస్తి ఉందని కానీ ఇప్పుడే తెలిసింది ఏమిటంటే ఈ హాస్టల్ అంతా విక్రమ్ గాడి తల్లిదంట,బావ కేవలం వాచ్మెన్ మాత్రమే ఈడ్చి తంతే బెత్తెడు భూమి కూడా బావ పేరు మీద లేదంట అంటాడు.

పన్నాగంతో విక్రమ్ చదువు మానిపించిన రాజ్యలక్ష్మి..

ఇంకొక విషయం ఏంటంటే ఆస్తి అంతా వాడి తల్లి విక్రం పేరు మీద పెట్టిందట రేపు వాడికి పెళ్లి అయితే వాడి పెళ్ళాం వాడు సంతకం పెడితేనే గాని ఈ ఆస్తి అమ్మటానికి కానీ, నీకు ఎలాంటి దానాలు చేయడానికి కానీ కుదరదంట అంటూ ఆమెలో విషాన్ని నింపుతారు రాజ్యలక్ష్మి తమ్ముడు, మరదలు. ఆ విక్రమ్ గాడిని మట్టి ముద్దలాగా ఎలా కావాలంటే అలాగా మార్చుకుందాం అనుకున్నామ్ కానీ వాడిని నువ్వు ఇలా పెరివేసి పెంచితే రేపు పొద్దున్న వాడికి చదువుతో పాటు తెలివితేటలు పెరిగి వాడు నీ నోట్లోనే మట్టి కొడతాడు అంటూ పురేక్కిస్తారు.

ఇప్పుడు వాడు నా చేతిలో ఉండాలి అంతే కదా అని రాజ్యలక్ష్మి అంటే అంతే కదా అని అంతా తేలికగా తీసిపారేయొద్దు అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. తెలివితేటలు నీకే కాదు నాకు ఉన్నాయి ఇకనుంచి వాడిని ఎలా పిలుస్తాను చూడు బ్రతికిన చచ్చినా అమ్మకోసమే అనేటట్లుగా పెంచుతాను అంటుంది రాజ్యలక్ష్మి. ఒకరోజు అతను చూసి గుండె పట్టుకొని కుక్క కోల్పోతుంది రాజ్యలక్ష్మి కంగారుపడిన విక్రమ్ ఏమైంది అని అడుగుతాడు.

విక్రమ్ జీవితం పాడు చేయొద్దు అంటూ బ్రతిమాలుకుంటున్న రాజ్యలక్ష్మి భర్త..

రేపు ఎగ్జామ్ ఉంది వెళ్లి చదువుకో నా గురించి ఆలోచించకు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగా జరుగుతుంది అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది రాజ్యలక్ష్మి. నువ్వు ఎందుకు ఇలాగా బాధపడుతున్నావో చెప్పు అని విక్రమ్ అంటే నాకు ఒక మాయదారి జబ్బు ఉంది ఎప్పుడూ ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోతాను ఎందుకు పడిపోతాను తెలియదు. ఈ సంగతి మీ నాన్నకి కూడా తెలియదు. నేను చెప్పలేదు ఎప్పుడు నా పక్కన ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉండాలి ఎవరుంటారు చెప్పు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంటుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi February 28 Today Episode

నీకోసం నేను ఉంటాను అంటాడు విక్రమ్. మీ స్కూల్ గొడవ చదువులు నీకు ఉంటాయి కదా అంటే ఈ క్షణం నుంచి నాకు ఈ చదువు వద్దు ఎవరు చెప్పినా వినను అని పుస్తకాన్ని విసిరేస్తాడు విక్రమ్. మనకు నీలో మార్పు బాగా కనిపిస్తుంది నీలో తల్లి ప్రేమ చనిపోయింది. రాజ్యలక్ష్మి మందలిస్తాడు, నీ తమ్ముడు మాటలు విని నీ మనసుని కలుషితం చేసుకుంటున్నావు. నీ మాటలు విని ఎవడు చదువు మానేసాడు.

నేను ఎంత చెప్పినా వినడం లేదు. నీకు చేతులెత్తి దండం పెడతాను వాడి జీవితాన్ని నాశనం చేయొద్దు అని బ్రతిమాలుకుంటాడు ఆమె భర్త. తరువాయి భాగంలో కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం అనుకోవటం వదిలించుకోవడం కాదు కొత్త జీవితం అందించడం అంటారు అంటుంది తులసి. లైఫ్ లో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుంటే ఎన్ని ఇన్స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నీ లైఫ్ నీ చూస్తేనే తెలుస్తుంది నువ్వే నా రోల్ మోడల్ అంటుంది దివ్య. ఇప్పుడు నిన్ను పెళ్లికి పంపించడానికి రాలేదు కేవలం పెళ్లి చూపులకి ఒప్పించడానికి మాత్రమే వచ్చాను అంటే పెళ్లి వద్దు అంటే పెళ్లి చూపులు ఏంటి అంటుంది దివ్య.