Intinti Gruhalakshmi February 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఈ చెత్తంతా ఎవరు క్లీన్ చేస్తారు అంటూ చిరాకు పడుతుంది లాస్య. అందరూ కష్టపడితే అరగంటలో అయిపోతుంది అంటుంది పనిమనిషి. నీ మొఖానికి మేకప్ ఏసినంత మాత్రాన నువ్వు ఐశ్వర్యరాయ్ అయిపోతావా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. సాయంత్రం వరకు అందరం కష్టపడితే ఐశ్వర్య రాయి లాగా కాకపోయినా లాస్య లాగా చెయ్యొచ్చు అంటూ ఆట పట్టిస్తాడు ప్రేమ్.

టైం వేస్ట్ చేసుకుంటున్నావ్ అంటున్న లాస్య.

అందరూ ఆ మాటకే ఓటేస్తారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇది తున్నావు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటుంది లాస్య. మన దగ్గర టైం లేదు సోర్స్ అంతకన్నా లేవు అంటాడు నందు. అందుకని చిరిగిపోయిన బూట్లతో రేస్ ని గెలవగలవా అంటుంది లాస్య. రేస్ గెలవాలంటే కావాల్సింది బూట్లు కాదు కాళ్లలో శక్తి గెలవాలని తపన అంటుంది తులసి. ఇలాంటి ప్రవచనాలు చెప్పే నా భర్తని గోతం లో దించేవు రేపొద్దున్న నా భర్త ఓడిపోతే బాధపడవలసింది నేను నీకేమీ దులుపుకొని వెళ్ళిపోతావు అంటుంది లాస్య.

ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతావు అంటాడు నందు. డిమాండ్ ఉన్న ప్లేసులో కేఫై పెట్టాలి అంతేకానీ ప్లేస్ దొరికింది కదా అని ఈ మూలన కేఫ్ పెడితే మనుషులు వెతుక్కుంటూ వస్తారా అని అడుగుతుంది లాస్య. అలా రప్పించగలగడమే మార్కెట్ అంటే అంటుంది తులసి. ఈమధ్య రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నామని నువ్వు కూడా మాట్లాడుతున్నావా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. తను ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నది అన్నది ముఖ్యం కాదు ఇప్పుడు జిఎం.

నా బలం నా కుటుంబం అంటున్న నందు..

నువ్వో అంటూ వెటకారంగా మాట్లాడుతాడు పరంధామయ్య. అనటం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని అనసూయ అంటే కొన్ని జన్మలు అంతే అని చురకంటిస్తాడు ప్రేమ్. నా భయం నాకు ఉంటుంది కదా నేను ఏం తప్పుగా మాట్లాడాను అంటుంది లాస్య. ఏ పక్షి అయినా తన రెక్కల్లో ఎంత శక్తి ఉందో అంతవరకే ఎగరాలి అంతకుమించి ఆలోచించకూడదు. ఇప్పుడు నేను ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను అంటే దానికి కారణం నా బలగం, నా వాళ్లు. వాళ్లు నన్ను కిందపడనివ్వరు.

వీళ్ళందరూ దీని రూపు రేఖలు మారుస్తాను అంటున్నారు కదా నీకు వీలైతే సజెషన్స్ ఇవ్వు అంతేగాని అబ్జెక్షన్స్ కాదు అంటాడు నందు. సరే నీ ఇష్టం నీ నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి అంటుంది లాస్య. నడుం బిగిస్తున్న అంకితని చూసి మనకి హాస్పిటల్ కి టైం అయిపోయింది అంటాడు అభి. మన కుటుంబం అంతా దీనికోసం ఒక ఉద్యమంలా తీసుకున్నారు. ఈ పని అయ్యే వరకు చూపు తిప్పే ప్రసక్తే లేదు అంటుంది అంకిత.

భర్త మాట లెక్కచేయని అంకిత..

కష్టపడి మా హాస్పిటల్ లో జాబ్ చూశాను. కేఫ్ కోసం మన జాబ్ ని ఇది రిస్క్ లో పెట్టలేము కదా అంటాడు అభి. కావాలంటే నువ్వు వెళ్ళు నేను రాను అని అంకిత అంటే సక్సెస్ అవుతుందో లేదో తెలియని ఈ కేఫ్ కోసం మన జీవితాల్ని పణంగా పెట్టలేము కదా అంటాడు అభి. నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్ళు అంతేగాని అపశకంగా మాట్లాడకు అంటాడు పరంధామయ్య. ఉన్న మాటే అంటున్నాను నువ్వు అపసకునం అనుకుంటే నేనేమీ చేయలేను లాస్య ఆంటీ అన్నట్లుగా ఇక్కడ కేఫ్ పెట్టడం ఒక పిచ్చి ఆలోచన అంటాడు అభి.

ఇంతకన్నా ఒక హోటల్ పక్కన పాన్ షాప్ పెట్టుకున్న బాగా నడుస్తుంది అప్పుడు కావాలంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను అంటాడు అభి. నువ్వు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబోలు వెళ్ళు అంటుంది తులసి. అంకితని కూడా పంపించు అని అంటే నువ్వు ఇక్కడ ఉండడం ఎంత అసాధ్యమో నేను నీతో రావడం కూడా అంతే అసాధ్యం అంటూ అభి ని పంపించేస్తుంది అంకిత. అందరూ కలిసి తలో చెయ్యి వేసి అందంగా తీర్చిదిద్దుతారు. అది చూసి ఎమోషనల్ అవుతాడు పరందామయ్య.

కలిసికట్టుగా కష్టపడిన నందు కుటుంబం..

అందరం కలిసి కలిసికట్టుగా దీని రూపురేఖలు మార్చేసాము. ఎప్పటికీ మనం అందరినీ ఇలాగే కలిసికట్టుగా ఉంటే మన కుటుంబంలో సంతోషాన్ని నింపొచ్చు కదా అనిపిస్తుంది అంటుంది తులసి. నా కోరిక కూడా అదే అంటాడు పరంధామయ్య. నాకోసం కష్టపడినందుకు థాంక్స్ అంటాడు నందు. అయిన వాళ్ళకి థాంక్స్ చెప్పకూడదు అని పరంధామయ్య అంటే నీకోసం కాకపోతే మరి ఎవరి కోసం కష్టపడతాం అంటుంది అనసూయ. మీకు హెల్ప్ చేయటం మా అదృష్టం అంటారు ప్రేమ్ దంపతులు.

మీ వరుస చూస్తుంటే జనాల కోసం రెస్ట్ రూమ్ ఓపెన్ చేసినట్లుగా ఉంది కేఫ్ లా లేదు అంటుంది లాస్య. మీకు ఎందుకలా అనిపించింది అని శృతి అంటే మెనూ కార్డు ఉండాలి కదా అంటుంది లాస్య. అంటే నీకు నువ్వే రెడీ చేసేసావన్నమాట నాకు కనీసం చెప్పలేదు అని లాస్య అంటే రెడీ చేసింది తను కాదు నేను అంటుంది అనసూయ. జీవితంలో కేఫ్ మొహం చూడని మీరు మెను కార్డ్ తయారు చేయడం ఏంటో అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య.

అత్తగారిని చులకనగా మాట్లాడుతున్న లాస్య..

ఏ కేఫ్లో అయినా తినే పదార్థాలే ఉంటాయి వాటి గురించి అత్తయ్యకే బాగా తెలుస్తుంది అంటుంది తులసి. వంటింట్లో వంట చేయటం వేరు, కేఫ్ వేరు అంటుంది లాస్య. సరే ఆమెను ఏంటో చెప్పండి అని లాస్య అంటే నన్ను వదిలేయండి పాతకాలపు దాన్ని పాతకాలపు వంటలు అంటుంది అనసూయ. మీ అనుభవం ముందు మా తెలివి ఎంత,కాలం మారినప్పటికీ అవే వంటలు కాకపోతే పేర్లు మారాయి అంటూ ప్రేమ్ కి చెవిలో ఏదో చెప్తుంది తులసి. మెను కార్డు తెచ్చిన ప్రేమ్ తో నానమ్మ మెనూలో మొదటి ఐటెం చదివి చెప్పు అంటుంది తులసి. ప్రేమ్ ఫస్ట్ పేరు చదవగానే ఆ పేరు వింటేనే అత్తయ్య గారు నోరెళ్లపెట్టారు అలాంటిది లైఫ్ లో అవి కూడా చూసి ఉండరు తిని ఉండరు అంటుంది లాస్య.

ఆవిడ తెలుగులో చెప్పిందాన్ని మేము కేఫై భాషలో రాసాము ఇంతకీ అది తెలుగులో ఏంటంటే ఆలు సమోసా విత్ చట్నీ అంటాడు ప్రేమ్. ఆ మాటకి నోరెళ్లబెట్టిన లాస్య మరి ఏమి మాట్లాడలేక సరే వెళ్దాం రేపు వచ్చి కెఫే ఓపెన్ చేయాలి కదా అంటుంది. అంటే దీన్ని కెఫే అని ఒప్పుకున్నారా అంటూ అంకిత, శృతి లాస్యని ఆటపట్టిస్తారు. మన వైపు ఇంట్లో అందరూ కూర్చొని రేపు ఓపెనింగ్ కి కావలసిన వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారు.

కోపంతో రగిలిపోతున్న అభి..

అంతలోనే అక్కడికి వచ్చిన అభి వాళ్ళందరిని చూసినప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నీ పెళ్ళాంతో సహా అందరిని ఇక్కడే ఉన్నాము నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటుంది అనసూయ. రేపటికి ఏమేమి కావాలో ఏమేమి చేయాలో మాట్లాడుకుంటున్నాం రా నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అంటాడు పరందామయ్య. అంతా ఊసుపోలు కబుర్లు చెప్పటానికి నాకు తీరిక ఓపిక రెండు లేవు అంటాడు అభి.

నీరసంగా ఉందా కాఫీ పెట్టి తీసుకురానా అంటే అక్కర్లేదు అయినా తీరిగ్గా అంతా లెక్కలు వేసుకోవడానికి మీరు ఏమైనా ఫైవ్ స్టార్ హోటల్ స్టార్ట్ చేస్తున్నారా ఇడ్లీ వడ సాంబారు అమ్ముకునే కేఫ్ స్టార్ట్ చేస్తున్నారు దీనికి ఇంత మీటింగులు అవసరమా అంటూ కోపంగా మాట్లాడుతాడు. వాడు ఏదో చికాకులో ఉన్నట్లుగా ఉన్నాడు అని తులసి అంటే కాదు వాడేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi February 6 Today Episodeఅభి మాటలకి బాధపడుతున్న నందు..

రేపు ఫంక్షన్ కి మీ అత్తగారిని పిలిచావా అని అడిగితే ఆ ఫంక్షన్ కి రావటానికి నాకే సిగ్గుగా ఉంది ఇంకా నేను తనని ఎందుకు పిలుస్తాను అంటూ గట్టిగా మాట్లాడుతాడు అభి. అదేంట్రా చాలా కాలం తర్వాత నన్ను నిలబెట్టడం కోసం నా కుటుంబం అంతా ఒకటయ్యారు అనుకొని సంతోషిస్తుంటే నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు అంటూ బాధపడతాడు నందు. వాళ్లకి స్టేటస్ అంటే ఏంటో తెలీదు, నాకు సొసైటీలో డాక్టర్ గా మంచి పేరు స్టేటస్ ఉంది అలాంటిది నా తండ్రి చిన్న కెఫే నడుపుతున్నాడు అంటే నాకు ఎంత అంబారిజంగా ఉంటుంది అంటూ కేకలు వేస్తాడు.

మీ నాన్న ఏమి ముష్టి అడుక్కోవడము దొంగతనం చేయటము చేయడం లేదు కష్టపడి సంపాదించాలి అనుకుంటున్నారు అంటుంది తులసి. తరువాయి భాగంలో కేఫ్ ఓపెన్ అయిన తర్వాత నందు తులసి నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. మాజీ భార్య భర్తలు కలిసి పోవడానికి ఎంతో సమయం అక్కర్లేదు అలాంటిది పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారంటే ఇంక అంతే సంగతులు అంటూ లాస్యని రెచ్చగొడుతుంది గాయత్రి. ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన లాస్య పూజ చేస్తున్న తులసిని నా కే ఫెలో పూజ చేయడానికి నీకేం అర్హత అంటూ అందరి ముందు నిలదీస్తుంది.