Intinti Gruhalakshmi February 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీ నాన్న మిస్టేక్ కొని బతకడం లేదు దొంగతనం చేసి బ్రతకడం లేదు ఇదే విషయాన్ని నీ కొలీగ్స్ కి చెప్పు. కాక హోటల్లో నడుపుకునే వాళ్ళు మీ హాస్పిటల్ కి వస్తే నువ్వు ట్రీట్మెంట్ చేయవా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవా, వాళ్ల డబ్బులు పనికొస్తాయి కానీ వాళ్ళు పనికిరారు అంటూ చివాట్లు పెడుతుంది తులసి.
మాటలతో తూట్లు పొడిచిన అభి..
నీకు ప్రెస్టేజ్ గురించి ఏమి తెలీదు ఎందుకంటే నువ్వు చదువుకోలేదు కదా అంటాడు అభి. నోరు ముయ్యి మీ అమ్మ కేవలం డిగ్రీలు మాత్రమే చదువుకోలేదు కానీ తన జీవితాన్ని చదివింది. కష్టాల అనుభవాన్ని లోతుల్ని చూసింది. ఒకప్పుడు భూమ్మీద మట్టిలో ఉండే మీ అమ్మ ఈరోజు ఆకాశంలో నక్షత్రం లాగా మెరిసిపోతుంది ఇదంతా చదువు లేకుండానే చేసింది. ఇదంతా నువ్వు జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసిన సాధించలేవు.
మీ అమ్మ కడుపు, నోరు పట్టుకొని నిన్ను కలిసే పెట్టి డాక్టర్ అయ్యావు, మీ అమ్మ ప్రాణానికి తెగించి రక్షించబట్టే నువ్వు ఈరోజు బ్రతికున్నావు అలాంటి నువ్వు మీ అమ్మని వేలికి చూపిస్తావా అంటే కోపంతో రెచ్చిపోతాడు పరంధామయ్య. మీరు ఆవేశ పడకండి అని తులసి అంటే నావల్ల కావడం లేదు అత్తగారు నెత్తిమీద పెట్టుకుంటేనే గాని బ్రతుకులేని వీడు నీ గురించి కామెంట్ చేస్తాడా మమ్మల్ని చూసి నువ్వు సిగ్గుపడడం కాదు నిన్ను చూసి మేము సిగ్గు పడుతున్నాము అంటాడు పరంధామయ్య.
కోపంతో రెచ్చిపోయిన పరంధామయ్య..
మీ అమ్మ చదువుకోలేదు మీ నాన్న కాకా హోటల్ పెడుతున్నాడు ఇదే కదా నీకు అభ్యంతరం, నీ పరువు పోతుంది నీకు అవమానంగా అనిపిస్తుంది అంటే నువ్వు ఇంట్లోంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు ఎవరిని అడ్డుపడము అంటాడు. ఇంట్లో ఉండాలని నాకేమీ ముచ్చటగా లేదు ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోదామని ఉంది అంటాడు అభి. మీ అమ్మ ఉమ్మడి కుటుంబం కోసం అంత కష్టపడుతుంటే నువ్వేంట్రా వెళ్ళిపోతాను అంటున్నావు అంటుంది అనసూయ.
మా అమ్మ డైవర్స్ తీసుకొని విడిగా ఉండొచ్చు కానీ ఉమ్మడి కుటుంబం విడిపోతే తప్పేంటి అదేదో పెద్ద విషయం లాగా గుండెల బాదేసుకుంటున్నారు. ఈ ఇంట్లో నా మాటకి ఎవరు విలువరు మీ అందరిని చూసి నా భార్య కూడా అలాగే ప్రవర్తిస్తుంది అంటాడు అభి. మన మధ్య ఉండే భేదాభిప్రాయాలు పది మందిలోని డిస్కస్ చేయకు అది పద్ధతి కాదు అంటుంది అంకిత. పద్ధతుల గురించి నువ్వు నాకు చెప్పేంత పెద్దదానివి అయిపోయావా.
బ్రతిమాలే ఓపిక లేదంటున్న అభి..
అయినా నువ్వు మా అమ్మని ఫాలో అవ్వకు ఎందుకంటే మన కాపురం కూడా వాళ్ల కాపురం లాగే ముక్కలైపోతుంది డైవర్స్ వరకు వెళ్తుంది నీకు కావలసింది అదే అయితే నువ్వు మా అమ్మ అడుగుజాడల్లోనే ఉన్నాడు నిన్ను బ్రతికిన ఓపిక నాకు లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అభి. పైకి వచ్చిన రవి ఈ ఇంట్లో ఎప్పుడూ గొడవలే కారణాలు వెతుక్కోండి మరి గొడవలు పెట్టుకుంటారు అనుకుంటాడు అంతలోనే అక్కడికి వచ్చిన నందు నీతో మాట్లాడాలి అంటే మన ఇంట్లో మాట్లాడుకోవడానికి ఉండవు ఓన్లీ పోట్లాడుకోవడాలే కదా నాకు అంత ఓపిక లేదు అంటాడు అభి.
బురద జల్లి వచ్చేసావు నీ మాటలతో అందరి మనసులో తూట్లు పొడిచి వచ్చేసావు సమాధానం వినకుండా వచ్చేస్తే ఎలా అంటాడు నందు. మీరంటే గౌరవం ముందు డాడీ కానీ మీరు తప్పుడు సలహాలు విని తప్పుడు దారిలో వెళ్తున్నారు అంటాడు అభి. అందుకు నేను ఒప్పుకోను అని నందు అంటే మామ్ మీకు డైవర్స్ ఇచ్చేసి తనమాన తాను బ్రతుకుతోంది అలాంటి తను మళ్ళీ మీ జీవితాన్ని తల చేతుల్లోకి ఎందుకు తీసుకుంటుంది అంటూ నిలదీస్తాడు అభి.
తులసిని వెనకేసుకొచ్చిన నందు..
వర్షం ఎలా అయితే పక్షపాతం లేకుండా అంతలక్కా పడుతుందో అలాగే మీ అమ్మ కూడా మంచితనంతో ఎదుటివాళ్ళు తన వ్యక్తి అవునా కాదా అని చూడకుండా తన సహాయాన్ని అందిస్తుంది అంటాడు నందు. మీకు అమ్మంటే ఇష్టమా అని అడుగుతాడు అభి. మంచి అనటానికి ఇష్టము ఉండక్కర్లేదు అలాగే తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పటానికి ద్వేషం కూడా ఉండక్కర్లేదు. కేకే విషయంలో నువ్వు మీ అభిప్రాయాన్ని చెప్పావు కానీ అంత హార్శ్ గా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు నందు.
హార్శ్ గా చెప్తేనే ఎవరు వినట్లేదు ఇంక ప్రేమగా చెప్తే ఏం వింటారు అంటాడు అభి. అందుకని మనసు గాయపడేలాగా మాట్లాడతావా, నువ్వు నీ భార్య తలుపులు మూసుకొని ఏమైనా మాట్లాడకుండా మాకు అనవసరం కానీ ఇప్పుడు నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు అన్నససరీ కామెంట్స్ చేశావు అంటాడు నందు. అవి కామెంట్స్ కాదు నిజాలు అని అభి అంటే మా మధ్య ఏం జరిగిందో నీకు ఏం తెలుసు.
కొడుక్కి వార్నింగ్ ఇచ్చిన నందు..
తన ప్రవర్తన నచ్చకపోతే పెళ్లయిన సంవత్సరానికే విడాకులు ఇచ్చేవాడిని అంతేగాని పాతికేళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లల్ని కనేవాడిని కాదు. డైవర్స్ కి కారణం మీ అమ్మ కారణం కానే కాదు అందుకు పూర్తి కారణం నేను అంటాడు నందు. ఎందుకు తప్పుని బి మీద వేసుకుంటున్నారు అంటే తప్పుని నా మీద వేసుకునేంత గొప్పవాడిని కాను మీ అమ్మ నాకు ఒక విషయాన్ని కోపాన్ని తెప్పించేది నా షార్ట్ టెంపర్ వల్ల అవి మరింత పెరిగి పెద్దయ్యేవి డైవర్స్ కి కారణాలు ఇవే భార్యాభర్తలుగా మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ తల్లిగా మీకు ఎలాంటి అన్యాయం చేయలేదు తులసి.
తన పిల్లల దృష్టిలో తండ్రి గౌరవం తగ్గకుండా చూసుకుంది నీ దృష్టిలో నీ తల్లి గౌరవం తగ్గకూడదు అని నిజం చెప్పడానికి వచ్చాను. నీకు కెఫే చాట్ చేయటం ఇష్టం లేకపోతే అటువైపుగా రావడం మానేయ్ అంతేగాని మీ అమ్మని తక్కువ చేసి మాట్లాడొద్దు ఇది రిక్వెస్ట్ అనుకుంటావో ఆర్డర్ అనుకుంటావో నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. ఈ మాటలు వెనకనుంచి వింటున్న లాస్య ఆడవాళ్ళ మాటలు ఎవరికీ అర్థం కావు అంటారు కానీ ఈ నందు నాకు ఎప్పటికీ అర్థం కాదు ఒకసారి తులసిని ఒకసారి తిట్లతో అభిషేకం చేస్తాడు ఒక్కొక్కసారి ప్రేమతో అభిషేకం చేస్తాడు అనుకుంటుంది.
అభి మాటలకి ఏడుస్తున్న తులసి..
మరోవైపు అభి అన్న మాటలు తలుచుకుని ఏడుస్తుంటుంది తులసి. ఎదుటి వాళ్ళకి మనసు ఉంటుంది ఒక మాటంటే బాధపడుతుంది కానీ ఎందుకు ఎవరూ ఆలోచించట్లేదు, నీ కన్నీళ్లు ఒకటి పేరంటానికి బొట్టు పెట్టి పిలిచినట్లుగా వచ్చేస్తాయి అంటూ కన్నీరు తుడుచుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన తన వాళ్ళందరిని చూసి నేను ఏడవటం లేదు కంట్లో నలుసు పడింది తీసుకుంటున్నాను అంటుంది. మీ కడుపున పుట్టిన నలుసే కదమ్మా నిన్ను బాధపెడుతుంది అంటాడు పరంధామయ్య.
నన్ను ఎవరు ఏమి అన్నా పట్టించుకోను మావయ్య కానీ నా పిల్లలు నా వైపు వేలెత్తి చూపిస్తే తట్టుకోలేకపోతున్నాను వాడికి ఏం తక్కువ చేశానని నా మీద అంత కోపం. విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అది నా తలరాత దానికి నేనేం చేసేది, జీవితాన్ని కావాలని నేనే నాశనం చేసుకుంటానా అలాగా జరిగిపోయింది అంతే అందుకని నా కోడల్ని నాకు దూరంగా ఉండమంటాడా, అంతా బాబిష్టి దాన్ని దురదృష్ట జాతకురాలిని అయిపోయాను అంటూ ఏడుస్తుంది. అమ్మని అని చూడకుండా ఎన్ని మాటలు అన్నాడు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi February 7 Today Episodeతులసిని ఓదారుస్తున్న కుటుంబ సభ్యులు..
ఆవేశంలోకి ఏదో అన్నాడు లే అమ్మ బాధపడకు అని అనసూయ అంటే లేదు అత్తయ్య వాడు ఎన్నాళ్ళు నుంచో మనసులో దాచుకున్న విషయాన్ని బయట పెట్టాడు, అవకాశం దొరికింది అనేసాడు. అయినా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకునేవాడు ఇంకా తను తప్పేం తెలుసుకుంటాడు. వాడు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోనిద్దాము ఎవరు అడ్డుపడొద్దు అంటుంది తులసి. వాడిని వదిలేసి నువ్వు ఉండగలవా అంటుంది అనసూయ.
ఆడపిల్లని అత్తారింటికి పంపేసి మనం ఉండటం లేదా అత్తయ్య అలాగే ఇది కూడాను అయినా వాడు ఇంట్లోంచి మాత్రమే బయటికి వెళ్తాడేమో కానీ నా మనసులోంచి వెళ్ళడు కదా అంటుంది తులసి.ఆ బాధని చూసి తట్టుకోలేక తులసి కాళ్లు పట్టుకొని మీ అబ్బాయి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను తను అలాగా మాట్లాడి ఉండవలసింది కాదు తనకి మీరంటే చాలా ఇష్టం కాకపోతే నా మీద కోపాన్ని మీ మీద చూపించాడు అంటుంది అంకిత. కాదు తల్లి నా వల్లే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో నువ్వు నా గురించి ఈ కుటుంబం గురించి ఆలోచించకుండా వాడికి దగ్గర రావడానికి ప్రయత్నించు అంటుంది తులసి.
ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయినా కూడా మీరు మా గురించి ఆలోచించకుండా ఉండగలిగారా, మీరే మాకు ఆదర్శం అలా ఎలా ఉండమంటారు అంటుంది అంకిత. ఆడది పురిటి నొప్పులని భరిస్తుంది కానీ ఎదిగిన బిడ్డలు చేసిన గాయాన్ని భరించలేదు అంటూ ఏడుస్తుంది. ఇదంతా గౌరవం నుంచే గమనిస్తూ ఉంటారు నందు, లాస్య. ఇలాంటి ఓవరాక్షన్ కి ఏమీ తక్కువ లేదు అనుకుంటుంది లాస్య. ప్రేమ్ తన గిటారు తీసుకువచ్చి తన మూడు బాగా ఎలాగా మంచి పాట పాడుతాడు దానికి అందరూ డాన్స్ వేస్తారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.