Intinti Gruhalakshmi February 9 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పూజ పూర్తి చేసిన తర్వాత లాస్య అందరికీ హారతిస్తుంది. తర్వాత ఎంత సేపటికి కస్టమర్లు రాకపోవడంతో అందరికీ చిలకకి చెప్పినట్లు చెప్పాను ఇక్కడికేసే వర్కౌట్ అవదు అని ఎవరు నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో పదండి మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోదాం అంటుంది లాస్య. శుభం పలకవచ్చు కదా అంటుంది తులసి.

అదిరిపోయే ప్లాన్ వేసిన తులసి..

పొద్దుటి నుంచి నువ్వు చేస్తున్నది అదే కదా ఏం జరిగింది టిఫిన్ ఎంత జనాలతో నిండిపోయి కళకళలాడుతుంది అంటూనే ఉన్నావు జరిగిందా, మనం అన్నంత మాత్రాన అన్ని జరిగిపోవు అంటూ నెగిటివ్గా మాట్లాడుతుంది. అప్పుడే తులసికి ఒక ఐడియా వచ్చితన వాళ్ళందరినీ ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. ఏం చేస్తున్నావు మనవాళ్ళనే కస్టమర్లను చేస్తున్నావెందుకు అంటూ అయోమయంగా అడుగుతుంది లాస్య.

కానీ అర్థం చేసుకున్న నందు ఎందుకు జనాలు ఎక్కువగా ఉన్న పానిపురి బండి దగ్గరకు వెళ్తారు అని అడుగుతాడు. జనాలు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే అక్కడికి వెళ్తాము ఎందుకంటే అక్కడ టెస్ట్ బాగుంటుంది కాబట్టి అంటుంది శృతి. అలాగే చేసే కూడా జనాలతో నిండి ఉంటే కస్టమర్లు ఎక్కడ చేస్తారు ఇదే మార్కెటింగ్ ప్లాన్ అంటాడు నందు. అర్థమైంది మార్కెటింగ్ అనేది చదువుకుంటే రాదు బుర్రలో నుంచి వస్తుంది అంటుంది అనసూయ.

నెగిటివ్గా మాట్లాడుతూ అందర్నీ ఇబ్బంది పెడుతున్న లాస్య..

అందరూ తలా ఒక సీటు పంచుకొని కూర్చుంటారు. అయినప్పటికీ ఎవరు రాకపోవడంతో టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం ఇంక ఇంటికి వెళ్దామా అంటుంది అనసూయ. ఇంటిదగ్గర లంకే బిందులు దాచావా ఎందుకంత కంగారు కావాలంటే నువ్వు వెళ్ళు అంటూ చిరాకు పడుతుంది అనసూయ. మీకు ఇంకా ఆశగా ఉందా ఒక్క కస్టమర్ వచ్చినా నా పేరు మార్చేసుకుంటాను అంటుంది లాస్య. అంతలోనే ఒక జంట లోపలికి వచ్చి కిటో బర్గర్ ఆర్డర్ చేస్తుంది.

మా దగ్గర రెగ్యులర్ బర్గర్ మాత్రమే ఉంటుంది అంటాడు నందు. అయితే వెళ్ళిపో వెళ్ళిపోదాము అని లెగిసిపోతుంటే వాళ్ళని కూర్చోమని చెప్పి షెఫ్ తో కిటో బర్గర్ చేయమని చెప్తాడు. నాకు రాదు అంటూ చేతులెత్తేస్తాడు ఆ షెఫ్. కిటో బర్గర్ కూడా చేయడం రాని వాడిని షఫ్ గా పెట్టుకున్నారు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ కపుల్. వాళ్ళని బ్రతిమాలి కూర్చోబెట్టి లాస్య అని నీకు వస్తే చేసి పెట్టు అంటాడు నందు. ఆమె కూడా చేతులు ఎత్తేస్తుంది.

కస్టమర్ ని మెప్పించిన తులసి..

అప్పుడు తులసి ఒక నిమిషం కూర్చోండి చేసి పెడతాను అంటుంది. వాళ్ళు అడిగింది మిరపకాయ బజ్జి కాదు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. నిజంగానే నీకు వచ్చా అంటే దివ్య బర్త్డే రోజు చేశాను అంటూ గబగబా చేసిపెడుతుంది తులసి. అది వాళ్లకి బాగా నచ్చడంతో ఫైవ్ కీటో బర్గర్స్ ఆర్డర్ ఇస్తారు. మీ కేఫ్ విసిట్ చేయమని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను అంటూ ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

అందరూ తులసిని అప్రిషియేట్ చేస్తారు. మరోవైపు గాయత్రీ నువ్వు అదృష్టవంతుడివో దురదృష్టవంతుడివో అర్థం కావట్లేదు అనుకున్నది సాధించావు కంగ్రాట్స్ చెప్తుంది నందుకి. అదృష్టం అంటే ఆశలు అంతస్తులు ఉండడం కాదు తడుపుతూ తిండి చేయడానికి కానీ పెంచుకోవటానికి ఆత్మీయులు ఉంటే చాలు ఆ రకంగా లేదు అదృష్టవంతుడినే డౌటే అక్కర్లేదు అంటాడు నందు.

సమర్ధించుకోవడం కూడా ఒక కళ అంటున్న గాయత్రి..

సమర్ధించుకోవడం కూడా ఒక కళ ఈ విషయంలో మీకు తులసి బాగా ట్రైనింగ్ ఇచ్చింది అంటుంది గాయత్రి. మంచి విషయం ఎవరి దగ్గర నేర్చుకున్న తప్పులేదు అంటాడు నందు. నువ్వు నేర్చుకున్నది మంచో చెడో కాలం డిసైడ్ చేస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గాయత్రి. అంతలోనే దీపక్ వెళ్ళొస్తాను బావగారు అంటూ నందుకు చెప్తాడు. ఫంక్షన్ కి వచ్చినందుకు థాంక్స్ నన్ను బావగారు అని పిలిచినందుకు ఇంకా థాంక్స్ అంటాడు నందు.

మా అక్కతో మీకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా మిమ్మల్ని బావగారు అని పిలుస్తున్నాను అంటే అందుకు కారణం మా మేనల్లుళ్ళకి మీరు తండ్రి అంటాడు దీపక్. పికిల్స్ అవి పంపించినందుకు అత్తగారికి థాంక్స్ చెప్పు అంటాడు నందు. తులసి కూడా చెప్పి బయలుదేరుతాడు దీపక్. ఈరోజు బిజినెస్ కి కారణం నువ్వే అంటూ తులసిని మెచ్చుకుంటుంది అనసూయ.

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమంటున్న పరంధామయ్య..

మీరు మెచ్చుకునే అంత గొప్పగా ఇక్కడ ఏమీ వ్యాపారం జరిగిపోలేదు అంటుంది లాస్య. మేము అల్పసంతోషులం అంటుంది శృతి. ఎందుకు అలా మూతి ముడుచుకుంటావు కొంచెం నవ్వొచ్చు కదా అంటూ చిరాకు పడుతుంది అనసూయ. నేను నవ్వితే మీకు నచ్చదు కదా కేఫై క్లోజ్ చేసే టైం అయింది లేట్ అయితే ఫైన్ పడుతుంది కెఫై మూసేసి మనం బయలుదేరుదాం అంటుంది లాస్య. మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి కేఫ్ మూసేద్దాము అనకూడదు బిజినెస్ ఈరోజుకి ఆపేద్దాం అనాలి అంటాడు పరంధామయ్య.

రెండింటికీ తేడా ఏంటో అంటుంది లాస్య. అర్థం కాకపోయినా పర్వాలేదు గుర్తుపెట్టుకో చాలు నాన్న ఆ మాట మన మంచికే చెప్పారు అంటాడు నందు. కొంచెం ఫుడ్ మిగిలిపోయింది ఏం చేద్దాం అంటుంది శృతి. మనం హోటల్ లో తిని చాలా రోజులైంది కదా ఈ రోజు ఇక్కడే తిందాం అంటాడు పరంధామయ్య బిల్లు మీద కట్టాలి అని అంటుంది అనసూయ. లెట్స్ ఎంజాయ్ టు డేస్ ఈస్ మై పార్టీ అని అంటాడు పరంధామయ్య. ఆరోజు రాత్రి తులసి కెఫీలో అని సద్దుతూ ఉంటుంది ఇంతలో అక్కడ పని చేసే చెఫ్ పనైపోయింది అని వెళ్ళిపోతాడు.

నందుకి జాగ్రత్తలు చెప్తున్న తులసి..

అప్పుడు తులసిని అందు దగ్గరికి వచ్చి ఇవన్నీ మీరే అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఇంటికెళ్లే ముందు గ్యాస్ ఆపేరా లేదా అని వస్తువులు వారి స్థానాల్లో ఉన్నాయో లేవా అని చూసుకోవాలి అని అంటుంది. నువ్వు పక్కనే ఉంటావు కదా అంటే మ్యూజిక్ అకాడమీ పక్కనే కదా అవసరం ఉన్నప్పుడు వస్తావు కదా అని అనగా నేను ఉన్నా లేనట్టే నా బాధ్యతలు నాకు ఉంటాయి అని అంటుంది తులసి. అందులో నా బాధ్యత కూడా ఒకటి ఉందని అనుకోవచ్చు కదా అంటే కేఫై కూడా నీ బాధ్యతలో కొంచెం వస్తుంది కదా అని అంటాడు నందు.

మీ బాధ్యత చూసుకోవడానికి అంటే కెఫే బాధ్యత పంచుకోవడానికి మీ భార్య ఉన్నది అని అంటుంది తులసి. మీ సొంత మనిషి మీతో జీవితాన్ని పంచుకొని మనిషి మీ సక్సెస్ కోసం ఆరాటపడే మనిషి అంటుంది తులసి. నువ్వు కూడా నా సక్సెస్ కోసం ఆరాటపడుతున్నావు కదా అని నందు అంటే పేషెంట్ కోసం డాక్టర్ పడే ఆరాటం వేరు, ఒక సొంత మనిషి కోసం ఆరాటపడటం వేరు అంటుంది తులసి. ఏదేమైనప్పటికీ చివరికి బ్రతికించవలసింది డాక్టరే కదా అంటాడు నందు.

ఆనందంతో ఎమోషనల్ అవుతున్న నందు..

ఈరోజు తన సంపాదన 1500 రూపాయలు చూపించి చాలా సంతోషిస్తాడు నందు. చాలా రోజుల తర్వాత నేను సంపాదించాను. నేను ఎంత సంపాదించాను అనేదానికన్నా ఎంతో తృప్తిని సంపాదించాను నామీద నాకు నమ్మకాన్ని సంపాదించుకున్నాను అందుకు కారణం నువ్వే అంటూ తులసిని మెచ్చుకుంటాడు నందు. నీకు ఎంతో హాని చేసినా నాకు బ్రతకటానికి దారి చూపించావు నీ రుణం తీర్చుకోలేను అంటాడు నందు.

తీర్చమని నేను కూడా అడగను నేను సహాయం చేసింది నా పిల్లల తండ్రికి ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీరు సంతోషంగా ఉంటే పిల్లలు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు అంటుంది తులసి. ఎంత సంతోషంలోనూ లాస్య మాటలు గుర్తొచ్చి బాధనిపిస్తుంది ఎక్కడ ఓడిపోతాను అని భయంగా అనిపిస్తుంది అంటాడు నందు. భయం ఎప్పుడు మంచిదే మనల్ని అప్రమత్తంగా ఉండేలాగా చేస్తుంది. అంతకు మించి లాస్య మాటలు కి ప్రాముఖ్యత ఇవ్వద్దు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి.

Intinti Gruhalakshmi February 9 Today Episodeదీర్ఘాలోచనలో తులసి..

మరోవైపు లాస్య మాటలు గుర్తొచ్చి తులసికి నిద్ర పట్టదు. లాస్య అన్నది జరగాలని లేదు ఉగ్రేషన్ తో ఏదో పని చేస్తుంది మనసుల్ని కలుషితం చేస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని నింపి నిద్ర పట్టనివ్వదు. టిఫిన్ సక్సెస్ అవ్వాలంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి, మరింత ప్రచారం చేయాలి ఎలాగా అనుకుంటూ ఆలోచనలో పడుతుంది.

తరువాయి భాగంలో పాంప్లెట్స్ ప్రిపేర్ చేస్తుంది తులసి వాటిని ప్రింట్ చేయించుకుని తీసుకువస్తాడు ప్రేమ్. అది చూసిన నందు ఆనందంతో కన్నీరు పెడతాడు. ఏమైంది అని ప్రేమ్ అడిగితే ఇన్నాళ్లు నాకు ఎవరూ లేరు అనుకున్నాను కానీ మీ అందరి సహకారం చూస్తుంటే నాకు చాలా ఎమోషనల్ గా ఉంది అంటాడు నందు.