Intinti Gruhalakshmi January 14 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నువ్వు తులసి గురించి ఆలోచిస్తున్నావు అనేదే నిజం. ఎందుకురా నీ మనసును నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ మనసులో మాట బయటకు చెప్పవచ్చు కదా అని అంటాడు.

తులసి కోసం జీవితాంతం వేచి ఉంటాను అన్న సామ్రాట్..

నా మనసులో మాట ఏంటి బాబాయ్ అని అనగా, అది నీ మనసుకు తెలుసురా నువ్వు తులసిని ప్రేమిస్తున్నావు కానీ ఒప్పుకోలేకపోతున్నావు అని అంటాడు. దానికి సామ్రాట్, లేదు బాబాయ్ తులసి గారికి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు రెండో పెళ్లి కూడా చేసుకోరు నేను ఆత్మబంధువు లాగే ఉంటాను అని చెప్పాను. తులసి లాంటి మంచి మనసు ఉన్న వారి కోసం జీవితాంతం వేచి చూసినా తప్పు కాదు అని అంటాడు.

ఆ తర్వాత సీన్లో శృతి వంటగదిలో పనులు చేస్తూ ఉండగా పనిమనిషి అక్కడికి వస్తుంది. ఎప్పుడు వచ్చావు రాములమ్మ అని సంతోషంగా శృతి అడగగా, నీకు మూడో నెల అంట కదమ్మా జాగ్రత్తగా ఉండాలి కదా అని రాములమ్మ అంటుంది. నాకు మూడో నెల అని నీకు ఎలా తెలుసు అని శృతి అడుగుతుంది. అత్తింట్లో ఉన్నామని పుట్టింటి విషయాలు తెలియకుండా ఉంటాయేటమ్మా ఇది అంతే అని అంటుంది రాములమ్మ.

వస పిట్టలా వాగుతున్న రాములమ్మ..

అయినా నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడకు వచ్చావు అని శృతి అడగగా ఎవరో పిలిస్తే నేనెందుకు వస్తానమ్మా స్వయాన తులసమ్మ గారే పిలిచారు.అమ్మగారు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసారట కదా పనుల్లో నేను ఒక చేయి వేయకపోతే ఆవిడకి రోజు గడవదు అని అంటుంది. ఇంతలో తులసి నవ్వుతూ వచ్చి ఇందాకటి నుంచి చూస్తున్నాను వసపిట్టలాగా వాగుతూనే ఉన్నావుగానీ పనేమీ చేయడం లేదా అని అనగా మాట్లాడుతూ పనిచేస్తుంది ఆంటీ అని శృతి నవ్వుతూ అంటుంది.

అప్పుడు తులసి శృతి తో, నేను వంట పనులు చేస్తాను, రాములమ్మ నిన్ను చూసుకుంటుంది అసలకే మూడో నెల కదా అని అనగా వద్దు ఆంటీ నేను బానే ఉన్నాను కదా నేను జాగ్రత్తగా చూసుకోగలను అని అంటుంది శృతి. అంకిత విషయంలో కూడా ఇలాగే జరిగిందమ్మా నేను ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని తులసి అనగా మీకెందుకు అమ్మగారు నేను చేస్తాను కదా మూడో నెలలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోలో నాకు తెలుసు.

ఇప్పుడే వెళ్లి జ్యూస్ కలిపిస్తాను అని ఫ్రిడ్జ్ తీయబోతుండగా ఫ్రిడ్జ్ కి తాళం ఉంటుంది. ఏంటమ్మా ఫ్రిడ్జ్ కి తాళం వేసి ఉన్నది అని రాములమ్మ అడుగుతుంది. ఇంకా ఆ లాస్య అంటే మారలేదు ఆవిడ దగ్గర తాళాలు ఉంటాయి ఆవిడని అడిగి తీసుకుంటేనే ఇస్తారు అని అంటుంది శృతి. కోపంతో తులసి వెంటనే లాస్య దగ్గరకు వెళ్తుంది. అదే సమయంలో లాస్య, తులసి ఎందుకు ఇక్కడికి వచ్చింది.

నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు బెనర్జీతో నా ప్రాజెక్టు కూడా చేయి దాటిపోయినట్టే అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంతలో తులసి అక్కడికి కోపంగా వచ్చి తన నడుము దగ్గర ఉన్న తాళాలు గుత్తిని చూస్తుంది వెంటనే పైటతో కప్పేసుకుంటుంది లాస్య. తులసి కోపంగా నువ్విస్తావా నన్ను తీసుకోమంటావా అని అనగా నేను ఇవ్వను నీకు దక్కదు అని లాస్య అంటుంది.

లాస్య దగ్గర తాళాలు గుత్తు లాక్కున్న తులసి..

నేను అడుగుతుంది నా మాజీ భర్త గురించి కాదు నీ దగ్గర ఉన్న తాళాలు గుత్తు గురించి అని బలవంతంగా లాక్కుంటుంది తులసి. ఈ ఇంటికి నీ పెత్తనం ఏంటి అయినా ఈ ఇంటికి నువ్వు పరాయి దానివి నేనే అసలైన కోడల్ని అని లాస్య అంటుంది. అది ఎవరికివారు అనుకుంటే సరిపోదు లాస్య నువ్వు ఆయనకి భార్యకి మాత్రమే అది కూడా రెండో భార్యవి అంతేగాని నా పిల్లలకు తల్లివి అవ్వలేవు.

నా అత్తమామలకు కోడలివి అవ్వలేవు అని అనగా కోడలు అవ్వాలంటే అదేమైనా పెద్ద విషయమా? ఇంట్లో పనులన్నీ చేసి ఉదయమే కాఫీలు ఇచ్చి అందరికీ సేవలు చేస్తే సరిపోతాది. దానికి ఏదో నేను పనికిరానట్టు చెప్తావు అని అంటుంది లాస్య. నువ్వు చేయలేవు అని తులసి అంటుంది. ఈ ఒక్క నెల నేను ఇంట్లో పనులన్నీ చేస్తాను అప్పుడు వాళ్ళ దగ్గర ప్రశంసలు తీసుకుంటాను అని అంటుంది లాస్య.

తులసి తో పందెం కాసిన లాస్య..

ఎందుకు లాస్య చేయలేనివి అని చెప్తావు నేను చివరి అవకాశం ఇస్తున్నాను నువ్వు చేయలేను అంటే నిన్ను, నీ భర్తని కూడా నేనే పోషిస్తాను మూలన పడి ఉండండి ఇంట్లో అని అంటుంది తులసి. నేను చేసి చూపించి నీ దగ్గరకు వస్తాను అని కోపంతో అంటుంది లాస్య. అది నీ వల్ల కాదు అని చెప్పి తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రేమ్ పాట పాడుతుండగా తులసి అక్కడికి వస్తుంది.

చాలా రోజులైంది నాన్న నీ పాట విని ఆఖరికి ఇప్పుడు నీ పాట వినే అవకాశం దొరికింది అని తులసి అంటుంది. నేను నీకు పాట వినిపించి చాలా రోజులైంది అమ్మ ఆగు గిటార్ తెచ్చి పెడతాను అని వెళ్లబోతుండగా గిటార్ అమ్మేసిన విషయం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు అమ్మకు తెలిస్తే బాధపడుతుందేమో అని మనసులో అనుకొని వద్దులే అమ్మ నేను గిటార్ లేకుండా పాడుతాను అని ప్రేమ్ అంటాడు.

ప్రేమ్ గిటార్ ను తిరిగి ఇచ్చిన తులసి..

నువ్వు ఆగు గిటార్ ఉంటేనే పాటకు అందం ఉంటుంది, గిటార్ తెస్తాను అని లోపలికి వెళ్తుంది తులసి. ఇప్పుడు అమ్మకి నిజం ఎలా చెప్పాలి అమ్మేసాను అంటే బాధపడుతుంది అనుకునే లోగ తులసి గిటార్ పట్టుకుని బయటకు వస్తుంది. గిటార్నీ చూసినా ప్రేమ్ ఆశ్చర్యపోతాడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్లి హద్దుకుంటాడు ఆరోజు నువ్వు ఎంత భారంగా గిటార్నీ అమ్మేవో నేను నా కళ్ళారా చూశాను రా.

Intinti Gruhalakshmi January 14 Today Episode:

అందుకే వెంటనే వెళ్లి నేను కొన్నాను అని అంటుంది తులసి. తల్లి ప్రేమను అమ్ముకున్నాను అమ్మ అని ప్రేమ అంటాడు. కాదు దీన్ని అమ్మేవంటే అంతకన్నా పెద్ద కష్టమేదో వచ్చే ఉంటుంది అని తులసి అనగా, శృతి హాస్పిటల్ కి ఖర్చులకోసం అమ్మేనమ్మ వేరే దారి లేక అని అంటాడు ప్రేమ్. ఒక మెట్టు ఎదిగా ప్రేమ్ తల్లి కన్నా భార్య గొప్పది కొన్ని కొన్ని విషయాల్లో భార్య తల్లిలా కూడా మారుతుంది.

అలాంటిది శృతిని నువ్వు ఇంతలా చూసుకోవడం నాకు బాగా నచ్చింది అని అంటుంది తులసి. తరువాయి భాగంలో లాస్య ఇంటి పనులన్నీ చేసే ఒప్పందంలో అన్నం వడ్డించబోయి నందు మీద సాంబార్ వేయడం, మరియు అనసూయ కి కాళ్లు పడుతున్నప్పుడు సరిగ్గా పట్టకపోవడంతో అనసూయ గట్టిగా అరవడం చూపిస్తారు.