Intinti Gruhalakshmi January 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను అర్జెంట్గా ఉత్తమ ఇల్లాలు అవ్వాలి అంటుంది లాస్య. ఆ మాటకి షాక్ అయిన నందు ఏమన్నావ్ అని అడుగుతాడు. నేను అర్జెంటుగా ఉత్తమ ఇల్లాలు అయిపోవాలి టైం లేదు షార్ట్ కట్ లో చెప్పు అంటుంది లాస్య. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంటాడు నందు.

భర్తని సలహా అడుగుతున్న లాస్య..

కారణం చెప్తేనే గాని సలహా ఇవ్వవా అసలు ఉత్తమ ఇల్లాలంటే నీ దృష్టిలో ఏంటి అని అడుగుతుంది లాస్య. ఉత్త ఇల్లాలు కానిది ఉత్తమ ఇల్లాలు అంటాడు నందు. నాకు కావాల్సింది నీకు సేవలు చేయడం మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళందరికీ నేను దగ్గర అవ్వాలి అంటుంది లాస్య. సడన్ గా ఏమైంది నీకు అంటాడు నందు. నేను మారడం మీకు ఇష్టం లేదా అని లాస్య అడిగితే నువ్వు మారతానంటే నాకెందుకు ఇష్టం ఉండదు కానీ నువ్వు మారడం కష్టమేమో అంటాడు నందు.

ఈ లాస్య తలుచుకుంటే జరగనిది ఉండదు ముందు ఏం చేయాలో చెప్పు అంటుంది లాస్య. పొద్దున్నే ఐదు గంటలకి లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేసి, దేవుడి ముందు దీపం వెగించడం ఉత్తమ ఇల్లాలి లక్షణం. ఏడు గంటలకి కాఫీలు టిఫిన్లు చూడాలి. ఎంత పనిలో ఉన్న అత్తమామల్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటూ పెద్ద లిస్ట్ చదువుతాడు నందు. ఎవరికి ఏది ఇష్టమో అడుగు మరి పెట్టాలి. ఎంత చిరాకు వచ్చినా మొఖం మీద నవ్వు చెదిరిపోకూడదు.

మొగ బుద్ధి అంతే అనుకుంటున్న లాస్య..

పడుకునే ముందు తలుపులన్నీ వేసి ఉన్నాయో లేదో కూడా నువ్వే చెక్ చేసుకోవాలి అంటాడు నందు. ఇంకా నయం వాచ్మెన్ డ్యూటీ కూడా చేయమనలేదు అనుకుంటుంది లాస్య. ఏమనుకుంటున్నావు అని నందు అడిగితే టోటల్గా తులసి లాగా మారిపోమంటున్నవ్ అంతేనా అంటుంది లాస్య. అంతే అనుకుంటూ వెళ్లిపోతాడు నందు. తులసి లాగా నేను మారిపోవాలి కానీ తులసి తో కాపురం చేయడు ఈ మొగబుద్దే అంత అనుకుంటుంది లాస్య.

దేవుడా నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావు అంటూ బాధపడుతుంది. తులసి లాగా మారడం కోసం ప్రాక్టీస్ చేస్తుంది. మరోవైపు తులసి వడ్డన చేస్తూఅందర్నీ భోజనానికి పిలుస్తుంది. ఆ పిలుపు విన్న లాస్య అదేంటి నేను ఈ పనులన్నీ చేసి ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలి కదా తనే ఈ పనులు చేసి నన్ను అందరికీ దగ్గర కానివ్వకుండా తొక్కేస్తుంది అనుకుంటుంది లాస్య. డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చిన లాస్యని భోజనానికి కూర్చోమంటుంది తులసి.

ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న లాస్య..

నువ్వు కూర్చో తులసి ఇన్ని రోజులు నువ్వు చేసి చేసి అలసిపోయావ్ ఇకనుంచి అన్ని నేను చూసుకుంటాను ఎవరికి ఎలాంటి లోటు రానివ్వను అంటూ తులసిని కూర్చోబెడుతుంది లాస్య. ఆమె ప్రవర్తనకి అందరూ షాక్ అవుతారు. దీనికి వెర్రి గాని పట్టలేదు కదా అనుకుంటుంది అనసూయ. అసలు మొహమాట పడొద్దు ఏం కావాలన్నా అడుగు అంటుంది లాస్య. ఏమిటి ఓవరాక్షన్ అని దివ్య అడిగితే కామ్ గా చూస్తూ ఉండు అంతే అంటుంది తులసి.

నందుకి సాంబార్ ఒడ్డించబోతూ అతని మీద ఒంపేస్తుంది లాస్య. సాంబార్ ని కడుక్కోవడానికి వచ్చిన నందు దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చేసావు అని అడుగుతుంది లాస్య. నామీద ఒంపింది సాంబారు, పన్నీరు కాదు అంటాడు నందు. మీరు రాకుండా ఉండాల్సిందే చూడండి వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారో అంటుంది లాస్య. ముందు ఎదురుగా ఉండడం నేర్చుకో తర్వాత ఉత్తమ ఇల్లాలివి అవుదువు గాని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు.

తన కోరికల లిస్ట్ చెప్తున్న తులసి..

నెక్స్ట్ డే పర్ఫెక్ట్ గా ట్రై చేస్తాను అనుకుంటుంది లాస్య. మరోవైపు ఆఫీసులో పని చేసుకుంటున్న తులసి సడన్గా నవ్వుతుంది. అది చూసిన సామ్రాట్ నన్ను చూశా అని అడుగుతాడు. ఇంట్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అంటూ సాంబార్ సంగతి అంతా చెప్తుంది తులసి. అయితే మీకు ఇంట్లో కాలక్షేపం బాగానే అవుతుంది అనమాట అంటాడు సామ్రాట్. బాగా, కాకపోతే నేను లాస్య లాగా చిటపటలాడుతుంటే తనేమో నాలాగా ఒద్దికగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

పాపం ఎప్పటికీ తన కోరిక తీరుతుందో అని తులసి అంటే, పోనీలెండి మీ కోరిక తీరింది కదా మీ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటున్నారు అంటాడు సామ్రాట్. మీ పుణ్యమా అని సరైన సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నేను చేయవలసిన పనులు మూడు ఉన్నాయి అంటుంది తులసి. ఏంటవి అని సామ్రాట్ అడిగితే మా పిల్లల్ని సెటిల్ చేయాలి అంటుంది తులసి. ఎవరి పనులు వాళ్ళకి ఉన్నాయి కదా అంటాడు సామ్రాట్. ఉన్నాయి కానీ ఎందుకో పైకి రాలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు తండ్రిగా నందగోపాల్ గారు సపోర్ట్ ఇస్తారు అనుకుంటే ఆయనకే తికానా లేదు అంటుంది తులసి.

తులసిని కంగారులో పడేసిన సామ్రాట్ నిర్ణయం..

అంటే వాళ్ల బాధ్యత కూడా మీదేనా అంటే ప్రస్తుతానికి నాదే అంటుంది తులసి. రెండవ పని అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ బాధ్యతలు లాస్య మీద వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను అంటుంది. ఇక మూడవ పని దివ్య పెళ్లి అని తులసి అంటే దీని గురించి ఆలోచించడానికి ఏముంది తను చక్కగా చదువుకుంటుంది డాక్టర్ అవుతుంది ఒక డాక్టర్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అంటాడు సామ్రాట్.

కానీ పెళ్లయితే చేయాలి కదా అందులో ఎలాంటి లోటు రాకూడదు. నేను సంపాదించిన డబ్బుతో దిగి పెళ్లి చేయాలి అప్పుడు నాకు తృప్త అంటుంది తులసి. మీ మూడో కోరిక తీరడానికి ఉపాయం చెప్తాను నేను స్టార్ట్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పూర్తిగా మీ చేతుల్లోనే పెడతాను మీరే ఇన్చార్జ్ లాభాలు 50.. 50.. అంటాడు సామ్రాట్. మీకు ఓకే కదా అని సామ్రాట్ అంటే అసలు ఓకే కాదు అంటుంది తులసి.

వేరే దారి లేదంటున్న సామ్రాట్..

ఎగిరి గంతేస్తారు అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి అంటాడు సామ్రాట్. నేను ఇప్పుడిప్పుడే కోడబలుక్కొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అలాంటిది తీసుకెళ్లి నన్ను సముద్రంలో పడేస్తానంటే ఎలా అని కంగారు పడిపోతుంది తులసి. తప్పదు అలా అయితేనే ఈత వస్తుంది ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఈ లోపల మీరు ఇంగ్లీషు నేర్చేసుకోండి వేరే ఆప్షన్ లేదు అంటూ తులసి ఏం చెప్తున్నా వినిపించుకోకుండా తులసికి ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సామ్రాట్.

అనసూయ కాలు విరిచేసిన లాస్య..

మరోవైపు భర్తని కాళ్ళకి మసాజ్ చేద్దురుగాని ఒకసారి రూమ్ కి రండి అంటుంది అనసూయ. నా పొట్ట వంగకుండా చేసే పని ఏదైనా చెప్పు అంటాడు పరందామయ్య. తులసిని పిలుస్తుంది అనసూయ ఇప్పుడు తనేందుకు అని పరంధామయ్య అంటే తనైతే కాళ్ళకి కూడా తెలియకుండా నొప్పి మాయమయ్యేలాగా చేస్తుంది అంటుంది అనసూయ. లాస్య ఇదేదో నాకు వర్క్ అవుట్ అయ్యేలాగా ఉంది అని ఆ మందు నాకు ఇవ్వండి నేను మర్దన చేస్తాను అంటుంది లాస్య.

వద్దమ్మా నొప్పి ఉన్న పర్వాలేదు కాల్ అంటూ ఉంటే కుంటుకుంటూ అయినా నడుస్తాను నేను చూసుకుంటాను నీకు ఇంకా ఏదైనా పని ఉంటే చూసుకో అంటుంది అనసూయ. మిమ్మల్ని ఇలా వదిలేసి నా పని నేను ఎలా చూసుకుంటాను మీ తర్వాతే నాకు ఏ పనైనా అంటూ ఆ కాలిని తన ఒడిలో పెట్టుకొని మర్ధన ప్రారంభిస్తుంది లాస్య. నీకు ఇంతకుముందు మద్యన చేసిన అలవాటు ఉందా అంటే అలాంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కాదు మా కుక్కపిల్లకి నేనే మర్దన చేసేదాన్ని అని లాస్య అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు.

మా ప్రాణాలతో ఆడుకోవద్దు అంటున్న పరంధామయ్య..

కుక్కకి నాలుగు కాళ్లు ఉంటాయి ఒకటి పోయినా మూడులతో మేనేజ్ చేయొచ్చు అంటాడు ప్రేమ్ మా నానమ్మకు గాని ఒక కాలుపోయింది అంటే మిగిలేది ఒక్కలే అంటాడు అభి. తులసి మరదలు చేస్తుంటే నాకు ఆలు విరగ్గొట్టేసింది అంటూ గోల పెట్టేస్తుంది అనసూయ. ఉండండి అమ్మ నేను చూస్తాను అని అంకిత అంటే అమ్మో నాకు రావాల్సిన క్రెడిట్ డాక్టరమ్మ కొట్టేస్తుంది అనుకోని నువ్వు ఆగు అంకిత ఇది కొత్తరకం పట్టు అంటుంది లాస్య.

ఇంకోసారి నా కాళ్లు ముట్టుకున్నా ఉంటే నీ కాళ్లు విరగగొడతాను అంటుంది అనసూయ. అప్పుడు ఆ కాలుని అంకిత మసాజ్ చేయడం ప్రారంభిస్తుంది. తులసి కన్నా తోపు అనిపించుకోవడం కోసం మా ప్రాణాలతో ఆడుకోకు అసలే మాయి ముసలి ప్రాణాలు అంటాడు పరంధామయ్య. ఈ వయసులో నాకు కావలసింది రెండే రెండు ఒకటి నా చేతిలో పేపరు రెండు పక్కన నా భార్య.

Intinti Gruhalakshmi January 16 Today Episode: లాస్యను చూసి నవ్వుకుంటున్న కుటుంబ సభ్యులు..

జీవితంలో మళ్లీ ఎప్పుడు మీ అత్తయ్య కాళ్ళు నొప్పి అని పైకి చెప్పదు అంటాడు పరంధామయ్య. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. మరోవైపు పుస్తకాలు షాప్ కి వెళ్ళిన తులసి పుస్తకం అడగటానికే ఇంత మొహమాటంగా ఉంది, ఇంకా పుస్తకం ఏం కొంటాను అనుకుంటుంది తులసి. ఏం కావాలి అని షాపు వాడు అడిగితే మా అబ్బాయి ఇంగ్లీష్ నేర్చుకుంటాడంట ఆ పుస్తకం కావాలి అంటుంది తులసి.

ఏం చదువుతున్నాడు హనీ షాప్ అతను అడిగితే అవును ఏం చదువుతున్నాడు అంటూ తడబడుతుంది. తరువాయి భాగంలో తులసి తెచ్చిన ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని చూస్తాడు పరంధామయ్య. ఇంగ్లీష్ మాట్లాడడం నేను నేర్పిస్తాను అని తులసితో చెప్తుంది శృతి.

నీకు కావాల్సింది అమెరికన్ వ్యాస ఇంగ్లీషు అది నేను నేర్పిస్తాను అంటుంది తులసి. ఈ మాటలు విన్న లాస్య అంటే శృతికి ఆ మాత్రం కూడా చేతకాదా ఏంటి అంకిత అంత మాట అనేసావు అంటుంది.