Intinti Gruhalakshmi January 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంగ్లీషు నేర్చుకోవడానికి పుస్తకం కావాలి అని అడుగుతుంది తులసి. అది అడగడానికి మొహమాటం ఎందుకు మేడం తినండి అని చెప్పి నాలుగు పుస్తకాలు ఇస్తాడు షాపతను. ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి హనీషా పక్కన ఉంటే నాలుగు ఇచ్చేయండి, ఏది చదువుకోవాలో ఇంటికి వెళ్ళాక డిసైడ్ అవుతాను అంటుంది తులసి.
అసలు విషయం చెప్పిన తులసి..
ఇంటికి వచ్చిన తులసి ఆ బుక్స్ ని టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి దీని పని పడతాను అనుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన పరంధామయ్య ఆ బుక్ ని చూసి వారం రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తే ఇంకేం అంటాడు. రాదంటారా అని అడుగుతుంది తులసి. పిండి పిండి కొద్దీ రొట్టె అని ఎంత ఎక్కువ టైం దానిమీద స్పెండ్ చేస్తే అంత త్వరగా వస్తుంది అంటాడు పరంధామయ్య.
నాకు అలాగే ఉంది కాకపోతే నేను నేర్చుకోగలనా లేదా అని టెన్షన్ గా ఉంది అంటుంది తులసి. ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అంటుంది శృతి. అమెరికన్ క్లైంట్స్ కి సంబంధించిన ఒక ప్రాజెక్టుకి నన్నే హెడ్ ని చేశారు సామ్రాట్ గారు అందుకే నేను త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటుంది తులసి. ఇలా చదివి నేర్చుకోవడం కన్నా ఎవరితోనైనా మాట్లాడితే త్వరగా ఇంగ్లీష్ వస్తుంది అంటాడు పరంధామయ్య.
తోటి కోడళ్ల మధ్య చిచ్చుపెట్టిన లాస్య..
సరిగ్గా రాకుండా మాట్లాడితే నవ్వుతారు కదా మావయ్య అంటుంది తులసి. అలాంటి మొహమాటలేవి పెట్టుకోవద్దు, మీరు నాతో మాట్లాడండి తప్పులు ఏమైనా ఉంటే నేను సరి చేస్తాను అంటుంది శృతి. అలా అయితే ఓకే ఇంక రెచ్చిపోతాను అంటుంది తులసి. మీరు అమెరికన్స్ తో మాట్లాడేటప్పుడు లోకల్ ఇంగ్లీష్ సరిపోదు అంటుంది అంకిత. అవునా అలా అయితే వేరే ఎవరినైనా చూసుకోమని సామ్రాట్ గారికి చెప్పాలి అని కంగారుగా చెప్తుంది తులసి.
అంత కంగారు ఎందుకంటే కాన్వెంట్లో చదువుకున్న నేను ఉన్నాను కదా మీకు నేర్పించడానికి అంటుంది అంకిత. అంతలోనే అక్కడికి వచ్చిన లాస్య అంటే శృతిదీ బట్లర్ ఇంగ్లీషా, తను ఇంగ్లీష్ మాట్లాడడానికి పనికిరాదా అంత మాట అనేసావేంటి శృతి అంటుంది. ఆ మాటకి హర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది శృతి. నేను అనని మాటని అన్నానని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటుంది.
మంచి పనిని వాయిదా వేయొద్దంటున్న పరంధామయ్య..
మీకు లేనిపోని మాటల వల్ల మా ఇద్దరి మధ్య అపార్ధాలు మొదలయ్యాయి అంటుంది అంకిత. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని నాకేమీ లేదు నేనేదో క్యాజువల్ గా అన్నాను అంతే అంటుంది లాస్య. తను అపార్థం చేసుకుంటుందేమో ఇప్పుడు ఎలా ఆంటీ అంటుంది అంకిత. తను అలాంటి మనిషి కాదులే అంటుంది తులసి. నేను అనుకోకుండా మంచిపని చేశాను అన్నమాట అనుకుంటుంది లాస్య.
నేను చదువు మొదలు పెట్టిన ముహూర్తం బాగోలేదు అనుకుంటాను అని పుస్తకాలు పక్కనపడేద్దామనుకుంటుంది తులసి. మంచి పనికి వాయిదా వేయవద్దు ముందు చదువు మొదలు పెట్టు అంటాడు పరంధామయ్య. మరోవైపు గదిలో పని చేసుకుంటున్న శృతి దగ్గరకు వచ్చి బాధపడ్డావా అని అడుగుతుంది. నా బాధ నాకే సొంతం ఎవరికి సంబంధం లేదు అని శృతి అంటే నాకు కూడానా అని అంటుంది తులసి.
శృతిని సముదాయిస్తున్న తులసి..
నేను నా కోడల్లో,కూతుర్ని చూసుకుంటున్నాను నా కోడలు కూడా నాలో తల్లిని చూసుకుంటుందని అనుకుంటున్నాను. అపార్థం మూడు అక్షరాలు మాటే కానీ అది అయిన వాళ్ళ మధ్య అంతులేని దూరాన్ని పెంచుతుంది. ఒకసారి అది శాశ్వతం కూడా కావచ్చు. నువ్వు అలాంటివి పరిస్థితి రానివ్వవు అని అనుకుంటున్నాను అంటుంది తులసి.
అంతలోనే అక్కడికి వచ్చిన అంకిత ఓకే తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వు నా సొంత చెల్లివే, అలాంటప్పుడు నిన్ను బాధపెట్టాలని ఎందుకు అనుకుంటాను. మీ ఇంగ్లీష్ ని నేను క్రిటిసైజ్ చేయలేదు. లాస్య ఆంటీ మాటల వల్ల నీకు అలా అనిపించింది అంతే అంటుంది అంకిత. ఎవరికైనా అర్థం చేసుకోవడం కష్టం అపార్థం చేసుకోవడం చాలా తేలిక ఏమంటావు అంటుంది తులసి.
లాస్య ముందు భార్యని ఇరికించేసిన పరంధామయ్య..
అంతలోనే అక్కడికి ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తాడు. ఎవరికి ఐస్ క్రీమ్స్ అని తులసి అడిగితే మా ఆవిడకి అంటాడు ప్రేమ్. అంటే మేము తినమనుకున్నావా అంటుంది తులసి. చూసావా ఎంత మంచి మొగుడో అంటుంది తులసి. తేవడమే కాదు తినిపించు చూసి సంతోషిస్తాం అంటుంది అంకిత. నేను ఐస్ క్రీమ్ అడిగితే వీడు ప్లస్ ఇచ్చాడు అని తెల్ల మొహం వేస్తాడు ప్రేమ్. ఆమాటలకి నవ్వేస్తుంది శృతి.
సీన్ కట్ చేస్తే ఇంకా రెండోసారి కాఫీ రాలేదు అని అడుగుతాడు పరంధామయ్య. తులసి పూజలో కూర్చొని కదా తెస్తుందిలేండి అంటుంది అనసూయ. ఇంతలోనే కాఫీ తెచ్చి ఇస్తుంది లాస్య. నువ్వే పెట్టావా నీ అత్తయ్యకి ఇవ్వమ్మా ఇందాకట్నుంచి నాలుక పీకేస్తోంది అంటుంది అని భార్యని ఇరికించేస్తాడు పరదామయ్య. నేను అలా అనలేదు కడుపులో తిప్పుతుంది కాఫీ తాగాలని లేదు అన్నాను, చెవిటి మొహం మీకు ఏమి వినిపించిందో ఏంటో, ఇందాకటి నుంచి కాఫీ కాఫీ అని గోల పెడుతున్నారు మీ మామయ్య.
ముసి ముసిగా నవ్వుకుంటున్న కుటుంబ సభ్యులు..
తీసుకోండి పాపం కష్టపడి తెచ్చింది అంటే భర్తని ఇరికించేస్తుంది అనసూయ. కాఫీ తాగిన పరంధామయ్య ని ఎలా ఉంది అని అడిగితే సూపర్ గా ఉంది అంటాడు. మరి పక్కనే పెట్టేసారేమీ అని గ్లాస్ అడిగితే బాగా ఇష్టమైనది దాచుకొని దాచుకొని తినటం, తాగడం నాకు అలవాటు అంటాడు పరంధామయ్య. ఆ మాటలకి కుటుంబ సభ్యులందరూ ముసిముసిగా నవ్వుకుంటారు కానీ లాస్య కి మాత్రం అర్థం కాదు. అప్పుడే పూజ పూర్తి చేసుకుని హారతి తీసుకొని వస్తుంది తులసి.
ఇబ్బంది పడుతున్న అత్తమామలకి నేను కాఫీ ఇస్తాను లెండి అని చెప్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన నందు కూడా హారతి ఇస్తుంది. కంగారుగా వచ్చిన లాస్య ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన హారతి తీసుకోకూడదు భార్య ఇచ్చిన హారితే తీసుకోవాలి అంటుంది. హారతి ఎవరిస్తే ఏంటి అని అనసూయ అంటే పోనీలెండి అత్తయ్య ఎవరి నమ్మకం వాళ్ళది అని హారతి పళ్లెం లాస్య చేతిలో పెట్టేస్తుంది. భర్తకి హారతిస్తూ ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది లాస్య.
నెత్తి కొట్టుకుంటున్న అనసూయ..
దాంతో వెళ్లిన పని అయినట్టే అని నెత్తి కొట్టుకుంటుంది అనసూయ. ఎందుకు నెత్తి కొట్టుకుంటున్నారు అని అడిగితే దోమ కుట్టింది అంటుంది అనసూయ. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు నందు. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే సరిపోదు భార్య కూడా ఎదురు రావాలి అంటుంది లాస్య. ఎదురొచ్చినా భర్తకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది. దీని వాళ్ళకు చూస్తుంటే ఈమధ్య పిచ్చి ఎక్కినట్లు గా అనిపిస్తుంది ఎలా భరించాలో అంటుంది అనసూయ.
మరోవైపు ఆఫీసుకు బయలుదేరుతున్న తులసితో నా లాప్టాప్ సతాయిస్తుంది అని చెప్తుంది దివ్య. రేపు బాగు చేయిస్తాను అని తులసి అంటే అదేమైనా డ్రెస్ అనుకున్న వాళ్ళు చేసి టైప్ చేయడానికి నేను చేసే వర్క్ కి ఇప్పుడున్న వెర్షన్ సరిపోదు లేటెస్ట్ వర్షన్ ల్యాప్టాప్ కావాలి అంటుంది దివ్య. అది 100 కి వెయ్యికి వచ్చే వస్తువులు కాదు కదా చాలా ఖర్చవుతుంది అంటుంది తులసి. కానీ అది లేకపోతే నాకు ఎగ్జామ్ కూడా కష్టమవుతుంది అని దివ్య అంటుంది.
తల్లిని డిమాండ్ చేస్తున్న దివ్య..
నాకు కొంచెం టైం ఇవ్వు, ఇప్పటికిప్పుడు అంటే కుదరదు నాకు కొంచెం టైం ఇవ్వు అని తెలిసి అంటే అయితే నన్ను చదువు మానేయమంటావా అంటుంది దివ్య. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర కొత్త వెర్షన్ ల్యాప్టాప్ లు ఉన్నాయి నా ఒక్కదాని దగ్గరే లేదు నా కర్మ అంటుంది దివ్య. ఎందుకు అంత నిస్టూరంగా మాట్లాడుతున్నావ్ మన ఇంటి పరిస్థితి నీకు తెలుసు. ఉన్నదంటే సర్దుకుపోవటం నేర్చుకో అంటుంది తులసి.
పోనీ సామ్రాట్ అంకల్ కి ఫోన్ చేసి అడగనా అని దివ్య అంటే ఏమని అడుగుతావు, మా అమ్మ లాప్టాప్ కొనట్లేదు మీరు ముష్టి వేస్తే నేను లాప్టాప్ కొనుక్కుంటాను అని అడుగుతావా అంటుంది తులసి. అసలు నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని తులసి అంటే అంకుల్ క్లోజ్ కదా హెల్ప్ చేస్తారేమో అని అలా అన్నాను అంటుంది దివ్య. ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు అవసరానికి వాడుకోవద్దు,స్వార్థం చేసేది ఫ్రెండ్షిప్ కాదు అంటుంది తులసి.
దివ్యని బాధ పెట్టొద్దు అంటున్న లాస్య..
నువ్వు ఎప్పుడు నీ వైపు నుంచే ఆలోచిస్తావు నాకు ఇప్పుడు లాప్టాప్ కొనిస్తావా లేదా అని అడిగితే నా పీకల మీద కూర్చుంటే నావల్ల కాదు, ఎగ్జామ్ వరకు ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసుకో తర్వాత సంగతి చూద్దాం అని తులసి అంటే కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య. అనవసరంగా దివ్యని బాధపెడుతున్నావు అంటూ వస్తుంది లాస్య. తనేమైనా ఆట బొమ్మ అడిగిందా ఎక్సామ్ కి లాప్టాప్ అడిగింది అంటుంది లాస్య.
అదేం అడిగిందో నాకు వినిపించింది. నాకు చెప్పక్కర్లేదు నా బాధ్యత నాకు తెలుసు అంటుంది తులసి. తెలిస్తే తనమీద అలాగా అరవవు అంటుంది లాస్య. అడిగినవన్నీ కొనిస్తేనే అభిమానం ఉన్నట్టా మన తాహతు ఏంటి అని చెప్పడంలో తప్పులేదు అంటుంది తులసి. మరి అలాంటప్పుడు ఎంబిబిఎస్ కోర్సు ఎందుకు చేపిస్తున్నావు అని లాస్య అంటే ఆ కోర్సులో జాయిన్ చేసింది నేను కాదు వాళ్ళ నాన్న ఇప్పుడు ఆ పెద్దమనిషి చేతులెత్తేసాడు.
Intinti Gruhalakshmi January 17 Today Episode: మా మధ్యలో దూరొద్దంటున్న తులసి..
అయినా నా బిడ్డల్ని చదివించుకోవడానికి నా పాట్లు నేను పడతాను మధ్యలో నువ్వు కల్పించుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది తులసి. దివ్యని నా వైపు తిప్పుకోకుండా ఎలా ఉంటాను నీ చేతకాని తనమే నా ఆయుధం అనుకుంటుంది లాస్య. మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్తున్న నందు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నాకు ఈ జాబు దొరకపోవడం ఏంటో నా కర్మ ఈరోజు ఇంటర్వ్యూ లోనైనా నేను సెలెక్ట్ అవ్వాలి అనుకుంటాడు.
తరువాయి భాగంలో మీటింగ్లో ఉన్న తులసికి ఆల్ ద బెస్ట్ చెప్తాడు సామ్రాట్. మీటింగ్ లో కూర్చున్న క్లైంట్స్ ఇంగ్లీష్ లో ఏవేవో ప్రశ్నలు అడుగుతారు. తులసి ఏం సమాధానం చెబుతుందో అని కంగారుగా చూస్తూ ఉంటాడు సామ్రాట్.