Intinti Gruhalakshmi January 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నాకు జాబ్ దొరకపోవడం ఏంటో ఈ రోజైనా జాబ్ దొరికితే బాగుండు అనుకుంటాడు నందు. ఎడం కన్ను అదురుతుంది ఏం ప్రమాదం నుంచి వస్తుందో ఏంటో అనుకుంటాడు. అంతలోనే అతని కారుకి అడ్డంగా ఒక కారువొచ్చి ఆగుతుంది. కళ్ళు కనిపించడం లేదా అంటూ మందలిస్తాడు నందు. కానీ వాళ్ళు ఆ మాటలు వినిపించుకోకుండా వచ్చి నందు కారు కీస్ తీసుకుంటారు.
నడిరోడ్డు మీద నందుకు జరిగిన అవమానం..
ఏం చేస్తున్నారు అంటూ కంగారుపడిన నందుని కార్లోంచి బయటికి దిగమని చెప్పి మేము బ్యాంకు వాళ్లని నాలుగు నెలల నుంచి ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నారు అంత డబ్బు లేనప్పుడు విలాసాలు ఎందుకు అంటూ అసహ్యంగా మాట్లాడుతారు. నేనేమీ కావాలని ఎగ్గొట్టడం లేదు జాబు పోయింది ఫైనాన్షియల్ క్రిటిసిస్ లో ఉన్నాను అని నందు ఎంత చెప్పినా వినిపించుకోరు. మీ కారు మేము తీసుకు వెళ్తున్నాం ఈఎంఐ కట్టి అప్పుడు ఈ కార్ తీసుకెళ్ళు అని వాళ్ళు అంటే ఇంటర్వ్యూ ఉంది నేను వెళ్ళాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు నందు.
కానీ వాళ్ళు నందుని నెట్టేసి తన ఫైలు పర్సు కింద పడేసి ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతారు. పర్సు చూసుకున్న నందుకు అందులో డబ్బులు కనిపించవు. ఇంటర్వ్యూ కి వెళ్ళాలి కనీసం ఆటో కూడా డబ్బు లేవు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తూ నడుచుకొని వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రతి విషయంలోనే ప్లాన్ గా ఉండే సామ్రాట్ గారు ఈ రోజు ఎందుకిలా చేశారు. ఈరోజు బోర్డు మీటింగ్ పెట్టుకుని అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్లారు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని చికాకు పడుతుంది తులసి.
నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటున్న తులసి..
అంతలోనే సామ్రాట్ వీడియో కాల్ చేస్తాడు. మీరు ఎంత టెన్షన్ పడుతున్నారు చూద్దామని వీడియో కాల్ చేశాను అని నవ్వుతాడు సామ్రాట్. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు బోర్డు మీటింగ్ అని తెలిసి ఎందుకు బయటకు వెళ్లారు అంటుంది తులసి. నేను పని ఉండి పూణే కి వచ్చాను మీకు చెప్పే టైం కూడా లేదు అని సామ్రాట్ అంటే బోర్డు మీటింగ్ క్యాన్సిల్ చేయమంటారా అంటుంది తులసి.
క్యాన్సిల్ చేయటం ఎందుకు మీరు ఉన్నారు కదా అంటాడు సామ్రాట్. మీరు జిఎం నా తర్వాత పొజిషన్ మీదే అని సామ్రాట్ అంటే నన్ను ములగ చెట్టు ఎక్కించద్దు అంటుంది తులసి. నేను నిజం చెప్తున్నాను అంటాడు సామ్రాట్. మూల విగ్రహం లోపల ఉన్న ఉత్సవ విగ్రహానికి ఊరేగింపులు జరుగుతాయి అంటాడు సామ్రాట్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేసాం వాళ్ళు అక్కడే ఎందుకు అని క్వశ్చన్ చేస్తారు.
ఆన్సర్ చేయాల్సింది మీరే అంటున్న సామ్రాట్..
అది ఆన్సర్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేసాను అని సామ్రాట్ అంటే నోట్స్ అంతా ప్రిపేర్ చేశాను అంటుంది తులసి. నోట్స్ ప్రిపేర్ చేయటం కాదు మీరు ప్రిపేర్ గా ఉండండి ఎందుకంటే ఆన్సర్ చేయవలసింది మీరే మీకు కావాలంటే తోడుగా వీడియో కాల్ లో జాయిన్ అవుతాను ఆన్సర్ చేయాల్సింది మాత్రం మీరే అంటాడు సామ్రాట్. సరే అంటూ ఫోన్ పెట్టేసిన తులసి సముద్రం మధ్యలో వదిలేసి ఈత కొట్టమంటున్నారు.
చూద్దాం నాలో ఏమాత్రం ధైర్యం ఉందో అనుకుంటుంది తులసి. తర్వాత సీన్లో మీటింగ్కి ఎటెండ్ అయిన తులసి సామ్రాట్ గారు రాలేకపోతున్నారు మీతో వీడియో కాల్ లో మాట్లాడుతారు అంటుంది. వీడియో కాల్ లో నేను మీటింగ్ కి రాలేకపోతున్నాను తను మిసెస్ తులసి మన జనరల్ మేనేజర్. నా తరఫున మీ క్వశ్చన్స్ కి క్లారిఫికేషన్ ఇస్తారు అంటాడు సామ్రాట్. కానీ వాళ్లు ఇంగ్లీషులో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ మాటలకి నవ్వుతున్న తులసిని ఎందుకు నవ్వుతారు మాకు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పండి అంటారు వాళ్ళు.
క్లైంట్స్ ని ఇంప్రెస్ చేసిన తులసి..
అవసరం వస్తేనే గాని మీరు తెలుగులో మాట్లాడతారనుకుంటాను. మీరు ఏదైనా గట్టిగా మాట్లాడాలి అనుకుంటేనే నోట్లోంచి తెలుగు వస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ తెలుగు వాళ్ళమే మరి తెలుగులో మాట్లాడడానికి సిగ్గు ఎందుకు అంటుంది తులసి. మనమే మన భాషని గౌరవించకపోతే వేరే వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు అని తులసి అంటే అందరూ చప్పట్లు కొడతారు.
ఇప్పుడు నేను తెలుగులో సమాధానం చెప్తాను ఇంగ్లీషు రాక కాదు తెలుగుని వదులుకోలేక అంటుంది తులసి. వాళ్ల అడిగినా ప్రతి డౌట్ కి చక్కగా తెలుగులో సమాధానం చెబుతుంది తులసి. ఇంప్రెస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ చప్పట్లు కొడతారు. మనం ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు ఎందుకు చేస్తున్నావ్ అన్నది ముఖ్యం. బిజినెస్ అంటే లాభనష్టాలు చూసుకోవాలి సేవ అంటే తృప్తి దొరికితే చాలు.
తులసిని పొగుడుతున్న క్లైంట్స్..
మానవ సేవ చేసే వాడిని మాధవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు అంటుంది తులసి. మిమ్మల్ని అడగటానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ ఏమీ అడగలేకపోతున్నాం. సేవ అన్నారు ఆ ఒక్క మాట చాలు హ్యాట్సాఫ్ అంటాడు ఒక వ్యక్తి. మీరే అనుకుంటే మీ జిఎం మిమ్మల్ని మించిపోయారు. మీరు బాధ్యతలు ఆమెకి అప్పజెప్పి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మీ కొత్త ప్రాజెక్టుకి మేము ఆమోదం తెలుపుతున్నాము మీ పనులు మొదలు పెట్టండి అంటూ మీటింగ్ ముగిస్తారు అందరు.
సామ్రాట్ కంగ్రాట్స్ చెప్తాడు. నెత్తి మీద నుంచి పెద్ద బరువు దిగినట్టుగా ఉంది అని తులసి అంటే కాదు నెత్తి మీదకి ఎత్తుకున్నారు ఇక బాధ్యత అంతా మీదే అంటాడు సామ్రాట్. మీరు ఎప్పుడు వస్తున్నారు అంటే ఇంకా నాలుగు రోజులు పడుతుంది ఇక్కడ మీటింగ్స్ తో బిజీగా ఉంటాను మీకు అసలు అందుబాటులో ఉండను. నేను వచ్చేవరకు మీరు అక్కడ మేనేజ్ చేయాలి అంటాడు సామ్రాట్. బాస్ ఆర్డర్ వేశారు కదా అని నవ్వుతుంది తులసి. సీన్ కట్ చేస్తే దివ్య నీ చూసి దివ్య వాళ్ళ అమ్మ మీద కోపంగా ఉంది ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటూ దివ్య దగ్గరికి వెళ్తుంది లాస్య.
ఎరక్కపోయి ఇరుక్కుపోయిన లాస్య..
జరిగిందంతా చూశాను చాలా బాధగా అనిపించింది కూతురితో ప్రవర్తించే తీరు ఇదేనా, చేతికి గోరింటాకు పెట్టడం నోటికి గోరుముద్ద పెట్టడం కాదు అవసరాలు కూడా తీర్చాలి కదా తల్లిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు. నువ్వు అడిగిన పద్ధతిలో తప్పు ఏమీ లేదు అంటుంది లాస్య. నిజమే కదా ఆంటీ తప్పు లేదు కదా మరి ఎందుకు నా మీద అంత కోపాన్ని ప్రదర్శించి నన్ను శత్రువులాగా చూస్తుంది దివ్య.
పెద్ద చదువులు చదివేటప్పుడు ఖర్చులు కూడా పెద్దవిగానే ఉంటాయి అది తెలుసుకోవాలి కదా, నువ్వు గాగ్రా చోళీ లేకపోతే ఇంకేదైనా అడుగుతే తప్పుపట్టాలి అంతేకానీ చదువుకోటానికి లాప్టాప్ అడిగితే కోప్పడం ఎందుకు, ఎలా భరిస్తున్నావు అంటుంది లాస్య. మీరే నన్ను అర్థం చేసుకున్నారు అలాంటిది మామూలు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంది దివ్య. నేను ఎప్పుడూ నిన్ను దూరం పెట్టలేదు నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంది లాస్య.
లాస్య మాటలకు పడిపోయిన దివ్య..
సారీ ఆంటీ మీరు ఇంత మారిపోయారని నాకు తెలియదు అంటుంది దివ్య. మా మామ కి మారే అవకాశం లేదా అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి మీ అమ్మ పెద్దగా చదువుకోలేదు కదా అంటూ రెచ్చకొడుతుంది లాస్య. నీకేమీ భయం లేదు నేను కొంటాను ఇంతకీ లాప్టాప్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది లాస్య. ఆ మాట విన్న దివ్య ఎంతో ఉండదంటి 1,50,000 అంతే అంటూ ఆనందంగా చెప్తుంది. ఆ మాటకి కంగుతిన్న లాస్య అంతుంటుందా? నేనే 40,000 అనుకున్నాను, నా తుప్పి వదిలిపోయేలాగా ఉంది ఎరక్కపోయి మాటిచ్చాను అనుకుంటుంది లాస్య.
ఏ బ్రాండ్ కొనాలా అని వివరాలు కలెక్ట్ చేసి ఉంచాను మీ మొబైల్ కి ఫార్వర్డ్ చేస్తాను అంటుంది దివ్య. అలాగే చెయ్యు నా పనిలో నేను ఉంటాను అని ప్లాస్య అంటే ఆనందంతో లాస్యని హత్తుకొని ముద్దు పెడుతుంది దివ్య. మరి రేపు మీటింగ్లో జరిగిందంతా ఇంట్లో చెప్పి ఆనందపడుతుంది తులసి. అంత చక్కగా అంత మందిని కన్వీస్ చేస్తూ మాట్లాడి అంతా కల లాగా ఉంది అని చెప్పి మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకుంటున్నారు అంటుంది అంకిత. నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావ్ మమ్మీ అంటాడు అభి.
క్రెడిట్ సామ్రాట్ గారిదే అంటున్న ప్రేమ్..
మీరందరూ అమ్మని పొగుడుతున్నారు కానీ నేను క్రెడిట్ సామ్రాట్ గారికి ఇస్తాను అంటాడు ప్రేమ్. అదేంటి అక్కడ అందరితో మాట్లాడి కన్విన్స్ చేసింది ఆంటీ కదా అని శృతి అంటే అమ్మని నమ్మి అంత పెద్ద బాధ్యత చెప్పింది మాత్రం సామ్రాట్ గారే కదా అంటాడు ప్రేమ్. ఆ మాట మాత్రం నిజం. కామ్రేడ్ గారు నమ్మకమే నాకు బలం. తప్పటడుగులు వేసే పసిపాప పక్కన అమ్మ ఉంది అనే ధైర్యంతోనే నటక ప్రారంభిస్తుంది నేను అంతే సామ్రాట్ గారిని చూసుకొని ప్రయాణం ప్రారంభించాను ఆయనే లేకపోతే నేను ఈ స్థితిలోనే ఉండదాన్ని కాదు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi January 18 Today Episode
ఈరోజు నీ మొఖంలో ఏదో గెలిచిన ఆనందము,తృప్తి కనబడుతుంది అంటాడు పరంధామయ్య. మరి సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటాడు పరంధామయ్య. ఏం లేదమ్మా ఆయనకి నువ్వు చేసిన పాయసం కావాలి అందుకే ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నారు అంటుంది అనసూయ. అంటే ఏంటి పాయసం కోసం తులసిని పొగిడాను అంటావా అంటాడు పరంధామయ్య. అలా అనలేదు పొగిడారు కాబట్టి పాయసం అడుగుతున్నారు అన్నాను అంటుంది అనసూయ. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన నందుని చూసి అనసూయ కొడుకు దగ్గరికి వెళ్తుంది.
తరువాయి భాగంలో దివ్యకి లాప్టాప్ ఇస్తుంది లాస్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని లాస్య అంటే అవునండి ఎవరేంటో అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది మా ఫ్రెండ్ బర్త్డే ఇస్తుంది పార్టీకి వెళ్ళాలి అంటుంది. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి వెళ్ళిపో అంటూ సలహా ఇస్తుంది లాస్య.