Intinti Gruhalakshmi January 2 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తనకి చెప్పకుండా తులసి వాళ్ళ ఇంటికి వెళ్లినందుకు ఇంట్లో వాళ్ళందరినీ మందలిస్తాడు నందు. వాళ్లని కంట్రోల్ లో పెట్టటానికి చిన్న పిల్లలు కాదు కదా నందు, ఎవరి జీవితం వాళ్ళది అంటాడు పరంధామయ్య. పిల్లలకి సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారేంటి అంటుంది లాస్య.
తులసి ఈ ఇంటికి బంధువు మాత్రమే అంటున్న నందు..
వాళ్లు మీ పిల్లలు కాబట్టి నీ మాట వినాలి అంటావు మరి నువ్వు నా కొడుకు కదా నా మాట వినకుండా లాస్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నేను అడగను ఎందుకంటే నీ జీవితం నీది అంటాడు పరంధామయ్య. అవున్నాన్నా మేము చిన్నపిల్లలం కాదు, అమ్మ కావాలా నాన్న కావాలా అని తెలుసుకుని పరిస్థితికి తీసుకురావద్దు అంటుంది దివ్య. నేను తులసిని అవాయిడ్ చేయమని చెప్పడం లేదు కానీ తను మన ఇంటికి బంధువు మాత్రమే, మన ఇంటి విషయాలు ఏమీ ఆవిడకి తెలియవలసిన అవసరం లేదు అంటాడు నందు.
అసలు మీరు ఈ ఇంట్లో ఉన్నదే అమ్మ వల్ల అంటాడు ప్రేమ్. నేను తులసిని పట్టించుకోవద్దు అనట్లేదు నాకు లాస్యకి విలువ ఇమ్మని చెప్తున్నాను అంతే, మీకు ఏదైనా సమస్యలు వస్తే నన్ను అడగండి, అంతేకానీ మళ్లీ ఇలాంటి సమస్యలు రాకూడదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. మరోవైపు సామ్రాట్ అప్పు చెప్పిన ప్రాజెక్టు రిపోర్ట్స్ ఇంగ్లీష్ లో ఉండటంతో చదవటానికి కన్ఫ్యూజ్ అవుతుంది తులసి.
దివ్య ని హెల్ప్ అడిగిన తులసి..
సామ్రాట్ గారిని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే బాగోదు అంటూ దివ్యని హెల్ప్ అడుగుతుంది తులసి. నేను డల్ గా ఉన్నట్టు అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అంటూ యాక్టివ్ గా ఉన్నట్లుగా అమ్మతో మాట్లాడుతుంది దివ్య. ప్రాజెక్ట్ రిపోర్టు ఒకటి నాకు అర్థం కావట్లేదు హెల్ప్ చేయమంటుంది తులసి. లాప్టాప్ లో ఇంగ్లీష్ ఫైల్ ని తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చెప్తుంది దివ్య. నీతో మళ్ళీ మాట్లాడతాను ఈ రిపోర్ట్ చదవాలి అర్జెంట్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది తులసి.
మరోవైపు షుగర్ డౌన్ అయిపోయి బాధపడుతుంటాడు పరంధామయ్య. అనసూయని లేపితే కంగారుగా షుగర్ డౌన్ అయ్యి ఉంటుంది ఉండండి చక్కెర తెస్తాను అంటూ వంట గదిలోకి వెళ్తుంది. అక్కడ అలమరాలన్నీ తాళాలు వేసి ఉండటంతో లాస్య ని తిట్టుకుంటూ ఇప్పుడు తననే లేపాలి అనుకుంటూ ఆమె గదికి పెళ్లి తలుపు కొడుతుంది. ఇంత అర్ధరాత్రి పూట తలుపు కొట్టారెందుకు అంటుంది లాస్య.
అనసూయ మొహం మీద తలుపు వేసేసిన లాస్య..
మీ మామయ్యకి షుగర్ డౌన్ అయిపోయే లాగా ఉంది, షుగర్ అలమరా లో ఉంది తాళాలు ఒకసారి ఇవ్వు అంటుంది అనసూయ. అర్ధరాత్రి పూట ఈ గోలేంటి, తాళాలు ఎక్కడో పెట్టేసాను ఈ రాత్రికి ఎలాగో ఒకలాగా మేనేజ్ చేయండి, రేపొద్దున్న చూద్దాం అంటూ మొహం మీదే తలుపు వేసేస్తుంది లాస్య. కంగారుగా ఉన్న అనసూయ ని చూసి ఏం జరిగింది అమ్మమ్మ అంటుంది అంకిత.
లేచావా తల్లి అంటూ జరిగిందంతా చెబుతుంది అనసూయ. మీరేమీ కంగారు పడకండి నేను శృతి దగ్గరకు వెళ్లి గ్లూకోస్ తీసుకొస్తాను మీరు తాతయ్య దగ్గరికి వెళ్ళండి అంటుంది. శృతి దగ్గరికి వెళ్లి కొంచెం నీరసంగా ఉంది గ్లూకోజ్ ఇవ్వు అని అడుగుతుంది. తను గ్లూకోజ్ ఇస్తే అది నీళ్లలో కలిపి ఇస్తుంది అంకిత. ఇంకేమీ భయం లేదు మీరు పడుకోండి తాతయ్య అంటుంది అంకిత. ప్రేమ్ వాళ్ళు లెగలేదా అని అడుగుతుంది అనసూయ.
తులసిని తిట్టుకుంటున్న సామ్రాట్..
లేచారు కానీ అర్ధరాత్రి గొడవలు ఎందుకని వాళ్ళకి నిజం చెప్పలేదు అంటుంది అంకిత. ఇంట్లో పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు అంటూ బాధపడుతుంది అనసూయ. అవేవి ఇప్పుడు ఆలోచించకండి ప్రశాంతంగా పడుకోండి అవసరమైతే మళ్లీ ఈ గ్లూకోజ్ కలిపి ఇవ్వండి అంటూ వెళ్ళిపోతుంది అంకిత. మరోవైపు బెనర్జీ గారు వచ్చారు రిసెప్షన్ లో వెయిట్ చేస్తున్నారు అంటూ సామ్రాట్ కి చెప్తాడు అతని పి ఏ.
ఈ బాధ్యత అంతా తులసిగారికి అప్పుడు చెప్పాను ఆవిడని ఒకసారి రమ్మను అంటాడు సామ్రాట్. ఆవిడ ఇంకా రాలేదు సార్ అంటాడు పిఎ . అదేంటి బాధ్యత అంతా ఆవిడకే అప్పచెప్పాను కదా ఫైల్స్ కూడా ఆవిడ దగ్గరే ఉన్నాయి అంటూ తులసికి ఫోన్ చేయబోతాడు సామ్రాట్. ఆల్రెడీ నేను చేశాను సార్ బయలుదేరిపోయారంట అంటాడు పిఏ. పార్టీకి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆలస్యం చేస్తే ఎలా అని మనసులోనే అనుకుంటాడు సామ్రాట్.
బెనర్జీ గురించి ఎంక్వయిరీ చేసిన
తులసి..
బెనర్జీ గారిని లోపలికి రమ్మనండి అంటూ పిఏ కి చెప్తాడు. మరోవైపు ఎవరికోసమో వెయిట్ చేస్తున్న తులసి, ఆఫీస్ కి లేటవుతుంది ఇంకా రాలేదు ఏంటి అనుకుంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని బెనర్జీ గారి పాత ప్రాజెక్టు ఫైల్స్ డీల్ చేసేది మీరే కదా అంటుంది తులసి. ఆయన ప్రాజెక్ట్ చూస్తే నాకు చాలా సందేహాలు వచ్చాయి అందుకే మిమ్మల్ని కనుక్కుందామని పిలిపించాను వచ్చినందుకు థాంక్స్ అంటుంది తులసి.
మీ గురించి సామ్రాట్ గారి గురించి మీ మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసమ్మ అందుకే వచ్చాను అంటూ బెనర్జీ గురించి నెగటివ్ రిపోర్టు ఇస్తాడు ఆ వ్యక్తి. పొరపాటున కూడా ఆ వ్యక్తిని మీ కంపెనీలోకి పెన్ డ్రైవ్ ఇవ్వకండి ఇది నా సజెషన్ అంటాడు అతను. సమయానికి విలువైన సలహా ఇచ్చారు థాంక్స్ అంటుంది తులసి. మరోవైపు వంట చేస్తున్న అంకితని టీ పెట్టి ఇమ్మంటుంది లాస్య. కానీ అంకిత వినిపించుకోదు. వినబడలేదా లేకపోతే విననట్లు నటిస్తున్నావా అంటుంది లాస్య.
లాస్య కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అంకిత..
నువ్వు ఎలా అయితే చేయాలనుకున్న పనిని చేస్తావో అలాగే నేను కూడా వినాలనుకున్న మాటనే వింటాను, రోజుకి ఇన్ని పనులు చేయాలి అని డిస్టిక్స్ పెట్టుకున్నాను, చెవులుకి చేతులకి కూడా డిసిప్లిన్ నేర్పించాలి కదా లాస్య ఆంటీ అంటుంది అంకిత. ఏమంటావ్ టీ పెట్టను అంటావ్ అంతేనా అంటుంది లాస్య. నేను అలా అనలేదు నిన్ను టీ పెట్టుకోమంటున్నాను ఏం నడుం వొంగదా దానికి కూడా డిసిప్లిన్ నేర్పు లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు మొదటికే మొరాయిస్తుంది అంటుంది అంకిత.
చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటుంది లాస్య. నిజంగా ఎక్కువ మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు కానీ తులసి ఆంటినా నేర్పిన సంస్కారం నేను అలాగా మాట్లాడలేను, నాకు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తెగించాలో కూడా తెలుసు అంటుంది. మనిషి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి రాత్రి అమ్మమ్మ వచ్చి తాళం అడిగితే అంత నెగ్లెట్టుగా మాట్లాడుతావా? అంటుంది అంకిత. సడన్గా నిద్రలేపితే చిర్రెత్తుకు రాదా అంటుంది లాస్య.
రాత్రి నువ్వు చేసిన పనికి నాకు చిరాకు వచ్చింది కానీ తాతయ్య పని ముందు అని చెప్పి నిన్ను వదిలేసాను, మేమందరం ఇంపార్టెన్స్ ఇచ్చేది తాతయ్య అమ్మమ్మలకి. అలాంటి అమ్మమ్మ తాతయ్య క్షేమంగా ఉన్నంతవరకే మీరు ఈ ఇంట్లో ఉండగలిగేది. అయినా క్షేమంగా ఉన్నారు కాబట్టే ఇప్పుడు మీరు కాఫీ అడుగుతున్నారు లేదు అంటే అంకుల్ మిమ్మల్ని ఈపాటికి మెడ పట్టుకుని బయటికి గెంటేసేవారు.
కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చిన తులసి..
ఒక పూట ఇంటికి రాకపోతేనే అంకుల్ హడావిడి చేశారు అలాంటిది తాతయ్యకి ఏమైనా అయితే మీ పరిస్థితి ఊహించుకోండి గేటు బయట గుండెలు బాదుకొని ఏడ్చే పరిస్థితి వస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంకిత. మరోవైపు బెనర్జీ ఫైల్ మీద సంతకం పెట్టమంటే కంగారు పెడతాడు సామ్రాట్ని. మా జనరల్ మేనేజర్స్ రావాలి అని సామ్రాట్ అంటే ఆఫ్ట్రాల్ జిఎం కోసం వెయిట్ చేయడమేంటి మీరు ఈ కంపెనీ సీఈవో అంటాడు బెనర్జీ. అయినా టైం కి మీటింగ్ కి రాలేదంటేనే తన ఎంత ఇర్రెస్పాన్సిబులో తెలుస్తుంది అంటాడు బెనర్జీ.
సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు, ఇలా ఇవ్వండి ఫైల్ మీద సైన్ చేస్తాను అంటాడు సామ్రాట్. అంతలోనే అక్కడికి వచ్చిన తులసి ఒక నిమిషం ఆగండి అంటుంది. ఆ ప్రపోజల్ అంతా చదివే సైన్ చేస్తున్నారా సార్ అని అడుగుతుంది తులసి. ఏమైంది తులసి గారు అంటాడు సామ్రాట్. అతను ప్రపోజల్ పెట్టిన దగ్గర ప్లేస్ లేదు సార్ అంటుంది తులసి. ఏం మాట్లాడుతున్నారు నా గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది అయినా వంట చేసుకుని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ప్లేస్ లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది అంటాడు బెనర్జీ.
Intinti Gruhalakshmi January 2 Today Episode: ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ అంటున్న బెనర్జీ..
పర్సనల్ కామెంట్స్ చేయకండి ఆవిడ అడిగినదానికి సమాధానం చెప్పండి అంటాడు సామ్రాట్. స్కూల్ కట్టడానికి నా దగ్గర అప్రూవల్ రెడీగా ఉంది అని బెనర్జీ అంటే అది దొడ్డిదారిన తెచ్చుకున్నది ఎప్పటికైనా ప్రమాదమే అంటుంది తులసి. ఇలాంటివి చూసి చూడనట్లుగా వదిలేయాలి అంటాడు బెనర్జీ. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ అని బెనర్జీ అంటే డబ్బు కోసం తప్పుతోవ తొక్కే అలవాటు మాకు లేదు అంటాడు సామ్రాట్.
తరువాయి భాగంలో గుడిలో మరొక కప్పు ప్రసాదం అడుగుతున్న పరంధామయ్యని చీదరించుకుంటాడు అక్కడ ఉన్న వ్యక్తి. పరంధామయ్యని అలాంటి పరిస్థితుల్లో చూసి షాక్ అవుతారు సామ్రాట్, తులసీలు. మనం కోడలికి భారం అయ్యాం అనసూయ మనలో ఎవరో ఒకరు చనిపోతే తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో అని భయంగా ఉంది అంటాడు పరందామయ్య. వెనకనుంచి ఆ మాటలు విన్న తులసి సామ్రాట్ లు చాలా బాధపడతారు.