Intinti Gruhalakshmi January 20 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తనని ఎందుకు అలా నిలదీస్తావు అని లాస్య అంటే ఎందుకు అడగకూడదు అయినా స్పెషల్ క్లాసులు అంటే అడ్వాన్స్డ్గా చెప్తారు, ఇప్పటికిప్పుడు చెప్పడం ఏంటి ఇప్పటివరకు ఎప్పుడూ అలా జరగలేదు అంటుంది తులసి. సినిమాకో, షికారుకో వెళ్తానంటే నిలదీయొచ్చు అంతేగాని కాలేజీకి వెళ్తానంటే ఎవరైనా నిలదీస్తారా మా ముందు అడిగితే అడిగావు కానీ తన ఫ్రెండ్స్ ముందు అడగకు, పరువు పోతుంది చిన్నతనంగా ఉంటుంది అంటుంది లాస్య.

దివ్య ని వెనకేసుకొస్తున్న లాస్య..

పార్టీకి వెళ్తున్నట్టుగా ఏంటా డ్రస్సు అని తులసి అడిగితే స్పెషల్ క్లాస్ అంటుంది కదా అందుకే వేసుకుందేమో అది కూడా తప్పేనా అంటుంది లాస్య. సరే వెళ్ళు అంటూ పర్మిషన్ ఇస్తుంది తులసి. శృతిని తీసుకొని వెళ్ళిపోతుంది తులసి. లాస్యకి థాంక్యూ చెప్పి ఆనందపడుతుంది దివ్య. సరే వెళ్లి త్వరగా వచ్చేయ్ అని లాస్య అంటే గంటలో వచ్చేస్తాను మీకు అస్సలు మాట రానివ్వను అంటూ సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య. పార్టీకి వచ్చిన దివ్య నాకు తెలియని కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు ఉంది అంటూ సంతోషంగా అందరితో కలిపి డాన్స్ వేస్తుంది.

దివ్యని పార్టీలో చూసిన ఒక ఫ్రెండ్ నేను ఒక పని చెప్తాను చెయ్యు అంటూ డ్రింకులో మత్తుమందు కలపమని పురమాయిస్తాడు మరో ఫ్రెండ్కి . డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆ డ్రింక్ ని దివ్య చేత తాగిస్తాడు. మరోవైపు తొందరగా వచ్చేస్తాను అంటే నిజమే అనుకున్నాను ఇప్పటికి వచ్చి రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, నిజంగానే పార్టీకి వెళ్లిందా లేకపోతే ఎవరితోనైనా లేచిపోయిందా, అబద్ధం చెప్పి ఇంట్లోంచి పంపించాను అని తెలిస్తే నా పని గోవిందా అంటూ టెన్షన్ పడిపోతుంది లాస్య.

భయంతో వణికిపోతున్న లాస్య..

టెన్షన్ తట్టుకోలేక మళ్ళీ దివ్య కి ఫోన్ చేస్తుంది లాస్య. ఫోన్ లిఫ్ట్ చేసిన దివ్య నేను ఇంకా ఇంటికి రావడానికి ఒక గంట పడుతుంది. నువ్వు ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్లావు త్వరగా వచ్చేయ్ అంటే ప్లీజ్ ఆంటీ ఎలాగోలాగా మేనేజ్ చేయండి అంటుంది. అంతలో దివ్య దగ్గరికి వచ్చిన మరో ఫ్రెండ్ పార్టీలో ఫోన్ చేయండి అంటూ దివ్య దగ్గర ఫోన్ లాక్కుంటుంది. ఇది నా వైపు మొగ్గు చూపుతుంది అనుకున్నాను కానీ ఇలా నా పీకలమీదికి తెస్తుంది అనుకోలేదు అంటూ నానా హైరానా పడిపోతుంది లాస్య. మరోవైపు తులసి కూడా అంతే ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది.

తులసి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంది అంటే డేంజర్ బెల్స్ మోగినట్లే అనుకుంటూ కంగారు పడిపోతుంది లాస్య. తులసి దగ్గరికి వచ్చిన శృతి స్పెషల్ క్లాసులు అంటే కొంచెం అటు ఇటు అవుతుందంటే తనేమీ చిన్నపిల్ల కాదు కదా వచ్చేస్తుంది లెండి అంటుంది శ్రుతి. అది చిన్న పిల్ల కాదు కాబట్టే టెన్షన్, ఇది కింద ఆడపిల్లని పట్టించుకోకుండా వదిలేయలేం కదా అంటుంది తులసి. అలాగని పట్టుకొని కూర్చోలేం కదా రేపో మాపో డాక్టర్ కూడా అవ్వబోతుంది తన ప్రొఫెషన్ కి టైమింగ్స్ఉండవ్ అంటుంది శృతి.

నీకు పిల్లలు పుడితే తెలుస్తుందంటున్న తులసి..

కానీ తల్లి మనసులో టెన్షన్ ఉంటుంది కదా ప్రజల్ని కాపాడే ఏపీఎస్ ఆఫీసర్ అయినా, ఆ తల్లికి కూతురు మీద టెన్షన్ ఉంటుంది మీకు రేపు బిడ్డ పుడితే తెలుస్తుంది అంటుంది తులసి. లేట్ అవుతుందని ఫోన్ చేయలేదా అంటుంది అంకిత. తను ఎప్పుడు చెప్తుంది కానీ ఈ రోజే ఎందుకో ఒక కాల్ కూడా చేయలేదు, నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు అంటుంది తులసి. నేను కాల్ చేస్తాను అంటూ అంకిత కాల్ చేస్తుంది. డాన్స్ మూడ్ లో ఉన్న దివ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. క్లాస్ లో ఉండి ఉంటుంది అని శృతి అంటే కనీసం మెసేజ్ పెట్టొచ్చు కదా అంటుంది అంకిత.

ఇంత నిర్లక్ష్యం ఏంటి అని తులసి అంటే ఎలా ఉందో ఏంటో అనవసరంగా తిట్టుకోవడం ఎందుకు అంటుంది శృతి. అప్పుడే మైకంలోకి వెళ్తున్న దివ్యని చూసి మన దారిలోకి తెచ్చుకోవాలి క్లైమాక్స్ అదిరిపోవాలి అంటాడు ఒక ఫ్రెండ్. ఒక్కసారి మత్తులోకి వెళ్ళిపోతే మనం ఏం చేసినా తెలీదు అంటాడు మరొక ఫ్రెండ్. నైట్ 11:00 అయిన తర్వాత పార్టీ ముగిసిన తర్వాత దివ్యని ఎలా వెళ్తావు అని అడుగుతారు ఫ్రెండ్స్. క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అంటూ మత్తుగా అంటుంది దివ్య. ఈ చీకట్లో ఎలా వెళ్తావు మా కారులో డ్రాప్ చేస్తామంటారు ఆ ఫ్రెండ్స్. వద్దు అంటుంది దివ్య.

దివ్యని ట్రాప్ చేస్తున్న ఆమె ఫ్రెండ్స్..

మైకంలో ఉన్న దివ్యని చూసి ఏమైంది అని అడుగుతుంది పక్కనే ఉన్న ఫ్రెండ్. ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి అంటుంది దివ్య. నీ డాన్స్ అదిరిపోయింది చాలా బాగా చేశావు ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకో అంటారు ఆ ఫ్రెండ్స్. నిజమే తన డాన్స్ ని స్టేజి మీద చూడడమే కానీ ఇలా పార్టీలో ఎప్పుడు చూడలేదు అంటుంది మరొక ఫ్రెండ్. క్యాబ్ రావటంతో తను వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోతున్నాను పాపం నువ్వు ఒక్కదానివే అయిపోయావు అంటుంది.

ఎంతకీ క్యాబ్ బుక్కు అవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కార్ లోనే బయలుదేరుతుంది దివ్య. ఆంటీ టెన్షన్ చూస్తే భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది శృతి. ఎంత స్పెషల్ క్లాస్ అయినా ఇంతసేపు ఉండదు కదా అంటుంది అంకిత. అసలు ఈ రోజు ఏ స్పెషల్ క్లాసు లేదంట కాలేజీకి ఫోన్ చేస్తే వాచ్మెన్ చెప్పాడు అంటాడు ప్రేమ్. అంటే దివ్య అబద్ధం చెప్పిందా అంటుంది శృతి. ఈ విషయం అత్తయ్యకి తెలుసా అంటే లేదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడతాడు ప్రేమ్.

అసలు విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన నందు..

మరోవైపు నందు కూడా కంగారుపడుతూ దివ్యకి ఫోన్ చేస్తుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన లాస్య జరిగిందంతా చెప్పి నేనే అలా అబద్ధం చెప్పమని చెప్పాను అంటుంది. గుమ్మం దగ్గర తులసి టెన్షన్ గా ఉంది వెళ్లి జరిగింది చెప్పు అంటాడు నందు. అమ్మో నేను చెప్పలేను నువ్వే ఎలాగోలాగా మేనేజ్ చెయ్యు అంటుంది లాస్య. చేసేవన్నీ వెదవ పనులు మళ్లీ ఏమైనా అంటే ఏడుస్తావు అంటూ తులసి దగ్గరికి వస్తాడు నందు. మరోవైపు కిందన ఈరోజు దివ్య ఎందుకో వింతగా ప్రవర్తిస్తుంది లాస్య కూడా సపోర్ట్ ఇచ్చింది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను అంటూ అత్తగారికి చెప్తుంది తులసి.

అదే నువ్వు చేసిన తప్పు నువ్వు నువ్వులాగా ఉండాల్సింది అంటాడు నందు. ఇప్పుడు ఏం జరిగింది అని తులసి అడిగితే దివ్య వెళ్ళింది స్పెషల్ క్లాస్ కాదు తన బర్త్డే పార్టీకి అంటూ జరిగిందంతా చెప్తాడు నందు. ఇలా చేస్తుందని అనుకోలేదు అంటుంది లాస్య. నోరు ముయ్యి అసలు నా పిల్లల విషయంలో కల్పించుకోవటానికి నువ్వు ఎవరు నీకు ఏం హక్కు ఉంది. నీ భర్త నా జీవితంతో ఆడుకున్నాడు నువ్వు నా పిల్లల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా, ఇప్పటివరకు దివ్య నాతో అబద్ధం చెప్పింది లేదు మీ పుణ్యమా అని అది కూడా జరిగింది.

ప్రమాదపుటంచల్లో దివ్య..

నీ అబద్ధం బ్రతికే దానికి కూడా అలవాటు చేయాలి అనుకుంటున్నావా, చూడు ఫలితం నా కూతురు కోసం గుండెలు బాదుకొని ఏడుస్తున్నాము నువ్వు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటుంది తులసి. లాస్య చేసింది తప్పే కానీ నువ్వే గుండెల బాదుకోవాల్సినంత అవసరం లేదు దివ్య బాధని చూడలేక అలాంటి సలహా ఇచ్చింది అంటాడు నందు. ప్రేమతో కాదు నా కూతుర్ని నాకు దూరం చేయాలన్న ఆలోచనతో ఇలా చేసింది,కాదు అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి అంటుంది తులసి.

Intinti Gruhalakshmi January 20 Today Episode:

ఇప్పుడు మనం గొడవపడాల్సిన టైం కాదు, దివ్య ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటాడు పరంధామయ్య. మరోవైపు మత్తులో ఉన్న దివ్య మా ఇంటికే తీసుకువెళ్తున్నారా నాకు ఏదో డౌట్ గా ఉంది అని కంగారుపడుతుంది దివ్య. మనం వెళ్ళేది మీ ఇంటికి అని ఆ ఫ్రెండ్ అంటే అయితే ఓకే అంటూ రిలాక్స్ అయిపోతుంది దివ్య. మరోవైపు తను ఎక్కడికి వెళ్లిందో అయినా చెప్పిందా అని క్లాస్ అని అడిగితే ఎందుకైనా మంచిదని అడ్రస్ తీసుకున్నాను లొకేషన్ కూడా షేర్ చేసింది అంటుంది లాస్య. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా నేను వెళ్లి వెతికేవాడిని ఇప్పుడైనా నాకు ఆ లొకేషన్ షేర్ చేయండి వెళ్లి వెతుకుతాను అంటాడు ప్రేమ్.

అంతమంది ఎందుకు అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అని నందు తులసి ప్రేమ్ మాత్రమే వెతకడానికి బయలుదేరుతారు. తరువాయి భాగంలో తను ఇబ్బందులో ఉన్నానని గుర్తించిన దివ్య హెల్ప్ అంటూ అరుస్తుంది. ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అంటూ ఆమె నోరు మూసేసి తన రూమ్ కి తీసుకెళ్ళిపోతారు ఆ ఫ్రెండ్స్. మరోవైపు దివ్యని వెతుక్కుంటూ పార్టీ జరిగిన దగ్గరికి వస్తారు తులసి వాళ్ళు. ఈ అమ్మాయిని చూశాను ఇద్దరు అబ్బాయిలు కారులో తీసుకెళ్లారు అని చెప్తాడు వాచ్మెన్.