Intinti Gruhalakshmi January 21 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కనీసం లొకేషన్ అయినా చెప్పిందా అని తులసి అడిగితే, చెప్పింది లొకేషన్ ఫార్వర్డ్ చేసింది అంటుంది లాస్య. ఈ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదా నేను వెళ్లి వెతికేవాడిని ముందు ఆ లొకేషన్ నాకు షేర్ చేయండి అంటాడు ప్రేమ్. నేను వస్తాను అని అభి అంటే అంత మందిని ఎందుకు మేము వెళ్తాము అవసరమైతే ఫోన్ చేస్తాము అని నందు, ప్రేమ్,తులసి బయలుదేరుతారు.

ఫ్రెండ్స్ ని అనుమానిస్తున్న దివ్య..

మరోవైపు మా ఇంటికి లెఫ్ట్ తీసుకోవాలి కదా ఆ చేతన్ గాడు రైట్ టర్న్ ఎందుకు తీసుకుంటున్నాడు ఏదో తేడాగా ఉంది అంటుంది దివ్య. వాడికి అడ్రస్ తెలుసు అయినా అప్పుడే ఇంటికి వెళ్లి ఏం చేస్తావు కాస్త ఎంజాయ్ చేసి వెళ్దాంలే అంటాడు పక్కన ఉన్న ఫ్రెండ్. ఏంట్రా వంకరగా మాట్లాడుతున్నారు నాకు నచ్చటం లేదు నన్ను దించేయండి అంటుంది దివ్య. అర్థం చేసుకో ఇదేమి తప్పు కాదు కాస్త ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంటాడు కార్తీక్.

నమ్మించి ఇలా మోసం చేస్తారా అంటూ కేకలు వేయబోతుంది దివ్య. తన కేకలు వినిపించకుండా నోరు నొక్కేస్తాడు కార్తీక్. మరోవైపు లొకేషన్ పట్టుకొని ఆ ప్లేస్ కి వస్తారు ప్రేమ్ వాళ్ళు. ఇక్కడ ఏమైనా పార్టీ జరిగిందా అని వాచ్మెన్ ని అడిగితే జరిగింది అని అంటాడు వాచ్మెన్. మరి ఎవరు లేరు ఏమి అని అడిగితే ఇది గెస్ట్ హౌస్ లాంటిది పార్టీ అవగానే ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు అంటాడు వాచ్మెన్. పొరపాటున ఎవరైనా ఉండిపోయారేమో చూడమంటుంది తులసి.

వాచ్మెన్ మీద కేకలు వేస్తున్న తులసి..

ఎవరు లేరు మేడం అన్ని చెక్ చేసాకే లాక్ చేస్తాను అంటాడు వాచ్మెన్. దివ్య ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూసావా అని అడుగుతాడు ప్రేమ్. చూశాను, అందరికన్నా లేటుగా వెళ్ళింది కొంచెం మత్తుగా ఉన్నట్టుగా కూడా ఉంది తనని ఇద్దరూ అబ్బాయిలు తీసుకుని వెళ్ళటం నేను కళ్ళారా చూశాను అంటాడు వాచ్మెన్. తను ఎటువైపు వెళ్ళిందో చూసావా కనీసం కార్ నెంబర్ అయినా చూసావా అని వాచ్మెన్ అడిగితే చూడలేదు అంటాడు వాచ్మెన్. మీ డ్యూటీ మీకు తెలియదా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోరా అని వాచ్మెన్ మీద కేకలు వేస్తుంది తులసి.

వచ్చిన వాళ్ళందరూ మా చిన్నమ్మ గారి ఫ్రెండ్సే వాళ్ళ కార్ నెంబర్లు బైక్ నెంబర్లు చూడవలసిన అవసరం నాకు లేదు అయినా ఏం జరిగింది మేడం అని అడుగుతాడు వాచ్మెన్. ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అంటుంది తులసి. అంతలోని అక్కడికి వచ్చిన నందుకి జరిగిందంతా చెప్తాడు ప్రేమ్. ప్రేమ్ పదా చుట్టుపక్కల వెతుకుదాము అని తులసి అంటే ఎక్కడికైనా వెళ్లి వెతుకుతాము, అసలు టైం వేస్ట్ చేయొద్దు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటాడు ప్రేమ్.

అలా చేస్తే పరువు పోతుంది అంటున్న తులసి..

అలా చేస్తే వెంటనే దాని ఫోటో తో సహా పేపర్ల లోని, టీవీలోని వచ్చేస్తుంది పెళ్లి కానీ పిల్ల జీవితాన్ని అలా నడిరోడ్డు మీద పెట్టలేము కదా అంటుంది తులసి. తన ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఏం చేస్తాం అంటాడు ప్రేమ్. అలా జరగకూడదు అని దేవుడికి దండం పెట్టుకోవడం తప్పితే ఏమీ చేయలేము చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని మన పరువుని బజారున పడేసుకోలేము కదా చిన్న అబద్ధం ఎన్ని అనర్ధానికి కారణం అవుతుందో చూసావా? దాని పరిస్థితి ఏంటో తలుచుకుంటే గుండె పగిలిపోతుంది అంటూ బాధపడుతుంది తులసి.

నేను ఇటువైపు వెతుకుతాను మీరు అటువైపు వెళ్లి వెతకండి అని చెప్తాడు నందు. మరోవైపు కేకలు వేస్తున్న దివ్యని అరవొద్దు నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాంలే అంటాడు ఆ ఫ్రెండ్, దివ్యని వాళ్ళ ఇంటిదగ్గర దింపేరా చేతన్ అయినా తనకి ఇష్టం లేకపోతే మనం ఏం చేస్తాం అంటూ చేతన్ కి కన్ను గీటుతాడు కార్తీక్. మా మామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కార్తీక్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి నన్ను మోసం చేయొద్దు అంటూ వేడుకుంటుంది దివ్య. పలానా ఇంటిదగ్గర ఆపమని కార్తీక్ కంటే మా ఇల్లు వచ్చేసిందా మా మామ్ కనిపిస్తుందా అంటుంది దివ్య.

లాస్యని టార్గెట్ చేసిన కుటుంబ సభ్యులు..

అవునవును బాగా కనిపిస్తుంది కార్తీక్. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ దివ్య కోసం కంగారుపడుతూ ఉంటారు. మన ఫోన్లు ఎవరివి లిఫ్ట్ చేయట్లేదు, క్షేమంగా ఉండి ఉంటే తను మౌనంగా ఉండదు ఎవరికో ఒకరికి రిప్లై ఇస్తుంది అంటుంది అనసూయ. అసలే టెన్షన్ గా ఉంటే ఈవిడ మరింత టెన్షన్ పెడుతుంది బర్త్ డే పార్టీ కి వెళ్ళింది క్షేమంగా ఉండకుండా ఏమవుతుంది వాళ్ళ అమ్మ లాప్టాప్ ఇవ్వలేదని ఏడిపిస్తుందేమో అనుకుంటుంది లాస్య.

కనీసం వెళ్ళిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయట్లేదు అని శ్రుతి అంటే లొకేషన్ దొరకాలి కదా అంటుంది లాస్య. నువ్వు మాట్లాడకు నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది అంటుంది లాస్య. నన్నెందుకు అంటున్నారు మధ్యలో నేనేం చేశాను అంటుంది లాస్య. నీ సలహా వినే తను అబద్ధం చెప్పి పార్టీకి వెళ్ళింది అంటుంది శృతి. ఒకవేళ తనంతట తానే అబద్ధం చెప్పి వెళ్లి ఉంటే అప్పుడు ఎవరిని తిట్టేవారు నా కర్మ ఖాళీ తను నన్ను సలహా అడిగింది, నా బుద్ధి తక్కువ తనిఖీ సలహా ఇచ్చాను.

భయంతో వణికిపోతున్న లాస్య..

ఏదో నేనే కావాలని తనని పార్టీకి పంపినట్లుగా మాట్లాడుతున్నారు. నన్ను తిట్టడానికి అనవసరంగా మాట్లాడడానికి మీకు కారణం దొరికింది కాల్చుకు తింటున్నారు అంటుంది లాస్య. మేము చావు కొట్టడం కాదు దివ్యకి ఏమైనా జరిగితే తులసి నిన్ను చావగొడుతుంది అంటాడు పరంధామయ్య. అసలే లోపల నుంచి ఒణుకు పుడుతుంది పైగా ఈయన బెదిరింపులు ఒకటి అనుకుంటుంది లాస్య. అలాంటిదేమీ జరిగి ఉండదు మీ అబ్బాయి తోనే చెప్పిస్తాను ఉండండి అని నందుకి కాల్ చేస్తుంది లాస్య.

ఫోన్ లిఫ్ట్ చేసిన నందు నువ్వు ఇచ్చిన అడ్రస్ లో దివ్య లేదు అని నందు అంటే అదేంటి పార్టీ అక్కడే అని చెప్పింది అంటుంది లాస్య. పార్టీ అక్కడే కానీ ఎప్పుడో అయిపోయింది అంటా వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోయారంట, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు తనని తీసుకొని వెళ్ళారంట వాచ్మెన్ చెప్పాడు. ఎక్కడికి తీసుకెళ్లారు తెలియటం లేదు. అందరినీ తనకు వైపు వెతుకుతూ ఎంక్వయిరీ చేస్తున్నాము అంటాడు నందు. ఆ మాటలకి అందరూ షాక్ అయిపోతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది అని పరంధామయ్య అంటే తులసి అప్పుడే వద్దని చెప్పింది.

విషయం తెలుసుకుని షాక్ అయినా కుటుంబ సభ్యులు..

పెళ్లి కావలసిన పిల్ల తన గురించి మీడియాలో న్యూస్ వస్తే బాగోదు అని ఆపింది అంటాడు నందు. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనఫీషియల్ గా తన హెల్ప్ తీసుకోవచ్చు కదా అంటుంది లాస్య. ఇప్పుడే తనికి ఫోన్ చేస్తాను అంటాడు నందు. ఏడుస్తూ కుప్పకూలిపోతుంది అనసూయ. నందు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. నేను ఇప్పుడే వస్తున్నాను అని బయలుదేరుతాడు ఆ ఫ్రెండ్. మరోవైపు అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాను త్రిల్లింగ్ గా ఉంది అన్న చూసావా ఎంత త్రిల్లింగ్ గా ఉందో డోంట్ మిస్ ది ఛాన్స్ అంటూ దివ్యతో చెప్తాడు కార్తీక్.

నేను నీకోసం ఎంతో చేశాను నీకు ప్రాక్టికల్స్ లో ఎంత హెల్ప్ చేశాను మర్చిపోయావా అంటూ ఏడుస్తుంది దివ్య. పిచ్చిపిచ్చి కోటలు చదువులోనే కాదు ఇలాంటిప్పుడు కూడా ఉండాలి అంటాడు కార్తీక్. డోంట్ స్పాయిల్ మై లైఫ్ అంటూ ఏడుస్తుంది దివ్య. పిచ్చిదానిలా ఏడవకు అసలు బాలేదు, నువ్వు ఇంకా బావిలో కప్పలాగా ఉన్నావు మారాలి అంటూ తనని టచ్ చేస్తాడు కార్తీక్. నన్ను టచ్ చేయొద్దు అంటూ కేకలు వేస్తుంది దివ్య. కేకలు వేస్తే నా పరువు తో పాటు నీ పరువు కూడా పోతుంది అయినా ఇంత చిన్న విషయానికే ఎందుకు కేకలు వేస్తావు అంటాడు కార్తీక్.

కార్తీక్ ని బ్రతిమాలుకుంటున్న దివ్య..

నీకు చిన్న విషయం ఏమో కానీ నాకు చిన్న విషయం కాదు మా అమ్మ నన్ను చాలా పద్ధతిగా పెంచింది దివ్య. ఏ తల్లి అయినా పద్ధతిగా నే పెంచుతుంది అంటాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న చేతన్ మనం తప్పు చేస్తున్నామేమో తనని వదిలేద్దాం అంటూ దివ్యకి సారీ చెప్తాడు. వాడి మీద కేకలు వేస్తాడు కార్తీక్. మరి రేపు వెతుకుతున్న ప్రేమ్ ని దొరికిందా అంటుంది తులసి. ఎక్కడ నీకు వెతుకుతాను రా అమ్మకి అబద్ధం చెప్పి మోసపోయింది అంటుంది తులసి. అది నోరు పెట్టుకుని అరుస్తుంది కానీ చాలా అమాయకురాలు అది తెలిసే తల్లి ఎవరో టార్గెట్ చేశారు అంటాడు ప్రేమ్. ప్రతి నిమిషం చాలా విలువైనది ఏదో ఒకటి చేయాలి దివ్య జాడ తెలుసుకోవాలి అంటుంది తులసి.

మరోవైపు శృతి ఫోన్ చేస్తుంది. దివ్య గురించి అడగడానికే అయి ఉంటుంది నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వే మాట్లాడు అంటూ ప్రేమ్ కి ఇచ్చేస్తుంది ఫోన్. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రేమ్ అమ్మ మాట్లాడే పరిస్థితిలో లేదు నాతో చెప్పు అంటాడు ప్రేమ్. దివ్య గురించి తెలిసిందేమో అని ఫోన్ చేశాను అని శృతి అంటే ఏమి లేదు తన గురించే వెతుకుతున్నాము అంటాడు ప్రేమ్. ఇంట్లో ఉంటే మాకు కంగారుగా ఉంది మేము కూడా వస్తాము లొకేషన్ షేర్ చేయండి అంటుంది అంకిత. అరే శృతి మాటలు వింటే నాకు ఒకటి అర్థం అవుతుంది మొన్నే ఏదో సినిమాల్లో చూశాను తన ఫోను ట్రేస్ చేసి పట్టుకుంటారు కదా అది ఏంటో పేరు గుర్తుకు రావట్లేదు మొన్న సినిమాలో చూశాను అంటే, అవునమ్మా దాన్ని జిపిఎస్ అంటారు మొన్నే తన మొబైల్ లో ఆ యాప్ ఎక్కించుకుంది కరెక్ట్ టైం కి గుర్తు చేశావు అంటూ తన లొకేషన్ ని పట్టుకుంటాడు ప్రేమ్.

Intinti Gruhalakshmi January 21 Today Episode:  చివరి నిమిషంలో తెలివితేటలు ఉపయోగించిన తులసి..

అమ్మ దివ్య ఎక్కడుందో తెలిసిపోయినట్లే కదా అంటూ బయలుదేరుతారు తల్లి, కొడుకులు. మరోవైపు దివ్య కి కొత్త, నీకు కొత్త కాదు కదా నువ్వెందుకు అలా జావ కారిపోతావు అయినా ప్రోగ్రాం మొత్తం నువ్వే కదా సెట్ చేసావు అంటాడు కార్తీక్. అదే సందుగా పారిపోతున్న దివ్యని పట్టుకొని గత 6 నెలలుగా నాలో నేనే నిన్ను లవ్ చేస్తున్నాను అంటాడు కార్తీక్. లవ్ చేసే వాళ్ళు చేసే పని ఫిదా సిగ్గు లేకుండా చెప్తున్నావ్ అంటుంది దివ్య. లవ్ చేసేది పెళ్లి చేసుకోవడానికి కాదు అంటాడు కార్తీక్. చేతన్ మనం తప్పు చేస్తున్నాంరా వద్దు అంటాడు. ఇంకొకసారి అలా అన్నావంటే కోసి కారం పెడతాను వెళ్లి బయట కాపలాకాయు అంటూ అతని బయటికి పంపించేస్తాడు కార్తీక్. తరువాయి భాగంలో నందు తన ఫ్రెండ్ ని కలుసుకొని అంతా చెప్తాడు. ప్రేమ్ వాళ్ళు జిపిఎస్ ద్వారా లొకేషన్ పట్టుకొని దివ్య ఉన్న దగ్గరికి వస్తారు. వాళ్లని చూసిన చేతన్ షాక్ అవుతాడు.