Intinti Gruhalakshmi January 24 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కూతురికి భోజనం పెడుతూ సమాజాన్ని గురించి చెప్తుంది తులసి. డబ్బు విలువ తెలిసిన వాళ్ళకి లక్ష రూపాయలు అయినా ధైర్యంగా ఇవ్వొచ్చు అలాగే డబ్బు విలువ తెలియని వాళ్ళకి కనీసం 10 రూపాయలు ఇచ్చినా కూడా ప్రమాదమే. స్వేచ్ఛ విలువ తెలియని వాళ్ళకి ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛ అంతా ఇచ్చిన ఉపయోగించుకోలేరు.
కూతురికి జీవిత పాఠాలు చెబుతున్న తులసి..
పాతిక వేలు పెట్టుకున్న బంగారాన్ని లాకర్లో దాచుకుంటున్నాము. ఆడపిల్ల బంగారం కంటే విలువైనది అప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం బాగున్నంత మాత్రమే మన చుట్టూ ఉన్నవాళ్లు బాగోవాలని ఏమీ లేదు. నడిచే దారిలో ముళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు మన జాగ్రత్తలో మనం ఉండాలి. మృగాలు తిరిగే సమాజం ఇది ఏ మృగం ఎప్పుడు దాడి చేస్తుందో తెలీదు.
బయటికి వెళ్లిన పిల్లల కోసం తల్లిదండ్రులు పిచ్చివాడా లాగా ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళని హేమాచనేని మీరు అనుకుంటారు కానీ అది మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవుతుంది. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకునే అమ్మానాన్నలని మోసం చేయడం అంటే దేవుడు కళ్ళు మూసి పాపం చేయాలనుకోవడమే, నిన్ను భయపెట్టడం కోసం ఇదంతా చెప్పడం లేదు కానీ మేము మీకోసం ఎంత భయపడతామో చెప్తున్నాను అంటుంది తులసి.
లాస్యని తిట్టుకుంటున్న నందు..
జీవితంలో ఇంకెప్పుడూ అబద్ధం చెప్పను నిన్ను టెన్షన్ పెట్టను అంటూ ఏడుస్తూ తల్లిని హత్తుకుంటుంది. కూతురికి అన్నం తినిపించి పడుకోపెడుతుంది తులసి. మరోవైపు నిద్ర లేవక ముందే పాటలు వింటున్న లాస్య అని తిట్టుకుంటూ ఉంటాడు నందు. పక్కనే మొగుడు లేకపోయినా పర్వాలేదు పక్కనే ఉన్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు కానీ పక్కన మాత్రం మొబైల్ ఫోన్ ఉండాలి అంటూ మొబైల్ లొ సాంగ్స్ ఆపేస్తాడు.
నిద్రలోనే ఉన్న లాస్య మళ్లీ ఆన్ చేస్తుంది. అప్పట్లో అర్జునుడు నీటిలో మష్యంత్రాన్ని కొట్టాడట ఇప్పుడు కళ్ళు మూసుకుని మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్న జనాలు ఎవరు గొప్పో అర్థం కావట్లేదు అనుకుంటూ వాకింగ్ కి బయలుదేరుతాడు నందు. తలుపు తీసేసరికి రాములమ్మ కనబడటంతో ఎక్కడికి అని అడుగుతాడు. లాస్యమ్మ పొద్దున్నే లేపమన్నారు అంటుంది రాములమ్మ. చిటికెన వేలు మీద గోవర్ధనగిరి లేపు లెగుస్తుంది అంతేగాని మీ లాస్యమ్మ ని లేపటం నీ తరం కాదు. మీతో పాటు వాకింగ్ కి వస్తాను ఎలాగైనా నన్ను నిద్ర లేపు అని సంవత్సరం నుంచి చెబుతుంది.
లాస్య తిక్క కుదిర్చిన రాములమ్మ..
నాకు వాకింగ్ కన్నా దాన్ని నిద్ర లేపడమే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోయింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు నందు. లాస్య దగ్గరికి వచ్చిన రాములమ్మ తనని నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుంది. ఏంటే తెల్లారి చెక్కి నీ అభిషేకం అనుకుంటూ కోపంగా నిద్ర లేస్తుంది లాస్య. ముఖం మీద నీళ్లు కొట్టైనా నిద్ర లేపు అన్నారు కదా అందుకే లేపాను అంటుంది రాములమ్మ. నేను ఏదో మాట వరసకి అంటే నిజంగానే నీళ్లు పోసిస్తావా అంటే ఆ ముక్క నేను నీళ్ళు పోయక ముందు చెప్పాలి అంటుంది రాములమ్మ.
ఈరోజు నుంచి నేను తులసి లాగా రెడీ అవ్వాలి కదా మర్చిపోయాను అనుకుంటూ మంచం దిగుతుంది లాస్య. మరోవైపు ఒత్తులు చేస్తున్న అనసూయ కి సాయం చేయబోయి ఆమె చేతే తిట్లు తింటాడు పరందమయ్య. సందు దొరికితే చాలు తాతయ్య మీద సెంటర్లు వేస్తావు అంటుంది అంకిత. నాకు వేరే కాలక్షేపం ఏముంది తను అనాలి,నేను పడాలి అంటాడు పరంధామయ్య. రెండోసారి కాఫీ ఇస్తానన్నావు మర్చిపోయావా లేకపోతే లాస్య లాగా పొదుపు మొదలు పెట్టావా అని అడుగుతుంది అనసూయ. అలాంటిదేమీ లేదు అత్తయ్య తిండి విషయంలో ఎప్పుడూ అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టను అంటుంది తులసి.
తనకి ఇంకా బుద్ధి రాలేదా అంటున్న తులసి..
నీ సంగతి నాకు తెలియదా నేను ఊరికే అంటున్నాను నువ్వు వచ్చాకే నా బిపి మీ మావయ్య గారి షుగరు కంట్రోల్ లోకి వచ్చాయి అంటుంది అనసూయ. అంకిత పెడతాను నువ్వు కాఫీ పెడతానన్నావు కదా అమ్మ అందుకే నేను స్నానానికి వెళ్లాను కుదరకపోతే చెప్పొచ్చు కదా నేనే పెట్టేదాన్ని అంటుంది తులసి.నాకు కుదరకపోవడానికి నేను చేసే పని పని ఉంది చెప్పండి అత్తయ్య మీరు చెప్పే కబుర్లు వినడం తప్పించి, మరి కాఫీ పెట్టడం మర్చిపోయావా అని కోడల్ని అడిగితే అప్పుడే వచ్చినా రాములమ్మ తెల్లారేసరికి రాక్స్ అన్నిటికి తాళాలు ప్రత్యక్షమయ్యాయి అంటుంది.
తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా బుద్ధి రాలేదా అని తులసి అంటే, వచ్చింది అత్తయ్య కానీ ఇంతకుముందు ఏం చేయాలన్నా తన పర్మిషన్ తీసుకొని చేయాలని తాళాలు వేసేది ఇప్పుడు ఏం చేయాలన్న తన చేతుల మీదుగా చేయాలని తాళాలు వేస్తోంది అంటుంది అంకిత. ఇంతకుముందు దాని కోపం తట్టుకోలేకపోయే వాళ్ళము ఇప్పుడు తను ప్రేమను తట్టుకోలేకపోతున్నాము అంటుంది అనసూయ. ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయేమో అంటుంది తులసి.
తులసావతారం ఎత్తిన లాస్య..
ఏం మంచి రోజులు ఏమో లాస్య పెట్టింది తింటే బడ్జెట్లో డాక్టర్ ఖర్చులు పెరిగిపోతాయి అని నవ్వుతాడు పరంధామయ్య. తనే చేయాలి అనుకోవటం బానే ఉంది కానీ ఇంకా రాలేదేంటి ఎక్కడ ఉంది అంటుంది తులసి. మరోవైపు చీర కట్టుకున్న లాస్య పాపం తులసిని నందు పాతికేళ్లు ఎలా భరించాడో, కళ్ళ ముందు భార్య అందంగా రెడీ అయి కనిపిస్తేనే హుషారుగా ఉంటుంది, లేకపోతే ఏముంది తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అంతేగా, మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు, ఈ ఇంట్లో వాళ్ళని దగ్గర చేసుకోవడానికి నేను ఇలా తులసి అవతారం ఎత్తాను. ముందు ఈ చీరలో నాకు అలవాటు అయ్యేవరకు బెడ్ రూమ్ క్లీనింగ్ చేస్తాను అనుకుంటూ తన రూమ్ కి మాపింగ్ పెడుతుంది లాస్య.
అప్పుడే అక్కడికి వచ్చిన నందిని చూసి చూద్దాము గురుడు ఎలా టెంప్ట్ అవుతాడో అనుకుంటుంది. లాస్యని గమనించని నందు నీ పని అయితే కాస్త టీ పెట్టి ఇవ్వు రాములమ్మ అంటాడు. ఆ మాటకి షాక్ అయిన లాస్య అసలు రాములమ్మ ఎందుకు గుర్తొచ్చింది అని తనని తాను చూసుకుంటుంది. అంటే నేను ఈ అవతారంలో రాములమ్మ లాగా ఉన్నానా అయినా ఈ నందు గురించి పట్టించుకోక్కర్లేదు అతనికి టేస్ట్ లేదు, ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మధ్యలోకి వెళ్దాము నన్ను తెలుసు అనుకుంటారో లేదో చూద్దాము అంటూ హాల్లోకి వస్తుంది. మరోవైపు ముస్తాబవుతున్న శృతి దగ్గరకొచ్చి ఆమెని ఆట పట్టిస్తుంటాడు ప్రేమ్.
కోడల్ని ఆటపట్టిస్తున్న తులసి..
అంతలోనే అక్కడికి వచ్చిన తులసిని చూసి తడబడతాడు. ఏమీ లేదమ్మా కంట్లో నలకపడుతుంటేను తీస్తున్నాను అంటూ నసుకుతాడు. నా ఇన్నేళ్ల అనుభవంలో వెనకనుంచి నలకు తీయడం ఎప్పుడూ చూడలేదు ఇకమీదట చూడనేమో అంటూ కొడుకుని ఆట పట్టిస్తుంది తులసి. ప్రేమ్ చేతిలో టిఫిన్ పెట్టి నువ్వు బయటికి వెళ్లి తిను నా కోడల్ని డిస్టర్బ్ చేయకు అని పంపించేస్తుంది. ప్రేమ్ వెళ్లిపోయిన తర్వాత నీకు చీర కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది ఏమో హెల్ప్ చేద్దామని వచ్చాను కానీ నా కొడుకు అదే పనిలో ఉన్నాడని ఎక్కడికి వచ్చేదాకా తెలీదు అంటూ శృతిని ఆట పట్టిస్తుంది తులసి.
Intinti Gruhalakshmi January 24 Today Episode:
మరోవైపు హాల్లో అందరూ ఉండగా అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది లాస్య. చీర కట్టుకొని నిండుగా ముస్తాబై ఉన్న లాస్య అని చూసి కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు. ఎవరు కాఫీలు తాగకుండా ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉంటారు. నువ్వు డాన్స్ చేస్తూ కాఫీ ఇస్తుంటే ఎక్కడ మా నెత్తి మీద అభిషేకం చేస్తారేమో అని టెన్షన్ పడ్డాం అంటాడు పరంధామయ్య. అయినా ఈ గెటప్ ఏంటి అని పరంధామయ్య అడిగితే వెరైటీగా ఉంది కదా మావయ్య అంటుంది లాస్య. ఈ కాఫీ అయినా నార్మల్ గా ఉంటుందా లేకపోతే ఇది కూడా వెరైటీగా ఉంటుందా అంటుంది అనసూయ.
తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన నందు తులసి మీద కేకలు వేస్తాడు. దివ్య నా కూతురా నీ కూతురా, ఎవరి పర్మిషన్ తో తనని ఢిల్లీకి స్పెషల్ కోర్సు చేయటానికి పంపిస్తున్నావు, నిర్ణయాలు తీసుకోవటానికి నేను చచ్చాను అనుకున్నావా అంటాడు.