Intinti Gruhalakshmi January 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో చీరలో ఉన్న లాస్య అని ఈ గెటప్ ఏంటి అని అడుగుతాడు పరంధామయ్య. వెరైటీగా ఉంది కదా మావయ్య అంటే కాఫీ అయినా నార్మల్ గా ఉందా ఇది కూడా వెరైటీగా ఉందా అంటుంది అనసూయ. ఈరోజు నుంచి ఏదీ మామూలుగా ఉండదు ఏం చేసినా లాస్య మార్పు కనబడుతుంది అని లాస్య అంటే చీరకట్టులో మాత్రం తులసి ఆంటీ మార్క్ కనపడుతుంది అంటుంది శృతి. నువ్వైనా నా క్రియేటివిటీని అర్థం చేసుకున్నావు అంటుంది లాస్య.
గీతా బోధ చేస్తున్న లాస్య..
మాకు కావలసింది తులసి లాగా రెడీ అవ్వటం కాదు తులసి లాగా కాఫీ పెట్టడం అంటుంది అనసూయ. తులసి లాగే పొయ్యి వెలిగించను తులసి లాగే గిన్నిపోయే మీద పెట్టాను అంటూ పెద్ద లిస్ట్ చదువుతుంది లాస్య. కావలసింది అది కాదు చివరికి తులసి ఆంటీ పెట్టినట్టుగా రావాలి అంటుంది అంకిత. శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా కర్మ చేయడంలోనే మీకు అధికారం ఉంది అంతేకానీ ఫలితాన్ని ఆశించడంలో కాదు నేను దాన్నే ఫాలో అవుతాను అంటుంది లాస్య.
నీకు ఏది అనుకూలము అదే నచ్చుతుందా అంటాడు పరంధామయ్య. ఈ ఇంట్లో అందరూ అంతే కదా ఎవరు నచ్చితే వాళ్ళు చేసిన పనులే నచ్చుతాయి కదా తులసి అంటే మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు అంటుంది తులసి. మామ్ లాగా రెడీ అయ్యి కాఫీ పెట్టినంత మాత్రాన కాఫీ మాం పెట్టినందుకు టేస్ట్ రాదు అంటాడు అభి. ఇప్పుడు ఈ గెటప్ తో ఏం అవసరం వచ్చింది నిన్ను ఎవరు అడిగారు అంటాడు పరంధామయ్య. ఇందాక పెంచి ఈ ప్రశ్న ఎవరు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నాను ఇంటి కోసం నా వాళ్ళ కోసం నడుము ఒంచి పని చేస్తున్నాను.
చేసే పనికి పబ్లిసిటీ అవసరం అంటున్న లాస్య..
పొగడాల్సిన వాళ్లు పొగటం లేదు రావాల్సిన మంచి పేరు రావడం లేదు అవ్వవలసిన వాళ్ళకి దగ్గరవడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అని మేదమదనం చేశాను నా తప్పులు నేను తెలుసుకున్నాను. పని చేయటం ముఖ్యం కాదు చేస్తున్న పని నలుగురికి తెలిసేలా చేయడం ముఖ్యం అంటుంది లాస్య. అందుకేనా గూర్కా వాళ్ళు రాత్రులు నేల మీద కర్రతో సౌండ్ చేస్తూ తిరుగుతారు అంటూ ఆటపట్టిస్తాడు ప్రేమ్. మధ్యలో డిస్టర్బ్ చేయకు తను ఏదో చెప్పాలనుకుంటుంది అంటుంది తులసి.
అవును చిన్నప్పుడు వాడు అంతే ఎక్కాలు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేసేవాడు అంటాడు పరంధామయ్య. నువ్వు కూడా మళ్లీ మొదటి నుంచి మొదలు పెడతావా కాఫీ ఇచ్చి ఎంత పెద్ద పనిష్మెంట్ అవసరమా అంటుంది అనసూయ. పని చేయడం ముఖ్యం కాదు పబ్లిసిటీ ముఖ్యం అందుకే ఉత్తమ ఇల్లాలుగా అందరి దృష్టిలో పడటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి నన్ను ఆదరించండి అంటుంది లాస్య.
లాస్య మాటలకి నవ్వుకుంటున్న కుటుంబ సభ్యులు..
నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే 0 0 నెంబర్ కి కాల్ చేసి నన్ను ఆదరించండి అంటూ లాస్య అని ఆట పట్టిస్తుంది దివ్య. దానికి అందరూ నవ్వుతారు. నేనేమీ జోక్ చేయటం లేదు మారుతున్నాను అని సిన్సియర్ గా చెప్తున్నాను అంటుంది లాస్య. అంతలోనే అక్కడికి వచ్చిన నందు ఇందాక అనగా కాఫీ అడిగాను చెవుడా, వినిపించడం లేదా అంటూ అక్కడికి వస్తాడు. లాస్యని చూసి షాక్ అవుతాడు నువ్వా రాములమ్మ ఏమో అనుకొని పొరబడ్డాను అంటాడు. మీరు నన్ను ఆటపటించడానికి కదా అలా అన్నారు అంటుంది లాస్య.
అలాంటిదేమీ లేదు అయినా ఈ గెటప్ ఏంటి అంటాడు నందు. మళ్లీ మొదటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తారా ఏంటి అంటూ కంగారు పడుతుంది అంకిత. వినే ఓపిక మీకున్న చెప్పే ఓపిక నాకు లేదు నేను ఇంకా బోలెడు పనులు చేయాలి అంటూ తను చేయాల్సిన పనుల లిస్టు చెప్తుంది లాస్య. ఇవన్నీ నిజంగా చేద్దామనేనా అంటాడు పరంధామయ్య. లాస్య అంటే మాటలు కాదు చేతలు చేసి చూపిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. ఇదంతా జరిగే పనేనా అంటుంది అనసూయ. సీన్ కట్ చేస్తే గుమ్మంలో ముగ్గు వేస్తున్న లాస్యని గుర్తుపట్టక అప్పుడే వచ్చిన భాగ్యం లాస్య ఉందా అని అడుగుతుంది.
లాస్యని గుర్తుపట్టలేకపోయిన భాగ్యం..
ఈ భాగ్యం కూడా నన్ను గుర్తుపట్టలేనట్టుంది అనుకుంటూ నేనే లాస్యని అంటుంది లాస్య. ఓహో నీ పేరు కూడా లాస్యనా? ఇంట్లో లాస్య అంటే ఎవరికి పడదు ఎవరో ఒకరు తిడుతూనే ఉంటారు నిన్ను అనుకొని ఫీల్ అవ్వకు అంటుంది భాగ్యం. ఎందుకు పడి చావదు అంటుంది లాస్య. దానికి నోటు తుడుసు ఎక్కువ తగ్గించుకోమని చాలాసార్లు చెప్పాను వింటేనే కదా తను మారదు ఇల్లు మారదు ఇంతకీ లాస్య ఉందో,లేదో చెప్పు తను లేదు అంటే నేను ఇట్నుంచితే వెళ్ళిపోతాను అంటుంది భాగ్యం.
వెనక్కి తిరిగిన లాస్య తింగరిది ఇక్కడే ఉంది అంటుంది. లాస్య మొహాన్ని చూసిన భాగ్యం షాక్ అవుతుంది. నేను తింగరి దాన అని లాస్య అడిగితే అలా అన్నాను కాదు నేనే తింగరిదాన్ని అంటుంది భాగ్యం. నీ కంటికి నేను పనిమనిషిలా కనిపిస్తున్నానా అంటే నువ్వు నిజంగానే పనిమనిషి లాగా ఉన్నావు. ఎవరినైనా కొత్త మనిషిని పెట్టుకున్నారేమో అనుకున్నాను అంటుంది భాగ్యం. తులసి లాగా కనబడదామని నేను ప్రయత్నిస్తుంటే అందరూ కలిపి నన్ను పని మెన్షన్ చేసేస్తున్నారు అంటుంది లాస్య.
ఇదంతా అవసరమా అంటున్న భాగ్యం..
నేను కాకుండా ఇంకెవరైనా అన్నారా అని భాగ్యం అంటే మీ బావగారు కూడా అదే అన్నారు మీరు ఇలా అంటే నా మీద నాకే డౌట్ వస్తుంది. నువ్వు తులసి అక్క డూప్ లాగా కూడా లేవు తన హైట్ తను పర్సనాలిటీ ఏ వేరు అంటుంది భాగ్యం. అంటే ఏంటి నీ ఉద్దేశం ఇప్పుడు హైట్ తగ్గినంత మాత్రాన నేను పనిమనిషిని అయిపోతాను అయినా కావాలనే నన్ను మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది లాస్య. టాపిక్ మార్చకపోతే ఇదే విషయాన్ని గ్రైండర్లు తిప్పినట్టు తిప్పుతుంది అనుకుంటూ తులసక్క లాగా నువ్వెందుకు రెడీ అవ్వాలనుకుంటున్నావు అంటుంది భాగ్యం.
ఉత్తమ ఇల్లాలు అంటే తులసి అంట నందు అన్నారు, నేను కూడా ఉత్తమ ఇల్లాలు అవ్వాలి అనుకుంటున్నాను అంటుంది లాస్య. ఇదంతా అవసరమా ఇప్పుడు అయినా ఆకాశానికి రెండు చందమామలు అక్కర్లేదు. నీకు ముగ్గు వేయడమే సరిగ్గా రావటం లేదు అలాంటిది నీ వాళ్ళని ముగ్గులోకి దించడం నీ వల్ల అవుతుందా అంటుంది భాగ్యం. కోపంగా చూస్తున్న లాస్య అని చూసి అయినా ఇదంతా మీ వల్ల సాధ్యమే అవుతుంది తులసక దగ్గర నుంచి బావగారిని లాక్కున్నావు అలాంటిది ఉత్తమ ఇల్లాలు హోదా లాక్కోలేవా?అంటూ మాట మార్చేస్తుంది భాగ్యం.
కోపంతో తులసి మీద కేకలు వేస్తున్న నందు..
అయినా ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలంటే తులసక్కలాగే మారక్కర్లేదు నీలా ఉండి కూడా మారొచ్చు అంటుంది భాగ్యం. ఇది బాగా చెప్పావు వెంటనే వెళ్లి గెటప్ మార్చుకుంటాను అంటుంది లాస్య. మరోవైపు కొరియర్ రిసీవ్ చేసుకున్న నందు కోపంతో రగిలిపోతాడు. కోపంతో తులసిని పిలిచి నేను ఆటలో అరటిపండుని పేరుకు మాత్రమే పెద్దని అనుకుంటున్నావా? ఆ మాట మొహం మీదే చెప్తే ముసుగేసుకుని గదిలో కూర్చుంటాను ఎవరి జోలికి రాను అంటాడు నందు. ఇప్పుడు ఏమైంది, మిమ్మల్ని కించపరిచేలాగా నేను ఏం చేశాను అంటుంది తులసి.
దివ్య కి సంబంధించిన ఏమైనా కలిసి తీసుకోవాలి మరి ఇదేంటి ఎవరిని అడిగి దివ్యని ఢిల్లీకి స్పెషల్ కోర్స్ కి పంపిస్తున్నావు అంటూ నిలదీస్తాడు. ఆ మాటకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు, నా కూతురు ఢిల్లీ యూనివర్సిటీ కి అప్లికేషన్ పెట్టినట్టు సెలెక్ట్ అయినట్టు వెళ్తున్నట్టు ఈ లెటర్ చూస్తేనే కానీ నాకు తెలియలేదు అంటే నేను ఏమనుకోవాలి, చేతకాని వాడిని దద్దమ్మని నీ పిల్లల తండ్రిగా ఉండడానికి నువ్వు ఇష్టపడడం లేదని ఒప్పుకోవాలా? ఒక పనికిరాని వాడిని తండ్రిగా గుర్తించటానికి నా కూతురు సిద్ధంగా లేదని అనుకోవాలా అంటాడు నందు.
దెబ్బతిన్న నందు ఆత్మాభిమానం..
ఎందుకంత పెద్ద పెద్ద మాటలు అని తులసి అంటే, మీరు నాకు చేసింది చిన్న అవమానం కాదు మీరు నన్ను తీసి పక్కన పడేశారు అంటాడు నందు. అప్లై చేసే ముందు ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు నా దగ్గర డబ్బు జాబు లేకపోవచ్చు కానీ నా రక్తం తనలో ఉంది నేను చచ్చిపోయాను అనుకున్నారా అంటాడు నందు. ఎందుకురా అలా మాట్లాడతావు అన్ని నీకు నువ్వే అనుకుంటున్నావు నిన్ను ఇక్కడ ఎవరు తీసి పారేయలేదు అంటాడు పరంధామయ్య. మూడు నెలలుగా ఈ చదువు విషయం మా మధ్య నలుగుతూనే ఉంది అని తులసి అంటే మూడు నెలల నుంచి నలుగుతున్న నాకు చెప్పటానికి మీకు టైం లేదు అంతేనా అంటాడు నందు.
టైం దొరకపోవడం కాదు చెప్పే అవకాశం మీరు ఇవ్వడం లేదు అంటుంది తులసి. నీ నోటికి అడ్డుపడ్డానా అంటాడు నందు. చెపుదామని వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ మనం ఎప్పుడూ ప్రశాంతంగా మాట్లాడుకున్నామని ఎప్పుడూ పాము ముంగిస గొడవలే కదా మనవి అంటుంది తులసి. నీ దగ్గర చదువు లేకపోయినా ఒక ఒక తెలివైన ఎడ్యుకేట్ దాక్కొని వున్నాడు అందుకు నిన్ను మెచ్చుకోవాలి తప్పు నీ వైపు ఉన్న ఎదుటి వాళ్ళ మీదికి తోసేసి నిన్ను ఒక న్యాయదేవతలాగా చూపించుకుంటావు నువ్వు గ్రేట్ అంటాడు నందు.
దివ్యని నిలదీస్తున్న నందు..
నేను అంత తెలివైన దాన్ని అయితే మెడలో తాళిబొట్టు ఉంచుకొని నా భర్తని వేరే ఆడదానికి వదిలేసేదాన్ని కాదు అంటుంది తులసి. టాపిక్ డైవర్ట్ చేయొద్దు అని లాస్య అంటే చేసింది నేను కాదు మీ ఆయన అంటుంది తులసి. మీ అమ్మకి నేనంటే పడదు తనకి నేను శత్రువుని తను అలా బిహేవ్ చేసింది అంటే ఓకే కానీ నీకు నేను ఏమన్యాయం చేశాను ఈ నాన్నని ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు చదువుకుంటానంటే నేను అడ్డుపడతాను అనుకున్నావా అంటాడు నందు. నిజానికి ఆ కోర్స్ చదవటానికి సరిపడే ఆర్థిక స్థోమత మన దగ్గర లేదు అందుకే వదిలేసాను కానీ మామ్ చదివించాలని పట్టుదలతో ఉంది డబ్బు కోసం ట్రై చేస్తానంది అంటుంది దివ్య.
అందుకని ఈ డాడ్ నీకు చీమ లాగా కనిపించాడు. అమ్మే నాన్నని పట్టించుకోవట్లేదు నేను ఎందుకు పట్టించుకోవాలి అనుకున్నావా చిన్నప్పుడు నిన్ను భుజాల మీద మోసింది మర్చిపోయావా? ఇప్పుడు ఏది అడిగినా కాదనకుండా కనిపెట్టిన విషయం మర్చిపోయావా? నువ్వంటే మీ డాడీకి ఇష్టమైన సంగతి మర్చిపోయావా అంటూ బాధపడుతూ దివ్యని అడుగుతాడు నందు. నేను అంత లోతుగా ఆలోచించలేదు మీరు జాబ్ లేక బాధపడుతున్నారు ఇలాంటి సమయంలో డబ్బు గురించి చెప్పాలని అనిపించలేదు అని దివ్య అంటే ముందు సెలెక్ట్ అవ్వు తర్వాత తీరిక చూసుకొని చెబుదాము అని నేనే దివ్యతో చెప్పాను తనని ఏమీ అనొద్దు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi January 25 Today Episode మనసుకి కష్టంగా ఉందన్న నందు..
మీకు చెప్పడం చెప్పకపోవడం పక్కన పెడితే ఢిల్లీ యూనివర్సిటీలో చదివితే దివ్య లైఫ్ బాగు పడినట్లే అంటాడు అభి. తను బాగుపడితే నాకు మాత్రం సంతోషం కాదా? నేను ఒక సగటు తండ్రిని నా ఆత్మ అభిమానం దెబ్బతింటే బాధపడతాను అంతేగాని నా కూతురు ఎదిగితే నాకు సంతోషమే కదా. కానీ నిన్న ఏం జరిగిందో చూసావు కదా పక్కన ఉన్న కూతుర్ని రక్షించుకోవడానికి నానా తంటాలు పడ్డాను. ఆ భయం తగ్గక ముందే తనని ఢిల్లీ పంపించాలంటే మనసుకి కష్టంగా ఉంది అంటాడు నందు. తను వెళ్లే యూనివర్సిటీలో డిసిప్లిన్ చాలా ఎక్కువ అంటాడు అభి.
తరువాయి భాగంలో అభిని కారు అడుగుతాడు నందు. నా ఎమర్జెన్సీ మీకు తెలియదు అయినా మీకు ఏం పని ఖాళీయే కదా అంటాడు. కావాలంటే నా బైక్ మీద డ్రాప్ చేస్తాను వచ్చేటప్పుడు నిదానంగా నడుచుకుని వచ్చేయండి అంటాడు ప్రేమ్. కాఫీ నందు కి ఇవ్వకుండా అత్తమామలకి ఇస్తుంది లాస్య. మీకు ఏం పని తిని కూర్చోవడమే కదా అంటూ అవమానంగా మాట్లాడుతుంది.