Intinti Gruhalakshmi January 26 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కూతుర్ని ఢిల్లీ యూనివర్సిటీ పంపించడానికి భయపడతాడు నందు. ఆ యూనివర్సిటీ డిసిప్లిన్ చాలా బాగుంటుంది ఇంట్లో కంటే స్ట్రిక్ట్ గా ఉంటారు నన్ను నమ్మండి అంటాడు అభి. మీ అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాదనాలి మీకు నచ్చినట్లే చేయండి అంటాడు నందు. అందరూ సంతోషించి రేపు సంక్రాంతి పండుగ గనంగా చేసుకొని అప్పుడు పంపిద్దాం అంటుంది అనసూయ.

తండ్రిని చులకన చేస్తున్న అభి, ప్రేమ్..

సీన్ కట్ చేస్తే సూది ఎక్కిస్తూ హాల్లోకి వస్తాడు పరంధామయ్య. అది చూస్తూ నవ్వుకుంటారు అభి, తులసి. ఏం చేస్తున్నారు తాతయ్య అని అభి అడిగితే మీ నానమ్మకి ఒక జబ్బు ఉంది. నేను ఖాళీగా కనబడితే దానికి కడుపుమంట అందుకే ఈ సూదిలో దారం ఎక్కించ మంటుంది ఇదేమో కుదిరిచావటం లేదు అంటాడు. ఎందుకు కుదురుతుంది తాతయ్య అది మీ చేతిలో నుంచి జారిపోయి పావుగంట అయింది అంటూ ఆ సూది తీసి నేను ఎక్కిస్తాను ఇవ్వండి అంటాడు.

వద్దు నేను ఖాళీగా ఉంటే మళ్ళీ ఇంకో పని చెప్తుంది మీ నానమ్మ అందుకే నా పని నేను చేసుకుంటాను అంటాడు పరంధామయ్య. అదే సమయంలో బయటికి వెళ్తూ వెనక్కి వచ్చేసిన తండ్రిని ఏమైంది అని అడుగుతాడు అభి. కారు బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లిన సంగతి గుర్తొచ్చింది, నీ కారు ఒకసారి ఇస్తే పావుగంటలో వచ్చేస్తాను అని కొడుకుని అడుగుతాడు నందు. నేను హాస్పిటల్లో ఏ నిమిషంలో నైనా కాల్ రావచ్చు అంటాడు.

గిల్టీగా ఫీల్ అవుతున్న నందు..

అది కాదు అంటూ ఏదో మాట్లాడుతుండగా మీరు ఖాళీనే కదా నా ఎమర్జెన్సీ మీకు తెలియదు అంటాడు నందు. పావుగంటలో వచ్చేస్తానన్నారు కదా అని తులసి అంటే వద్దులే నేను ఖాళీయే కదా నడుచుకొని వెళ్తాను వాడు బిజీ కదా అంటాడు నందు. ప్రేమ్ బైకు అడుగు అంటాడు పరంధామయ్య. నేనేమీ ఖాళీగా లేను బయటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను వెళ్లేటప్పుడు దించుతాను ఖాళీయే కదా అటు నుంచి వచ్చేటప్పుడు నడుచుకొని రమ్మనండి అంటాడు ప్రేమ్.

దిగాలుగా సోఫాలో కూర్చొని సంపాద లేకపోతే మగాడు విలువ ఇంత దారుణంగా పడిపోతుందా? చాక్లెట్ కోసం రూపాయి నన్ను అడిగిన పిల్లలు ఈరోజు సంపాదన లేకపోతే నన్ను చాక్లెట్ కంటే హీనంగా చూస్తున్నారు అనుకుంటాడు. అప్పుడే కాఫీ తీసుకొని వచ్చిన లాస్య పరంధామయ్యకి, అభి కి ఇస్తుంది కానీ అక్కడే ఉన్న నందు కి ఇవ్వదు. పైగా మీకు కూడా కావాలా అని అడుగుతుంది. కావాలా ఏంటమ్మా తాగుతాడు కదా దీన్ని రాత్రి డైజేషన్ ప్రాబ్లం అన్నారు తిని కూర్చుంటున్నారు కదా అందుకే తీసుకురాలేదు అంటుంది లాస్య.

అందరి ముందు భర్తని అవమానించిన లాస్య..

ఇప్పుడే పాలు అయిపోయాయి రెండు పాల ప్యాకెట్లు తీసుకొని రండి అందరూ బిజీగా ఉన్నారు కదా అందుకే నీకు చెప్పాను అంటూ చులకనగా మాట్లాడుతుంది. ఎవరు షాప్ కి వెళ్ళక్కర్లేదు షాప్ కుర్రాడికి ఫోన్ చేస్తే వాడే తీసుకొని వస్తాడు అంటుంది తులసి. నీకు కూర్చున్న చోటే అన్ని పనులు అయిపోతున్నాయి నువ్వు లక్కీ అంటుంది లాస్య. నేను ఇప్పుడే తాగాను ఈ కాఫీ నువ్వు తాగు అంటాడు పరంధామయ్య. నేను పనికిరాని వాడినని లెక్క కట్టేసి లాస్య నాకు కాఫీ ఇవ్వడం మానేసింది మీరు ఎందుకు నాన్న నా మీద జాలి పడటం అంటాడు నందు.

ఆ మాటకొస్తే నేను అందరికంటే పనికిమాలిన వాడిని కూర్చుంటే లేవలేని వాడిని నాకే ఇచ్చింది కదా నువ్వు లేనిపోనివి ఊహించుకోవద్దు అంటాడు పరంధామయ్య. నువ్వు విలువ లేని అడవి ఎందుకు అవుతావు నీకు పెన్షన్ వస్తుంది నా మొహానికి అది కూడా లేదు అంటూ బాధపడతాడు నందు. ఈ మాటలన్నీ వింటున్న తులసి భర్త పరిస్థితి బాధపడుతుంది. బాధపడుతున్న కొడుకుకి ధైర్యం చెప్తాడు పరంధామయ్య.

కొడుకు కోసం బాధపడుతున్న పరంధామయ్య..

సిన్సియర్గా ట్రై చేస్తున్నాను నాన్న కానీ ఏ ఒక్క విషయంలోనూ నాకు కలసి రావట్లేదు అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. వాడిని చూస్తే జాలేస్తుంది దేవుడు కరుణించి వాడికి ఏదైనా జాబు వచ్చేలాగా చేస్తే బాగుండు లేకపోతే వాడు పిచ్చివాడు అయిపోతాడు అంటూ బాధ పడిపోతాడు పరంధామయ్య. మరోవైపు ఒక వ్యక్తికి ఫోన్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతుంది తులసి. మీరు మాకు చాలా సార్లు హెల్ప్ చేశారు, అలాంటిది ఫస్ట్ టైం మీరు హెల్ప్ అడుగుతున్నారు చెప్పండి మేడం అంటాడు అతను.

నాకు తెలిసి అతనికి మీరు జాబ్ ప్రొవైడ్ చేయాలి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి ఇంటర్వ్యూ చేశాక మీకు నచ్చితేనే జాబ్ లో చేర్చుకోండి అంతేకానీ జాబ్ నేను రికమండ్ చేసినట్లుగా ఆయనకి తెలియనివ్వకండి అంటుంది. మీకు చాలా కావలసిన మనిషి అయి ఉంటారు అందుకే అంత కేర్ తీసుకుంటున్నారు నేను డీల్ చేస్తాను అండి అంటాడు అతను. ఈ మాటలు విన్న పరంధామయ్య జాలి పడ్డావా అని అడుగుతాడు, ఆయన నా విషయంలో ఎప్పుడూ జాలి పడ్డారని నేను ఆయన మీద జాలి పడటానికి, మా కొడుకు అని మా మొహం చూసి ఆయనకి హెల్ప్ చేస్తున్నావా అని అడుగుతాడు పరంధామయ్య.

తులసిని నిలదీస్తున్న పరంధామయ్య..

ఆయన భార్య మిమ్మల్ని పస్తులుంచినప్పుడు కనీసం ఒక మాట కూడా అనలేదు అలాంటి పెద్ద మనిషిని మీ కొడుకు అనుకోవడం ఎప్పుడో మానేశాను. మరి ఏ ఫీలింగ్ తో హెల్ప్ చేశావు అని పరంధామయ్య అడిగితే ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటే ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు, ఆయన కష్టాన్ని అందరి నెత్తి మీద రుద్దుతూ ఎవరిని నిద్రపోనివ్వరు అందుకే హెల్ప్ చేస్తున్నాను అంటుంది తులసి. ఎందుకు దొంగచోటుగా హెల్ప్ చేయడం అని అడిగితే నాకు ఆయనకి ఒక జబ్బు ఉంది.

తినటానికి లేకపోయినా పర్వాలేదు కానీ పౌరుషానికి మాత్రం కొదవలేదు అందుకే సీక్రెట్ గా హెల్ప్ చేస్తున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఖాళీగా ఉన్నా నందు దగ్గరికి వచ్చి నీకు జాబ్ రాకూడదని ఎవరో గట్టిగా పూజలు చేస్తున్నారు అందుకే నీకు జాబ్ రావట్లేదు అంటుంది లాస్య. నీ ఆలోచనలు కరెక్ట్ అని చెప్పటానికి రుజువు చూపించు అంటాడు నందు. నీకు నా మీద ప్రేమ ఉంది అని చెప్పటానికి ప్రజలు చూపించు అని లాస్య అంటే అన్ని భరిస్తూ ఇంకా కాపురం చేస్తున్ననే అదే పెద్ద రుజువు అంటాడు నందు.

ఆ వార్త విని ఆనందంతో గంతులు వేస్తున్న నందు..

ఇంతలో తులసి రిక్మెంట్ చేయమన్న వ్యక్తి ఫోన్ చేసి మా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టు ఖాళీగా ఉంది మీరు వచ్చి జాయిన్ అవుతారా అని అడుగుతాడు. నాకు జాబ్ అవసరమని మీకు ఎలా తెలుసు అంటాడు నందు. అవసరం మాది అవసరమైన కాండిడేట్లు వెతుక్కోవడానికి మా పద్ధతులు మాకు ఉన్నాయి అవి రివిల్ చేయకూడదు రేపు ఇంటర్వ్యూకి రండి అని చెప్తాడు అతను. నాకు ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అంటూ ఆనందంగా లాస్య కి చెప్తాడు నందు.

నిన్ను ఆట పట్టించడానికి ఎవరో కాల్ చేయలేదు కదా అంటుంది లాస్య. ఏ ఆనందాన్ని కాసేపు కూడా ఫీలవనవే అంటూ కోప్పడతాడు నందు. అంటే అడిగిమరీ జాబ్ కి రమ్మంటున్నారు కదా అందుకే డౌట్ వచ్చింది అంటుంది లాస్య. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకు వచ్చాక అప్పుడు నమ్ముదువు గానివి లే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. సీన్ కట్ చేస్తే ముగ్గుల పోటీ అన్నారు బహుమతులు అన్నారు రెడీ అయిపోయి వస్తే ఎవరూ కనిపించట్లేదు అనుకుంటాడు పరంధామయ్య.

Intinti Gruhalakshmi January 26 Today Episodeపరంధామయ్యని ఇరికించేస్తున్న ప్రేమ్..

మేము వచ్చేసాం తాతయ్య అని మనవళ్ళిద్దరూ అంటే మీరెందుకు ఇది ముగ్గుల పోటీ అంటాడు పరంధామయ్య. మరి ఈ ముగ్గురు నారీమణులు ఏరి అంటాడు ప్రేమ్. అదే చూస్తున్నాను అంటాడు పరంధామయ్య. పోటీ కోసం పబ్లిసిటీ అవసరం తాతయ్య ఉండండి నేను చెప్తాను అంటూ మైక్ లో అనౌన్స్ చేసినట్లుగా పేపర్ పట్టుకొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అంటూ తులసమ్మ వాకిట్లో ముగ్గుల పోటీ అంటూ ఆహ్వానిస్తాడు. ఒరేయ్ ఆగరా బాబు పట్టుచీరలు అంటున్నావు ఎక్కడినుంచి తెస్తావు అంటాడు పరంధామయ్య.

నువ్వే ఇస్తావు తాతయ్య అంటే నా కొంప ముంచేలాగా ఉన్నావు అంటాడు పరంధామయ్య. పేపర్ ముక్కలు చూపించి ఇవే గిఫ్ట్ గా ఇచ్చాయి అంటాడు ప్రేమ్. తరువాయి భాగంలో మాధవి వచ్చి వాళ్ళ అన్నయ్యని హగ్ చేసుకుంటుంది. ఇంట్లో అందరూ కలిపి పూజ చేసుకుంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 26, 2023 at 8:07 ఉద.