Intinti Gruhalakshmi January 27 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అందంగా ముస్తాబయి ఆడవాళ్ళందరూ హాల్లోకి వస్తారు. వాళ్లతో పాటు నువ్వెందుకు రెడీ అయిపోయావు అని భార్యని అడుగుతాడు పరంధామయ్య. ముగ్గుల పోటీకి తాతయ్య అంటాడు ప్రేమ్. కూర్చుంటే నుంచోలేవు, నించుంటే కూర్చోలేవు నీకెందుకే పోటీ అంటాడు పరంధామయ్య. పడుకొని ముగ్గులు వేస్తాను అవన్నీ నీకెందుకు పట్టుచీరలు రెడీయే కదా అంటుంది అనసూయ.
మళ్లీ కలిసిన అన్నా చెల్లెళ్ళు..
నా మాటలకి అందరూ నవ్వుకుంటారు అంతలోనే నందు, లాస్య హాల్లోకి వస్తారు. నేను ఈ రోజే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను నాన్న ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండండి అంటుంది దివ్య. ఇంపార్టెంట్ పనిమీద బయటికి వెళ్తున్నారు గుడ్ న్యూస్ తో ఇంటికి త్వరగానే వచ్చేస్తారులే అంటుంది లాస్య. అంతలోనే అక్కడికి వచ్చిన మాధవి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఆ దంపతులని చూసి ఆనందంతో షాక్ అవుతాడు నందు.
నన్ను లోపలికి రానిస్తావా? నా టిఫిన్ ఖర్చు వెళ్లేటప్పుడు నేను ఇచ్చేసి వెళ్ళిపోతానులే అంటూ అన్నయ్యని హత్తుకుంటుంది మాధవి. ఆరోజు అంత వరకసంగా నీతో ఎలా మాట్లాడాను ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటాడు నందు. ఇంక ఆ విషయం మర్చిపోండి అంటుంది తులసి. ఈ ఇంటికి కూతురుతో పాటు అల్లుడు కూడా వచ్చాడు వాడిని పలకరించడం మర్చిపోయాడు అని నవ్వుతాడు మాధవి భర్త. నువ్వు ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నట్లు ఉన్నావు నేను ఎదురు వచ్చాను భయంగా ఉంది అంటుంది మాధవి.
రూల్స్ మాట్లాడుతున్న లాస్య..
ఏం పర్వాలేదులే మళ్ళీ నేను ఎదురు వస్తాను అంటుంది లాస్య. నువ్వా అంటాడు ప్రేమ్. ఏంటి నీ అబ్జెక్షన్ అని అడుగుతుంది లాస్య. అది కాదు లాస్య లాస్ట్ టైము నువ్వు ఎదురొచ్చినప్పుడు బావ గారు బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా అందుకే అనుమాన పడుతున్నారు వాళ్ళు అంటుంది భాగ్యం. మంచైనా చెడైనా భార్య భర్తకి అదృష్టం. భార్య భర్త కి ఎదురు రావాలి అది రూల్ అంటూ భర్తకి ఎదురొస్తుంది లాస్య.
నేను వచ్చేవరకు ఉండు ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అని చెల్లెలికి ప్రేమగా చెప్పి బయలుదేరుతాడు నందు. ఇంకా అందరం ముగ్గుల పోటీకి వెళ్దామా అంటూ వాతావరణాన్ని తేలిక చేస్తాడు పరంధామయ్య. మరోవైపు ఇంటర్వ్యూకి వచ్చిన నందిని ఓనర్ అనుకుని అక్కడ ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళందరూ సెల్యూట్ చేస్తారు. తర్వాత నన్ను కూడా ఇంటర్వ్యూ కి వచ్చాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు.
నందుని జీవితకాలం లేట్ అంటున్న పక్కవాళ్ళు..
మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చారా మేము ఓనర్ అనుకోని అనవసరంగా విష్ చేసాము మీరు ఇంటర్వ్యూకి బాగా లేట్ అనుకుంటాను అని ఒక అతను అడిగితే లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నారు కదా అంటాడు నందు. అవసరాలు వయసును బట్టి కాదు పరిస్థితులను బట్టి వస్తాయి. కుర్రాళ్ళతో ఏంటి పోటీ అని ఊరుకునే వాడిని కాదు, ఓటమి ఎదుటి వాళ్ళు ఇచ్చేది కాదు మన వల్ల చేతకాదు అనుకున్నప్పుడు వస్తుంది అంటూ అక్కడ ఉన్న అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాడు నందు.
వాళ్లు కూడా నందు కి ఆల్ ది బెస్ట్ చెప్తారు. మరోవైపు వాకిట్లో ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తూ ఉంటారు. విజిల్ వేసిన పరంధామయ్యతో సౌండ్ బాగానే వచ్చిందే అంటుంది అనసూయ. ఈ వయసులో కాబట్టి సౌండ్ వచ్చింది అదే చిన్నప్పుడైతే రీసౌండ్ కూడా వచ్చేది అంటూ భార్యని ఆట పట్టిస్తాడు పరంధామయ్య. నానమ్మ తాతయ్య నిన్ను మోసం చేస్తున్నాడు తాతయ్య ఓన్లీ యాక్షన్ చేశాడు సౌండ్ ఇచ్చింది చిన్నన్నయ్య అంటుంది దివ్య.
గొబ్బెమ్మ గురించి వివరిస్తున్న తులసి..
ముగ్గులు వేయడం సరే కానీ ముగ్గులు మీద గొబ్బెమ్మలు పెట్టడం మర్చిపోవద్దు అంటుంది తులసి. గొబ్బెమ్మలు ఎందుకు అని దివ్య అంటే గొబ్బెమ్మని కాత్యాయనిదేవుగా కొలుస్తారు అంటుంది తులసి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అంటుంది అనసూయ. దివ్యకి ముగ్గు సరిగ్గా రావట్లేదు అంటే చెల్లెల్ని ఆటపట్టిస్తాడు ప్రేమ్. ముందు నీ పెళ్ళాం సంగతి చూసుకోరా అంటూ అన్నయ్యని ఆట పట్టిస్తుంది దివ్య.
ముగ్గు వేయకుండా లేచిన భాగ్యాన్ని ఎందుకు లేచావు అని అడుగుతుంది తులసి. పది నిమిషాలు ఒక దగ్గర కూర్చుంటే ఇంక అనుకునేది ఏముంది, కాలు చేయి ఆస్తమానం ఆడుతూనే ఉండాలి అంటూ దెప్పుతుంది అనసూయ. కథ ముద్దు వేస్తున్న తులసి తో దాని ప్రత్యేకత ఏంటి అని అడుగుతుంది దివ్య. మూడు రోజులు పాటు సరదాగా సాగిన సంక్రాంతిని ఘనంగా సాగనంపేందుకు పుట్టిందే ఈ రధం ముగ్గు అంటుంది తులసి.
అందరిమి విజేతమే అంటున్న తులసి..
టైం అయిపోయింది ఇంక అందరూ లేవండి మనం జడ్జిమెంట్ ఇద్దాం అంటూ అల్లుడుని పిలుస్తాడు పరంధామయ్య. అందరినీ కష్టపడి సంప్రదాయాన్ని నిలబెట్టాము అందుకే అందరిని విజేతమే ఉంటుంది తులసి. విజేతని ప్రకటించాల్సిందే మావయ్య అంటారు అభి వాళ్ళు. ఎందుకురా పండగ పూట నా కాపురంలో నిప్పులు పోస్తారు అంటూ తన భార్యని విజేతగా ప్రకటిస్తాడు మాధవి భర్త. ఇది అన్యాయం అంటూ అతని వెనుక పరిగెడతారు మిగిలిన ఆడవాళ్ళు.
మరోవైపు ఇంటర్వ్యూలో మనం వచ్చి ఇంత సేపు అయింది కానీ మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు వెళ్లి వాళ్ళ కాలర్ పట్టుకుంటేనే కానీ ఎవరూ రెస్పాండ్ అయ్యేలాగా లేరు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు అంత ఆవేశ పడతారు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మనల్ని ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తారు అంటాడు నందు. ఈయనకి వయసుతో పాటు సాధిస్తూ కూడా పెరిగిపోయినట్లుగా ఉంది ప్రతి దానికి లెక్చర్లు ఇస్తున్నాడు అంటాడు పక్కవ్యక్తి.
మాధవి మీద అనుమానపడ్డ తులసి..
వాళ్లకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది సాల్వ్ చేసుకోవడానికి టైం ఇద్దాం అంటాడు నందు. ఇంటర్వ్యూ కి వచ్చాము మన టెన్షన్ మనకి ఉంటుంది కదా అంటాడు ఒక వ్యక్తి. ఇక్కడ కూర్చుని ఆవేశపడే బదులు మన అందరి తరపున మీరిద్దరూ వెళ్లి మాట్లాడండి అంటాడు నందు. అంతలోనే అక్కడికి వచ్చిన హెచ్ఆర్ హెడ్ ఇంటర్వ్యూ అయిపోయింది అని అంటే ఎవరిని పిలిచారని అని అడుగుతారు వాళ్ళు. ఆ సిసి కెమెరా ద్వారా గంట నుంచి మీ అందర్నీ అబ్జర్వ్ చేస్తున్నాము మాకు కావాల్సిన క్వాలిటీస్ నందగోపాల్ గార్లో కనిపించాయి అంటూ అతన్ని క్యాబిన్లో కూర్చోమంటాడు హెచ్ఆర్.
ఇంక మీరు వెళ్ళొచ్చు అంటూ మిగిలిన వాళ్ళని పంపించేస్తాడు. మరోవైపు మాధవిని ఆమె భర్తని కూర్చోబెట్టి మాట్లాడుతుంది తులసి. మీ అన్నయ్య నిన్ను అవమానించేలాగా ప్రవర్తించారు. ఆత్మ అభిమానం దెబ్బతిని బంధాన్ని తెంచుకొని మళ్ళీ మీ ఇంటి వైపు కూడా చూడలేదు నువ్వు చేసింది తప్పా, ఒప్పా అని నేను చర్చించట్లేదు. నాకు కావలసింది అల్లా మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఉండడం అందుకే ఈ సంక్రాంతి పండుగను అవకాశంగా వాడుకున్నాను. ఆశతో పిలిచాను కానీ వస్తావు రావో అని అనుమానపడ్డాను అంటుంది తులసి.
Intinti Gruhalakshmi January 27 Today Episode మాధవి చాలా బాధపడింది అంటున్న ఆమె భర్త..
నాకు అమ్మ కన్నా నీ దగ్గరే చనువు ఎక్కువ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి చేస్తావు అందుకే నువ్వు అడిగినప్పుడు ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను అంటుంది మాధవి. గొడవపడిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తాడేమో మళ్లీ ఈ ఇంటికి రమ్మని పిలుస్తాడేమో అని చాలా ఎదురు చూసింది కానీ వాళ్ళ అన్నయ్య అసలు ఆ విషయం గురించి పట్టించుకోకపోవడంతో చాలా బాధపడింది.
ఇంక ఈ ఇంటితో తెగదెంపులేనేమో అని భయపడింది. కానీ నీ ఫోన్ కాల్ రాగానే తన మైండ్ సెట్ మారిపోయింది అంటాడు మాధవి భర్త. తరువాయి భాగంలో ఎవరు తులసి గారు అంట బాగా రికమెండ్ చేశారంట అని ఆఫీసులో మాట్లాడుకోవడం వింటాడు నందు.అపాయింట్మెంట్ ఆర్డర్ ని చించేసి ఇంటికి వచ్చి తులసి మీద కేకలు వేస్తాడు.