Intinti Gruhalakshmi January 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మనిషికి ఇవ్వాల్సిందే విలువ ఇవ్వకపోతే మనం ఇద్దరం అనుకున్నప్పుడు వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. నా మాట మన్నించి వచ్చినందుకు ఇది నువ్వు నాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను అంటుంది తులసి. తగింపులు చేసుకొని వెళ్ళిపోయావు మళ్లీ ఎందుకు వచ్చావు అని అన్నయ్య నిలదీస్తాడేమో అని భయపడ్డాను నువ్వు పిలిస్తే వచ్చేవని తెలిస్తే ఇష్యూ చేస్తాడేమో అనుకున్నాను అంటుంది మాధవి.

అది వాడి దురదృష్టం అంటున్న మాధవి..

ఈ ఇంట్లో నేను తప్ప మీ అన్నయ్యకి ఎవరు శత్రువులు లేరు అంటే అది వాడి దురదృష్టం అంటుంది మాధవి. ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుంటాడు కానీ ఆ రోజుకి అతని కోసం ఎవరు మిగలకపోవచ్చు అంటాడు మాధవి భర్త. అలా ఎందుకు అనుకోవాలి అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి అనుకుంటే సరిపోతుంది అంటూ పూజకు బయలుదేరుతారు తులసి వాళ్ళు.

మరోవైపు నందు తనకి ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను చాలా లక్కీ నేను చెప్పకుండానే నా టాలెంట్ ని గుర్తించారు అంటే మార్కెట్లో మనకు ఇంకా రేంజ్ ఉన్నట్టుంది అనుకుంటాడు. ఆ పక్కనున్న వ్యక్తి టాలెంటా మనకున్న తోపా అంటాడు. అసలు ఇలాంటివన్నీ ఎలా సెలెక్ట్ చేశారు అంటాడు మరొక వ్యక్తి. స్పెషల్ గా ఇంటర్వ్యూ చేశారంట కదా అని ఒక వ్యక్తి అడిగితే అలాంటిదేమీ లేదు ఎవరో తులసి గారు ఉంటా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశారంట అంటాడు మరొక వ్యక్తి.

ఆఫీసులో నందుకు జరిగిన ఘోర అవమానం..

ఏదో ఒక రకంగా చేసి అతన్ని ఆ సీట్లో కూర్చోబెట్టడం కోసమే టాలెంట్ అని ముసుగు వేశారు ఆడదాని రికమండేషన్ తో సెలెక్ట్ అయ్యాడు అది ఒక టాలెంటేనా, మనం ఇంటర్వ్యూ కోసం కష్టపడకూడదు మనల్ని రికమండు చేసే ఒక ఆడదాని కోసం కష్టపడాలి అంటూ నందు బాధపడేలాగా మాట్లాడుతాడు. వీడు చెప్తున్నది నిజమేనా అనుకుంటాడు నందు. మరోవైపు ఆ కంపెనీ మేనేజర్ మీరు చెప్పిన పని దాదాపు పూర్తి కావచ్చింది.

అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టడం ఒకటే లేటు అంటాడు. మళ్లీ చెప్తున్నాను నేను చెప్పానని కాదు అతనికి టాలెంట్ ఉంటేనే జాబ్ ఇవ్వండి అంటుంది తులసి. క్యాండిడేట్ లో విషయం లేకుండా మీరు రెకమెండ్ చేయరని తెలుసు అయినా ఆయనలోని పెద్దమనిషి తరహా బాధ్యత మాకు నచ్చింది అందుకే జాబ్ ఇస్తున్నావ్ అని చెప్తాడు ఆ మేనేజర్. థాంక్యూ చెప్పి ఫోన్ పెట్టేసిన తులసిఅప్పటివరకు వరకు పడిన కష్టాలన్నింటినీ భోగిమంటలకి ఆహుతి ఇచ్చి సుఖ సంతోషాలని ఇమ్మని భోగి మంటలు వేసుకుంటారు.

అపాయింట్మెంట్ లెటర్ మేనేజర్ మోఖాన కొట్టిన నందు..

ఈ ఇంటికి పట్టుకున్న కష్టనష్టాలు నిన్నటి భోగిమంటల్లో కాలిపోయి ఈ రోజు నుంచి మంచి రోజులు మొదలవపోతున్నాయి అంటూ సంతోషపడుతుంది. మరోవైపు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో వాళ్లకి కొత్త నందుని పరిచయం చేద్దాము అనుకున్నాను అందరికీ పండుగ వచ్చింది నాకు మాత్రం పండగ రాలేదు అంటూ మేనేజర్ రూమ్ కి వెళ్తాడు నందు. అక్కడ మేనేజర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని చించేసి రికమెండ్ చేసిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతాడు.

దాంతో కోప్పడిన ఆ మేనేజర్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. తను ముష్టి వేస్తే నేను తీసుకుంటానని ఎలా అనుకుంది. మర్యాదగా మాట్లాడమని మేనేజర్ అంటే నిజాన్ని దాచి ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడే మీరు మీ మర్యాదని పోగొట్టుకున్నారు అంటూ అక్కడ నుంచి కోపంగా వచ్చేస్తాడు నందు. మరోవైపు పూజకి అన్ని సిద్ధం చేసి పూజ ప్రారంభిద్దామా మీ అబ్బాయి వచ్చే వరకు వెయిట్ చేద్దామా అంటుంది తులసి.

మా పూజ మేం చేసుకుంటాం అంటున్న లాస్య..

అయినా గుడ్ న్యూస్ తో తిరిగి వస్తారు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మీ పూజ మీరు ప్రారంభించండి మీ ఇద్దరం స్పెషల్గా పూజ చేసుకుంటాము అంటుంది లాస్య. చెప్పింది కదమ్మా స్పెషల్గా చేసుకుంటావని ఇంకా మనం పూజ ప్రారంభిద్దాం అంటాడు పారందమయ్య. ఈరోజు నేతి అరుసులు స్పెషల్ అని పరంధామయ్య అంటే అవి మీకు నానమ్మకి నైవేద్యం పెట్టి మేమే తినేస్తాం అంటుంది దివ్య. మరి మాకు అని పరంధామయ్య అంటే మీకు షుగర్ కదా అంటుంది.

పండగ రోజు అలాంటివి ఏమీ లేవు నాకు పెట్టకుండా తినడానికి వీల్లేదు అంటాడు పరంధామయ్య. గంగిరెద్దు విశిష్టత ఏంటి అని అడుగుతాడు ప్రేమ్. గంగిరెద్దు పెళ్లయిన మగవాడితో సమానం ఎంత దట్టంగా ఉన్నా అమ్మగారికి దండం పెట్టు అంటే మోకాళ్ళ నుంచి దండం పెట్టవలసింది అంటూ నవ్వుతాడు పరంధామయ్య. పంట ఇంటికి వచ్చేవరకు రైతుకి అండగా ఉండేది ఎద్దు. అందుకే సంక్రాంతి వాళ్ళ తానే స్వయంగా బిక్షకి వస్తుంది.

తులసిని అపార్థం చేసుకున్న నందు..

కష్టపడి ధాన్యం పండించింది నేనే అన్నా అహంకారం అసలు ఉండదు. ఎంత గొప్పగా వున్నా, అణిగి,మణిగి ఉండాలని గంగిరెద్దు చెబుతుంది అంటుంది తులసి. ఈ లోపు కోపంగా ఇంటికి వస్తాడు నందు. అదే సమయానికి అందరికీ హారతి ఇస్తుంది తులసి. నందు వచ్చాడు నందు కూడా హారతి ఇవ్వమ్మా అంటాడు పరంధామయ్య. హారతి తీసుకోండి అంటూ నందు దగ్గరికి వెళ్తుంది తులసి. హారతి పళ్లన్నీ ఎగరగొట్టేస్తాడు. నీకు బుద్ధుందా, హారతిపళ్లాన్ని ఎదరగొడతావా అంటూ తండ్రి మందలిస్తాడు.

హారతి ఈ పవిత్రమైనదే అది ఇలాంటి వాళ్ళ చేతిలో ఉండకూడదు అంటాడు నందు. తను ఏం చేసింది అంటుంది తులసి. నన్ను కీలుబొమ్మని చేసి ఆడించాలనుకుంది. మోసంతో నన్ను తొక్కేయాలి పనుకుంది అదృష్టం కొద్ది తప్పించుకున్నాను అంటాడు నందు. ఏం నందు నీకు జాబ్ రాకుండా అడ్డుపడిందా అంటుంది లాస్య. జాబు వచ్చేలా చేసి నన్ను తన బానిసలాగా మార్చుకోవాలని చూసింది అంటాడు నందు. జాబు వస్తుంటే నా టాలెంట్ చూసి ఇచ్చారేమో అనుకున్నాను కానీ ఈ మహాతల్లి రికమండేషన్ తో వచ్చిందని తర్వాత తెలిసింది అంటాడు నందు.

మాట తూలోద్దు అంటున్న పరంధామయ్య..

పౌరుషం తనకే కాదు నాకు ఉంది అందుకే ఆ ఆర్డర్ వాడి మొహన కొట్టి నిలదీద్దాం అని వచ్చాను అంటాడు నందు. అందుకు బాధపడిన నందు మీకు జాబ్ ఇవ్వమని చెప్పాను కానీ మీ టాలెంట్ చూసే ఇవ్వమని చెప్పాను ఎందుకు రిజెక్ట్ చేశారు అంటుంది తులసి. నేను నిన్ను అడిగానా ఎందుకు అన్ని విషయాలని కలగజేసుకుంటున్నావు నీ సుపిరియారిటీ చూపించుకోవడం కోసం నా ఇన్ఫినియార్టీని హైలెట్ చేద్దామనుకుంటున్నావా అంటూ కేకలు వేస్తాడు.

ఒక మంచి మనిషిని బాధ పెట్టొద్దు మాటని కంట్రోల్ చేసుకో అంటాడు పరంధామయ్య. మీ వరకు మంచి మనసేమో కానీ నా వరకు అది కుండు మనసే అంటాడు నందు. ఆ మాటకి అందరూ బాధపడతారు. వదిన గురించి ఎప్పుడు తెలుసుకుంటావు ఎప్పుడు రియలైజ్ అవుతావు అంటూ అడుగుతుంది మాధవి. రియలైజ్ అవ్వాల్సింది నేను కాదు మాధవి మీరు ఈ ఇంట్లో నా పరువు తీసింది కాక బయట కూడా నా పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది.

తులసి ని నానా మాటలు అంటున్న నందు..

ఇంట్లో ఎవరు ముందు నిన్ను చేతకాని వాడిని చేసింది అంటూ నిలదీస్తుంది మాధవి. అందరి ముందు నేను ఏదో తల్లి హింసిస్తున్నట్లుగా క్రియేట్ చేసింది. చిన్నప్పటి నుంచి ప్రేమ్ని నాకు విరోధి లాగా పెంచింది. కాస్తో,కూస్తో అభిమానం ఉండేది అలాంటిది అభి కూడా మారిపోయాడు. నా బాజీ భర్త ఉద్యోగం తెచ్చుకోలేని జాతకానివాడు వాడికి ఒక ఉద్యోగం ఇవ్వండి అంటూ బయట కూడా నా పరువు ని తీయాలని చూస్తుంది అంటాడు నందు. ఏవేవో ఊహించుకొని ఆవేశపడుతున్నారు.

మాట తూలుతున్నారు తర్వాత బాధపడతారు జాగ్రత్త అంటాడు మాధవి భర్త. తను మీ మంచి కోసమే కదా చేసింది అంటే అడిగితే చేసేది సాయం పడకుండా చేసేది స్వార్థం అంటాడు నందు. నువ్వు చేసిన పనికి మా వాడు పెట్టిన పేరు స్వార్థం. నువ్వు వాడికి అమృతాన్ని ఇచ్చినా వాడు విషయం ఇచ్చాడని ప్రచారం చేస్తాడు అది వాడి వ్యక్తిత్వం అంటూ మాట్లాడుతుంది అనసూయ. తనే నాకు విషమిచ్చి అమృతం ఇచ్చానంటూ ప్రచారం చేస్తుంది.

Intinti Gruhalakshmi January 28 Today Episode కుందేటికి కొమ్ములు వచ్చాయి అంటున్న నందు..

అయినా తనని ఉద్యోగం ఇవ్వమని ఎవరు అడిగారు నేను అంతా చేతకాని వాడినా అంటాడు. నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని చేతకాడు వాడు అనలేదు మీరే వంద సార్లు అనుకుంటూ ఆనింద నా వేస్తున్నారు. ఏ పండుగ కూడా మన ఇంట్లో ప్రశాంతంగా జరగదు. ప్రశాంతంగా జరుగుతుంది ఏమో అనుకున్నాను. పాతికేళ్ళు కాపురం చేసినప్పుడు కూడా ఇదే గొడవ, సంసారం మంట కలిసాక కూడా ఇదే గొడవ అంటూ బాధపడుతుంది తులసి.

పాతికేళ్లు ఈ సంసారాన్ని భుజాన్ని మోసాను అప్పుడు నువ్వు వంటింటి కుందేలు ఇప్పుడు కుందేలుకి కొమ్ములు వచ్చాయి అంటాడు నందు. బుద్ధి తక్కువ విషయంలో కలగజేసుకున్నాను నాదే తప్పు ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ కోపంగా నందు కి దండం పెట్టేస్తుంది తులసి.

నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో దివ్య ఢిల్లీ యూనివర్సిటీ కి ప్రయాణం అవుతుంది. నందు ఆమెకి వాచి గిఫ్ట్ గా ఇస్తాడు. నా గురించి ఎక్కువ బాధపడొద్దు అంటూ తల్లికి చెప్తుంది దివ్య.