Intinti Gruhalakshmi January 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీ కంపెనీ కాకపోతే నాతో వర్క్ చేయడానికి చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి అంటాడు బెనర్జీ. ఇలాంటి అర్హత లేని ప్రాజెక్టుని మేం చేయకపోవటమే కాదు ఇంకెవరిని కూడా చేయనీయము అంటుంది తులసి. నాకే వార్నింగ్ ఇస్తున్నావా అంటాడు బెనర్జీ. మీలాంటి వాళ్లతో అలాగే మాట్లాడాలి మీ చరిత్ర తెలుసుకొనే నేను మాట్లాడుతున్నాను అంటుంది తులసి.
బెనర్జీతో చాలెంజ్ చేసిన తులసి..
నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ నేను ప్రపోజ్ చేసిన ప్లేస్ లోనే స్కూల్ కట్టి నీకు నీ బాస్ కి ఇన్వైట్ చేస్తాను అప్పుడు ఏం చేస్తావో చూస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బెనర్జీ. మరోవైపు శృతిని చూసి షాక్ అవుతాడు ప్రేమ్. శృతిని కంగారుగా పిలుస్తాడు. శృతి ఎందుకలా అరుస్తావు కడుపుతో ఉన్న భార్యని ఎవరైనా కంగారు పెడతారా అని అడుగుతుంది.
తలంటు పోసుకున్నావు కరెక్టే కానీ తల తెలుసుకోవటానికి ఎన్ని మెట్లు ఎక్కి టెర్రస్ మీదకి ఎవరైనా వస్తారా, నేను ఉన్నప్పుడే నన్ను పట్టించుకోకుండా ఇన్ని పనులు చేస్తున్నావంటే నేను లేనప్పుడు ఇంకెన్ని చేస్తున్నావో అంటాడు ప్రేమ్. కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి నాకు తలంటు పోసుకోవడం కొత్తా,తల తుడుచుకోవడం కొత్తా, అంటుంది శృతి. కడుపులో బిడ్డని మోయడం కొత్త అంటాడు ప్రేమ్.
శృతిని కంగారు పెట్టేస్తున్న ప్రేమ్..
నేను ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాను మీరు అంతా కంగారు పడవలసిన పనిలేదు అంటుంది శృతి. నువ్వు ఇలా రెండు చేతులతోడుచుకుంటుంటే నీ కడుపు కదిలి అందులో ఉన్న బిడ్డ కూడా స్ట్రైన్ అవుతాడు అంటాడు ప్రేమ్. సరే అయితే తల తుడుచుకోనులే అంటుంది శృతి. మళ్లీ కంగారుగా అరుస్తాడు ప్రేమ్. మళ్లీ ఏమైంది అంటుంది శృతి. నువ్వు ఇలా తల తుడుచుకోకపోతే ముందు జలుబు వస్తుంది తర్వాత జ్వరం వస్తుంది ఆ తర్వాత తట్టుకోలేనంత నీరసం వస్తుంది అంటూ శృతిని భయపెట్టేస్తాడు ప్రేమ్.
ఇంకాపు అంటుంది శృతి. అయితే నీకు నచ్చినట్లుగా చేయడం ఆపు అంటూ ఆమె తల తుడుస్తాడు ప్రేమ్. నువ్వు సేవలు చేయవలసింది టైం చాలా దూరం ఉంది అంటుంది శృతి. నా మ్యూజిక్ ని పక్కన పెట్టి నిన్ను కాలు కిందన పెట్టకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు ప్రేమ్. అయితే ఐస్ క్రీమ్ తిని బ్రతుకుతామా అంటూ నవ్వుతుంది శృతి. నీకు నవ్వులాటగానే ఉంటుంది కానీ మొన్నటిలాగా అవుతుందేమో అని కంగారుగా ఉంది అందుకే నాకు ఒక బుజ్జి తల్లిని ఇచ్చినంత వరకు నేను నిన్ను చిట్టితల్లిలాగా చూసుకుంటాను అంటాడు ప్రేమ్.
తనకు తెలియకుండానే లాస్యకి ఆయుధాన్ని ఇచ్చిన అంకిత..
వాళ్ళిద్దర్నీ చూస్తున్న అంకిత శృతికి తలినయ్యే అదృష్టాన్ని ఇచ్చి దేవుడు న్యాయం చేశాడు అనుకుంటుంది. శృతి మాత్రం అంకిత ప్రెగ్నెంట్ అవ్వలేదని బాధపడుతుంది. దేన్నైనా పాజిటివ్ గా తీసుకో ఇప్పుడు తను నీకు హెల్ప్ చేస్తుంది కదా రేపు తను ప్రెగ్నెంట్ అయినప్పుడు నువ్వు హెల్ప్ చేద్దువు గానివి అంటాడు ప్రేమ్. ఇదే దేవుడు ప్లాన్ ఏమో అంటాడు ప్రేమ్. ఇది దేవుడు ప్లాన్ కాదు దేవుడు శిక్ష ఒకప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో నేను చేసిన తప్పుకి ఇలా పనిష్మెంట్ వేశాను అనుకుంటుంది అంకిత.
గమనిస్తున్న లాస్య, నీ బలహీనత ఏంటో తెలిసింది, నీకు తెలియకుండానే నాకు ఆయుధాన్ని ఇచ్చావు వాడకుండా ఊరుకుంటానా? లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ నవ్వుకుంటుంది లాస్య. మరోవైపు పొద్దున్న మీటింగ్కి రావడం లేట్ అయినందుకు కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఇంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు సామ్రాట్. నాకు అప్పచెప్పినప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా లేకపోతే చెడ్డ పేరు నాకే అంటుంది తులసి.
నేను చెప్పింది తులసికి అర్థమైందంటున్న సామ్రాట్ వాళ్ళ బాబాయ్..
ఎలా అని అడుగుతాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. జీవితంలో ఎన్నో డక్కా మొక్కీలు తిన్నాను అంటుంది తులసి. మావాడు ఎప్పుడైనా అలా ప్రవర్తించాడా? తనకి మీరంటే చాలా గౌరవం మీకు తనకంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. మా బాబాయి చెప్పేది ఏంటంటే మీ వర్క్ డెడికేషన్ ని నేను ఇష్టపడుతున్నాను అంటాడు సామ్రాట్. నేను చెప్పింది తనకి అర్థమైందిలే మళ్లీ నీ ఎక్స్ప్లనేషన్ అక్కర్లేదు అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్.
అయినా ఆ బెనర్జీతో ఎందుకు చాలెంజ్ చేశారు అంటాడు. ఎవరో ఒకరు అడ్డుపడకపోతే అతను వేరే వాళ్ళని మోసం చేస్తాడు అందుకే మనమే అడ్డుపడదాం అంటుంది తులసి. నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటాడు సామ్రాట్. హనీ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది నేను వెళ్తాను అని బయలుదేరుతాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. మరోవైపు బెనర్జీ తులసి అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతాడు. నా జాతకాన్ని అంత కరెక్ట్ గా ఎలా చెప్పింది. తను నన్ను రెచ్చగొట్టింది తనే కాకుండా ఈ ప్రాజెక్టు మరెవరి చేత చేయించను అని చాలెంజ్ చేస్తుందా? బాహుబలి అనుకుంటుందా.
కోపంతో రగిలిపోతున్న బెనర్జీ..
ఆ రాగ సుధా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకో అంటాడు బెనర్జీ. ఆల్రెడీ ఫోన్ చేశాను సార్ కానీ వాళ్లకి ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదంట అంటాడు బెనర్జీ పిఏ. డిస్కషన్ లేకుండా డెసిషన్ కి ఎలా వచ్చేస్తారు అంటాడు బెనర్జీ. సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది అంట సార్, సామ్రాట్ వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసినట్టు మార్కెట్లో తెలిసిపోయింది ఇంక మనకి పార్టీలు దొరకు అంటాడు పిఏ. కొత్త వాళ్ళని పట్టుకో ఒక ఆడదాని చేతిలో మనం ఓడిపోకూడదు బెనర్జీ.
అదే సమయంలో ఇంటికి వచ్చిన సామ్రాట్, చూసి సీఈఓ పోస్ట్ మీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని తులసి తో అంటాడు. బ్యాంకు ముందు నిలబడి సెక్యూరిటీ గార్డు ఆ డబ్బుకి కాపుల కాలుస్తాడు అందుకని ఆ డబ్బంతా సెక్యూరిటీ గార్డ్ కి ఇచ్చేస్తారా అంటుంది తులసి. మీరు చెప్పే కబుర్లు ఉండడానికి నాకు టైం లేదు ఆ ఫైల్ తెచ్చి ఇస్తే వెళ్ళిపోతాను అంటుంది తులసి. మీరు ఎదుటి వాళ్ళని చాలా తెలివిగా తిడతారు అంటాడు సామ్రాట్.
సామ్రాట్ మాటలకి నవ్వుతున్న తులసి..
నేనేం తిట్టాను అంటుంది తులసి. నన్ను అంకుల్ అని అనాలనిపించినప్పుడల్లా మిమ్మల్ని మీరు ఆంటీ అనుకుంటారు నాకు అర్థమైంది అంటాడు సామ్రాట్. ఆ మాటలకి నవ్వుతుంది తులసి. నీ నవ్వు వింటుంటే కడుపు నిండిపోతుంది అంటాడు సామ్రాట్. మీరు ఆ ఫైల్ తెచ్చిస్తే నేను ఇంటికి వెళ్లి వండుకొని తినాలి ఆకలి వేస్తుంది అంటుంది తులసి. సామ్రాట్ ఫైల్ తేవడానికి వెళ్తాడు, అప్పుడే అక్కడికి వచ్చిన హనీ ని పలకరిస్తుంది తులసి.
ఎవరు మీరు అని అడుగుతుంది హనీ. తనకి నామీద కోపం వచ్చినట్లు ఉంది అంటూ ఆమెని బుజ్జగిస్తుంది తులసి. మీరు ఈ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా అంటుంది హనీ. కొంచెం బిజీ అయిపోయి రాలేదు అంటుంది తులసి. అంటే మీ కాళీ ఉన్నప్పుడు నేను గుర్తొస్తాను అంటుంది హనీ. మీకు ముందు ఎవరి ఫ్రెండ్ అయ్యారు నేనే కదా మరి నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అంటుంది హనీ. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను సరేనా అంటుంది తులసి. సరిపోదు నన్ను బయటికి తీసుకెళ్లాలి, లేకపోతే ఆంటీ తోటి ఎప్పుడూ మాట్లాడను అంటుంది హనీ.
హనీ అడిగితే ఓకే అంటున్న తులసి..
అమ్మో అంత పెద్ద శిక్ష నాకు వద్దు సరే అయితే బయటికి వెళ్దాం అంటుంది తులసి. బిజీ అన్నారు అంటాడు సామ్రాట్. హనీ అడిగితే ఎప్పుడైనా ఓకే అంటుంది తులసి. నేను కూడా మీతో రావచ్చా అంటాడు సామ్రాట్. సరే అంటూ అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నీతో మాట్లాడే సరికి తనకి ఎనర్జీ వచ్చింది అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. తులసికి ఆ ఫైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు సామ్రాట్.
మరోవైపు శృతికి భోజనం తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్. నువ్వు ఇలా తినిపించడం చూస్తే అందరూ ఆట పట్టిస్తారు నాకు ఇవ్వు నేను తింటాను అంటుంది శృతి. నువ్వు నీ చేత్తో తింటే నీకు కడుపు నిండుతుంది ఏమో కానీ నా మనసు నిండదు అంటూ బ్రతిమిలాడి తినిపిస్తాడు ప్రేమ్. నూతికి అన్నం అంటుకుంటుంది నీకు అన్నం తినిపించడం చేతకాదు అంటుంది శృతి.
Intinti Gruhalakshmi January 3 Today Episode: ప్రేమ్ కి అన్నం తినిపించడం రాదు అంటున్న శృతి..
అన్నం తినిపించడం రాదు కానీ మూతిని శుభ్రం చేయడం వచ్చు అంటాడు ప్రేమ్. సరే చెయ్యు ఎలా చేస్తావో చూస్తాను అంటుంది శృతి.తరువాయి భాగంలో గుడిలో అవమానించబడిన అత్తమామల్ని చూసి చాలా బాధపడుతుంది తులసి. మన ఇద్దరిలో ఒకరు పోతే మిగతావారి పరిస్థితి తలుచుకుంటేనే దిగులుగా ఉంది అంటాడు పరంధామయ్య.