Intinti Gruhalakshmi January 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జరిగిందని గురించి అందరూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మొదటిగా తేరుకున్న తులసి దివ్య కాలేజీ కి వెళ్లడానికి సామాన్లన్నీ సర్దుతూ మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు మీరందరూ మూతి ముడుచుకొని కూర్చున్నారు ఆయన నన్ను అన్నారు అయితే నేను మూతి ముడుచుకోవాలి అంటుంది.

నోటి మీద వాత పెడతాను అంటున్న అనసూయ..

నువ్వు అలా చేసి ఉంటే మేము సంతోషించే వాళ్ళని అంటాడు ప్రేమ్. ఇల్లు ఏ మాత్రం సంతోషంగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా అంటుంది తులసి. వాడు చిన్నపిల్లవాడు అయి ఉంటే ఈపాటికి నాలిక మీద వాతపెట్టే దాన్ని అంటుంది అనసూయ. అప్పుడు మళ్లీ మీరే మందు రాయాల్సి వచ్చేది అంటుంది తులసి. నువ్వేం అనుకుంటున్నావో చెప్పు అంటాడు పరంధామయ్య.

ఆయన మాజీ భార్యని అయి ఉంటే వాళ్ళని వెళ్లిపోమనే దాన్ని మీ అందరి సుఖం కోరుకునే ఉంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయే దాన్ని కానీ నా బిడ్డలకి తండ్రి ప్రేమకి దూరం కాకూడదని రాజీ పడి ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. నిర్ణయాలు తీసుకోవడం ఐదు నిమిషాలు కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం ఒకసారి ఇలాగే నిర్ణయం తీసుకుని బయటికి వెళ్లాను కానీ తిరిగి రాక తప్పలేదు అంటుంది.

ప్రయాణాన్ని క్యాన్సిల్ చేయమన్న దివ్య..

నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాము, కష్టాలన్నీ ఒకేసారి మీద పడ్డ ఇంత ధైర్యంగా ఎలా ఉంటావు అంటూ కోడలు మీద జాలి పడతాడు పరంధామయ్య. ఒకసారి మీరే చెప్పారు కదా మావయ్య సిరివెన్నెల గారి పాట అంటూ పాట పాడి అందరి మూడ్ మారుస్తుంది. దివ్యని ఒక దాన్ని వదిలేసి మనం ఇక్కడ కూర్చోవడం ఏమీ బాగోలేదు, వాళ్ల నాన్న దాన్ని పలకరించకపోతే దాని ప్రయాణం మానుకుంటుంది.

మీరు వెళ్లి దివ్యని రెడీ చేయండి నేను వెళ్లి నందగోపాల్ గారిని తీసుకొని వస్తాను అంటూ బయలుదేరుతుంది. చెల్లెలి దగ్గరికి వచ్చిన ప్రేమ వాళ్ళు ఆమెని రెడీ అవ్వమని చెప్తారు. నేను ఎక్కడికి వెళ్ళను ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి అంటుంది దివ్య. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటే నా స్వార్థం కోసం నేను అమ్మని ట్రబల్ చేయలేను అంటుంది దివ్య.

చెల్లెల్ని ఓదార్చుతున్న అన్నదమ్ములు..

ఇప్పుడు నువ్వు వెళ్లకపోతే అందరికన్నా బాధపడేది అమ్మ మాత్రమే నీవల్ల అమ్మ బాధపడకుండా చూసుకో అంటాడు ప్రేమ్. చివరి నిమిషంలో మనసు మార్చుకుంటే ఆంటీ నిన్ను ఏ విషయంలోని నమ్మదు అంటూ అంకిత చెప్తుంది. ఇది నీ లైఫ్ లో దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ, ఇలాంటి వెరీ వెరీ ఆలోచనలతో నీ లైఫ్ ని ఏర్పాటు చేసుకోవద్దు అంటూ నచ్చచెప్తాడు అభి.

అయినా డాడ్ అంతా ఆవేశపడవలసిన అవసరం లేదు ఇలాంటి సమయంలో కూడా ఈగో క్లాసెస్ అవసరమా అంటాడు ప్రేమ్. లేదు ఏదో ఆవేశంలో అలా అన్నారు కానీ ఇది అంటే డాడీకి చాలా ఇష్టం కావాలంటే చూడు దివ్యని తనే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిస్తారు అంటాడు అభి. నిజమేనా అని దివ్య అంటే ఒకవేళ ఎక్కించకపోతే అప్పుడు ప్రయాణం క్యాన్సిల్ చేసుకో ఎవరిమి ఏమీ అనము అంటాడు అభి.

చీకట్లో బాణం వేసిన ప్రేమ్..

అది సరే కానీ మొత్తం కలెక్షన్ ఎంత అని అడుగుతాడు ప్రేమ్. అడిగితే నా దగ్గర దాయొద్దు నాకు తాత అంతా చెప్పాడు ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పి మొత్తం అందరి దగ్గర ఎంత కలెక్షన్ చేశావు అంటూ చెల్లెల్ని ఆటపట్టిస్తూ వాతావరణాన్ని తేలిక చేస్తాడు ప్రేమ్. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నీకు చెప్పేసాడా ఉండు తాతయ్య పని చెప్తాను అని దివ్య అంటే ఏం కాదు నేనే చీకట్లో బాణం వేసాను నువ్వే దొరికేసావు అంటూ చెల్లెల్ని హుషారు పరుస్తాడు. మరోవైపు నేను ఏం చేయాలనుకున్న మొహం మీద చేస్తాను ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని చూడను.

కానీ ఆ తులసి అలా కాదు అని ఆచితూచి మాట్లాడుతుంది. పైకి మాత్రం కన్నా బుజ్జి కంటూ మాట్లాడుతూ లోపల మాత్రం తను ఏం చేయాలో అది చేసేస్తుంది తనని ఉత్తమ ఇల్లాలు అంటావు నువ్వు అంటూ నందుతో చెప్తుంది.అసలు ఆ తులసిని తలుచుకుంటేనే అంటూ కోపంతో రగిలిపోతుంది అంతలోనే అక్కడికి వచ్చిన తులసితో ఆయన్ని కదిలించకు కోపంలో ఉన్నారు అంటుంది.

లాస్య కి మాటలతో చురకపెట్టిన తులసి..

ఇది నీ మాట మీ ఆయన మాట అంటుంది తులసి. మేము మొగుడు పెళ్ళాలం మా ఇద్దరిదీ ఒకటే మాట అంటుంది దివ్య. అయితే నిన్ను తిడితే మీ ఆయన్ని తిట్టినట్టేనా అంటూ చురక అంటిస్తోంది తులసి. అంతా పొగరు పనికిరాదు అంటుంది లాస్య. ఆయనతో పాతికేళ్ళు కాపురం చేశాను ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో నీకన్నా నాకే బాగా తెలుసు అంటుంది తులసి.

ఇప్పుడు ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా అంటుంది లాస్య. నీ చీర కుంకుని కాసేపు నోట్లో పెట్టుకో మాటలు బయటికి రాకుండా కంట్రోల్ అవుతాయి అంటూ నందు తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. నాకు ఎవరితోని మాట్లాడాలని లేదు అంటాడు నందు. నాక్కూడా మీతో మాట్లాడాలని లేదు కానీ మన గొడవలు ఎప్పుడూ ఉండేదే, గొడవలు కంచికి చేరని కధలు లాంటివి. దివ్య బయలుదేరిపోతుంది, నీకోసమే వెయిట్ చేస్తుంది నా మీద కోపంతో తనకి సెండాఫ్ ఇవ్వకుండా ఉండొద్దు తను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో నవ్వుతూ సాగనంపుదాము అంటుంది.

రియలైజైన నందు..

వెనకటికి నీలాంటిదే నోట్లో కారం కొట్టి ఫోటో తీస్తాను నవ్వుతూ ఫోజు ఇవ్వమన్నదట అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. తనని దగ్గరగా పిలిచి నువ్వు ఉత్తమ ఇల్లాలు అవుతాను అన్నావు కదా అసలు ఉత్తమ ఇల్లాలు లక్షణం ఏంటో తెలుసా ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఒక పక్షాన మాట్లాడటం మానేసి రెండు వైపులా మాట్లాడి వాళ్లకి సర్ది చెప్పాలి అది నీకు చేతనవుతుందా తులసి. ఎందుకు చేతకాదు అని లాస్య అంటే అయితే చీర కొంగు నోట్లో పెట్టుకుని మూసుకొని ఉండు అంటుంది.

రియలైజ్ అయిన నందు కూతురికి సెండాఫ్ ఇవ్వడానికి వస్తాడు. మరోవైపు దివ్య బయలుదేరుతుంటే కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావు రేపటి నుంచి నీకు దొంగతనంగా స్వీట్స్ తినిపించేవాళ్లు ఉండరని అంటూ ఏడుస్తుంది దివ్య. రేపటి నుంచి అసలు నేను స్వీట్స్ తినను అంటాడు పరంధామయ్య. ఏమంటున్నారు నువ్వే ఆయనకి స్వీట్స్ పెట్టాలి అంటూ బాధగా మాట్లాడుతుంది.

ఎమోషనల్ అవుతున్న కుటుంబ సభ్యులు..

నువ్వు కనిపించవని రాత్రి నుంచి మీ తాతయ్య బెంగ పెట్టుకున్నారు అని అంటే, దానికోసం బెంగ ఎందుకు రోజు రాత్రులు వీడియో కాల్ చేస్తాను అని బాధగా అంటుంది. తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకొని మీరంటే నాకు చాలా ఇష్టం మీ దగ్గర ఏ విషయాలు దాచాలని అనుకోలేదు. నా కూతురు సంగతి నాకు తెలుసు కానీ ఎందుకో అలాగా పిచ్చివాడిలాగా అరిచేశాను, ఈ బ్యాడ్ మీద కోపం లేదు కదా అంటాడు నందు. నాకు మీ మీద ఎప్పుడు కోపం లేదు ఇలా చేస్తున్నారు అని బాధ తప్పితే, నాకు ఒక మాట ఇవ్వండి.

అమ్మ మీద ఎప్పుడు కోప్పడకండి ఇద్దరు గొడవ పడకండి అంటుంది. నందు ఏమి మాట్లాడకపోవడంతో కనీసం ప్రయత్నిస్తాను అని అయినా చెప్పండి డాడ్ నేను ప్రశాంతంగా వెళ్తాను అంటుంది దివ్య. ఆమెకి మాట ఇచ్చి నీకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను అంటూ వాచ్ ని ఆమె చేతికి తగిలిస్తాడు నందు. అందుకు ఎంతో సంతోషపడుతుంది దివ్య. తల్లిని హత్తుకుని నువ్వు ఇచ్చిన ఈ స్వేచ్ఛని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటాను.

Intinti Gruhalakshmi January 30 Today Episodeతల్లికి ధైర్యం చెబుతున్న దివ్య..

నీ పర్మిషన్ తీసుకోకుండా నేను ఏది చేయను నువ్వు గీసిన గీత దాటను అంటూ తల్లికి మాటిస్తుంది దివ్య. ఎక్కువ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు అంటూ తల్లికి ధైర్యం చెప్తుంది. తరువాయి భాగంలో కబ్జా అయిన భూమి మళ్లీ మీ చేతికి వచ్చింది అంటూ గుడ్ న్యూస్ చెప్తుంది లాస్య. ఎంత శుభవార్త చెప్పావు అంటూ అనసూయ ఆనందపడుతుంది. కుటుంబ సభ్యులందరూ పరంధామయ్యకి కంగ్రాట్స్ చెప్తారు. ఆస్తిని నా పేరు రాసేయండి అని నందు అంటే మనవడిలో పేరుమీద మనవరాలు పేరు మీద రాస్తాను అంటాడు పరంధామయ్య.