Intinti Gruhalakshmi January 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నామీద బెంగ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండు అంటూ తల్లికి చెప్తుంది దివ్య. నీ ఒళ్ళో పడుకొనే రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో, నీ పక్కన దిండు పెట్టుకొని పడుకో అది నేనే అనుకో అంటూ తల్లిని హత్తుకుంటుంది. అన్నదమ్ములు ఇద్దరు చెల్లెల్ని హత్తుకొని ఆమెకి జాగ్రత్తలు చెప్తారు.
కన్నీటితో వీడ్కోలు పలికిన దివ్య..
నువ్వు అక్కడికి వెళ్ళేది చదువుకోవటానికి అంతేగాని అందరి గురించి ఆలోచించడానికి కాదు అంటూ చెల్లెలికి చెప్పి మీరు ఎవరు వద్దు నేను, అన్నయ్య మాత్రమే వెళ్లి చెల్లిని డ్రాప్ చేసి వస్తాము అంటూ బయలుదేరుతారు. అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరుతుంది దివ్య. మరోవైపు పడుకున్న నిద్ర పట్టదు కూతుర్ని తలుచుకొని బాధపడుతుంది. ఆమె ఫోటో చూసుకుంటూ అమ్మని ఒంటరిని చేసి వెళ్ళిపోయావు ఎలా ఉంటావో ఏంటో అనే భయం లేదు, నేను ఎలా ఉండాలో అని దిగులే నాకు.
అల్లరిగా తిరిగే నువ్వు ఇంట్లో లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయింది, ఏ పని చేసినా నువ్వే గుర్తొస్తున్నావు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావ్ బాగుండాలి అంటూ ఆ ఫోటోకి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. కానీ ఏదో శబ్దం రావటంతో కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవరో గునపంతో తవ్వడం చూసి దొంగ అయితే గోడ దూకుతాడు అంతేగాని ఇలాగా తవ్వడు, ఎవరు ఏంటో అనుకుంటూ బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ నందు కసిగా కోపంగా గార్డెన్ ని తవ్వుతూ ఉంటాడు.
పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న నందు..
ఏం చేస్తున్నారు ఆపండి అంటూ పరిగెత్తుకొని వస్తుంది. ఆవేశంగా ఆమె మాట పట్టించుకోకుండా పిచ్చివాడి లాగా తవ్వుతూ ఉంటాడు. ఆపడానికి ప్రయత్నిస్తే ఆమెని తోసేస్తాడు. కోపంతో ఒక్కసారి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పటికి శాంతించిన నందు తవ్వడం ఆపేసి లో లోపల తట్టుకోలేని కోపం అంటూ అరుస్తాడు. ఎవరిమీద అని తెలిసి అడిగితే నా మీద నాని సహాయత మీద ఏం చేయాలో తోచడం లేదు అంటాడు నందు. అందుకని మిమ్మల్ని మీరే శిక్షించుకుంటారా మీ చేతులు చూడండి ఎలా కంది పోయాయో అంటుంది.
కాస్త ఉంటే రక్తం కూడా వచ్చేది ఏం సాధిద్దామని ఈ పిచ్చితనం అంటుంది తులసి. నేను ఎవరిని సాధిస్తాను. నేనే అందరికీ చులకన అయిపోయాను ఎవరూ నన్ను కాతర చేయడం లేదు అంటాడు నందు. ఎందుకు అలా అనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరు చులకన చేశారు మీకు మీరే అలాగ భావిస్తున్నారు అలా అయితే నేను ఎందుకు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఆపుతాను, మిమ్మల్ని మీరే తప్పుగా ఊహించుకొని బాధపడటం, కుందిపోవడం ఇది ఒక జబ్బు దీనికి మందు లేదు అంటుంది.
నందుకి చివాట్లు పెట్టిన తులసి..
ఎంతోమంది అంగవైకల్యం ఉన్నవాళ్లు ధైర్యంగా వాళ్ళ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతున్నారు అని వాళ్ళు అనుకుంటే సమస్య నుంచి బయటపడగలరా? మీరు కూడా సవ్యంగా ఆలోచించండి మీ మీకు కూడా పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని నాకు సహాయం చేయలేదు అంటూ వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ ఇంట్లో కూర్చోవడం కాదు. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆరాటపడి లాభం లేదు.
మీ బాధ ఏదో మీరు పడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధపడుతున్నారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. పొద్దున్న నందు కాఫీ తాగుతుండగా తులసి అనసూయ కి కాళ్లు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పరంధామయ్య ఈ ఎదవ పందికొక్కుల తోటి చచ్చిపోతున్నాం, మాయదారి పందికొక్కు ఎక్కడ నుంచి వచ్చిందో గార్డెన్లో పెద్ద గొయ్యి తీసి చచ్చింది ఎవడు పుడుస్తాడు అనుకుందో అంటాడు కోపంగా.
గుడ్ న్యూస్ చెప్పిన లాస్య..
అందుకు నవ్వుతూ నందు వైపు చూస్తుంది తులసి. బయటికి వెళ్ళినప్పుడు పందికొక్కులు కి పెట్టడానికి మందు తీసుకురా అంటూ నందుకు చెప్తాడు పరంధామయ్య. అప్పటికే మొఖం చిన్న బుచ్చుకున్న నందు ఒక్కసారికే ఎందుకు నన్ను మళ్లీ తవ్వితే అప్పుడు చూద్దాంలే అంటాడు. మళ్లీ తవ్వుతుందంటారా చెప్పిన వినదా అంటుంది తులసి. పందికొక్కుల కోపం నీకు తెలీదు పూనకం వచ్చినట్లుగా తవ్వేస్తాయి అంటుంది అనసూయ. ఒకసారి అలవాటు పడితే అంత బేగా వదలవు అంటాడు పరంధామయ్య.
ఇంక ఈ పందికొక్కుల గోల ఆపేద్దామా అంటూ చికాకు గా అంటాడు నందు. అంతలో కొరియర్ రావటంతో తీసుకుంటుంది తులసి. ఎక్కడో కోర్టు నుంచి వచ్చినట్లుంది మామయ్య అని తులసి అనే లాగా ఆమె దగ్గర నుంచి లాక్కొని ఇంటికోడల్ని నేను ఉన్నాను కదా నేను చూస్తాను అంటూ చదువుతుంది. మీరు అప్పుడెప్పుడో టౌన్ లో స్థలం కొన్నారు కదా, ఆ స్థలం తాలూకా కేసు కోర్టులో ఉంది కదా అది ఇప్పుడు మీకు ఫేవర్ గా జడ్జిమెంట్ వచ్చింది అని చెప్తుంది లాస్య. అందరూ హ్యాపీగా ఫీలవుతారు అందరూ పరంధామయ్యకి కంగ్రాట్స్ చెప్తారు.
రిస్క్ చేయలేను అంటున్న నందు..
మనకి మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాయి అంటుంది తులసి. నాకు చాలా సంతోషంగా ఉండమ్మ ఈ వయసులో కూడా కుటుంబానికి ఆ మాత్రం ఉపయోగపడుతున్నందుకు అంటాడు నందు. శృతి మంచి పార్టీ అడిగితే ఆఫ్ట్రాల్ పార్టీ ఏంటి బయటికి అందర్నీ బయటికి తీసుకెళ్తాడు తాతయ్య మేం రెడీ అంటూ నవ్వుతాడు ప్రేమ్. మరోవైపు ఈ వయసులో కూడా ముసలాయనకి కాలం బాగానే కలిసి వస్తుంది ధనలక్ష్మి అవసరమైన వాళ్ళకి కాకుండా కాళ్లు చాపుకునే వాళ్ళకి బాగానే కటాక్షిస్తుంది అంటుంది లాస్య.
నాకు ఇస్తారు లేదో అంటూ బొమ్మ, బొరుసు వేస్తుంది. కానీ అది కింద పడకుండా నందు పట్టుకుంటాడు. ఏమైంది అని అడిగితే బొరుసు పడుతుందేమో అని టెన్షన్ అంటాడు నందు. బొమ్మ పడుతుందేమో కదా అని లాస్య అంటే నేను రిస్క్ చేయలేను అంటాడు నందు. నేను మాత్రం టెన్షన్ తో చచ్చిపోతున్నాను అయినా వెళ్లి నువ్వే అడగొచ్చు కదా అంటుంది లాస్య. ఆయన అంతట ఆయనే పిలిచి చెప్తారేమో అని చూస్తున్నాను అంటాడు నందు. మీ వాళ్ళకి మీ మీద అంత ప్రేమ కారిపోతుంటే మొన్న ఇంటినే నీ పేరు మీద రాసి ఇచ్చేవారు.
నందుని ముష్టి అడుక్కోమంటున్న లాస్య..
అడగందే అమ్మయినా అన్నం పెట్టదు సిగ్గు ఎగ్గు లాంటివి ఏమైనా మిగిలి ఉంటే అవి అన్ని తుడిచేసుకుని, మీకు వచ్చిన ప్రాపర్టీ నాకు ముష్టి వేయండి అంటూ అడుక్కో, అవసరమైతే కాళ్లు పట్టుకో ఏదో ఒకటి చేసి ఆస్తిని నీ పేరు మీద రాయించుకో అంటూ నందుని బలవంత పెడుతుంది లాస్య. మరోవైపు పరంధామయ్య దగ్గరికి వచ్చిన తులసి ఎందుకు మామయ్య పిలిచారు అని అడుగుతుంది. కష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు సమస్య వచ్చినప్పుడు నీ వైపు చూడటం నాకు అలవాటే అంటాడు పరంధామయ్య.
ఇప్పుడు అంత పెద్ద సమస్య ఏం వచ్చింది అని అడిగితే అదృష్టం కొద్ది ఆస్తి కలిసి వచ్చింది దాన్ని ఏం చేస్తే బాగుంటుందో చెప్పు అంటాడు. అత్తయ్య ని అడగవలసింది కదా మామయ్య అంటుంది తులసి. తను కూడా నిన్నే సలహా అడగమని చెప్పింది. నేను కూడా నిర్ణయం తీసుకునే వాడినే కానీ నాకే తెలియకుండా ఏదో ఒక మూలన పక్షపాతం ఏర్పడుతుందేమో అని భయం నీలాగా నిష్పక్షపాతంగా నేను ఆలోచించలేను అంటాడు. ప్రస్తుతానికి ఉంటేనే మంచిది ఎందుకంటే దాని అవసరం మీకు ఉండొచ్చు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi January 31 Today Episodeసమస్యకి పరిష్కారం చెప్పమంటున్న పరంధామయ్య..
అలా చేస్తే నేను ప్రశాంతంగా ఉండలేను సమస్యని పక్కన పెట్టుకొని పడుకున్నట్లుగా ఉంటుంది. ఇంక నా దగ్గర ఎంత సమయం ఉందో తెలియదుఅంటాడు పరంధామయ్య. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా అసలు పెట్టుకునే వాళ్ళకి నిరాశని కలిగించవచ్చు అంటుంది తులసి.
తరువాయి భాగంలో ఆస్తిని నా పేరు మీద రాయండి అంటూ తండ్రిని అడుగుతాడు నందు. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ ఆస్తిని మనవరాలు మనవల్ల పేరుమీద రాయమని చెప్పింది మంచి సలహానే కదా అంటాడు పరంధామయ్య.