Intinti Gruhalakshmi January 4 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో క్లోజ్ గా ఉన్నా ప్రేమ్, శ్రుతిలని చూసి అభి వాళ్ళు వాళ్ళని ఆట పట్టిస్తారు. ఇలా కూడా మూతి తుడవచ్చని నాకు తెలీదు అంటుంది అంకిత. ఈ తొమ్మిది నెలలు మా అన్నయ్య నీకు ఇలాగే సేవ చేస్తుంటాడు వదిన అంటూ శృతిని ఆట పట్టిస్తుంది దివ్య.
హ్యాపీ మూమెంట్ ని స్పాయిల్ చేసిన లాస్య..
వాళ్ళందరూ అలా నవ్వుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన లాస్య, ఈ ఇంట్లో నేను కోరుకునేది ఇదే ఇంట్లో పండగ వాతావరణం ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయంట అంటుంది లాస్య. సంతోషమే అంటుంది అంకిత. కానీ నువ్వు కూడా అమ్మని అవుతున్నానని చెప్పినప్పుడు నేను సంతోషిస్తాను అంటుంది లాస్య. నువ్వు పెద్ద కోడలివి నీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని చాలా బాధగా ఉంది అంటుంది లాస్య.
కానీ నేనేమీ బాధపడడం లేదే అంటుంది అంకిత. కచ్చితంగా ఉండే ఉంటుంది కాకపోతే బయటపడడం లేదు అంతే అంటుంది లాస్య. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అని కోప్పడతాడు అభి. కచ్చితంగా అవసరమే అభి ఒకరు సంతోషంగా ఉండేటప్పుడు ఇంకొకరు బాధపడితే చూస్తూ ఉండలేము కదా అంటుంది. ఎందుకంత నెగిటివ్ థింకింగ్ అంటుంది అంకిత. నెగిటివ్ థింకింగ్ నీది, మీ మధ్య ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చాను అంటుంది లాస్య.
అంకితని ఏడిపించిన లాస్య..
మా మధ్య ప్రాబ్లం ఉందని నీకు ఎవరు చెప్పారు అంటుంది అంకిత. నువ్వు ఇంకా కన్సీ కావటం లోనే అర్థమవుతుంది మీ టర్మ్స్ బాగోలేదని, మీ మధ్య ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి ఈ ఇంటి కోడలుగా మీ సమస్యని నేను పరిష్కరిస్తాను అంటుంది లాస్య. నీకు ప్రాబ్లం క్రియేట్ చేయడమే వచ్చాను క్లియర్ చేయడం కూడా వచ్చా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దివ్య.
ఎవరి అదృష్టం వాళ్ళది నీకు లాగా పక్క వాళ్ళ అదృష్టం చూసి కుళ్ళుకోను, నువ్వు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టొద్దు అంటుంది అంకిత. నిన్ను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను కదా అంటాడు ప్రేమ్. మీ ఆవిడ కడుపు పండింది నీకు టెన్షన్ లేదు కానీ కడుపు మండే వాళ్ళ పరిస్థితి కూడా చూసుకోవాలి కదా అంటుంది లాస్య. లాస్య మాటలకి అక్కడినుంచి కోపంతో అందరూ వెళ్ళిపోతారు. మీరు నన్ను వదిలిపెట్టిన నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది లాస్య.
భర్తని లెంపలు వేసుకోమన్న అనసూయ..
మరోవైపు గుడికి వచ్చిన పరంధామయ్యని ఎప్పుడు గుడికి వెళ్దాం అన్నా పీఠం కదలదు,ఈరోజు ఏంటి మీ అంతట మీరే గుడికి వెళ్దాం అన్నారు, భక్తి పెరిగిందా అంటుంది అనసూయ. కాదు దేవుడితో అవసరం పెరిగింది అంటాడు పరంధామయ్య. చాలా కాలానికి మంచి బుద్ధి పుట్టింది అంటుంది అనసూయ. ఈ గుడిలో ప్రసాదం కూడా చాలా బాగుంటుంది అంట నెట్లో రేటింగులు చూశాను అంటాడు పరంధామయ్య. ప్రసాదాలకి కూడా రేటింగులు ఉంటాయా జనాలకి పిచ్చి ముదిరిపోతుంది అంటుంది అనసూయ.
ఆరేటింగులు చూసే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు పరంధామయ్య. ఏంటి మీరు వచ్చింది ప్రసాదం కోసమా, అలా మాట్లాడకూడదు లెంపలు వేసుకోండి అంటుంది అనసూయ. నేను వేసుకోకపోతే నువ్వే లెంపలు వాయించే లాగా ఉన్నావు అంటాడు పరంధామయ్య. అదే సమయానికి తులసి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. తరచుగా ఇక్కడికి వస్తారా అని అడుగుతాడు కార్తీక్.
అదే గుడికి వచ్చిన తులసి సామ్రాట్ లు..
ఇక్కడికి వస్తే ప్రశాంతంగా వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది అంటుంది తులసి. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఒక ఐస్ క్రీమ్ తినిపించావ్ గుర్తుందా, ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ నాకు ఐస్క్రీం తినిపించు అంటుంది హనీ. ఆంటీ కి చాలా పనులు ఉంటాయి ఎప్పుడు మీతోనే తిరగాలంటే కుదరదు కదా అంటాడు సామ్రాట్. ఆ మాట ఆంటీ చెప్పాలి అంటుంది హనీ. గుడిలోకి వచ్చి దండం పెట్టుకున్న సామ్రాట్ వాళ్ళు గంట కొడతారు. హనీ కి అందకపోతే ఇద్దరు కలిపి హనీ ని ఎత్తుకొని గంట కొట్టిస్తారు.
పూజారి గారు పాప చాలా బాగుంది, నీ భార్యాభర్తలు ఇద్దరూ పాప విషయంలో సమానంగా బాధ్యతలు పంచుకోవాలని ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అంటారు. మీ ఇద్దరినీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నారు అంటుంది హనీ. మీరు పొరపాటు పడ్డారు మేమిద్దరం భార్యాభర్తలం కాదు అంటుంది తులసి. తెలియక అనేసాను క్షమించండి అంటూ సామ్రాట్ మీకేం అవుతారు అని అడుగుతాడు పూజారి. ఫ్రెండ్ అంటుంది తులసి.
అంకితను ఓదారుస్తున్న ప్రేమ్ దంపతులు..
తులసి హనీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే సామ్రాట్ వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు లాస్య అన్న మాటలు కి ఏడుస్తుంది అంకిత. అక్కడికి వచ్చిన శృతి, ప్రేమ్, అంకితని ఓదారుస్తారు. ఆవిడ సంగతి తెలిసిందే కదా నలుగురు సంతోషంగా నవ్వుతూ కూర్చుంటే తట్టుకోలేరు. నువ్వు ఏడుస్తుంటే ఆవిడ కడుపు నిండుతుంది అంటాడు ప్రేమ్. నేను శృతి ఇద్దరం ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిపోయాం, సంతోషమైన బాధైనా కలిసి షేర్ చేసుకున్నాం.
ఇప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అందరికన్నా ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ లాస్య ఆంటీ నా గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది. నువ్వే చెప్పు శ్రుతి నీ విషయంలో ఎప్పుడైనా ఈర్షద్వేషాలు కనిపించాయా? అంటూ బాధపడుతుంది. ఆవిడ మాటలు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావ్ అంటుంది శృతి. నా ఆలోచనలని అక్కడే ఆగిపోయాయి ఏం చేయాలో తోచట్లేదు అంటుంది అంకిత. లాస్య ఆంటీ మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంది, ఆలోచన తీసి పక్కన పెట్టు అంటుంది దివ్య.
ఏడుస్తున్నావా అంకిత అంటుంది శృతి. దేవుడు నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు అమ్మ విలువ తెలియక అబార్షన్ చేయించుకున్నాను, ఇప్పటికీ దానికి నాకు గిల్టీగా అనిపిస్తుంది అంకిత. అయిపోయిందాని గురించి బాధపడొద్దు అంటాడు ప్రేమ్. పొట్టబోయేది నాకు మాత్రమే బిడ్డ కాదు అంకిత మన బిడ్డ మనం గుడిలో అలాగే కదా అనుకున్నాం. బిడ్డ బాధ్యతల్ని ఇద్దరం చెరో సగం చేద్దాం అంటుంది శృతి. ఆ మాటలకి ఆనందంగా శృతిని హత్తుకుంటుంది అంకిత.
భర్త మాటలకి ఖంగుతిన్న అనసూయ..
సీన్ కట్ చేస్తే వెళ్లి ప్రసాదం తెచ్చుకుందాం కదా అంటాడు పరంధామయ్య. క్యూలో నిలబడి కాళ్లు పీకుతున్నాయి ఇప్పుడు ప్రసాదం దగ్గర క్యూ కట్టలేను అంటుంది అనసూయ. గుడికి వచ్చి ప్రసాదం తీసుకోకపోతే పాపం అంట అంటాడు పరంధామయ్య. ప్రసాదం కోసం అంత ఆరాటం ఎందుకు అంటుంది అనసూయ. నీకు తెలియనిది ఏముంది అనసూయ ప్రసాదం తింటే కాస్తయినా కడుపు నిండుతుంది కదా, ఇంటిదగ్గర ఇది కావాలి అని అడిగే పరిస్థితి లేదు.
దానికన్నా రోజు ఇక్కడికి వచ్చి కాస్త ప్రసాదం తింటే పుణ్యం, పురుషార్ధము, నీకు తప్పనిపిస్తే చెప్పు వెళ్ళిపోదాం అంటాడు పరంధామయ్య. వెళ్లి ప్రసాదం తీసుకురండి దాంతోనే మనం కడుపు నింపుకుందాం అంటుంది అనసూయ. ఒక కప్పు ప్రసాదం ఇస్తే మరొక కప్పు ప్రసాదం అడుగుతాడు పరందమయ్య. ఇది ప్రసాదం అనుకున్నావా అన్నదానం అనుకున్నావా? ఇంకా చాలామంది ఉన్నారు చూస్తే బేసన్ మొత్తం అడిగే లాగా ఉన్నావు అంటాడు అతను.
Intinti Gruhalakshmi January 4 Today Episode: పరంధామయ్యకి జరిగిన ఘోర అవమానం..
నాకోసం కాదు మా ఆవిడ కోసం తనకి కాళ్ల నొప్పులు అందుకే రాలేదు అంటాడు పరంధామయ్య. చాల్లేవయ్యా చెప్పిన అబద్ధాలు సిగ్గుండాలి అంటాడు ప్రసాదం ఇచ్చే వ్యక్తి. అంతలోనే అక్కడికి వచ్చిన అనసూయ ఆయన ప్రసాద్ అడిగింది నాకోసమే ఇస్తే ఇవ్వు లేకపోతే మాని అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడకు అంటుంది. ఆ మాటలన్నీ అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ వాళ్ళు వింటారు.
తరువాయి భాగంలో సరుకులతో ఇంటికి వచ్చిన తులసిని ఇవన్నీ నిన్ను ఎవరు తెమ్మన్నారు అని అడుగుతారు నందు దంపతులు. ఇంట్లో పెద్దవాళ్ళు ఆకలితో మాడిపోకూడదు అందుకే తెచ్చాను అంటుంది తులసి. అప్పుడు లాస్య బాగోతం అంతా బయట పెడతారు కుటుంబ సభ్యులు