Intinti Gruhalakshmi January 6 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య బాగోతం అంతా నందుకు చెప్తారు కోడళ్ళు ఇద్దరు. సొంత ఇంట్లోనే జైల్లో బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నాం అంటుంది దివ్య. చివరికి తాతయ్య గారికి షుగర్ డౌన్ అయినప్పుడు కూడా రాక్స్ కి ఇవ్వలేదు అంటుంది అంకిత.
లాస్య గుట్టు బయటపెట్టిన తోటికోడళ్ళు..
అంతకంటే విషాదం ఏంటంటే చెప్పటానికి నాకే సంస్కారం అడ్డు వస్తుంది ఇక చాలు అంటుంది తులసి. లాస్య ని కోపంగా చూస్తాడు నందు. తప్పు మీ వైపు పెట్టుకొని తనని ఎందుకు కోపంగా చూడడం అంటుంది తులసి. తప్పు నాదా అని నందు అంటే మీది కాకపోతే మరి ఎవరిది నా వాళ్ళందరూ నాతో ఉండాలని అనుకున్నారు కరెక్టే కానీ వాళ్ళ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా, అంటుంది తులసి.
ఎవరి నుంచి ఎలాంటి కంప్లైంటు లేకపోతే అందరూ బాగున్నారని అనుకున్నాను అంటాడు నందు. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని తాతయ్య మా నోరు నొక్కేసాడు అంటాడు ప్రేమ్. అది ఇంట్లో వాళ్ళందరికీ మీరంటే ఉన్న అభిమానం కానీ అది మీకు కనిపించకుండా ఏదో పొర అడ్డుపడుతుంది. ఆపరా ఎప్పుడు తొలగిపోతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
అవమానంతో తలదించుకున్న నందు..
ఈ కష్టాల గురించి నాకు ఎవరు చెప్పలేదు కానీ నేనే తెలుసుకున్నాను. నా వాళ్ళు ఎవరు ఆకలితో బాధపడడానికి వీల్లేదు అంటుంది తులసి. వీటిని కూడా తీసుకెళ్లి రాక్స్ లో దాస్తావేమో అలాంటిది కుదరదు అంటుంది తులసి. నువ్వు అనవసరంగా నన్ను విలన్ గా క్రియేట్ చేస్తున్నావ్ అంటుంది లాస్య. నాకు అంతా అవసరం లేదు ఓపిక లేదు అంటుంది తులసి. మీరు మీ బాధ్యతల్లో విఫలం అవుతున్నంతవరకు నేను నా వాళ్ళకి ఇలా సరుకులు తెస్తూనే ఉంటాను.
మీ చేతకానితనాన్ని గుర్తు చేస్తూనే ఉంటాను పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు నేను మీ జోలికి రాను అంటుంది తులసి. అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు.నందుని ఫాలో అవుతూ లాస్య కూడా వెళ్ళిపోతుంది. ఇది నీకోసమే ఈ మామిడి కాయలు అంటూ శృతికి ఇస్తుంది తులసి. మా ఆయనకంట మీరే బెటర్ అని నవ్వుతుంది శృతి. పైకి వెళ్లిన నందుని లాస్య పిలిస్తే ఆమె మీద కోప్పడిపోతాడు నందు.
లాస్య మీద నిప్పులు కక్కుతున్న నందు..
కాసేపు నా కళ్ళ ముందు కనబడకు ఇంట్లో వాళ్ళందరూ ముందు నా పరువు ని తీసేసావ్, నన్ను ఒక చేతకాని వాడిని చేసి వాళ్ళముందు నిలబెట్టావ్. వాళ్లందరూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే బ్రతిమిలాడి రప్పించుకోటానికి నానా తంటాలు పడ్డాను ఆఖరికి తులసి ముందు కూడా చేతులు కట్టుకొని నిలబడ్డాను నా వాళ్ళని బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చాను కానీ నా వెనకాతల నువ్వు ఇలా గోతులు తీస్తావ్ అనుకోలేదు అంటాడు నందు.
గోతులు తీయటం ఏంటి నందు, కావాలని తులసి అందరిని రెచ్చగొడుతుంది అని లాస్య అంటే కావాలని టాపిక్ ని డైరెక్ట్ చేయొద్దు తన సంగతి ఎందుకు మీ సంగతి చెప్పు నువ్వు రాక్స్ కి లాక్ వేసేవా లేదా అని నిలదీస్తాడు నందు. మా నాన్నగారి వాళ్ళకి తిండి విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు, వారం రోజులు నిన్ను గదిలో పడేసి వదిలేస్తాను అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అంటాడు నందు. ఎందుకలా చేసాను చెప్పుకునే అవకాశం ఇవ్వు అంటుంది లాస్య. ఇంతకుముందు అన్ని చెప్పే చేసావా నువ్వు మారేవేమో అని బ్రమపడ్డాను.
గిల్టీ గా ఫీల్ అవుతున్న నందు..
నా ఇంట్లో నా వాళ్ళకి తులసి సరుకులు తెచ్చి ఇస్తుంది అంతకంటే అవమానం ఉంటుందా అంటూ బాధపడతాడు. ఇంట్లో వాళ్ళందరూ ముందు నేను ఎలా తలెత్తుకోవాలి అంటాడు నందు. మన ఇద్దరికీ సంపాదనలేదు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం పిల్లలకు చెప్తే అర్థం కాదు అందుకే ఇలా చేశాను అంటుంది లాస్య. వాళ్ళు ఏదో అన్నారని నేను బాధపడట్లేదు కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటుంది లాస్య. మనం అప్పులపాలు కాకూడదని ఇలా చేశాను, మన ఫ్యామిలీ మీద బాధ్యతతోనే ఇలా చేశాను నా మీద నమ్మకం లేకపోతే నువ్వు అన్నట్టు నన్ను గదిలో పెట్టి బంధించెయ్ అంటూ ఏడుస్తుంది లాస్య.
మరోవైపు అత్తమామల్ని కూర్చోపెట్టి మందలిస్తుంది తులసి. మీ అబ్బాయికి తోడుగా ఉండమని చెప్పాను కానీ బాధల్ని భరించమని చెప్పలేదు. ఇక్కడ మీరు ఇలా కష్టపడుతున్నట్టు మీరు చెప్పక చెప్పే వాళ్ళ నోర్లు నొక్కిస్తే ఎలా మావయ్య అంటుంది తులసి. ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చే వయసు కాదు మాది, మా మీద కంప్లైంటు రాకుండా జాగ్రత్త పడవలసిన వయసు అందుకే తలించుకొని బ్రతకడం కన్నా ఉత్తమం లేదు అంటాడు పరంధామయ్య. మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే మీ అబ్బాయికి చెప్పాలి కదా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటుంది తులసి.
అసలు విషయాన్ని చెప్పి తులసికి షాక్ ఇచ్చిన సామ్రాట్..
ఉద్యోగం లేక వాడే నానా కష్టాలు పడుతున్నాడు, మా కష్టాలు కూడా చెప్పి ఇంకేం బాధపెడతాం, అలా చెప్పి వాడి కాపురంలో నిప్పులు పోయలేం అంటాడు పరంధామయ్య. మరి గుడిలో ప్రసాదాలు తింటూ బ్రతికేద్దాం అనుకున్నారా అంటూ జాలిగా అడుగుతుంది తులసి. మిమ్మల్ని అలా చూసి ఎంత బాధ పడ్డానో తెలుసా, నా గుండె తరుక్కుపోయింది ఇంకొకసారి అలా జరిగితే నా మీద ఒట్టు అంటూ ఏడుస్తుంది. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ కూతురు ఉంది మావయ్య అంటూ దైర్యం చెప్తుంది తులసి.
సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన తులసికి సామ్రాట్ ఫోన్ చేస్తాడు. నేనే మీకు చేద్దామనుకుంటున్నాను అంటుంది తులసి. ఎందుకు అని సామ్రాట్ అడిగితే మనసు గజిబిజిగా అయినప్పుడు కాసేపు మీతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది తులసి. నేను మీ గజిబిజిని మరింత పెంచడానికి ఫోన్ చేశాను అంటాడు సామ్రాట్. ఏం జరిగింది అని తులసి అడిగితే మనం వద్దనుకున్న ప్రాజెక్ట్ ని నందు, లాస్యలు టేకప్ చేస్తున్నారంట అని చెప్తాడు.
మీ వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు అంటున్న సామ్రాట్..
వాళ్లకి ఏం అనుభవం ఉందని ఈ ప్రాజెక్టు తీసుకుంటారు అని తులసి అంటే ఎలాగో ఒకలాగా డబ్బులు సంపాదించాలి అందుకే తప్పటడుగులు వేస్తున్నారు అంటాడు సామ్రాట్. వాళ్ల ఆశ వాళ్ళనే కాదు కుటుంబం మొత్తం రోడ్డున పడేలాగా చేస్తుంది. బెనర్జీ గురించి లాస్య వాళ్ళకి చెప్పి ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్తాను అంటుంది తులసి. మీరు చెప్తే వింటారా అని సామ్రాట్ అడిగితే అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేను కదా అంటుంది తులసి.
బెనర్జీ ని మీరు చాలెంజ్ చేసినందుకు అతను మీ ఫ్యామిలీని టార్గెట్ చేశాడాంటారా? అని సామ్రాట్ అంటే అతని మనసులో ఏముందో నాకు అనవసరం కానీ నా కుటుంబాన్ని మాత్రం కాపాడుకొని తీరుతాను ఈ విషయాన్ని వెంటనే నందగోపాలల్ వాళ్ళతోటి మాట్లాడతాను అనుకుంటూ బయలుదేరుతుంది తులసి. సీన్ కట్ చేస్తే మూడిగా ఉన్న నందు ని చూసి బెనర్జీ ప్రాజెక్టు గురించి మాట్లాడదామంటే మూడ్ ఆఫ్ లో ఉన్నాడు నా జీవితమంతా వీడిని సతాయించేసరికే అయిపోతుంది అంటూ నందు దగ్గరికి వస్తుంది లాస్య.
ప్రాజెక్ట్ విషయం నందు చెప్పిన లాస్య..
కానీ ఆమెను చూసి వెళ్ళిపోబోతాడు నందు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యులు వస్తూనే ఉంటాయి, అవి ఒక రాత్రిలోనే సెటిలైపోవాలి ఇలా లాక్కోకూడదు అంటుంది లాస్య. నాకు మూడ్ లేదు అని నందు అంటే మన లైఫ్ కి సంబంధించిన విషయం కూర్చో అంటూ బ్రతిమిలాడుతుంది.కూర్చున్న నందుతో బెనర్జీ ప్రాజెక్టు గురించి చెప్తుంది తులసి. అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మనది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు నందు.
తులసి మ్యూజిక్ స్కూల్ కూడా మనమే కన్స్ట్రక్షన్ చేయించాం కదా అప్పుడు కూడా మన ఫీల్డ్ సాఫ్ట్వేర్ అంటుంది లాస్య. అప్పుడు మన టార్గెట్ వేరు అంటాడు నందు. అప్పుడైనా ఇప్పుడైనా మన టార్గెట్ డబ్బులు సంపాదించడం. కంపెనీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని మన వెనకే ఉంటాను అన్నాడు అంటుంది లాస్య. పెట్టుబడి కూడా తనే పెడతాడు అంటే అది తను ఎందుకు పెడతాడు నా ఫ్రెండ్ పెడతానంది.
Intinti Gruhalakshmi January 6 Today Episode: సందేహ పడుతున్న నందు..
సంపాదనలేక మనం ఇంట్లో చులకన అయిపోయాం అంటూ నందుకి నచ్చచెప్తుంది లాస్య. నాన్నతో చెబుదాం అంటే వాళ్ళు భయాన్ని అంటగడతారు అంటుంది లాస్య. తులసి తో కూడా చెప్పొద్దు అని లాస్య అంటుండగానే తులసి అక్కడికి వస్తుంది. రాత్రి కదా కనిపించవు అంతలోనే బెంగ పెట్టుకున్నావా అంటూ చులకనగా మాట్లాడుతుంది లాస్య. అవును నిజంగానే బెంగ పెట్టుకున్నాను, అంటూ బెనర్జీ విషయం చెప్తుంది తులసి. తరువాయి భాగంలో శత్రువులు ఎప్పుడు కొంపముంచే సలహాలే ఇస్తారు అంటుంది లాస్య. బెనర్జీతో చేతులు కలపటం తప్పుడు నిర్ణయం అని తులసి చెప్తే అసలు నీతో పెళ్లే ఒక తప్పుడు నిర్ణయం అంటాడు నందు.