Intinti Gruhalakshmi January 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీ మీద బెంగ పెట్టుకున్నాను అని తులసి అంటే జోక్ బావుంది కానీ నీ హిప్నటిజం నా దగ్గర కాదు అంటుంది లాస్య. ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నావు డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. బెనర్జీ ప్రపోజల్ గురించే కదా మీరు మాట్లాడుకునేది అంటుంది తులసి. చూసావా మనల్ని ఎంతలా ఫాలో అవుతుందో, బలి చక్రవర్తి లాగా మన నెత్తి మీద కాలు పెట్టి తొక్కడమే తన టార్గెట్.
నందు మాటలకి షాకైయిన తులసి..
ఎక్కడ సామ్రాట్ కి కాంపిటేటర్ గా అవుతారేమో అని తన భయం అంటుంది లాస్య. లాస్య దూకుడుగా నిర్ణయం తీసుకుంటుంది మీరైనా ఆలోచించండి నిజంగానే బెనర్జీ మోసగాడు సామ్రాట్ గారు రిజెక్ట్ చేస్తేనే మీ దగ్గరికి వచ్చాడు అంటుంది తులసి. థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు సలహా ఇస్తేనే విలువ ఉంటుంది లేకపోతే సలహా ఇచ్చిన మనిషికి విలువ పోతుంది అంటాడు నందు.
బెనర్జీతో చేయి కలపడం తప్పుడు నిర్ణయం అవుతుంది అని తులసి అంటే నీతో పెళ్లి నేను తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం. నా పిల్లల దృష్టిలో నన్ను చేతగాని వాడిలాగా నిలబెట్టడానికి చాలా కష్టపడుతున్నావ్, కానీ అలా జరగనివ్వను నువ్వు తియ్యగా నవ్వుతూనే విషం చిమ్ముతున్నావు. నిన్ను ఇంక నమ్మేది లేదు, నువ్వు వచ్చిన పని అయింది ఇంక వెళ్ళు అంటాడు నందు. బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
కళ్ళు తిరిగి పడిపోయిన తులసి..
ఇంటికి వచ్చిన తులసి నందు అన్న మాటలు తలుచుకుని బాధపడుతుంది. ఎందుకు ఆయన ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, మళ్లీ నా మీద ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, లాస్య చాలా తెలివిగా ప్రవర్తించి నందు గారిని తన గుప్పెట్లో పెట్టుకుంది. నా కుటుంబం ప్రమాదంలో పడింది వాళ్ళని ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు, నేను ఏమాత్రం ఆవేశపడినా కుటుంబం మొక్కలైపోతుంది అంటూ భయపడుతుంది తులసి.
టెన్షన్ పడుతున్న తులసి మంచినీళ్లు కూడా తాగలేక పోతుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మరోవైపు ప్రేమ్ దంపతులు, అభి దంపతులు క్యారమ్స్ ఆడుతుంటారు. ఆటే కదా అని స్వేచ్ఛ చేస్తే వీళ్ళు పెళ్ళాలతోనే ఆట్లాడుకుంటున్నారు అంటుంది శృతి. అసలు మాకు మాట్లాడే అవకాశం ఇస్తారా అంటాడు అభి. ఈ విషయంలో నా సపోర్ట్ నీకే అన్నయ్య అంటాడు ప్రేమ్.
తులసిని చూసి షాక్ అయిన సామ్రాట్..
అంతలోనే అభి కి ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతున్న అభి దగ్గర ఫోన్ లాక్కొని ఆడేటప్పుడు కాన్సన్ట్రేషన్ తో ఆడండి, ఈ ఫోన్లు అవి ఏమీ వద్దు ఇలా ఇవ్వండి అని అందరి దగ్గర ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అదే సమయంలో మెలకువ వచ్చిన తులసి వాళ్లకి ఫోన్లు చేస్తుంది కానీ సైలెంట్ లో ఉండడం వల్ల ఎవరు పట్టించుకోరు. అప్పుడు సామ్రాట్ కి ఫోన్ చేసి నీరసంతో మళ్లీ కళ్ళు తిరిగి పడిపోతుంది.
ఫోన్ లిఫ్ట్ చేసిన సామ్రాట్ ఫోన్ చేసి మాట్లాడరేమండి అంటూ ఎంతకీ మాట్లాడకపోవటంతో మళ్ళీ తనే ఫోన్ చేస్తాడు. అయినా తను రెస్పాండ్ అవ్వకపోవడంతో కంగారుగా ఆమె ఇంటికి వెళ్తాడు. తులసిని పిలిస్తే పలకదు, డోర్ బ్లాక్ చేసి ఉంది ఎక్కడికైనా వెళ్లి ఉంటారా అని ఆమెకి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ ఇంట్లోంచి వస్తుంది. లోపలే ఉన్నారు అనుకుంటూ కిటికీలోంచి చూస్తాడు సామ్రాట్, స్పృహ తప్పి పడి ఉన్న తులసిని చూసి కంగారు పడతాడు.
తులసి కోసం టెన్షన్ పడుతున్న సామ్రాట్..
తలుపు బద్దలు కొట్టుకొని వచ్చి ఎంత పిలిచినా పలకక పోవడంతో ఆమెని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. తులసిని టెస్ట్ చేసిన డాక్టర్ ఆమె హెల్త్ కండిషన్ ఏమీ బాగోలేదు బిపి సడన్ గా డౌన్ అయింది పల్స్ రేట్ కూడా పడిపోయింది అని డాక్టర్ అంటే ఆమెకి ఏమీ కాకూడదు తను ఈ సిచువేషన్ నుంచి బయటకు రావాలి అంటూ కంగారు పడిపోతాడు సామ్రాట్.
మా ప్రయత్నం కూడా అదే ఆమెకి మేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటూ సామ్రాట్ ని తీసుకువెళ్లి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించు అని నర్స్ తో చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. ట్రీట్మెంట్ కోసం మనీ పే చెయ్యాలా ఎంత పే చేయాలి మనీ కోసం ట్రీట్మెంట్ ఆపొద్దు అంటాడు సామ్రాట్. ప్రాబ్లం మనీ కోసం కాదు సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్ తాలూకా గార్డియన్ కంసెంట్ ఫామ్ మీద సైన్ చేయాలి అంటూ ఆ ఫామ్ అతనికి ఇస్తుంది.
డేరింగ్ డెసిషన్ తీసుకున్న సామ్రాట్..
మీరు ఆమె హస్బెండ్ ఏ కదా, అర్జెంటుగా ఫామ్ ఫిలప్ చేయండి అంటుంది నర్స్. ఆ మాటకి షాక్ అవుతాడు సామ్రాట్. ఆలోచిస్తున్నా సామ్రాట్ ని చూసి పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది లేట్ అయితే కష్టం అంటుంది నర్స్. తులసి గారు కండిషన్ కన్నా నా కండిషన్ క్రిటికల్ గా ఉంది హస్బెండ్ అంటే ఒక ప్రాబ్లం కాదు అంటే ఇంకొక ప్రాబ్లం పోనీ నేను హస్బెండ్ కాదు అని చెబుదాము అంటే వాళ్ళ వాళ్లు వచ్చేవరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు ఇప్పుడు నేను తెగించకపోతే తులసి గారికి ప్రమాదం అని అనుకుంటాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన నర్స్ ఇంకా సైన్ చేయలేదా ఏమి ఆలోచిస్తున్నారు అంటుంది. దేవుడు ఆడుతున్న నాటకం గురించి ఆలోచిస్తున్నాను, కదా తను రాశి పాత్రధారులని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆలోచిస్తున్నాను అన్నాడు సామ్రాట్. నాకు కావలసింది తులసి గారు క్షేమంగా ఈ గండం నుంచి బయటపడడం అనుకుంటూ ఫామ్ ఫిల్ చేస్తాడు సామ్రాట్. అదే సమయంలో దీపక్ తులసికి ఫోన్ చేస్తాడు.
Intinti Gruhalakshmi January 7 Today Episode: లాస్యని కోప్పడ్డ అభి..
సామ్రాట్ అతనికి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడే అమ్మని తీసుకొని వస్తాను అంతవరకు అక్కని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు దీపక్. సీన్ కట్ చేస్తే ఇంట్లోకి వచ్చిన నందు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను అంటాడు నందు. ఆల్రెడీ ఒకసారి బిజినెస్ పెట్టి నష్టపోయారు కదా అంటుంది అంకిత. ఒకసారి నీ కడుపులో బిడ్డ పోయింది అలా అని బిడ్డలే వద్దనుకుంటావా అంటూ అంకితని బాధపెడుతుంది లాస్య.
ఇప్పుడు ఎందుకు ఆ విషయం అంటూ కోప్పడతాడు అభి. అలా చెప్తే తనకి అర్థమవుతుందని చెప్పాను హర్ట్ అయి ఉంటే సారీ అంటుంది లాస్య. తరువాయి భాగంలో తులసికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ తను ఉన్న కండిషన్ కి పెరాలసిస్ అయినా రావచ్చు లేదు అంటే కోమాలోకి వెళ్లొచ్చు అంటుంది.