Intinti Gruhalakshmi June 6 Episode: ఈరోజు ఎపిసోడ్ లో తులసి అభికి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు అందరు దగ్గరవుతారు అని ఆ తర్వాత దెబ్బ తీస్తారు అని నందు, లాస్యను ఉద్దేశించి చెబుతుంది. అభికి ఆ మాటలు అర్థం కాకపోవడంతో ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెబుతున్నావు మామ్ అనడంతో మీ నాన్న అని నేరుగా చెప్పేస్తుంది. దాంతో అభి ఆశ్చర్యపోయి అలా ఎలా అంటున్నావు అంటూ.. నాకు ఏం తెలియదా అన్నట్లు మాట్లాడతాడు.
అభికి జాగ్రత్తలు చెబుతున్న తులసి..
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రేమ్ కు ఇప్పటివరకు ఎటువంటి సలహాలు ఇవ్వలేదు అని.. నాకెందుకు ఇస్తున్నావు అని.. అంటే నాకు ఏమి తెలీదా అన్నట్లు మాట్లాడుతున్నావా మమ్మీ అని అనడంతో తులసి అలా కాదు అని.. ముందు జరిగే పరిణామాల గురించి చెబుతున్నానని అంటుంది. ఏది చేసినా మీ మంచికి చేస్తాను అని జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
సీన్ కట్ చేస్తే..
లాస్య మాస్ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. పక్కన నందు క్లాప్స్ కొడుతూ బాగా చిల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి భాగ్య వచ్చి పాటను ఆఫ్ చేస్తుంది. వెంటనే లాస్య భాగ్య పై అరుస్తుంది. ఇంకా ఏమీ కాలేదు అని అప్పుడే ఇంత ఎంజాయ్ చేస్తున్నావు అని వెటకారం చేస్తుంది భాగ్య. ఇక్కడ మీరు అంతా జరిగిపోయింది అని అనుకుంటున్నారు కానీ.. అక్కడ తులసి అభికి అన్ని మాటలు చెప్పి తన మాయలో పడేసింది అన్నట్లు చెబుతుంది.
తులసి పై కోపంతో ఊగిపోయిన నందు..
వెంటనే లాస్య కోపంతో ఊగిపోతూ ఎలాగైనా తన పని చేయాలి అని అనుకుంటుంది. ఇక నందు ని తీసుకొని తులసి ఇంటికి బయల్దేరుతుంది. నందు తులసిని చూసి తనపై బాగా అరుస్తాడు. తులసి కూడా గట్టిగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఎప్పటిలాగానే గొడవ పడుతున్న సమయానికి పరంధామయ్య దంపతులు లాస్య, నందులను మరికొన్ని మాటలతో అవమాన పరుస్తూ ఉంటారు.
ఇక నందు తులసి నా తల్లిదండ్రులను దూరం చేసింది అని.. ఇప్పుడున్న నా పిల్లలను కూడా దూరం చేస్తుంది. ఇలా చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అని బెదిరిస్తాడు. తులసి ఏమైనా చేసుకో అన్నట్లు మాట్లాడుతుంది. నందు కాసేపు తులసిపై అరిచి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఆ తర్వాత దివ్య అంకిత కు ఫోన్ చేసి ఇంట్లో అభి అన్న వల్ల గొడవలు జరుగుతున్నాయి అని అంటుంది.
Intinti Gruhalakshmi June 6 Episode: లాస్య ను తల్లి కంటే ఎక్కువగా పోల్చిన అభి..
అంతే కాకుండా అభి ప్రవర్తించిన తీరు గురించి మొత్తం చెబుతుంది. దాంతో అంకిత షాక్ అవుతుంది. తరువాయి భాగంలో అంకిత తన కోట్ల తులసి పేరు పై రాయిస్తాను అంటుంది. ఇక లాస్య అభి పేరు పైన రాయించు అని గాయత్రికి సలహా ఇస్తుంది. దాంతో అభి అమ్మ కంటే ఎక్కువ చేస్తున్నావు అని లాస్యను పొగుడుతాడు.