Intinti Gruhalakshmi: ఆస్తిని దక్కించుకోవడం కోసం సవతి కొడుకు జీవితంతో ఆటలాడుతున్న ఒక సవతి తల్లి కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి. ఈవారం కథలో ఏం జరిగిందో చూద్దాం.
తులసికి విడాకులు ఇచ్చేసానని చెప్పి తప్పుని ఒప్పుకుంటాడు నందు. ఈ విషయం తనకి ముందే తెలుసని చెప్పి షాక్ ఇస్తాడు వాసుదేవ్. మరోవైపు ధర్నాకి దిగిన దివ్య ద్వారా జరిగింది తెలుసుకొని కొడుకుని చెంప దెబ్బ కొడుతుంది రాజ్యలక్ష్మి. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితులలో కొడుకు చేత ప్రియ మెడలో తాళి కట్టిస్తుంది.
మరోవైపు భాగ్యం ద్వారా దివ్య ప్రేమ కథని తెలుసుకున్న లాస్య అతని వివరాలు కనుక్కోమంటుంది. మరోవైపు దివ్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. తనని ఉద్యోగం నుంచి తీసేస్తే పండగ చేసుకుంటుంది అందుకని తను ఎక్కడైతే మంచి పేరు తెచ్చుకుందో అక్కడే విలన్ ని చేయాలి అంటుంది రాజలక్ష్మి. మరోవైపు ఒక్క దెబ్బతో మంచి పేరు అయితే తెచ్చుకున్నారు కానీ విక్రమ్ బాబునే దూరం చేసుకున్నారు అంటూ దివ్య మీద జాలి పడతాడు దేవుడు.
ఇక్కడ జరిగిన సంగతులు ఏవి విక్రమ్ కి తెలియనివ్వడు. ప్రియ తో సహా ఇంటికి వస్తాడు సంజయ్. పూజల పేరు చెప్పి కోడల్ని ఇంట్లోకి రానీయకుండా అవుట్ హౌస్ లోనే ఉంచుతుంది రాజ్యలక్ష్మి.పనిమనిషి ద్వారా అత్తగారి నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది ప్రియ. మరోవైపు దివ్య చేసిన పని తెలుసుకుని కంగారుపడుతుంది తులసి. పెద్ద వాళ్ళతో పెట్టుకునేటప్పుడు వాళ్లు దాన్ని తేలిగ్గా తీసుకోరు.
నా కూతురు క్షేమం గురించి నాకు భయంగా ఉంటుంది కదా అంటుంది తులసి. రాజ్యలక్ష్మి గారు తిరగబడితే ఏమి చేయలేకపోయే దానివి ఆవిడ మంచితనాన్ని మెచ్చుకోవాలి అంటుంది తులసి నిజమే అంటుంది దివ్య. మరోవైపు ఇంటికి వచ్చిన విక్రమ్ కి అమ్మవారికి అభిషేకం చేస్తూ కనిపిస్తుంది ప్రియ. విషయం తెలుసుకుని ముందు షాక్ అవుతాడు కానీ తల్లి పెళ్లి జరిపించిందని తెలుసుకొని ఆనందపడతాడు.
భార్య పూజలో భర్తకి కూడా భాగం ఉంటుంది అంటూతోడుగా ఉంటూ ప్రియకి హెల్ప్ చేయమంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్యలక్ష్మి, సంజయ్. మరోవైపు దివ్యని కలవడానికి తొందర పడుతున్న విక్రమ్ తో మీ అమ్మగారు వద్దంటే దివ్యతో పెళ్లి మానేస్తారా అని అడుగుతాడు దేవుడు. నేను అలాంటి పరిస్థితిని ఊహించలేదు నన్ను టెన్షన్ పెట్టొద్దు అంటాడు విక్రమ్. విక్రమ్ దివ్యకి ఫోన్ చేసి మనం ఎప్పుడూ కలుసుకునే దగ్గర కలుసుకుందాం అంటాడు.
మరోవైపు లాస్యని ఇంటికి పిలిపించి దివ్య జీవితం ఎలాగైనా నాశనం చేయాలి అంటూ ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తుంది రాజ్యలక్ష్మి. మీ కోడల్ని చేసుకోండి, విక్రమ్ ఎలాగో మీ కాలికింద చెప్పు కాబట్టి తను మీ మాటే వింటాడు. అప్పుడు దివ్య జీవితాంతం మీ కాళ్ళ దగ్గర బానిసలాగా పడి ఉంటుంది అంటుంది లాస్య. ఆ పని ఏదో నువ్వే చెయ్యు అని రాజ్యలక్ష్మి అంటే ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు లవ్టర్ నడుపుతున్నారు అంటూ నిజం చెప్పి షాక్ ఇస్తుంది లాస్య.
మరోవైపు రాజ్యలక్ష్మి హాస్పిటల్ ఓనర్ విక్రమ్ అని తెలుసుకొని అతన్ని నిలదీస్తుంది దివ్య. నేను నిజం మాత్రమే చెప్పలేదు అంతేకానీ అబద్ధాలు చెప్పలేదు కదా అంటూ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటాడు విక్రమ్. అతన్ని అర్థం చేసుకొని హగ్ చేసుకుంటుంది దివ్య. మరోవైపు రాజ్యలక్ష్మి హాస్పిటల్స్ అధినేతతో దివ్యకి సంబంధం మాట్లాడి వచ్చాను అంటుంది లాస్య. వివరాలన్నీ విన్న నందు ఈ సంబంధం నువ్వు తెచ్చావు కాబట్టి ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటాడు.
రాజ్యలక్ష్మి, విక్రమ్ ల రాకతో కథ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అంటూ టాప్ రేటింగ్ ని ఇస్తున్న ప్రేక్షకులు..
నీ కూతురు మనసు పడింది అన్నా ఒప్పుకోవా అంటుంది లాస్య. ఒకసారి గా షాక్ అవుతారు నందు తులసి. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య జరిగిందంతా తెలుసుకొని పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ లాస్యని కోప్పడి జరిగిందంతా తల్లికి చెప్తుంది. మరి విక్రమ్ దివ్యల పెళ్లి జరుగుతుందా? రాజ్యలక్ష్మి పంతం నెరవేరుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.