Intinti Gruhalakshmi March 11 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పైకి గంగి గోవు లాగా అమాయకంగా కనిపిస్తాడు కానీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు అంటుంది దివ్య.ఆ అబ్బాయి నీకు తెలుసా అంటుంది ఆ తల్లి. అడిగి అడగగానే డబ్బులు ఇస్తూ మంచితనం నటిస్తూ ట్రాప్ చేసి ముగ్గులోకి దింపుతాడు. అదృష్టం కొద్ది నేను తప్పించుకున్నాను అంటుంది దివ్య.

పేషెంట్ తల్లికి ధైర్యం చెబుతున్న దివ్య..

అవునమ్మా మీ వాళ్ళకి చెప్పి మా అమ్మాయిని ఎలాగైనా రక్షించండి డబ్బు ఎంతైనా పర్వాలేదు అంటుంది ఆ తల్లి. మీరేమీ కంగారు పడకండి ఆమె ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు ఆమెకి అన్యాయం చేసిన వాడికి శిక్ష పడే లాగా చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అంటుంది దివ్య. అడిగి అడగగానే ఏ మాత్రం గొడవ పెట్టకుండా రెండు లక్షలు ఇచ్చినప్పుడే వాడి మీద అనుమానం వచ్చింది.

చెప్తాను వాడి పని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆడపెళ్లి వారితోపాటు పంతులుగారు రావడం లేదంట, వాళ్ళకి అడ్రస్ ఇచ్చారంట ఏ నిమిషంలో నైనా రావచ్చంట అని రాజ్యలక్ష్మి తో చెప్తాడు ఆమె తమ్ముడు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ సంబంధం కుదిరిపోవాలి. ఆ అత్తెసరు పెళ్లికూతురు ఈ ఇంటి కోడలు అవ్వాలి అంటుంది రాజ్యలక్ష్మి.

తల్లిని అమ్మవారితో పోల్చిన విక్రమ్..

ఇంతలో విక్రమ్ రావటంతో ఇన్నాళ్లు నీ జీవితంలో మీ అమ్మ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ స్థానాన్ని నీ భార్య తీసుకుంటుంది అంటుంది రాజ్యలక్ష్మి. అలా అనద్దు అమ్మ నా జీవితంలో ఎంతమంది ఉన్నా నీ తర్వాతే నీది గుడిలో అమ్మవారి స్థానం అంటాడు విక్రమ్. ఎంత మంచి కొడుకుని కన్నావు ఎంత అదృష్టవంతురాలివి మీ ఇద్దరికీ దిష్టి తగిలేలాగా ఉంది అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు.

నేను దిష్టి తీస్తానులెండి అంటుంది రాజ్యలక్ష్మి మరదలు. బలిచ్చే మేకపోతుని మేపుతున్నట్టు మేపుతున్నావ్. పాపం ఆ సంగతి ఈ పిచ్చి వెధవకి తెలియక నీ చుట్టూ కుక్క పిల్ల లాగా తిరుగుతున్నాడు అనుకుంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. వదినకి ఆల్రెడీ ఈ సంబంధం నచ్చి ఫిక్స్ చేసేసింది ఫార్మాలిటీ కోసం మాత్రమే ఈ పెళ్లిచూపులు అంటుంది రాజ్యలక్ష్మి మరదలు.

ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్న ఇరువర్గాలు..

ఈ లోపల ఆడపిల్ల వారు రావటంతో లోపలికి తీసుకొచ్చి రాజ్యలక్ష్మి పరిచయం చేస్తాడు ఆమె తమ్ముడు మీ అమ్మాయిని చూసిన వెంటనే తనే ఈ ఇంటి పెద్ద కోడలు అని ఫిక్స్ అయిపోయి మురిసిపోయింది అని చెప్తాడు. విక్రమ్ ని చూపించి ఇతనే పెళ్ళికొడుకు పరిచయం చేస్తాడు. వాళ్లు కూడా వాళ్ళ అమ్మాయిని పరిచయం చేసి ఈమె పెద్దగా చదువుకోలేదు.

మాకు ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఆస్తిపాస్తులు లేవు అని చెప్తుంది పెళ్లికూతురు తల్లి. కానీ మా అక్కకి పెద్ద మనసు ఉంది పర్వాలేదు అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. ఇంతలో విక్రమ్ తాతయ్య కిందికి వచ్చి నేను పెళ్ళికొడుకు తాతయ్యని, అతని మంచి చెడ్డలు చూసేది నేనే అంటూ పరిచయం చేసుకుంటాడు. ఇంతలోనే సంజయ్ కూడా రావడంతో మీ వదిన అంటూ పరిచయం చేస్తుంది రాజలక్ష్మి.

ఈ పెళ్లి జరగదు అంటున్న దేవుడు..

నీకు పర్ఫెక్ట్ జోడి అన్నయ్య, నీకు నచ్చినట్లే కదా అంటాడు సంజయ్. అమ్మకు నచ్చితే నాకు నచ్చినట్లే అంటాడు విక్రమ్. మరోవైపు మీరు ఏమి కంగారు పడకండి ఈ సంబంధం అసలు కుదరదు అని విక్రమ్ వాళ్ళ తాతయ్యతో మెల్లగా చెప్తాడు దేవుడు. ఎలా చేస్తున్నావు అని అతను అడిగితే చూడండి పెళ్లికూతురు మొహంలో అస్సలు చిరునవ్వు లేదు. కనీసం పెళ్ళికొడుకుని ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు.

ఈ కారణాలు చాలు ఈ సంబంధం తప్పిపోవటానికి అంటాడు దేవుడు. ఆ అమ్మాయితో మాట్లాడాలనిపిస్తే బయటికి తీసుకెళ్ళి మాట్లాడు అని విక్రమ్ కి చెప్తాడు అలాంటిదేమీ అవసరం లేదు అని విక్రమ్ అంటాడు కానీ నేను మాట్లాడాలి అంటుంది పెళ్లికూతురు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఫిక్స్ అయిపోయిన పెళ్ళే కాబట్టి పెళ్లయ్యాక మాట్లాడుకోవచ్చు అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు.

భయంతో టెన్షన్ పడుతున్న నందు..

పెళ్లికూతురు తండ్రి కూడా అదే మాట అంటాడు కానీ పెళ్ళికూతురు మాత్రం మాట్లాడాలి అంటుంది. మరోవైపు కంగారుగా వాసుదేవ్ కోసం ఎదురుచూస్తున్న నందు మరి కాసేపట్లో వాడు వస్తాడు మా విడాకుల విషయం దాచినందుకు మొహం వాచేటట్లు తిడతాడు. మొహం కూడా చూడకుండా అట్నుంచి అటే వెళ్ళిపోతాడు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది అనుకుంటూ టెన్షన్ పడుతుంటాడు.

ఇంతలో వాసుదేవ్ దంపతులు రావడంతో వాళ్లని ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు నందు, పరంధామయ్య దంపతులు. చాలా దూరం వెళ్ళిపోయారు అంటుంది అనసూయ. మీ వాడు నేను బిజినెస్ పార్ట్నర్స్ కాబోతున్నాము ఇకపై వద్దన్నా కలుస్తూనే ఉంటాము అంటాడు వాసుదేవ్. మన బిజినెస్ డీల్ గురించి అంకుల్ వాడితో చెప్పావా అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు.

వాసుదేవ్ తో బిజినెస్ డీలింగ్ నందు కి ఇష్టం లేదా..

నన్ను చూడగానే ఎగిరి గంతేస్తావు అనుకున్నాను కానీ పరాయి వాడిని పలకరించినట్లు పలకరిస్తున్నావు నాతో బిజినెస్ డీల్ నీకు ఇష్టం లేదా అంటాడు. అలాంటిదేమీ లేదు ఏ బిజినెస్ డీల్ ఫైనలైజ్ అయితే నాకన్నా అదృష్టవంతుడు ఉండడు అంటాడు నందు. అదేంటి అలా అంటున్నావు మనం ఇద్దరం అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేస్తే అదే ఫైనల్ డీల్ అంటాడు వాసుదేవ్.

మాట తప్పవు కదా అంటాడు నందు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాట తప్పను కానీ నువ్వు కూడా నీ మాట తప్పకూడదు నేను ఉన్న రెండు రోజులు మా చెల్లెలి మర్యాదలతో పాటు తెలుగింటి వంటకాలతో నన్ను నేను మర్చిపోయా లాగా చేయాలి అంటాడు. ఇంతకీ తులసి ఏది, తను నీ పక్కన ఉంటేనే నీకు విలువ అంటూ తులసిని పిలుస్తాడు వాసుదేవ్.

సడన్ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన తులసి..

లాభం లేదు నిజం చెప్పేద్దాం అనుకుంటాడు నందు. అంతలో హారతి పళ్ళెంతో వస్తుంది తులసి. ఏంటమ్మా ఇంత ఆలస్యంగా వస్తున్నావు అంటాడు వాసుదేవ్. హారతి సిద్ధం చేసేసరికి ఆలస్యమైంది అన్నయ్య మీరు వచ్చినట్లు చెప్పకుండా ఈయన వచ్చేసారు ఉంటుంది తులసి. కాలనీ మారిపోయింది కదా నువ్వు కూడా మారిపోయే ఉంటావు అనుకున్నాను అంటాడు.

మారిపోతే ఎలా అన్నయ్య మనం తర్వాత తరానికి కూడా అందించాలి కదా మనం మారిపోకూడదు అంటుంది తులసి. పదండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అనసూయ అనటంతో అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇదివరకు నువ్వు ఎవరితో మాట్లాడాలన్నా మీ ఆయన ఏమంటాడోనని వెలుగు కనిపించేది కానీ ఇప్పుడు నీ మనసులో మాటని కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు.

ఇదంతా ఆయన పుణ్యమే అంటున్న తులసి..

ఇదంతా మా వాడి ఎంకరేజ్మెంట్ ఏనా అంటాడు వాసుదేవ్. అవునన్నయ్య ఇదంతా ఆయన చలవే ఆయన వల్లే లోకం తెలుసుకున్నాను, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను అంటుంది తులసి. భార్య మెప్పు పొంది ఐడియల్ హస్బెండ్ వినిపించుకున్నావు కంగ్రాట్స్ అంటాడు వాసుదేవ్. మా తులసి ఉద్యోగం కూడా చేస్తుంది అని చెప్తుంది అనసూయ. గ్రేట్ వదిన మీలో చాలా డెవలప్మెంట్ ఉంది అంటుంది వాసుదేవ్ భార్య.

నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది వెళ్లి మంచి కాఫీ తీసుకురా అంటాడు వాసుదేవ్. ఇప్పుడే తెస్తాను అంటూ వంట గదిలోకి వెళ్తున్న తులసి వెనకాతలే నన్ను కూడా వెళ్లి ఆమెకి థాంక్స్ చెప్తాడు. అబద్దాలతో బంధాలని నిలబెట్టుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు, అది ఎప్పటికైనా ప్రమాదమే కానీ మీ ఎదుగుదలకి అడ్డు రాకూడదని ఒప్పుకున్నాను కానీ ఎప్పటికైనా అన్నయ్యకి నిజం చెప్పేయండి.

నిజం చెప్పేయమంటూ భర్తకి సలహా ఇస్తున్న తులసి..

ఆయనకి మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి అంటుంది తులసి. మరోవైపు దివ్య సూసైడ్ చేసుకున్న పేషెంట్ దగ్గరికి వస్తుంది. ఈవిడ నాకు ధైర్యం చెప్పింది అని కూతురికి పరిచయం చేస్తుంది ఆ తల్లి. మా అమ్మకి ధైర్యం చెప్పినందుకు థాంక్స్ అని ఆ అమ్మాయి అంటే తనకే కాదు మగాడి చేతిలో మోసపోయిన నీకు కూడా సపోర్ట్ గా ఉంటాను.

పోలీసులకి కాల్ చేసి పిలిపిస్తాను ఆ విక్రమ్ మీద కేసు పెడుదువు గాని అంటుంది దివ్య. విక్రమ్ మీదనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆ అమ్మాయి. డబ్బున్నవాడని నువ్వు వెనకడుగు వేయవలసిన అవసరం లేదు, ఆరోజు కాఫీ షాప్ లో మీ ఇద్దరి మాటలు నేను విన్నాను అవసరమైతే కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్తాను అంటుంది దివ్య.

నిజం తెలుసుకుని షాకైన దివ్య..

మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు, విక్రమ్ నా వెల్విషర్ తను ఎప్పుడు నా మంచి కోరుకునే వాడు అంటుంది ఆ అమ్మాయి. ఆ మాటకి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది దివ్య. నేను తల్లిదండ్రుల ఆస్తి అమ్ముకొని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది తప్పని నన్ను వారించాడు కానీ నేనే వినలేదు ఈరోజు ఇలా అనుభవిస్తున్నాను నాతో పాటు నా పేరెంట్స్ ని కూడా బాధ పెడుతున్నాను అంటుంది.

విక్రమ్ నిన్ను మోసం చేయలేదా అంటుంది దివ్య. విక్రమ్ చాలా మంచి మనిషి తను ఎవ్వరిని మోసం చేయడం అవసరమైతే సాయం కూడా చేస్తాడు. విక్రమ్ ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతులు మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు అంటుంది ఆ అమ్మాయి. అవును ఒకసారి కాదు రెండుసార్లు పొరపాటు పడ్డాను అతనితో రూడ్ గా మాట్లాడాను అంటుంది దివ్య.

విక్రమ్ ముందు తన అనుమానాన్ని వ్యక్తం చేసిన పెళ్లికూతురు..

ఏం పర్వాలేదు ఫోన్ చేసి మాట్లాడండి ఈజీగానే తీసుకుంటాడు అంటుంది ఆ అమ్మాయి. థాంక్యూ నేను నీకు సాయం చేయడం కాదు నువ్వే నాకు సాయం చేశావు అంటుంది దివ్య. అందుకే అంటారు అపార్థం చేసుకొని ఎవర్ని దూరం చేసుకోకు అర్థం చేసుకోకుండా ఎవరిని దగ్గర చేసుకోకు అని అంటూ మరొకసారి ఆ అమ్మాయికి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది దివ్య.

మరోవైపు బయటికి వచ్చిన విక్రమ్ నన్ను ఏమైనా అడగాలంటే అడగొచ్చు అంటాడు. మీరు ఏమీ అనుకోరు కదా అంటూ మీరు చాలా గొప్ప వాళ్ళు మీ కార్ల విలువ చేయవు మా బ్రతుకులు. అందము ఆస్తి ఉన్న అమ్మాయిలు కో అంటే కోటి మంది వస్తారు అలాంటిది మీరు నన్నే ఎందుకు కోడలుగా అనుకుంటున్నారు అంటుంది పెళ్లికూతురు.

అలా చేయటం నచ్చలేదంటున్న పెళ్లికూతురు..

మా అమ్మకి నచ్చారు కాబట్టి అంటాడు విక్రమ్ అంటే మీకు నచ్చలేదా అంటుంది పెళ్లికూతురు. ఇంతకుముందే చెప్పాను కదా మా అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్లే అంటూ నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు విక్రమ్. నచ్చకపోవటం కాదు నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాకు చదువు అంటే చాలా ఇష్టం నేను ఎలాగూ చదువుకోలేదు రేపు పెళ్లి అయ్యాక నా పిల్లలకి చదువు చెప్పుకోలేను.

కనీసం నేను చేసుకోబోయే వాడైనా బాగా చదువుకుంటే రేపటి రోజున పిల్లలు జీవితాలు బాగుంటాయని చిన్న ఆశ అంటుంది ఆ పెళ్ళికూతురు. నాకు చదువు లేదని మీ వాళ్ళు చెప్పలేదా అంటాడు విక్రమ్. చదువు లేకపోతే ఏమి ఆస్తి ఉంది కదా అని ఆశపడ్డారు. కానీ నాకు అలాగా నచ్చట్లేదు అంటుంది పెళ్లికూతురు. మరి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పొచ్చు కదా అంటాడు విక్రమ్.

విక్రమ్ ని బ్రతిమాలుకుంటున్న పెళ్ళికూతురు..

ఆడపిల్ల అభిప్రాయాలకు విలువ ఎక్కడ ఉంది ఆమాత్రం మీకు తెలియదా అయినా నేను మిమ్మల్ని నమ్ముకొని ఈ పెళ్లి చూపులకు వచ్చాను అంటుంది పెళ్లి కూతురు. నన్ను నమ్ముకోవడమేంటి అంటాడు విక్రమ్. అమ్మాయి నచ్చలేదని మీరు చెప్పండి అంటుంది. అబద్ధం ఎందుకు చెప్పాలి అని విక్రమ్ అంటే జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదా నాకోసం ఈ ఒకసారి చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది పెళ్లికూతురు.

అదేదో మీరే చెప్పొచ్చు కదా అని విక్రమ్ అంటే అలా చెప్తే ఇంటికి వెళ్ళాక నా వీపు విమానం మోత మోగుతుంది,తిండి పెట్టకుండా గదిలో పెట్టి బంధించేస్తారు అంటుంది పెళ్లికూతురు. ఇప్పుడు నేను వద్దని చెప్తాను కరెక్టే కానీ తర్వాత మళ్ళీ ఇలాంటి సంబంధమే మీ వాళ్ళు తీసుకొని వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు విక్రమ్. చేసేదేముంది ఇలా అడుక్కోవడమే అంటుంది పెళ్లికూతురు.

Intinti Gruhalakshmi March 11 Today Episode అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నావ్ అంటున్న వాసుదేవ్..

ప్రతిసారి ప్రతి వాళ్లు మీ మాట వినాలని లేదు కదా అంటాడు విక్రమ్. మీరన్నది నిజమే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటుంది ఆ పెళ్ళికూతురు. ధైర్యం చేసి మనసులో మాట చెప్పేయండి, మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అంటాడు విక్రమ్. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా ఎందుకు మీ అమ్మ గారి మీద ఆధారపడుతున్నారు అంటుంది ఆ పెళ్లికూతురు.

తరువాయి భాగంలో తొందరగా కిందికి వచ్చి వాసుదేవ్ వాళ్ళని పలకరిస్తుంది లాస్య. నువ్వేంటి ఎక్కడున్నావు ఇంట్లో నీకేం పని అంటాడు వాసుదేవ్. అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నావు అంటూ తులసికి చెప్తాడు. ఈ నాటకం నాకు ఇబ్బంది కలగనంతవరకే, నువ్వు అనుకున్నది సాధించే వరకు కాదు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది తులసి.