Intinti Gruhalakshmi March 13 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మనసులో ఉన్న అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పండి అంటాడు విక్రమ్. ఆ పని మీరే చేయొచ్చు కదా అని పెళ్లికూతురు అంటే మా అమ్మ తీసుకునే నిర్ణయం నాకు నచ్చుతుంది. కానీ మీ విషయంలో అలా కాదు కదా అంటాడు విక్రమ్. మరోవైపు తులసి ఇచ్చిన కాఫీ తాగుతూ అమృతం లాగా ఉంది అంటాడు వాసుదేవ్.
లాస్య ని చూసి షాక్ అయిన వాసుదేవ్..
తీపి ఎక్కువైందా అని నందు అంటే కాదు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంది, అయినా నీ కాఫీలో గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని వాడు ఇంక నిన్నే అర్థం చేసుకుంటాడు అంటాడు వాసుదేవ్. అర్థం చేసుకోవాలని లేనప్పుడు ఎప్పటికీ అర్థం చేసుకోరు, సమయం దాటిపోయిన తర్వాత అర్థం చేసుకున్నా విలువ ఉండదు అంటుంది తులసి.
వాళ్లు అలా మాటలా ఉండగానే అక్కడికి లాస్య వచ్చి వాసుదేవరావు దంపతులని పలకరిస్తుంది. క్లాస్ ఏమి చూసి షాక్ అయిన వాసుదేవ్ తను మీ దగ్గర అసిస్టెంట్గా పని చేసేది కదా తను ఎక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు. తన భర్త తనకి డైవర్స్ ఇచ్చేసాడు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే తులసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది అంటాడు నందు. నీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినా, అమాయకత్వం పెరగలేదు.
నీకు నాకు ఏమి సంబంధం లేదంటున్న తులసి..
అందర్నీ గుడ్డిగా నమ్ముతున్నావు అంటాడు వాసుదేవ్. వంట చేయడం కోసం తులసి కిచెన్ లోకి వెళ్తుంది. ఆమె వెనకాతలే వచ్చిన లాస్య, నందుకి భార్యగా ఒప్పుకోవడానికి నటించినందుకు థాంక్స్ అంటుంది. నీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. నువ్వు అడిగావని నేను నటించలేదు నాకే పోన్లే పాపం అనిపించి నటిస్తున్నాను అంటుంది తులసి.
నేను చెప్పబట్టే కదా నటించావు, ఒప్పుకోవచ్చు కదా ఈ చిన్న విషయానికే ఇగో ఎందుకు అంటుంది లాస్య. ఇది ఈగో కాదు స్వీట్ నాకు ఏ సంబంధం లేదు అని చెప్పటం అంటుంది తులసి. నువ్వు చేసేది కేవలం నటన మాత్రమే అని గుర్తుపెట్టుకో పాతికేళ్ల ఎక్స్పీరియన్స్ బయటకి తీసి ఈ రెండు రోజులు ప్రదర్శించకు నందు ఇబ్బంది పడతాడు అంటుంది లాస్య.
లాస్యని మొగుడు రుణం తీర్చుకోమంటున్న తులసి..
ఇబ్బంది నీకా, నాకా అంటుంది తులసి. ఆయన ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడినట్లే అయినా నువ్వు చేసిన సహాయానికి రుణం ఉంచుకోములే అంటుంది లాస్య. నిన్ను కట్టుకున్నందుకు ముందు మీ ఆయన రుణం తీర్చుకో. నాకు ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే సహాయం చేస్తాను, నువ్వు అనుకున్నది సాధించేవరకు మాత్రం కాదు ఇదే విషయాన్ని మీ ఆయన కూడా చెప్పాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
మరోవైపు విక్రమ్ వాళ్ళు ఎంతకీ ఇంట్లోకి రాకపోవడంతో ఇది పెళ్లిచూపులని మర్చిపోయి ముద్దు ముచ్చట్లలో మునిగిపోయినట్లుగా ఉన్నారు అంటూ దేవుణ్ణి పిలుచుకు రమ్మంటాడు బసవయ్య. ముద్దు ముచ్చట్లు ఉన్నారు అంటున్నారు కదా నేను వెళ్తే బాగోదేమో అంటూ వెటకారంగా మాట్లాడుతాడు దేవుడు. వాళ్ల కోసం మనం ఎదురు చూడవలసిన పనిలేదు ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం అంటుంది రాజ్యలక్ష్మి.
రాజ్యలక్ష్మిని కోప్పడుతున్న ఆమె మామగారు..
ఏంటి అంత తొందర వాళ్లు రానీ,ఒకరికి ఒకరు నచ్చారు అని చెప్పిన తర్వాతే ముహూర్తాల సంగతి మాట్లాడాలి అంటూ కోప్పడతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. విక్రమ్ ఆల్రెడీ ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాడని చెప్పు తమ్ముడు అంటుంది రాజ్యలక్ష్మి. ఇక మిగిలింది అమ్మాయి తల్లిదండ్రుల అభిప్రాయమే కదా మీరు కూడా నచ్చిందని ఒక ముక్క చెప్పిస్తే మా పెద్దాయనకి తృప్తి అంటాడు బసవయ్య.
చెప్పడానికి ఏముంది మా అమ్మాయిని పెద్ద మనసుతో రాజ్యలక్ష్మి గారు ఈ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు అది మా పూర్వజన్మ సుకృతం అంటాడు పెళ్లి కూతురు తండ్రి. అంతలోనే ఇంట్లోకి వచ్చిన విక్రమ్ ని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటాం అంటున్నారు నీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు విక్రమ్.
ఈ అబ్బాయి వద్దు అంటూ షాకిచ్చిన పెళ్లికూతురు..
అభ్యంతరం అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ల తాతయ్య ఆ సమాధానం విని నిరాశ చెందుతాడు. అభ్యంతరం నాకు ఉంది అంటుంది పెళ్లికూతురు. ఏంటి నీకు అభ్యంతరం ఆ అబ్బాయికి ఏం తక్కువ అంటాడు పెళ్లికూతురు తండ్రి. నాకు కావాల్సింది ఇలాంటి అబ్బాయి కాదు బాగా చదువుకున్న అబ్బాయి కావాలి అంటుంది పెళ్లి కూతురు. ఆ అమ్మాయిని అక్కడే కొట్టడానికి ప్రయత్నిస్తుంది ఆమె తల్లి.
ఏమైనా గొడవ పడాలంటే మీ ఇంటికి వెళ్లి గొడవ పడండి అంటాడు విక్రమ్. మగవాడు మా అబ్బాయి బుద్ధిగా పెళ్ళికి ఒప్పుకున్నాడు. మీ అమ్మాయి ఏం చూసుకొని రెచ్చిపోతుంది బుద్దిగా తల ఒంచుకొని తాళి కట్టించుకోమని చెప్పండి అంటాడు బసవయ్య. ఆ అమ్మాయి ఇష్టం లేదని చెప్తుంటే నువ్వు ఎందుకు తనని బెదిరిస్తున్నావ్, నా మనవడికి నేను ధైర్యం ఆ అమ్మాయికి ఉంది సంతోషించు అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
అయోమయ పరిస్థితిలో రాజ్యలక్ష్మి..
దాన్ని ధైర్యం అనరు పిచ్చితనం అంటారు అంటుంది రాజ్యలక్ష్మి. మీరు ఏమైనా అనుకోండి కానీ నాకు ఈ సంబంధం అవసరం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పెళ్లికూతురు. మళ్లీ వెనక్కి వచ్చి సరి అయిన సమయంలో సరి అయిన సలహా ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టారు, బలవంతంగా మీతో తాళి కట్టించుకుని ఉంటే జీవితాంతం ఏడుస్తూ బ్రతకాల్సి వచ్చేది.
మీరిచ్చిన ధైర్యానికి రుణపడి ఉంటాను అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది ఆ పెళ్లికూతురు. ఎందుకు ఆ అమ్మాయి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది అసలు ఏం జరిగింది రాజ్యలక్ష్మి. నువ్వేమైనా పెళ్లికూతురులకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టావా, నువ్వు సలహా ఇవ్వడమేంటి ఆ అమ్మాయి నిన్ను చీకటి వెళ్లిపోవడం ఏంటి అంటూ నిలదీస్తాడు బసవయ్య.
నేను తప్పు చేయలేదంటున్న విక్రమ్..
వద్దన్నా ఈ విషయం బయటికి తెలుస్తుంది మన పరువు వీదిని పడిపోతుంది అంటాడు బసవయ్య. నేను ఆలోచించేది నా పరువు గురించి కాదు విక్రమ్ పరువు గురించి, నువ్వు చదువుకోలేదు కాబట్టి నిన్ను ఛీ కొట్టి వెళ్ళిపోయింది అని బయట తెలిస్తే నీకు ఎంత రాజ్యలక్ష్మి. చదువు లేదు కాబట్టి నువ్వు వద్దు అని ఆ అమ్మాయి నా మొహం మీదే చెప్పింది.
కావాలంటే మనసు చంపుకుంటాను తాళికట్టు అని చెప్పింది అలాంటి అమ్మాయితో కలిసి జీవితకాలం ఎలా బ్రతకమంటావు, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితంతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోతుంది. అయినా కూడా నేను నో చెప్పలేదమ్మా, నీకు కావాలంటే నువ్వే మీ ఇంట్లో వాళ్లతో చెప్పుకో అని చెప్పాను నేను చేసింది తప్పా అంటాడు విక్రమ్.
తమ్ముడు సంగతి చూడమంటున్న విక్రమ్..
నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయడు, చేస్తే అది నా పెంపకం తప్పవుతుంది అంటుంది రాజ్యలక్ష్మి. చదువు లేని నాకు గొప్ప సంబంధాలు రావని అర్థమైంది అందుకే ముందు తమ్ముడికి పెళ్లి చేయండి నా సంగతి తర్వాత చూద్దాం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. పెళ్లి సంబంధం తప్పోయినందుకు ఆనందంగా ఫీల్ అవుతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
మరోవైపు దివ్య విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చూసిన విక్రమ్ భయంతో వణికి పోతాడు. తనేరా, ఆ అమ్మాయి రా, దివ్య అంటూ కంగారుగా దేవుడికి చెప్తాడు. అంటే ఆ రెండు లక్షల డాక్టర్ ఏనా, అయినా ఇష్టం వచ్చినట్లు తిట్టడం మళ్ళీ ఫోన్ చేయడం ఏంటి బుద్ధి లేదా అమ్మాయికి. నాకు ఇవ్వండి నేను మాట్లాడుతాను అని ఫోన్ లాక్కోబోతాడు దేవుడు. గొడవలు వద్దు అంటూ ఫోన్ ఇవ్వడు విక్రమ్.
దివ్య మాటలకి కంగారుపడిన విక్రమ్..
మరోవైపు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేను తిట్టానని అలిగాడా, లేకపోతే నాకు నేనుగా ఫోన్ చేస్తున్నందుకు బెట్టు చేస్తున్నాడా, లాస్ట్ టైం చేస్తాను ఎత్తకపోతే లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయను అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంది దివ్య. ఫోన్ ఎత్తడానికి ఎందుకు అంత భయపడిపోతున్నారు, నేను మగాడిని అని అనుకుంటూ ఫోన్ ఎత్తండి అంటూ ధైర్యం చెప్తాడు దేవుడు.
ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అయినా నేను నీతో మాట్లాడాలి మొన్న కలుసుకున్న ప్లేస్ కి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది దివ్య. మళ్లీ కంగారు పడిపోతాడు విక్రమ్. ఏమైంది అంటాడు దేవుడు. మాట్లాడాలంట మొన్న కలుసుకున్న ప్లేస్ కి రమ్మంటుంది ఎందుకు అంటూ అమాయకంగా మొహం పెడతాడు విక్రమ్.
లాస్యకి మొహం వాచేలా చివాట్లు పెట్టిన వాసుదేవ్..
ఇక్కడ కూర్చొని జుట్టు పీక్కోవడం కాదు అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి అంటాడు దేవుడు అయితే నువ్వు కూడా రా అని దేవుడు చెప్తున్నా వినిపించుకోకుండా తనతో పాటు తీసుకువెళ్తాడు విక్రమ్. మరోవైపు భోజనాలు దగ్గర కూర్చున్న వాసుదేవరావు తులసి వంటని మెచ్చుకుంటాడు. యమధర్మరాజు మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా మేము అందుకే వెళ్లలేదు అని నవ్వుతారు అనసూయ దంపతులు.
అంతలోనే అక్కడికి వచ్చిన లాస్య సారీ లేట్ అయ్యానా అంటూ నందు పక్కన కూర్చుంటుంది లాస్య. ఒకసారిగా షాక్ అయినా వాసుదేవ్ ఆంటీ పక్కన అంకుల్ కూర్చుంది నా పక్కన నా భార్య కూర్చుంది నీ పక్కన ఏంటి లాస్య కూర్చుంది అని అడుగుతాడు. నేను వడ్డిస్తున్నాను కదా అన్నయ్య అంటుంది తులసి. సరే తనని వదిలేయ్ లాస్య నీ బుద్ధి ఏమైంది నీ మొగుడు నీకు విడాకులు ఇచ్చాడు అని పరాయి వల్ల మొగుడు పక్కన కూర్చుంటావా.
అందరి ముందు తులసి చేయి పట్టుకున్న నందు..
అయినా నువ్వైనా చెప్పాలి కదా నందు అంటాడు వాసుదేవ్. ఈ చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నాడు అలవాట్లో పొరపాటు లాగా వచ్చి కూర్చున్నాను అంటూ వాసుదేవ్ ని తిట్టుకుంటూ అక్కడినుంచి లేచిపోతుంది లాస్య. నువ్వు వడ్డిస్తున్నట్లు నేను చూసుకోలేదు చైర్ ఖాళీగా ఉంటే కూర్చుండి పోయాను పోయాను అని తులసి తో చెప్తుంది లాస్య.
లాస్య వడ్డిస్తుంది కానీ నువ్వు వచ్చి కూర్చో అంటూ తులసి చేయి పట్టుకుని వెంటనే వదిలేస్తాడు నందు. మీ అబ్బాయి చాలా పిరికివాడు భార్య చేయి పట్టుకొని వెంటనే వదిలేసాడు అని నవ్వుతాడు వాసుదేవ్. పెళ్ళాం దగ్గర మొహమాటం ఎందుకు అయినా నా చెల్లెలు ఏమైనా కొడుతుందా, తిడుతుందా అంటాడు.మాది లవ్ మ్యారేజ్ మా పెళ్ళికి మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు.
Intinti Gruhalakshmi March 13 Today Episode: వ్యక్తిత్వానికి చదువు కొలమానం కాదంటున్న దివ్య..
దగ్గరుండి మా పెళ్లి చేయమని వీడిని అడిగితే భయపడ్డాడు. తులసి ధైర్యం చెప్పి దగ్గరుండి మా పెళ్లి చేసింది అంటాడు వాసుదేవ్. ఒక విధంగా తను నా ఆడపడుచు అంటుంది వాసుదేవ్ భార్య. అప్పట్లో నువ్వు మౌనంగా ఉండే దానివి అయినా మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందో అని ఆలోచించేవాడిని ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఎంత ధైర్యమో అని అంటాడు వాసుదేవ్.
తరువాయి భాగంలో హోటల్లో మీట్ అవుతారు దివ్య విక్రమ్. అక్కడ వెయిటర్ ని చదువు లేని వాడు అంటూ ఒక కస్టమర్ తిడతాడు. అతని దగ్గరికి వెళ్లి వ్యక్తిత్వానికి కొలమానం చదువు కాదు అంటూ మందలిస్తుంది. ఒకవేళ అలాంటి చదువు రానివాడు మీకు ఎదురుపడితే మీరు పెళ్లి చేసుకుంటారా అని దివ్యని అడుగుతాడు దేవుడు.