Intinti Gruhalakshmi March 15 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో నవ్వులు వినిపిస్తే ఎవరు వచ్చారు అనుకుంటూ లోపలికి వెళ్తుంది దివ్య. సడన్గా ఆమెని అక్కడ చూసి షాక్ అవుతారు నందు లాస్య ఎక్కడ నిజం బయటపెట్టేస్తుందో అని భయపడతారు. ఎవరి అమ్మాయి అని అడుగుతాడు వాసుదేవ్. దివ్య అని చెప్తాడు నందు.ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అంటుంది వాసుదేవ్ భార్య.

భయంతో వణికిపోతున్న లాస్య..

ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు కదా వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా అంటుంది లాస్య. మాట్లాడుతున్నాం కదా ఎందుకలా దూరిపోతావు అంటూ చీదరించుకుంటాడు వాసుదేవ్. చిన్నప్పుడే డాక్టర్ కావాలని హడావుడి పడే దానివి, అనుకున్నది సాధించావు అంటూ అప్రిషియేట్ చేస్తాడు వాసుదేవ్. మొత్తానికి పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు నువ్వు హ్యాపీయే కదా అంటాడు.

అంతకన్నా ఏ తల్లి కైనా ఆనందం ఏముంటుంది అంటుంది తులసి. పైకి అలా అంటుంది కానీ తన మనసులో అసంతృప్తి నాకు తెలుసు అంటుంది దివ్య. ఆ మాటకి షాక్ అయిన వాసుదేవ్ అసంతృప్తి అంటున్నావేంటి అంటాడు. అందరి కోసం అన్ని చేసింది కానీ తనకి అసంతృప్తి మిగుల్చుకుంది అంటుంది దివ్య. అసంతృప్తి అంటున్నావేంటి అంటే కలిసి ఉండవలసిన వాళ్ళతో విడిపోతే అసంతృప్తి కదా అంకుల్ అంటుంది.

దివ్యని లాక్కుని వెళ్లిపోయిన లాస్య..

ఇప్పుడు తను ఎవరితో విడిపోయింది అంటాడు వాసుదేవ్. దివ్య ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని పిల్లలిద్దరూ చెరో వైపుకి వెళ్లిపోయారు కదా ఆ విషయాన్నే చెప్తుంది అంటూ దివ్య నువ్వు ఫ్రెష్ అవ్వాలి కదా అంటూ ఆమెని లాక్కొని వెళ్లిపోబోతుంది లాస్య. అది నీ డ్యూటీ కదమ్మా మధ్యలో లాస్య ఆంటీ గోల ఏంటి అంటుంది దివ్య.

ఇక్కడ కూడా దూరిపోతుంది, మాట్లాడుతుంది కదా మాట్లాడనివ్వు అంటూ చిరాకు పడతాడు వాసుదేవ్. ఎంతసేపు ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది అంటూ దివ్యని లాక్కు వెళ్ళిపోతుంది లాస్య. పిల్లలు దగ్గర లేరు అని చెల్లెమ్మ బాధపడుతుంటే నువ్వు తనని ఊరడించాలి కదా అలా వదిలేస్తావా అని అడుగుతాడు వాసుదేవ్.

రాజ్యలక్ష్మి ని రెచ్చగొడుతున్న బసవయ్య..

అన్నయ్యకి నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నానేమో అనుకుంటుంది తులసి. మరోవైపు రాజ్యలక్ష్మి ని రెచ్చగొడుతూ ఉంటాడు బసవయ్య, అతని భార్య. నా కొడుకు నా కొడుకు అని పెంచావు ఇప్పుడు అమ్మ చేదయింది, తన మనసులో మాటని బయట పెట్టలేక ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకున్నాడు తెలివిగా ప్రవర్తిస్తున్నాడు నీకు అర్థం అవుతుందా అంటాడు బసవయ్య.

నేను ఎప్పటికైనా మాట మీద నించుంటున్నాను, నేను నిప్పుల్లో దూకమంటే ఆలోచించకుండా దూకుతాడు ఎప్పటికీ వాడిని నా గుప్పెట్లో నుంచి వదలను అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వు వాడిని హిప్నటైజ్ చేయడం కాదు వాడే నిన్ను హిప్నటైజ్ చేస్తున్నాడు అంటాడు వాసుదేవ్. అంతలోనే అక్కడికి విక్రమ్ రావటంతో ఆకలి వేస్తున్నా నీ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను పదా భోజనం చేద్దాం అంటుంది రాజలక్ష్మి.

విక్రమ్ మీద ఒ కన్నేసి ఉంచమన్న రాజ్యలక్ష్మి..

నాకోసం ఎందుకు వెయిట్ చేయటం ఎందుకు నాకు ఆకలిగా లేదు నువ్వు తినేసేయ్ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇప్పుడే ఏదో అన్నావ్ అక్క ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఆకలి అంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఇప్పటికైనా మేలుకో, తొండ ముదిరి ఊసరవెల్లి గా మారక ముందే జాగ్రత్త పడు అంటాడు బసవయ్య.

మా ఇద్దరినీ విడదీసే శక్తి ఏదో మా మధ్యకి వచ్చింది అంటుంది రాజ్యలక్ష్మి. మా మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది డేంజర్ బిల్స్ వినిపిస్తున్నాయి అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు బసవయ్య. ఇన్నాళ్లు పూజలు, వ్రతాలు అని చెప్పి మాయ చేసి గుప్పెట్లో పెట్టుకున్నాను మళ్ళీ అదే పని ప్రారంభించాలి మీరు కూడా వాడి మీద ఒక కన్నేసి ఉంచండి అంటుంది రాజలక్ష్మి.

తల్లిని మారిపోయావు అంటున్న దివ్య..

ఆ పెళ్ళికొడుకు కుక్క మొరుగుదామని చూస్తుంది వాడిని కాపలా కుక్కని చేసి టైం దగ్గరకొచ్చింది అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఒంటరిగా పాటలు వింటున్న తులసి దగ్గరికి వచ్చి ఇన్నాళ్ల తర్వాత ఒకప్పటి నీ భర్తకి సేవలు చేసినందుకు ఆనందపడుతున్నావా, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అంటుంది దివ్య. ఇప్పుడు ఏం జరిగింది అని తులసి అంటే నువ్వు చాలా మారిపోయావు అంటుంది దివ్య.

మీ అమ్మ మారడం అనేది జరగని పని అంటాడు పరంధామయ్య. ఇప్పుడు నీ అనుమానం ఏంటి అని తులసి అడిగితే దూరంగా ఉంచాలో ఆ మనిషి మాటే నువ్వు వింటున్నావు దీన్ని మారటం అనరా అంటుంది దివ్య. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని తులసి అంటే లాస్య ఆంటీ గురించి మాట్లాడుతున్నాను, ఆమె మాట విని నువ్వు నటించడం ఏంటి అంటుంది దివ్య.

దివ్య కోరిక విని కంగారుపడ్డ తులసి..

లాస్య అడిగిందని నేను నటించలేదు మీ నాన్న కోసమే నటిస్తున్నాను అది కూడా మనసు చంపుకొని అంటుంది తులసి. నువ్వు నాన్న భార్యాభర్తల్లాగా కనిపిస్తూ ఉంటే మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉంది, ఈ క్షణంలో ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుందో అనిపిస్తుంది ఇది నీ కూతురు కోరిక తీరుస్తావా ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు చిన్న ఆశ అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య.

చాక్లెట్ అడిగినట్లు అడిగి వెళ్లిపోతుంది అంటుంది తులసి. అదేదో చిన్న పిల్ల దాని ఆశలు దానికి ఉంటాయి కదా అంటాడు పరంధామయ్య. కాలానికి క్లారిటీ ఎక్కువ మనకి ఏది అవసరమో అదే ఇస్తుంది అంటుంది తులసి.మరోవైపు తనలో తానే నవ్వుకుంటున్న విక్రమ్ ని చూసి ఇప్పుడు అంతా మురిసిపోవటం అవసరమా అంటాడు దేవుడు. కళ్ళు ముసినా, తెరిచినా తనే గుర్తొస్తుంది అంటాడు విక్రమ్.

విక్రమ్, దివ్యల మధ్య స్టార్ట్ అయిన కమ్యూనికేషన్..

అయితే చాలా కష్టమే పచ్చబొట్టు లాగా మీ లవ్ కూడా మనసులో స్ట్రాంగ్ గా ముద్ర వేసుకుంది అంటాడు దేవుడు. అదే సమయంలో దివ్య అద్దంలో చూసుకుంటూ ఇది నేను రోజు నవ్వుకునే నవ్వే అయినా కానీ ఈరోజు కొత్తగా అందంగా కనిపిస్తుంది ఎందుకై ఉంటుంది విక్రం కాంప్లిమెంటు ఇచ్చినందుకా అనుకుంటుంది. అదే సమయంలో మీకున్న ఫీలింగ్ ఆ అమ్మాయి కూడా వచ్చిందేమో కనుక్కోండి అంటాడు దేవుడు.

ఎలా కనుక్కోవాలి అని విక్రమ్ అంటే నీ ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టండి అట్నుంచి వెంటనే రిప్లై వస్తే నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టే అంటాడు దేవుడు. పెట్టేయమంటావా అంటూ స్పెల్లింగ్ మిస్టేక్ హాయ్ కొడతాడు. అందుకే మిమ్మల్ని చదువుకోమని ఇది మీకన్నా నేనే బెటరు అంటూ కరెక్ట్ గా స్పెల్లింగ్ చెప్పి మెసేజ్ పెట్టిస్తాడు దేవుడు. అట్నుంచి అంతే ఫాస్ట్ గా రిప్లై వస్తుంది.

నందుని నిలదీస్తున్న వాసుదేవ్..

మీకన్నా స్పీడ్ గా ఉన్నట్టున్నారు, ఆవిడ కూడా మీ దారిలోనే ఉన్నారు అంటాడు దేవుడు. మెసేజ్ పెట్టాడు అంటే నా గురించే ఆలోచిస్తున్నాడన్నమాట సరదాగా పలకరిద్దాం అనుకుంటూ డిన్నర్ అయిందా అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ కి ఆనందంతో ఊగిపోతూ దేవుణ్ణి ఊపేస్తాడు విక్రమ్. కట్టుకున్న పెళ్ళాం కూడా ఇంత ముద్దుగా అడగదు అంటాడు దేవుడు.

మరోవైపు భోజనం అయిపోయిన తర్వాత పరంధామయ్య వాళ్ళు గదిలోకి వెళ్లి పడుకుంటారు. కడుపులో ఇంకొంచెం చోటు ఉంటే బాగుండేది చెల్లెమ్మ వంటలు అంత బాగున్నాయి అంటాడు వాసుదేవ్. కంద బచ్చలి కూర మీ ఇద్దరి కాంబినేషన్ లాగా చాలా బాగుంది అంటాడు. ఆ మాటలకి లాస్య వైపు చూస్తాడు నందు నేను మీ ఇద్దరి కాంబినేషన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు లాస్యవైపు ఎందుకు చూస్తున్నావ్ అని నిలదీస్తాడు వాసుదేవ్.

Intinti Gruhalakshmi March 15 Today Episodeలాస్యకి చివాట్లు పెడుతున్న వాసుదేవ్..

అడగడానికి ఏమైనా టాబ్లెట్ ఇమ్మంటారా అని అడుగుతుంది లాస్య పొట్ట పగిలేలాగా తిన్నానని వెటకారమా అంటాడు వాసుదేవ్. జీలకర్ర వేసి మజ్జిగ తీసుకువస్తాను అన్నయ్య తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది అంటుంది తులసి. అది పద్ధతి అంటే చూసి నేర్చుకో అని లాస్యకి చెప్తాడు వాసుదేవ్. బిజినెస్ డీల్ ఉంది కదా అని భరిస్తున్నాను అనుకుంటూ వాసుదేవ్ ని తిట్టుకుంటుంది లాస్య.

వెళ్లి ఆ మజ్జిగ పట్రా, ఊరికే తిను కూర్చుంటే ఏం అరుగుతుంది కాస్త చిన్న చిట్కా పనులు చేయు అంటాడు వాసుదేవ్. నువ్వైనా చెప్పొచ్చు కదరా అని నందుని అంటాడు వాసుదేవ్. వాడు చెప్పినట్టు చెయ్యి లాస్య అంటాడు నందు. కట్టుకున్న పెళ్ళాన్ని బ్రతిమాలినట్లుగా బ్రతిమాలతావ్ ఏంటి అంటాడు వాసుదేవ్.

తరువాయి భాగంలో నీ భార్య ఎవరు, నువ్వు లాస్య వెనకాతల ఎందుకు వెళ్తున్నావు అంటాడు వాసుదేవ్. అన్నిట్లోని దూరతావు కదా ఈ విషయంలో ఏమి మాట్లాడవు ఏమి అంటాడు వాసుదేవ్. మీరు తులసి గదిలోని పడుకోండి అంటుంది లాస్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 15, 2023 at 8:49 ఉద.