Intinti Gruhalakshmi March 16 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య మజ్జిగ తాగటం తేవడానికి లోపలికి వెళ్తుంది అప్పుడు తులసి తో ఇంట్లో పాముని తెచ్చి పెంచుకొని ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు. మొగుడికి విడాకులు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే, మగవాడు ఎంత మంచివాడు అయినా చపలత్వం ఉంటుంది.

తులసికి సలహాలిస్తున్న వాసుదేవ్..

పక్కింటి పుల్ల కూర మీదికి మనసు లాగుతూ ఉంటుంది ఒకవేళ నీ మొగుడు మంచివాడైనా ఆ చిచ్చు బుడ్డి ఉండనివ్వదు నీ మంచి కోసమే చెప్తున్నాను విను అంటాడు వాసుదేవ్. మీకు పక్కలో ఆ గదిలో ఏర్పాటు చేశాను అంటుంది తులసి మేం కాసేపాగి పడుకుంటాము మీరు వెళ్లి పడుకోండి అంటాడు వాసుదేవ్.

తులసి ఒకవైపు, నందు లాస్య వెనుక వెళ్తుంటే వాళ్లని ఆపి నీ భార్య ఎవరు అని అనుమానంగా అడుగుతాడు వాసుదేవ్. ఏమైంది అని నందు అడిగితే, నీ భార్య తులసి కదా ఆ గదిలోకి వెళ్లకుండా లాస్య వెనుక అసలు ఎందుకు వెళ్తున్నావు అని నిలదీస్తాడు నందు. తనకి ఆఫీస్ వర్క్ ఏదో ఉందంట నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అంటాడు నందు. అందుకని భార్యని వదిలేస్తావా.

నందుని మందలిస్తున్న వాసుదేవ్..

ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ అవ్వాలి కానీ, ఇదేనా నీకు భార్య మీద ప్రేమ ఇంకా నయం లాస్య రూమ్ లో పడుకుంటాను అనలేదు అంటాడు వాసుదేవ్. అన్ని విషయాల్లోనే దూర్ పోతావు కదా ఈ విషయంలో ఏం మాట్లాడవేమి అంటూ లాస్యని మందలిస్తాడు వాసుదేవ్. ఆయన చెప్పింది కరెక్టే ఇబ్బంది అయినా నువ్వు తెలుసు గదిలో పడుకోవడమే కరెక్ట్ అంటుంది లాస్య.

ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మీరు మరీనీ వాళ్లు ఏమనుకుంటారు అని భర్తని మందలిస్తుంది వాసుదేవ్ భార్య. ఇది మా చెల్లెలు ఇల్లు ఎవరు ఏమి అనుకోరులే అంటాడు వాసుదేవ్. మరోవైపు అన్నయ్య పడుకోడానికి వెళ్ళిపోయాక చెప్తాను మీరు మీ గదిలోకి వెళ్లి పడుకోండి అంటుంది తులసి. నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఈ మధ్య రాత్రి లేసి చెక్ చేస్తాడేమో అంటాడు నందు.

వాసుదేవ్ ని తిట్టుకుంటున్న లాస్య..

చెల్లిలి ఇంటికి తినడానికి వచ్చి తిని పడుకోవచ్చు కదా ఎవరు ఏ గదిలో పడుకుంటే వాడికి ఎందుకు అంటూ వాసుదేవ్ ని తిట్టుకుంటుంది లాస్య. నందుకి ఫోన్ చేయాలనుకుంటుంది కానీ ఆ తింగరోడికి తెలిసిందంటే వచ్చిన డీలింగ్ కాస్త పోతుంది అనుకుంటుంది. మరోవైపునందు మనిద్దరం రాత్రంతా క్యారం బోర్డు ఆడుకుందాము అప్పుడు ఇద్దరికీ ప్రాబ్లం ఉండదు అంటాడు. వాసుదేవ్ అన్నయ్య వాళ్ళని కూడా పిలుద్దాము.

నలుగురిని ఆడుకోవచ్చు అప్పుడు వాళ్లకు కూడా ఏ అనుమానం రాదు అని వెటకారంగా ఉంటుంది తులసి. అది అర్థం చేసుకోలేని నందు ఓకే అంటాడు. తులసి ఎగదిగా చూస్తుంది. లాస్య ని కూడా పిలుద్దాము లేకపోతే అనుమానంతో తనకి నిద్ర పట్టదు అంటాడు నందు. ఇక మిగిలింది అత్తయ్య మామయ్య కదా వాళ్ళు కూడా పిలుద్దాం.

నందు గది ముందు హడావిడి చేస్తున్న వాసుదేవ్..

ఒక మూలన కూర్చుని రామకోటి రాసుకుంటారు అంటుంది తులసి. నేను కింద పడుకుంటాను నువ్వు మంచి మీద పడుకో ఉంటాడు నందు. మీకు అలవాటు లేదు మీరు మంచం మీద పడుకోండి అంటుంది తులసి మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అంటాడు నందు. నేను కూడా మంచం మీద పడుకుంటాను మీకు నాకు మధ్యలో దిండు పెడతాను అంటూ మధ్యలో దిండు పెట్టుకొని పడుకుంటారు తులసి నందు.

ఆ తులసి మీద నమ్మకంతో ఊరుకున్నాను లేకపోతే తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేసే దాన్ని అంటూ ఫ్రెస్టేట్ అయిపోతుంటుంది లాస్య. పొద్దు పొద్దున్నే తలుపు తీయమంటూ నందు గది ముందు హడావిడి చేస్తాడు వాసుదేవ్. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య పరందామయ్య దంపతులు ఏమైంది అని అడుగుతారు. మీకు ఏమీ తెలియదా లేకపోతే తెలిసి నాటకం ఆడుతున్నారా అంటాడు వాసుదేవ్.

నందు దంపతులకు చివాట్లు పెడుతున్న వాసుదేవ్..

కంగారుగా లేచిన నందు తలుపు తీయడానికి వెళ్ళబోతు నా కుడి కన్ను అదురుతుంది ఎందుకో భయంగా ఉంది అంటాడు నందు. తప్పు చేయటమే తప్పు,తప్పు చేసి దాయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు వెళ్లి తలుపు తీయండి అంటుంది తులసి. తలుపు తీస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తులసి గదిలోకి వస్తారు. ఎంతసేపైనా తలుపు తీయడం లేదు ఏమి.

ఛాన్స్ దొరికింది కదా అని ఈ రోజంతా గదిలోనే ఉండిపోవాలనుకుంటున్నారా, మిమ్మల్ని అడగవలసినవి కడగవలసినవి చాలా ఉన్నాయి అంటాడు వాసుదేవ్. నిజం తెలిసిపోయింది ఏమో కానీ కంగారు పడతాడు నందు. నువ్వు కూడా వాడితో కలిసిపోయి చేతులు కలిపేసావా అని తులసిని అడుగుతాడు వాసుదేవ్. తులసి కూడా కంగారుగా చేస్తుంది అలా బయటికి రండి మాట్లాడుకుందాం అంటాడు.

తప్పంతా నాదే అంటున్న నందు..

ఏవండీ అంటూ భార్య సర్ది చెప్పబోయినా ఊరుకోడు నా కడుపు రగిలిపోతుంది ప్రాణ స్నేహితుడిని ఇంత మోసం చేస్తాడా, రెండు రోజులు ఉండి పోయేవాడు వాడికే నిజం తెలుస్తుంది పిచ్చోడు అని అనుకున్నావా అంటూ నందు మీద కేకలు వేస్తాడు. నువ్వు కూడా ఏంటమ్మా నువ్వు చేసిన పాయసం అంత స్వచ్ఛంగా ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు కూడా మోసం చేశావు అంటూ తులసిని నిలదీస్తాడు.

నేను ఇంత త్యాగం చేశాను అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమో అనుకుంటుంది లాస్య. నిజమే తప్పు చేశాను దానికి పూర్తి బాధ్యత నాది తులసికేమీ తెలియదు అంటాడు నందు. తప్పు చేసిన వాళ్ళకి తీర్పు చెప్పే హక్కు లేదు మీ ఇద్దరు తలవంచుకొని నుంచోండి అంటాడు వాసుదేవ్. అమ్మని అపార్థం చేసుకుంటున్నారు అంటుంది దివ్య.

వాసుదేవ్ ని రిక్వెస్ట్ చేస్తున్న పరంధామయ్య దంపతులు..

చిన్న విషయాన్ని పెద్దది చేయకు పెద్దవాళ్ళం మేం రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని ఇంతటితో వదిలేయ్ అంటారు పరంధామయ్య దంపతులు. వాసుదేవ దంపతులు బయటకు వెళ్లి బొకేతో గదిలోకి వచ్చి హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ వాళ్ళిద్దరికీ బొకే ఇస్తాడు. బిజినెస్ డీల్ ఏంటో గాని నిన్న మ్యారేజ్ లైఫ్ కి డేమేజ్ అయ్యేలాగా ఉంది అనుకుంటుంది లాస్య.

అలా బిత్తర చూపులు చూడకపోతే మా నలుగురికి ఒక ఫోటో తీయొచ్చు కదా అంటూ లాస్యని అడుగుతాడు వాసుదేవ్. ఇన్ని సంవత్సరాలైనా ఆ జంట చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో, ప్రేమంటే ఇది నువ్వు ఉన్నావు మొగుడుతో విడాకులు తీసుకొని అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. పెళ్లయ్యి 28 ఏళ్లయింది కదా 28 ఫోటోలు తీయు అంటాడు వాసుదేవ్.

వాసుదేవ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు అంటున్న లాస్య..

సోషల్ మీడియాలో చూసి నేను విషెస్ చెప్తున్నాను కానీ ఇంట్లో ఉన్న మీరు పట్టించుకోకపోవడం ఏంటి కనీసం ఇప్పుడైనా చెప్పండి అంటూ పరంధామయ్య వాళ్ళని అడుగుతాడు వాసుదేవ్. ఏమని చెప్పమంటారు అని లాస్య ని అడుగుతుంది దివ్య. జీవితాంతం ఇలాగే కలిసి ఉండమని అడగనా అంటే వెటకారంగా లాస్య ని చూస్తూ అంటుంది దివ్య. చాలా ఎక్కువ చేస్తున్నాడు ఇక్కడితో ఆపేస్తాడు ఇంకా ఎక్కడిదాకా వెళ్తాడు అనుకుంటుంది లాస్య.

తులసిని చాలా ఇబ్బంది పెడుతున్నాను నిజం చెప్పేస్తాను అనుకుంటాడు నందు. త్వరగా పెద్దవాళ్ల ఆశీర్వచనం తీసుకుంటే తర్వాత బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకోవచ్చు అంటుంది లాస్య. పరంధామయ్య దంపతుల కాళ్ళకి దండం పెడతారు నందు దంపతులు. ఏమని దీవించాలో అర్థం కావట్లేదు అని అనసూయ అంటే మీ అబ్బాయి ఇంకా పైకి ఎదగాలని ఆశీర్వదించండి అంటుంది తులసి.

Intinti Gruhalakshmi March 16 Today Episode నిజం చెప్పడానికి డిసైడ్ అయిన తులసి, నందు..

ఎలాగూ ఈయన నిజం చెప్పటం లేదు నేను నిజం చెప్పేస్తాను అనుకుంటూ ఉండగానే నేనే నిజం చెప్పేస్తాను అంటాడు నందు. ఒకసారి గా షాక్ అవుతుంది తులసి. ఏంటి నీ పెళ్లి రోజు గురించేనా అంటాడు నందు. అవును తులసికి కూడా తెలియకుండా సాయంత్రం సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాను అంటాడు నందు. ఇప్పుడు మాత్రం ఏం పోయింది దాన్నే ఫాలో అవుతాము అంటాడు వాసుదేవ్.

దివ్యని సాయంత్రం హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చేయమంటాడు. తరువాయి భాగంలో నందు దంపతులకు బొట్టు పెట్టి బట్టలు పెడతారు వాసుదేవ్ దంపతులు. అంతలోనే అక్కడికి దీపక్ వస్తాడు. వీడు ఇప్పుడే రావాలా అనుకుంటాడు నందు. మీ అక్క బావల పెళ్లిరోజుని విష్ చేయటానికి వచ్చావా అంటాడు వాసుదేవ్. ఏంటి ఈరోజు పెళ్లిరోజా అని ఆశ్చర్యంగా అడుగుతాడు దీపక్.