Intinti Gruhalakshmi March 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో బొమ్మ బొరుసు ఆడుతుంటాడు విక్రమ్. ఈ వయసులో ఇదేం ఆట చినబాబు అంటాడు దేవుడు. ఇది ఆట కాదు నా మనసులో ఉన్నది జరుగుతుందో లేదో అని పరీక్షించుకుంటున్నాను అంటాడు విక్రమ్. ఇలా కూడా పరీక్షించుకుంటారా అయినా మీ మనసులో ఏముందో చెప్పండి అంటాడు దేవుడు.

నిజాన్ని చెప్పమంటున్న దేవుడు..

దేవుడికి తెలుసు అంటాడు విక్రమ్. నిజంగానే నాకు తెలియదండి అంటే ఎగస్ట్రాలు చేయొద్దు నీది పేరు మాత్రమే దేవుడు నేను చెప్పేది ఆ దేవుడు గురించి అంటాడు విక్రమ్. ఆ దేవుడికి చెప్తే వినేసి ఊరుకుంటాడు. అదే ఈ దేవుడికి చెప్తే తెలివైనోడు కదా ఒక సలహా ఇస్తాడు మీ మనసులో ఏముందో చెప్పండి అంటాడు దేవుడు.

అదేరా ఆ అమ్మాయి మళ్లీ కలుస్తుందంటావా అంటాడు విక్రమ్. ఆ మాత్రానికి ఇంత ఆలోచన ఎందుకు ఆ అమ్మాయి ఫోన్ చేసి మీరు పని చేస్తున్న హాస్పిటల్ నాది అని చెప్పండి అంటాడు దేవుడు. అలా అయితే నా ఆస్తిని చూసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నన్ను నన్నుగా ప్రేమించాలి అంటాడు విక్రమ్. తను ఎలాగూ ఎముకల డాక్టర్ కాబట్టి ఏ కాలు చేయి విరిగినోడిని తీసుకెళ్లండి.

విక్రమ్ ని బ్రతిమాలుకుంటున్న దేవుడు..

అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా చేయించి ఆమెతో పరిచయాన్ని పెంచుకోండి అంటాడు దేవుడు. ఐడియా బానే ఉంది కానీ ఎప్పటికీ ఇప్పుడు కాలు చేయి విరిగినోడు ఎక్కడ దొరుకుతాడు కష్టం కదా అంటాడు ఆలోచించండి ఎవడో ఒక తలకు మాసినోడు దొరుకుతాడు అంటాడు దేవుడు. విక్రమ్ చూపు దేవుడి మీద పడుతుంది. అది అర్థం చేసుకున్న దేవుడు నన్ను వదిలేయండి పెళ్ళాం పిల్లలులేనివాడిని.

నా జీవితంతో ఆడుకోవద్దు అంటాడు. దేవుణ్ణి పట్టుకునే ప్రయత్నంలో అతను కాలుజారి డాబా మీద నుంచి పడిపోతాడు. నేరుగా హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది దివ్య. పేషెంట్ ని తీసుకొచ్చాను అంటూ ఆమెతో కబుర్ల లో పడతాడు విక్రమ్. బాబు మీ ముచ్చట్లు తర్వాత ముందు నా సంగతి చూడండి అంటూ గోల పెడతాడు దేవుడు.

విక్రమ్ ని తెగ పొగుడుతున్న దివ్య..

అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది దివ్య. వీడికి కాలు చేయి విరిగిపోయిందా ఎన్ని నెలలైనా పర్వాలేదు నేను చూసుకుంటాను మాకు ఒక రూమ్ ఇచ్చేయండి అంటాడు విక్రమ్. నేను చెప్పేది కాస్త వినండి అతనికి ఏమీ కాలేదు బానే ఉన్నాడు అంటుంది దివ్య. నేను ఒప్పుకోను అంటాడు విక్రమ్ మీరు ఒప్పుకునేదేంటి అంటుంది దివ్య. అంటే చిన్న బాబుకి నేనంటే విపరీతమైన ఇష్టం అందుకే నా మీద అంత శ్రద్ధ అంటాడు దేవుడు.

అతను మీకు ఏమవుతారు అని దివ్య అడిగితే నేనే అతనికి పని వాడిని అంటాడు దేవుడు. ఒక పని వాడి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు మీరు నిజంగా గ్రేట్ అంటూ ఇంగ్లీషులో మాట్లాడుతుంది. అర్థం కానట్లుగా మొహం పెడతాడు విక్రమ్. ఏమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు వాడిన ఇంగ్లీష్ ని వాడనని మా తాత మీద ఒట్టేసాను అంటాడు విక్రమ్.

బసవయ్యతో గొడవకు దిగిన తులసి..

అన్ని మంచి క్వాలిటీస్ మీలోనే ఉన్నాయి అంటూ పొగుడుతుంది దివ్య. దేవుని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. మరోవైపు గుడిలో క్యూలో ఉంటుంది తులసి. అప్పుడే అక్కడికి రాజ్యలక్ష్మి సెక్యూరిటీతో వస్తుంది. పొద్దుటినుంచి లైన్ లో నిల్చున్నాము ఇప్పుడు వీళ్ళు వచ్చి అందరిని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు అంటారు అక్కడున్న వాళ్ళు.

డబ్బు ఉన్నవాళ్లు కదా అన్నీ చెల్లుతాయి మనం ఏం చేయగలం అంటుంది మరోకావిడ. మేడంకి లేటవుతుంది అడ్డం వచ్చిన వాళ్ళని పక్కకు తోసేయండి అంటాడు బసవయ్య. తులసి వచ్చి బసవయ్యని ఆగమంటుంది. ఎప్పటికీ చాలా ఆలస్యమైంది ఇంకేం ఆగమంటావు వెళ్లి లైన్లో నుంచో అంటాడు బసవయ్య. నాకు క్రమశిక్షణ తెలుసు తెలియదల్లా నీకే.

ముందు వెనక ఆలోచించి మాట్లాడమంటున్న బసవయ్య..

ఇంతమంది పెద్ద చిన్న ముసలి ముతక అందరూ లైన్ లో నిలబడ్డారు మీరు అలా తోసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి, దేవుడికి అందరూ సమానమే అంటుంది తులసి. దేవుడికి అందరూ సమానం కాదు ఎవరి తాహతను బట్టి వాళ్ళకి దర్శనం ఇస్తాడు అంటాడు బసవయ్య. దేవుడేమీ మిమ్మల్ని పిలిచి దర్శనం ఇవ్వటం లేదు, మీరే తోసుకొని వెళ్ళిపోతున్నారు అంటుంది తులసి.

ఏంటి నీ గోల విఐపి లు సైరెన్లు వేసుకుని కారులో వచ్చినప్పుడు కామ్ గా పక్కకి జరుగుతున్నారా లేదా అంటాడు బసవయ్య. బయట ఏం జరుగుతుందో మాకు అనవసరం గుడిలో సహించం. ఆవిడ ఎవరో కానీ వచ్చి లైన్లో నిలబడమని చెప్పండి అంటుంది తులసి. కయ్యానికొచ్చే బసవన్న లాగా బాగా రంకేలేస్తున్నావు కానీ కాస్త ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడు.

రాజ్యలక్ష్మి తోనే తేల్చుకుంటాను అంటున్న తులసి..

అసలు మా అక్క ఎవరో తెలుసా అంటాడు బసవయ్య. అసలు నీతో నాకు మాటలు ఏంటి మీ అక్కని రమ్మను ఆవిడతోనే తేల్చుకుంటాను అంటుంది తులసి. ఇదంతా గమనిస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ప్రపంచం చిన్నదని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని తెలియదు ఆరోజు హాస్పిటల్ లో గొడవ పడింది మళ్ళీ ఇక్కడ గొడవ పడుతుంది అనుకుంటుంది రాజ్యలక్ష్మి.

రాజ్యలక్ష్మి ని చూసిన తులసి నేను గుర్తున్నానా అని అడుగుతుంది. పెద్ద మదర్ తెరిసావని నిన్ను గుర్తుంచుకోవటానికి అంటాడు బసవయ్య. మేడం ఇలాంటి వాళ్ల వల్లే మీ పేరు పోతుంది. ఎందుకు అనవసరంగా పేరు పోగొట్టుకుంటారు అంటుంది తులసి. మా అక్క ఈ గుడికి డొనేషన్ ఇచ్చింది అంటాడు బసవయ్య.

బసవయ్యని మందలిస్తున్న రాజ్యలక్ష్మి..

డొనేషన్ అంటే విరాళం ఇవ్వడం అంతేగాని దేవుడి దగ్గర హక్కులు కొనుక్కోవడం కాదు అంటుంది తులసి. ఆరోజు హాస్పిటల్ దగ్గర కూడా పేషెంట్ కి న్యాయం చేశారు. ఇప్పుడు కూడా న్యాయాన్ని పాటించండి దేవుడికి కూడా ఇలాంటివి నచ్చదు అంటుంది తులసి. అసలు నువ్వు ఎవరివి దేవుడి తరుపున వకాలత పుచ్చుకోవడానికి అంటాడు బసవయ్య.

తమ్ముడు ఎక్స్ట్రాలు చేయకు ఆవిడ చెప్పింది దాంట్లో కూడా న్యాయం ఉంది దేవుడు ముందు అందరూ సమానమే నేను వెళ్లి లైన్లో నుంచి ఉంటాను మీరు కూడా లైన్ లో నుంచోండి అంటుంది రాజ్యలక్ష్మి. అక్క ఏంటి ఇలా తయారయింది అనుకుంటాడు బసవయ్య. ఆవిడని చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు కూడా వెళ్లి లైన్లో నుంచోండి అని మందలిస్తుంది తులసి.

తులసి సంగతి తేలుస్తానంటున్న రాజ్యలక్ష్మి..

ఈలోపు పంతులుగారు వచ్చి ఈ పూట పాట పాడడానికి అమ్మాయి రాలేదు మీకు వీలైతే పాట పాడండి అని తులసిని అడుగుతారు. ఇది నాకు దక్కిన అదృష్టం అనుకుంటాను అంటూ పంతులు గారితో వెళ్తుంది తులసి. పాట పాడుతున్న తులసిని చూసి ఎవరు ఈ తులసి నాకు తగులుతుంది. ఎక్కడో ఓ దగ్గర దొరక్కపోదు అప్పుడు చెప్తాను తన పని అనుకుంటుంది రాజ్యలక్ష్మి.

మరోవైపు రాములమ్మ కాఫీ తీసుకొచ్చి వాసుదేవ్ కి ఇస్తుంది. ఇక్కడ ఉన్న రెండు రోజులు నేను తులసి చేతి వంట తప్పితే తినను తాగనని తెలుసు కదా అంటాడు వాసుదేవ్. ఇది తులసమ్మ చేసిన కాపీయేనండీ అంటుంది రాములమ్మ. కాఫీ తాగిన వాసుదేవ్ నిజమే ఇది తులసి చేతి కాఫీ అంటాడు అంతలోనే అక్కడికి తులసి వస్తుంది. మేము షాపింగ్ కి వెళ్లి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటాడు వాసుదేవ్.

 

Gruhalakshmi March 17 Today Episode మనసు చంపుకొని తల్లికి మాటిచ్చిన విక్రమ్..

సోమవారం కదా అన్నయ్య అందుకే గుడికి వెళ్ళాను అంటుంది తులసి. సోమవారము అని వెళ్ళావా లేకపోతే మ్యారేజ్ డే అని వెళ్ళావా? అంటాడు వాసుదేవ్. తరువాయి భాగంలో మరోవైపు శివుని ముందు పూజ చేస్తుంది రాజ్యలక్ష్మి. పొద్దుటి నుంచి వచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు లేదా అక్క అంటాడు బసవయ్య.

నా బిడ్డ కోసం పూజ చేస్తున్నాను మనసు మరీ మాట వినే వరకు నేను ఇక్కడి నుంచి ఇలాగను అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది రాజ్యలక్ష్మి. అదంతా చూస్తున్న విక్రమ్ నీ సమస్య ఏంటి అని అడుగుతాడు. నువ్వు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ తల్లికి మాటిస్తాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 17, 2023 at 8:19 ఉద.