Intinti Gruhalakshmi March 18 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సోమవారం కదా గుడికి వెళ్లాను అంటుంది తులసి సోమవారం అని వెళ్ళావా లేకపోతే మ్యారేజ్ డే అని వెళ్ళావా అయినా మ్యారేజ్ డే రోజు భర్త పక్కన రాకుండా వెళ్ళటం ఏంటి, నిష్టగా సాంప్రదాయాలు పాటిస్తావు కదా అలా వెళ్లకూడదని తెలియదా అంటాడు వాసుదేవ్.

తులసికి డైవర్స్ ఇచ్చేయమంటున్న వాసుదేవ్..

పాపం తులసి అడిగింది తనకే ఖాళీ లేక ఆయనే వెళ్ళలేదు అంటుంది లాస్య. అంతా బిజీ ఏంటి అంటూ ముందు ని పిలిచి అర్జెంటుగా మా చెల్లెలికి డైవర్స్ ఇచ్చేయ్ అని చెప్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. శుభమా అని పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకుంటుంటే డైవర్స్ అంటారేంటి అంటుంది వాసుదేవ్ భార్య. మరి వాడు చేసిన పనేంటి పెళ్లి రోజు భార్యతో కలిసి గుడికి వెళ్లకపోవటం ఏంటి తను ఎంత ఫీల్ అయి ఉంటుంది.

తనకి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం తప్పితే తన గురించి ఆలోచించుకోవటం తెలియదు. తనకి ఏం కావాలో అడగడం తెలియదు తనకి ఏం కావాలి అడగడం తెలియదు తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు నందు. చూసావు కదా అందరి ముందు నాకు మాట ఇచ్చాడు మాట తప్పితే నాకు ఫోన్ చెయ్యు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను అంటాడు వాసుదేవ్.

లాస్య కి చురకలు పెడుతున్న రాములమ్మ..

చేసిన గొడవ చాలు కానీ రండి బట్టలు పెడదాము అంటూ భర్తని పిలిచి ఇద్దరు దంపతులు నందు దంపతులకు బట్టలు పెడతారు. ఇంత కలలాగా ఉంది ఇలాంటి క్షణాలని జీవితంలో చూస్తాం అనుకోలేదు అనుకుంటారు పరంధామయ్య దంపతులు. సాయంత్రం పార్టీలో వాళ్లు కొత్త డ్రెస్ వేసుకునే లాగా చూసుకునే బాధ్యత నీది అంటూ లాస్య కి బాధ్యతని అప్పగిస్తుంది వాసుదేవ్ భార్య.

అలా అని వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకు అంటూ చిరాకు పడతాడు వాసుదేవ్. కక్కలేక మింగలేక చిరాకు పడుతుంటుంది లాస్య. ఒక్క నిమిషం వాళ్ళిద్దర్నీ పక్కపక్కన చూస్తేనే మీరు భరించలేకపోతున్నారు అలాంటిది ఆవిడ భర్తని మీరు శాశ్వతంగా లాక్కున్నారు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది.దేవుడు చూస్తూ ఊరుకోడు అంతకంత ఎప్పుడో తిరిగి ఇచ్చేస్తాడు అంటూ చివాట్లు పెడుతుంది రాములమ్మ.

సడన్ ఎంట్రీ ఇచ్చిన దీపక్..

నోరు ముయ్యి అంటూ తనమీద చిరాకు పడుతుంది లాస్య. అంతలోనే అక్కడికి దీపక్ వస్తాడు. తనని చూసి నందు దంపతులు ఇప్పుడే రావాలా అనుకుంటూ టెన్షన్ పడతారు. ఇతను మీ తమ్ముడు కదా అంటూ దీపక్ తో పరిచయం చేసుకుంటాడు. నన్ను చూడటానికి వచ్చావా లేకపోతే మీ అక్క బావల పెళ్లిరోజుని విష్ చేయడానికి వచ్చావా అంటాడు వాసుదేవ్.

ఎందుకు అందరూ టెన్షన్ గా కనిపిస్తున్నారు అక్క ఒంటరిగా ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవాలి అనుకుంటాడు దీపక్. బావమరిదిని పలకరించవేంటి అంటాడు వాసుదేవ్. పెళ్లిరోజు గిఫ్ట్లు తీసుకురాకుండా వచ్చాడు అందుకే బావమరిది మీద అలిగాను అంటాడు నందు. మా అక్కనే నీకు ఇచ్చేశాను అంతకంటే విలువైనది ఏమైనా ఉంటే చెప్పు తీసుకొస్తాను అంటాడు దీపక్.ఆ మాటలకి నవ్వుకుంటారు అందరు.

నర్స్ ని ట్రాప్ చేస్తున్న సంజయ్..

మరోవైపు ఒక పేషెంట్ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ కి 8000 అవుతున్నది అని చెప్పావు కదా ఇప్పుడు 25000 కట్టమన్నారు అంటూ దివ్యకి చెప్పుకుంటుంది. అంతా అవసరం లేదే అంటూ రిపోర్ట్స్ చూస్తుంది దివ్య. నేను చెప్పింది ఏంటి వీళ్లు చేసింది ఏంటి అంటూ మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి వెళుతుంది దివ్య. అప్పటికి సంజయ్ అక్కడ ఒక నర్స్ ని ట్రాప్ చేస్తూ ఉంటాడు.

మీ అమ్మ గారితో పెళ్లి గురించి మాట్లాడుతాను అన్నావు ఇప్పటికి వచ్చి మాట్లాడలేదు అంటుంది నర్స్. అలా అని నిన్ను ప్రేమించడం మానలేదు కదా నీకు కావలసినవన్నీ కొని పెడుతున్నాను నా పక్కనే కూర్చోబెట్టుకుని షికార్లు తీసుకెళ్తున్నాను, నీ మొహానికి కోపం సూట్ కాలేదు అంటూ ఆమెకి చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చి నెల రోజుల్లో కచ్చితంగా మన పెళ్లి జరిగి తీరుతుంది అంటూ ఆమె మీద ఒట్టేసి చెప్తాడు సంజయ్.

సంజయ్ ని నిలదీసిన దివ్య..

ఆ మాటలకి ఏం కరిగిపోతుంది నర్సు. ఇంతలో ఎవరో డోర్ కొడతారు. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నారు అంటే కచ్చితంగా దివ్య అయి ఉంటుంది నువ్వు వెళ్ళు అంటూ ఆమెని పంపించేస్తాడు సంజయ్. చాక్లెట్ తో సహా బయటికి వస్తున్న సిస్టర్ ని చేస్తుంది దివ్య. సంజయ్ దగ్గర పడి ఉన్న హెయిర్ క్లిప్ ని చూసి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. బొత్తిగా మేనర్స్ లేనట్టు ఉంది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ దివ్యని మందలిస్తాడు సంజయ్.

నా పేషెంట్ కి నేను చేయమనుకుండా ఇన్ని టెస్ట్ లు ఎందుకు చేశారు అంటుంది దివ్య. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నీ పేషెంట్లు కాదు మా పేషెంట్లు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వరకే నీ పని నువ్వు మా దగ్గర శాలరీకి పనిచేసే డాక్టర్ వి మాత్రమే బిల్స్ విషయంలో కలుగజేసుకోవద్దు అంటాడు సంజయ్. కచ్చితంగా కలగజేసుకుంటాను ఈ విషయాన్ని ఎండి గారి వరకు తీసుకువెళ్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య.

నందు మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంటున్న తులసి..

మరోవైపు అక్క ద్వారా విషయాన్ని తెలుసుకున్న దీపక్ వాళ్ళ స్వార్థానికి నిన్ను వాడుకుంటున్నారు మీకు అర్థమవుతుందా అంటాడు. నేనేమీ చిన్నపిల్లని కాదు, తెలివి తక్కువ దాన్ని అంతకన్నా కాదు ఎవరికి వద్దనుకో ఎర కావడానికి ఉంటుంది తులసి. డైవర్స్ ఇచ్చిన బావగారితో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటాడు.

ఆయన పరాయి మనిషి కాదు పాతికేళ్ళు కాపురం చేశాను. అలా అని ఆయన మీద ప్రేమ,లేదు కోపము లేదు. అసలు ఎలాంటి ఫీలింగు లేదు దురదృష్టం కొద్దీ ఆయన నా పిల్లలకి తండ్రి అందుకే ఆయన గురించి ఆలోచించాల్సి వస్తుంది అంటుంది తులసి. భార్య గా నటించడం తప్పే కానీ నాలో ఉన్న మంచితనం, నేను చంపుకోలేకపోతున్నాను అందువల్ల కొన్నిసార్లు నష్టపోతున్నారు కూడా అంటుంది.

నందు కి సపోర్ట్ చేయడం ఇష్టం లేదంటున్న దీపక్..

కెఫె విషయంలో ఆయనకి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు అంటాడు దీపక్. నేను ఆయనని దూరం పెడితే పిల్లలు కూడా తన తండ్రిని దూరం పెడుతున్నారు అది నాకు ఇష్టం లేదు. పిల్లలకి తండ్రి ముఖ్యం అందుకే రాజీ పడాల్సి వస్తుంది అంటుంది తులసి. వాసుదేవ్ అన్నయ్య బిజినెస్ డీల్ విషయంలో హెల్ప్ చేయకపోతే మళ్లీ వెనకటి పరిస్థితి వస్తుందేమో అని రెండు అడుగులు తగ్గాను.

మేమిద్దరం విడాకులు తీసుకున్న సంగతి సాధ్యమైనంత త్వరగా చెప్పమని ఆయనకి చెప్పాను అంటుంది తులసి. మరోవైపు తులసి నాకోసం చాలా సహాయం చేస్తుంది ఛీ కొట్టి వదిలించుకున్న మనిషి పక్కన మళ్లీ భార్య గా నటించడమంటే చిన్న విషయం కాదు. మనసు చంపుకొని మంచితనంతో చేస్తుంది. సంపాదన బాగుంటే ఇంట్లో వాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవచ్చని నా స్వార్థం దేవ్ ముందు నాటకం ఆడేలాగా చేస్తుంది.

తులసికి నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయిన నందు..

అనవసరంగా తులసిని ఇబ్బంది పెడుతున్నాను. ఈరోజు ఎలాగైనా తనకి నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేస్తాడు నందు. మరోవైపు శివుని ముందు కూర్చొని పూజ చేస్తుంటుంది రాజ్యలక్ష్మి. విక్రమ్ రావటం గమనించిన బసవయ్య కొంచెం పాలు తీసుకో అక్క, పొద్దుటి నుంచి ఏమి తీసుకోలేదు. నీరసంతో పడిపోయేలాగా ఉన్నావు అంటాడు.

నాకు ఏదైనా నా బిడ్డ తర్వాతే అలాంటిది నా బిడ్డని ఆ దేవుడు ఎందుకు నాన్న గురించి దూరం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నేను బ్రతుకుతున్నదే వాడి కోసం. నా బిడ్డ మనసు మార్చుకొని నా మాట వినే వరకు నేను నీ ముందు నుంచి కదలను అంటూ పూజ చేస్తూ ఉంటుంది. ఇదంతా నాటకం అని తెలియని విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. విక్రమ్ చూసి కోలుకొని అంతా మంచే జరగాలని దేవుడికి దండం పెట్టుకో అంటుంది.

విక్రమ్ ని ఇరకాటంలో పెట్టిన రాజ్యలక్ష్మి నాటకం..

ఈ పూజలు అవి ఎందుకు అంటాడు విక్రమ్. ఈ దేవుడిని నమ్ముకొని నీకు అమ్మగా ఇంట్లో అడుగు పెట్టాను. మీ నాన్న మీ తాతయ్య నన్ను నమ్మరు, నన్ను శత్రువులాగా చూస్తారు అందుకే నా గుండెల్లో భారం దింపమంటూ ఆ శివయ్యని వేడుకుంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. దండం పెట్టుకునే వరకు అయితే పర్వాలేదు ఆమె వెనుక మేము కూడా నిలబడతాము కానీ తిండి మానేసింది. పైకి ఆకారం అలా కనిపిస్తుంది కానీ లోపల ఏమాత్రం బలం లేదు.

గుండె కూడా చాలా వీక్ గా పనిచేస్తుందని మీ తమ్ముడు చెప్పాడు అంటూ రాజ్యలక్ష్మిని వెనకేసుకొస్తాడు బసవయ్య. నీ సమస్య ఏంటి అని అడుగుతాడు విక్రమ్. కొడుకు కోసం బెంగ ఎక్కడ తన మాట వినకుండా తనకి దూరం అయిపోతాడు అని బెంగ అంటాడు బసవయ్య. అంతా భయపడవలసిన పనే వచ్చింది అయినా అమ్మ చెప్పిన మాట నేను ఏది కాదన్నాను అంటాడు విక్రమ్.

Intinti Gruhalakshmi March 18 Today Episode నోరు జారి నిజం చెప్పిన రాములమ్మ..

వినను అనటం లేదు విననంత పని చేస్తున్నావు అంటాడు బసవయ్య.తరువాయి భాగంలో నందు తులసికి నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. నందు కి తులసి మీద టన్నులకొద్దీ ప్రేమ ఉంది నో డౌట్ అంటాడు వాసుదేవ్. మొన్న లాస్యమ్మకి ఇచ్చిన నెక్లెస్ కన్నా ఈ నక్లెస్ చాలా బాగుంది అంటూ నోరు జారుతుంది రాములమ్మ.