Intinti Gruhalakshmi March 1 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నీ మాటలు విని వాడు చదువు మానేసాడు, వాడి భవిష్యత్తుతో ఆడుకోవద్దు చదువుకోమని చెప్పు అంటూ భార్యని కోప్పడతాడు రాజ్యలక్ష్మి భర్త. కానీ భర్త మాటలని ఏమాత్రం పట్టించుకోదు రాజ్యలక్ష్మి. నీకే చెప్పేది వినిపించుకోవటం లేదా నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అంటూ బాగా ఆవేశపడతాడు. ఆ ఆవేశంలోనే అతనికి పక్షవాతం వస్తుంది.

కొడుకు కోసం మూగగా రోధిస్తున్న విక్రమ్ తండ్రి..

గతం నుంచి ప్రస్తుతానికి వచ్చేసరికి భోజనం తినిపించి మాత్రలు వేస్తాడు విక్రమ్. ఈరోజు చక్కగా చెప్పిన మాట విన్నావు రోజు ఇలాగే భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి అంటాడు విక్రమ్. రోజు నువ్వే భోజనం పెడితే చక్కగా నీ మాట వింటాను గొర్రె కాసాయి వాడిని నమ్మినట్లుగా నువ్వు మీ అమ్మని నమ్ముతున్నావు ఆ చక్రబంధం నుంచి ఇప్పుడు బయటపడతావో అనుకుంటాడు విక్రమ్ తండ్రి. రోజు మీ పనులు నేనే చేయాలని ఉంటుంది కానీ కుదరటం లేదు అంటాడు విక్రమ్.

కుదరకపోవడం కాదు నాన్న నిన్ను నా దగ్గరికి రానివ్వదు, మన మధ్య అనుబంధాన్ని పెరగనివ్వదు అనుకుంటాడు విక్రమ్ తండ్రి. అమ్మ బాగా కష్టపడుతుంది అందుకే నేను తన వెనక ఉండి అన్ని పనులు చూసుకోవాలి అనుకుంటాడు విక్రమ్. నేనొక పనికిరాని వస్తువుని నాతో ఎవరికీ పనిలేదు అందుకే మూలన పడేసారు అని మనసులోనే బాధపడతాడు విక్రమ్ తండ్రి. అమ్మ కూడా నీతో మాట్లాడాలి అనుకుంటుంది.

తల్లిని వెనకేసుకొస్తున్న విక్రమ్..

ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది కదా అందుకే అలసిపోయి పడుకుండిపోతుంది అయినా నువ్వు అర్థం చేసుకుంటావనుకో ఇంటి పెద్దగా నువ్వు మోయాల్సిన బాధ్యతని శ్రమ అనుకోకుండా ఆమె మోస్తుంది అంటూ తల్లిని తమ్ముడిని కూడా వెనకేసుకొస్తాడు విక్రమ్. మరోవైపు తనతో ఏదో చెప్పటానికి ఇబ్బంది పడుతున్న తులసిని అర్థం చేసుకుంటుంది దివ్య. నా పెళ్లి గురించే అయి ఉంటుంది అనుకుంటుంది. తులసి తనతో ఎన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించినా మాట మార్చేస్తుంది దివ్య.

నేను బయలుదేరుతాను అని దివ్య అంటే నీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి కూర్చో అంటుంది తులసి. మాట్లాడుతూ కూర్చుంటే లేట్ అయిపోతుంది మొదటి రోజే రి మార్క్ అనుకుంటూ కంగారుగా వెళ్లిపోతుంది దివ్య. తను కావాలనే నిన్ను అవాయిడ్ చేస్తుంది అంటుంది లాస్య. తులసి మీద అరిచి ఏం లాభం తన ప్రయత్నం తాను చేసింది కదా అంటాడు నందు. నేను తనమీద అరవలేదు దివ్య ఎందుకు ఇలా చేసింది అనుకుంటున్నాను అంతే తులసిని ఒక మాట అని ఇంట్లో నేను బ్రతకగలనా అంటూ చిరాకు పడుతుంది లాస్య.

రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చిన విక్రమ్..

హాస్పిటల్ నుంచి వచ్చాక మళ్ళీ ట్రై చెయ్యు అని తులసికి చెప్తాడు నందు. మరోవైపు హాస్పిటల్లో నర్స్ ని ట్రాప్ చేస్తూ ఉంటాడు రాజ్యలక్ష్మి చిన్న కొడుకు. ఆ నర్స్ తొందరగానే అతని ట్రాప్ లో పడిపోతుంది. నీకేం కావాలో చెప్పు అని అతను అడిగితే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది నర్సు.వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే విక్రమ్ హాస్పిటల్ కి వస్తాడు. తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఫిజియోథెరపీ సెక్షన్ లో ఉన్నారు అని చెప్తారు అక్కడ స్టాప్.

విక్రమ్ అక్కడికి వెళ్లేసరికి అతన్ని గమనించిన వాళ్ళ తమ్ముడు ఫ్లేట్ కిరాయించేసి నర్స్ ని మందలిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడే విక్రమ్ నేను చూస్తున్నట్లుగా నటించి రా అన్నయ్య ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను కానీ అమ్మ ఎక్కడ అని అడుగుతాడు విక్రమ్ తను మీటింగ్లో ఉంది అని చెప్తాడు అతని తమ్ముడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని విక్రమ్ అంటే పని మానేసి కబుర్లు చెప్తుంటే క్లాస్ తీసుకుంటున్నాను అంటాడు విక్రమ్ తమ్ముడు. ఇలా దగ్గర కూర్చోబెట్టుకుని నచ్చ చెప్పటంలో మా వాడు ఫస్ట్ ఉంటాడు.

విక్రమ్ ని దబాయిస్తున్న దివ్య..

మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో, పూర్తయ్యే వరకు ఇక్కడికి ఎవరిని పంపొద్దని మీ పిఎ కి చెప్తానులే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. అక్కడ సడన్ గా దివ్యని చూసి షాక్ అయిపోతాడు విక్రమ్. అక్కడ స్టాప్ ని ఆమె ఎవరు అని అడుగుతాడు విక్రమ్. తను డాక్టర్ దివ్య అని కొత్తగా జాయిన్ అయిందని చెప్తారు వాళ్ళు. పడకుండానే మనసుకు నచ్చిన అమ్మాయిని చూపించావు, అడక్కుండానే మిగతా కార్యక్రమాలన్నీ జరిగేలాగా చూడు అంటూ దేవుడిని వేడుకుంటాడు విక్రమ్.

అంతలోనే ఒక తల్లి యాక్సిడెంట్ అయిన తన కొడుకుని తీసుకువచ్చి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన దివ్య గబగబా ఆ పేషెంట్ కి ఫస్ట్ ఎయిడ్ చేసి, సిస్టర్స్ అందర్నీ అలర్ట్ చేసి బాబుని ఐసియులోకి తీసుకువెళ్తుంది. విక్రమ్ కూడా ఐసియులకు వెళ్లబోతుంటే అతని ఆపి ఎవరు పడితే వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళకూడదుఅని దివ్యఅంటే అక్కడ ఉన్న సిస్టర్ ఏదో చెప్పబోతే వారిస్తాడు విక్రమ్. ఐ సి యు నుంచి బయటకు వచ్చిన దివ్య కంగారు పడవలసిన బాబు సేఫ్ అంటుంది.

ఉతికి ఆరేస్తానంటున్న దివ్య..

కానీ ఆపరేషన్ కోసం రెండు లక్షలు అప్పు చేయవలసి వచ్చింది మేము ఎప్పుడు దీని నుంచి తేరుకుంటామో అంటుంది ఆ తల్లి . డబ్బులు వసూలు చేయలేదా అని దివ్య అడిగితే మా మాటలకి ఎవరు బెదురుతారమ్మ నువ్వే కొంచెం అతని దగ్గర డబ్బులు వసూలు చేయు అంటూ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని చూపిస్తుంది ఆ తల్లి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని కాకుండా అతని ముందు ఉన్న విక్రమ్ ని చూస్తుంది దివ్య.

యాక్సిడెంట్ చేసి పారిపోకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు జరగకూడనిది ఏదైనా జరిగితే ఇరుక్కుపోతానని భయంతో ఇక్కడే కాపలా కాస్తున్నట్లుగా ఉన్నాడు నువ్వు ఇక్కడే ఉండు అతన్ని ఉతికి ఆరేసి వస్తాను అంటూ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది దివ్య. నేను ఒకరిని చూపిస్తే తను మరొకరి దగ్గరికి వెళ్తుంది ఏంటి తెలిసిన వారేమో అనుకుంటుంది ఆ తల్లి. విక్రమ్ దగ్గరికి వెళ్లి నీకు ధైర్యం ఎక్కువే అంటుంది దివ్య. ఇలాంటి విషయాల్లో ధైర్యం చేయాలని దేవుడు చెప్పాడు అంటాడు విక్రమ్.

రౌడీయిజం చేస్తున్న దివ్య..

నువ్వు ఇందాక ఐసీయూలోకి వస్తుంటే పేషెంట్ తాలూకా ఏమో అనుకున్నాను అంతేకానీ భయంతో వస్తున్నావు అనుకోలేదు పేషెంట్ కి రెండు లక్షలు ఖర్చు అయింది మర్యాదగా డబ్బు తీయు అంటుంది దివ్య. మధ్యలో సిస్టర్ ఏదో మాట్లాడబోతే మేము మేము చూసుకుంటాము అంటూ కసిరి ఆమెని పంపించేస్తాడు విక్రమ్. విక్రమ్ 2 లక్షలు ఇస్తే డబ్బులు కరెక్ట్ గానే ఉన్నాయా నమ్మొచ్చా అంటుంది దివ్య. లెక్కపెట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటాడు విక్రమ్.

రెండు లక్షలు పోగొట్టుకుంటున్నాను అనే ఫీలింగ్ నీ మొహం లో అసలు కనిపించడం లేదు అంటుంది దివ్య. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని మా దేవుడు చెప్పాడు అంటాడు విక్రమ్. ఒకవేళ బాబుకి ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే నీదే బాధ్యత అందుకే ఫోన్ నెంబరు తీసుకుంటున్నాను అంటూ అతని ఫోన్ నెంబరు తీసుకుంటుంది దివ్య.డబ్బు తీసుకెళ్లి ఆ తల్లికిచ్చి చూడ్డానికి కొంచెం హార్ష్ గా ఉన్నాడు కానీ గట్టిగా నిలదీసేసరికి ఏమాత్రం బుకాయించకుండా రెండు లక్షలు చేతిలో పెట్టాడు.

Intinti Gruhalakshmi March 1 Today Episodeపొరపాటు పడ్డారంటున్న పేషెంట్ తల్లి..

తప్పు చేశానని మనసులో గిల్టీగా ఉండి ఉంటుంది అందుకే అడగ్గాని ఇచ్చేశాడు ఇంకా ఎక్స్ట్రా అయితే ఇంకా అతని దగ్గర తీసుకోవటానికి అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను మీరేమీ టెన్షన్ పడకండి అంటుంది దివ్య. నేను మీరు డబ్బులు తీసుకున్నది యాక్సిడెంట్ చేసిన వ్యక్తి దగ్గర కాదు అంటుంది ఆ తల్లి. అదేంటి మీరు అతన్నే చూపించారు కదా కానీ దివ్య అంటే నేను అతని వెనుక ఉన్న వ్యక్తిని చూపించాను మీరు అతనితో మాట్లాడుతుంటే తెలిసిన వ్యక్తి ఏమో అనుకున్నాను అంటుంది ఆ తల్లి.

అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది తప్పు చేయని వ్యక్తి దగ్గర నేను డబ్బులు వసూలు చేశాను అంటూ బాధపడుతుంది దివ్య. మీరు అడిగితే మాత్రం పిచ్చివాడిలాగా అతను ఎలా ఇచ్చాడు అంటుంది ఆ తల్లి. అవును అలా ఎలా ఇచ్చాడు, పైగా 100,1000 కాదు రెండు లక్షలు. వెళ్ళిపొమ్మనగానే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడుఅంటుంది దివ్య. ఇప్పుడే కదా వెళ్ళాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అంటుంది మా తల్లి. అవును అన్నట్లుగా విక్రమ్ ని వెతకటానికి బయటకు వస్తుంది దివ్య.

అక్కడ కనిపించకపోవడంతో వెళ్లిపోయి ఉంటాడు అనుకుంటుంది. అతని ఫోన్ నెంబరు ఉంది కదా అని ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు విక్రమ్. అడగ్గానే రెండు లక్షలు చేతిలో పెట్టేసాడు మంచివాడా,పిచ్చివాడా అనుకుంటుంది. అందులోనే అక్కడికి పేషెంట్ తల్లి వచ్చి దొరికాడా అని అడుగుతుంది. లేదు, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎలా అయినా ఆ డబ్బు నేను అతనికి అందజేస్తాను అంటుంది దివ్య. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.