Intinti Gruhalakshmi March 22 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కార్లో కామ్ గా కూర్చున్న విక్రమ్ వాళ్ళని చూసి కష్టపడి బండి టైర్ పంచర్ చేసి వీళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించాను అయినా వాడుకోవడం లేదు అని చికాకు పడతాడు దేవుడు. ఈ లోపు టూ వీలర్ ఒకటి విక్రమ్ కారుని డాష్ కొడుతుంది. బండి మీద ఉన్న ఇద్దరూ కింద పడిపోతారు. దివ్య ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది.
విక్రం మాటలకి మెస్మరైజ్ అయిన దివ్య..
నెమ్మదిగా డ్రైవ్ చేయమని చెప్పాను, నీకేమైనా అయితే ఎంత ప్రమాదం జరిగేది అని కంగారు పడుతుంది ఆమె. నువ్వు సరిగ్గా కూర్చోలేదు అందుకే పడిపోయాము అయినా ఎందుకు చెప్పిందే చెప్తావు అంటూ చిరాకు పడతాడు ఆమె బాయ్ ఫ్రెండ్. విక్రమ్ అతనిని మందలించి తను నీ గురించే కదా చెప్పింది ఆమె బాధ వెనుక ప్రేమ అర్థం కావడం లేదా, ప్రేమ అంటే పెదాలు పలికే పదాలు కాదు గుండె నుంచి వచ్చే భావాలు.
ఆమె మనసు నిండా నీకేమవుతుందో అని భయమే అలాంటి మంచి మనసున్న అమ్మాయి దొరకటం నీ అదృష్టం అంటే అతనికి నచ్చ చెప్తాడు విక్రమ్. ఆ మాటలకి ఇంప్రెస్ అయిపోతుంది దివ్య. అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు దివ్య కూడా కూరగాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దివ్య వెళ్ళిపోతుంటే గుండెని ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్లుగా ఉంది అంటాడు విక్రమ్.
తల్లిదండ్రులని అలా చూసి ఆనందిస్తున్న దివ్య..
మీకు కిందనున్న ఈ దేవుడు తోపాటు పైనున్న ఆ దేవుడు కూడా సాయం చేస్తున్నాడు అంటాడు దేవుడు. మరోవైపు తల్లికి ఎలా ఉందో అని కంగారుపడుతూ వస్తుంది దివ్య. తండ్రి తల్లికి సేవలు చేయడం చూసి ఆనంద పడిపోతుంది. పరుందామయ్య దంపతులు కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళిద్దర్నీ డిస్టర్బ్ చేయకుండా ముగ్గురు వెళ్లి హాల్లో కూర్చుంటారు.
నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ నాన్న ఇంత అన్యోన్యంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం ఉంటుంది దివ్య. కానీ ఈ క్షణాలు శాశ్వతం కాదని బాధనిపిస్తుంది అంటుంది. స్వయంకృతాపరాదానికి శిక్ష అనుభవించాలి అంటాడు పరంధామయ్య. పోగొట్టుకున్నది దొరకదా అని దివ్య అంటే బకెట్లో పోగొట్టుకున్న వస్తువు దొరకవచ్చు సముద్రంలో పోగొట్టుకున్న వస్తువు దొరకదు అంటాడు పరంధామయ్య.
నందుని చూసి జాలి పడుతున్న పరంధామయ్య దంపతులు..
కొంచెం గౌరవం కొంచెం గుర్తింపు భర్త ఇస్తే చాలు ఆ భార్య జీవితాంతం ప్రశాంతంగా ఉంటుంది. భర్త హోదా అధికారం పలుకుబడి ఇవేవీ భార్యకి సంతోషాన్ని ఇవ్వవు, భర్త చల్లని మనసు ఆ మనసులో కొద్దిపాటి చోటు ఉంటే ఆ ఇల్లాలు సంతోషిస్తుంది అంటుంది అనసూయ. నందుని చూసి జాలి పడటం తప్పితే ఏమి చేయలేమా అంటుంది అనసూయ.
లాస్యకి మంచి బుద్ధి ప్రసాదించమని ఆ దేవున్ని ప్రార్థించడం తప్పితే ఏమీ చేయలేము అంటాడు పరందామయ్య. దేవుడు కూడా చేయలేని పనులు కొన్ని ఉంటాయి అందులో ఒకటి లాస్య కి మంచి బుద్ధిని ప్రసాదించడం అంటుంది అనసూయ. మరోవైపు తులసి శకుంతల అనే ఆవిడని దివ్య దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పంపిస్తుంది. నీకు తెలిసిన వాళ్ళ అమ్మ అని అడుగుతుంది దివ్య.
దివ్యని మందలిస్తున్న సంజయ్..
అవును కడుపునొప్పని మీ హాస్పిటల్ లోనే ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా నొప్పి తగ్గకపోతే వేరే హాస్పిటల్ లో చూపించుకున్నారు అంట అక్కడ ట్రీట్మెంట్లో భాగంగా స్కాన్ చేస్తే కడుపులో సిజర్ పెట్టి కుట్టేసారంట అదే విషయాన్ని మీ వాళ్ళతో చెప్తే మాకు సంబంధం లేదు పొమ్మన్నారట వాళ్లు చాలా పేదవాళ్లు కొంచెం చూడు అని చెప్తుంది తులసి. నేను చూసుకుంటాను అని తల్లికి ధైర్యం చెబుతుంది దివ్య.
వాళ్ల మెడికల్ ఫైల్ చూసిన దివ్య మరీ ఇంత దారుణమా మీరు ఇక్కడే ఉండండి నేను మేనేజ్మెంట్ తో మాట్లాడి వస్తాను అంటూ రాజ్యలక్ష్మి రూమ్ కి వెళ్తుంది. నేరుగా రాజ్యలక్ష్మి తో మన హాస్పిటల్ రోజురోజుకీ దిగజారుతుంది అని చెప్తుంది. ఎండి గారితో ఇలాగేనా మాట్లాడడం అంటూ మందలిస్తాడు సంజయ్. దివ్యని చెప్పని అంటూ సంజయ్ ని మందలిస్తుంది రాజ్యలక్ష్మి.
పేషంట్ తరఫున మేనేజ్మెంట్ తో ఫైట్ చేస్తున్న దివ్య..
ఫైల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళు నేను చూస్తాను అంటుంది రాజ్యలక్ష్మి ఈలోపు ఆ పేషెంట్ కి ఏమైనా అయితే అంటుంది దివ్య ఆపరేషన్ చేసింది ఎవరు అంటుంది రాజ్యలక్ష్మి డాక్టర్ సంజయ్ అంటుంది దివ్య. ఒక్కసారిగా షాక్ అవుతారు తల్లి కొడుకులు. మన హాస్పిటల్ కి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ఎవరో ఇలా కావాలని చేస్తున్నారు అంటాడు సంజయ్.
అంత అవసరం ఎవరికి ఉంటుంది మీ వల్ల తప్పు జరిగింది కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను అంటుంది దివ్య. దివ్య మీద కేకలు వేస్తున్న సంజయ్ ని మందలించి పేషెంట్ ని హాస్పిటల్ లో జాయిన్ అవ్వను ఆపరేషన్ చేసి సిజర్ తీసేద్దాం అంటుంది రాజ్యలక్ష్మి. మన హాస్పిటల్ అంటేనే పేషెంట్ భయపడుతుంది 10 లక్షలు పరిహారం ఇస్తే వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకుంటుందట అంటుంది దివ్య.
సంజయ్ తిక్క కుదిర్చిన దివ్య..
పైసా కూడా ఇచ్చేది లేదు ఏం చేసుకుంటుందో చేసుకోమను అంటాడు సంజయ్. ఇదే మాట చెప్పమంటారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అంటూ బెదిరిస్తుంది దివ్య. చూసావా మామ్ ఎలా బెదిరిస్తుందో అని సెండ్ చేయకంటే నేను బెదిరించడం లేదు వాళ్ళు చేయబోయేది మీకు చెప్తున్నాను అనవసరంగా ఎండి గారిని మిస్ గైడ్ చేయకండి అంటుంది దివ్య.
డీలింగ్ కి ఒప్పుకుంటుంది రాజ్యలక్ష్మి. పేషెంట్ కి సంజయ్ సారీ చెప్తే బాగుంటుంది అంటుంది దివ్య. అందుకు కూడా ఒప్పుకుంటుంది రాజ్యలక్ష్మి. తల్లి ప్రవర్తనకి సంజయ్ చికాకు పడుతాడు. దివ్య పేషెంట్ ని తీసుకొస్తే సంజయ్ సారీ చెప్పి చెక్క అరెంజ్ చేస్తాను అంటాడు. ఎండి మేడం మీకు ఇలా జరిగినందుకు చాలా ఫీల్ అవుతున్నారు ఆడికి థాంక్స్ చెప్పండి అంటుంది దివ్య.
తులసిని రిక్వెస్ట్ చేస్తున్నఆఫీస్ మేనేజర్..
పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల దివ్యని తిట్టుకుంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ఆఫీస్ నుంచి మేనేజర్ వచ్చి ఆఫీస్ ఫైల్స్ మీద సంతకం కావాలి సామ్రాట్ గారు చాలా రోజుల నుంచి ముంబై బ్రాంచ్ లోనే ఉండిపోయారు. ఇక్కడ డెసిషన్స్ అన్ని మిమ్మల్ని తీసుకోమన్నారు అంటాడు. ఫైల్స్ అక్కడ పెట్టండి చూసి సైన్ చేస్తాను ప్రజెంట్ అయితే నాకు ఓపిక లేదు అంటుంది తులసి.
ఒంట్లో బాగోకపోయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ కానీ ఈ ఫైల్స్ వరకు కొంచెం ఓపిక చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అర్జెంట్ అంటాడు మేనేజర్. సరే అంటూ ఒప్పుకుంటుంది తులసి. మరో వైపు లాస్య, నందుకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. కిచెన్ లో ఉన్నాను అంటాడు నందు ఏం చేస్తున్నావు అంటుంది తెలుసుకొని ఏం చేస్తావు అంటాడు నందు మా ఆయన ప్రయోజకుడు అయ్యాడు అని మురిసిపోతాను అంటుంది లాస్య.
Intinti Gruhalakshmi March 22 Today Episode నందు, లాస్యకి విడాకులు ఇవ్వబోతున్నాడా?
నీకు అంత పెద్ద మనసు లేదు వదిలేయ్ ఉంటాడు నందు. ఈ మధ్య నేనంటూ ఒకదాని ఉన్నానన్న విషయం కూడా మర్చిపోతున్నావు నాతో చెప్పకుండానే వెడ్డింగ్ పార్టీ అరేంజ్ చేసావు నాతో చెప్పకుండానే తులసికి నెక్లెస్ ప్రజెంట్ చేశావు అంటుంది లాస్య. దేవ్ ముందు నాటకం ఆడుతున్నామ్ నీకు తెలిసిందే కదా అంటాడు నందు. నాటకం అంటే నటించాలి అంతేగాని జీవించకూడదు అంటుంది లాస్య.
తులసికి నక్లిస్ గిఫ్ట్ ఇవ్వవలసిన అవసరం ఏం వచ్చింది అంటుంది తను మనకి చేసిన సాయం ముందు ఇది చాలా తక్కువ అంటాడు నందు. నాకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అంటుంది లాస్య. నీ అనుమానానికి అర్థం ఏదైనా ఉందా అంటాడు నందు. అనుమానాలు కాదు కారణాలు చాలా ఉన్నాయి ముందు నటించడానికి ఒప్పుకోను అన్న తులసి మళ్ళీ నటించడానికి ఒప్పుకుంది అంటే తన మనసులో ఏదో ఉన్నట్లు కదా అంటుంది లాస్య.
మొన్న రాత్రి ఆమె గదిలో పడుకున్నావు అంటే నేను గుర్తు రావట్లే కదా అంటే నీ మనసులో కూడా ఏదో ఉన్నట్లే కదా మాట్లాడుతుంది లాస్య. దేవి ముందు భార్యాభర్తలుగా మేము నటించాలన్న డెసిషన్ నీది అంటాడు నందు. తరువాయి భాగంలో రోడ్డుమీద నడుచుకొని వస్తున్న దివ్యని మీ బైక్ ఏమైంది అని అడుగుతాడు విక్రమ్. పాడయింది అని చెప్తుంది దివ్య. ఇంతలోనే రౌడీలు వచ్చి దివ్యని అల్లరి పెడుతుంటే విక్రమ్ సేవ్ చేస్తాడు.