Intinti Gruhalakshmi March 28 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దివ్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. రంకే వేసినప్పుడే ఆంబోతు కి మొక్కుతాడు వేయాలి.. నువ్వేమో తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకున్నావు అంటాడు బసవయ్య. వానపాము లాగా ఉంటుందనుకున్నాను కానీ త్రాచుపాము లాగా మారుతుంది అనుకోలేదు అంటుంది రాజ్యలక్ష్మి.

 

దివ్య అంతు చూస్తానంటున్న రాజ్యలక్ష్మి..

 

పాపం పిల్లవాడు ఏం చేయాలో తెలియక గిలగల కొట్టుకుంటున్నాడు అంటాడు బసవయ్య. అసలు తప్పంతా వాడిదే, వాడి వల్లే ఇంతవరకు వచ్చింది మనకి చెప్పి ఉంటే సమస్యని ఇంత దూరం తీసుకువెళ్లను ఇచ్చే వాళ్ళం కాదు అంటూ సంజయ్ ని తిడుతుంది రాజ్యలక్ష్మి. పిల్లాడు ఏదో సరదా పడ్డాడు డబ్బులు ఇచ్చి వదిలించుకోవాల్సింది అనవసరంగా నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నారు అంటాడు బసవయ్య.

 

అది నా కొడుకుని మామూలు దెబ్బ కొట్టలేదు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఏదో హాస్పిటల్లో జోక్యం చేసుకుంటే.. ఊరుకున్నాను కానీ ఇప్పుడు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే వరకు వచ్చింది. ఇక ఉపేక్షించి లాభం లేదు దాని అంతు చూస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. ఉద్యోగం నుంచి పీకి పారేయ్ అంటాడు బసవయ్య. ఉద్యోగం నుంచి తీసేస్తే బయటికి వెళ్లి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ మనకి కొరగాని కొయ్యలాగా మారుతుంది.

 

దివ్య మీద జాలి పడుతున్న దేవుడు..

 

అందుకని తను ఎక్కడైతే మంచి పేరు తెచ్చుకొని హీరో లాగా వెలుగుతుందో అక్కడే ఆమెని విలన్ ను చేయాలి అంటుంది రాజలక్ష్మి. మరోవైపు హాస్పిటల్ స్టాఫ్ అందరూ దివ్యని కంగ్రాట్యులేట్ చేస్తారు. మేనేజ్మెంట్ తో గొడవకి దిగారు ఏమీ భయంలేదా అని అడుగుతారు. నేను వెల్ ట్రైన్డ్ డాక్టర్ని బయటికి వెళ్తే నాకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటుంది దివ్య.

 

ఇదంతా చూస్తున్న దేవుడు ఒక్క దెబ్బతో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు కానీ విక్రమ్ బాబునే దూరం చేసుకుంది అనుకుంటాడు దేవుడు. మరోవైపు దేవుడు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తానని చెప్పాడు కదా ఇంకా చేయలేదు ఏంటి అనుకుంటూ దేవుడికి ఫోన్ చేస్తాడు విక్రమ్. నిన్ను నమ్ముకునే కదా విజయవాడ వెళ్లాను ఇప్పుడు ఇలా సైలెంట్ అయిపోతే నా గతేంటి నీతో పాటు నన్ను కూడా సన్యాసంలో కలిపేసేలాగా ఉన్నావు అంటాడు విక్రమ్.

 

వేదాంతం మాట్లాడుతున్న దేవుడు..

 

మీరు ఎక్కువ ఆలోచించకండి ఎవరికి ఎంత రాసిపెట్టి ఉందో అంతే జరుగుతుంది అంటాడు దేవుడు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నావ్ కదా బొకే పంపించాను నా పేరు చెప్పి దివ్య కి ఇవ్వు అంటాడు విక్రమ్. మీ ప్రేమ పెటాకులు అవుతుంది అని నేను అంటుంటే మీరు రొమాంటిక్ మూడ్ వదలను అంటున్నారు వచ్చాక ఇక్కడ విషయాలన్నీ మీకే తెలుస్తాయి.

 

అప్పుడు బాంబు పేలుతుంది అనుకుంటు బొకే తీసుకెళ్లి దివ్యకి ఇస్తాడు. ఇదే మీ ఇద్దరి మధ్య పిచ్చి పుచ్చుకునే ఆఖరిపోకే ఏమో అనుకుంటాడు దేవుడు. మరోవైపు ఇది మహాభారత యుద్ధం అంటున్నావు కదా నువ్వు నా భార్యవి కాబట్టి ఓడిపోకూడదు అని కోరుకుంటున్నాను ఇది నా ఆట కాబట్టి నేను గెలవాలని కోరుకుంటున్నాను అంటాడు నందు.

 

లాస్యకి తిరుగులేని ఆయుధాన్ని ఇచ్చిన భాగ్యం..

 

నేను గెలవాలని కోరుకోండి ఎందుకంటే నేను గెలిస్తేనే మావయ్య గారు గెలుస్తారు అని అనసూయతో చెప్తుంది లాస్య. ఇంతలో భాగ్యం ఫోన్ చేయడంతో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏంటిది మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతుంది అంటుంది అనసూయ. మరోవైపు భాగ్యం దివ్య గురించి చెప్తూ నీకు బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.

 

దివ్య తనకి తెలియకుండానే తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో చిచ్చు పెట్టింది అంటూ జరిగిందంతా చెబుతుంది. దానికి అన్ని తల్లి పోలికలే ప్రతిదీ నెత్తి మీదకి తెచ్చుకుంటుంది అంటుంది లాస్య. నీకు తిరుగులేని ఆయుధాన్ని ఇచ్చాను ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తుంది భాగ్యం. తులసి వైపు చూస్తూ పాశుపతాస్త్రాన్ని నీ మీదకి రెడీ చేస్తున్నాను కాచుకో అనుకుంటుంది.

 

మోసంతో కోడల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేసిన రాజ్యలక్ష్మి..

 

మరోవైపు ప్రియతో సహా ఇంటికి వస్తాడు సంజయ్. వాళ్లని గుమ్మం బయటే నిల్చోపెడుతుంది రాజ్యలక్ష్మి. సవితి కొడుకు కోసం పనికిమాలిన పిల్లని చూస్తుంటే నా కొడుక్కి అలాంటి పిల్లని ఏకంగా భార్యని చేసేసాడు ఆ దేవుడు అనుకుంటుంది. హలో ఆలోచిస్తూ ఉండిపోయావేంటి వాళ్ళ ముచ్చట్లు చూడు అంటాడు రాజ్యలక్ష్మి మామగారు. అన్ని ముచ్చట్లు తీరాకే వాడు పెళ్లి చేసుకున్నాడు.

 

ఇక ఈ ముచ్చట్ల సంగతి అంటారా, పెళ్లంటే ఏదో అలా అయిపోయింది కానీ మిగతావి అన్ని శాస్త్ర ప్రకారం జరగాలి కదా అందుకే పంతులు గారిని పిలిపించాను అంటుంది రాజలక్ష్మి. మీ కోడలి జాతకం బాగోలేదు ఇప్పుడు గృహప్రవేశానికి అనువైన సమయం కాదు ఈమె 101 రోజులు అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేసి ఆఖరు రోజు ఉపవాసంతో పూజ చేస్తే అప్పుడు దోషం తొలగిపోతుంది.

 

రాజ్యలక్ష్మిని పూర్తిగా నమ్ముతున్న ప్రియ..

 

అప్పుడు ఆమెని గృహప్రవేశం చేయించవచ్చు అంటారు. అంతవరకు అమ్మాయిని అవుట్ హౌస్ లో ఉంచండి అంటుంది రాజ్యలక్ష్మి. అక్కడ పనివాళ్ళు ఉంటారు ఇంటి కోడలు అక్కడ ఎలా ఉంటుంది అంటాడు రాజ్యలక్ష్మి మామగారు. ఈ ఇంటికి మంచి జరుగుతుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే మీరేమీ బాధపడకుండా తాతయ్య గారు అంటుంది ప్రియ.

 

నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగిన నువ్వు ఈ ఇంటి కోసం ఆలోచిస్తున్నావు ఎంత మంచి దానివి అంటుంది రాజ్యలక్ష్మి. ఇలాంటి అత్తగారు నీకు వందమందిలో ఒకరు దొరుకుతారు ఈవిడ మంచితనం పోను పోను నీకే అర్థమవుతుంది అంటూ ప్రియకి చెప్తాడు బసవయ్య. నీ భార్యని అవుట్ హౌస్ లో ఉంచుతారంట నీకేమీ అభ్యంతరం లేదా అంటాడు తాతయ్య.

 

దివ్యకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్న రాజ్యలక్ష్మి..

 

జాతకాలు బాగోకపోతే దానికి మనం ఏం చేస్తాం తాతయ్య అయినా ప్రియ కూడా ఒప్పుకుంది కదా 101 రోజులు అంటే ఇట్టే గడిచిపోతాయి అంటాడు సంజయ్. ప్రియని అవుట్ హౌస్ కి తీసుకు వెళ్ళమని దేవుడితో చెప్తుంది రాజ్యలక్ష్మి. కొడుకుని లోపలికి తీసుకువచ్చి నువ్వు కూడా ఈ 101 రోజులు అటువైపు వెళ్తే బాగోదు చేసింది చాలు అంటూ కొడుకు మీద మండిపడుతుంది.

 

దివ్య.. నువ్వు నాకు ప్రియ ని గిఫ్ట్ గా ఇచ్చావు కదా నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా కచ్చితంగా ఇస్తాను అని కసిగా అనుకుంటుంది రాజ్యలక్ష్మి. మా అక్క దెబ్బకి కొత్త కోడలు అట్నుంచి అటే బయటికి పోతుంది అని భార్యకి చెప్తాడు బసవయ్య. మరోవైపు మీకు శుభలేఖ వచ్చింది అక్కడ పెట్టాను అంటుంది తులసి. ఎవరిది అని అడుగుతాడు నందు.

 

పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవకూడదని మా అమ్మ చెప్పింది అంటుంది తులసి. నేను అంత పరాయి వాడినా అనుకుంటూ ఆ శుభలేఖ తీసి మా ఫ్రెండ్ కూతురికి ఎల్లుండి పెళ్ళంట అని ఆనందంగా చెప్తాడు. వాళ్ల పెళ్లి వీళ్ళ పెళ్లి కాదు ముందు నీ కూతురు పెళ్లి ఎప్పుడు చెప్పు అంటూ అక్కడికి వస్తాడు పరంధామయ్య. ఇంకా ఏమీ అనుకోలేదు మామయ్య.దివ్యకి కూడా ఒక మాట చెప్పాలి కదా అంటుంది తులసి.

Intinti Gruhalakshmi March 28 Today Episode  దివ్య సంగతి నేను చూసుకుంటానంటున్న నందు..

 

అడుగుతే వద్దనే చెప్తుంది అలా అని మనం ఊరుకోలేము కదా అంటాడు నందు. ఇదివరకటి రోజు లాగా కాదు కదా పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయాలన్న పదేపదే ఆలోచించాలి అంటుంది తులసి. ఆ సంగతి నాకు వదిలేయ్ నేను చూస్తాను అంటాడు నందు. తరువాయి భాగంలో నీకోసం ఎవరో ఒకే పంపించారు అంటూ పేరు చూడబోతుంది లాస్య. ఆమె దగ్గర నుంచి గబుక్కున ఆ బొకే ని లాక్కోబోతుంది దివ్య. కావాలనే తులసి మీద పడేస్తుంది లాస్య. ఎవరు పంపించాను పేరు చూస్తాను అంటుంది తులసి. దేవుడా ఇప్పుడు అమ్మ విక్రమ్ పేరు చూడబోతుంది అంటూ కంగారు పడుతుంది దివ్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 28, 2023 at 8:18 ఉద.