Intinti Gruhalakshmi March 29 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దివ్య సంగతి నాకు వదిలేయ్ నేను చూసుకుంటాను ఇన్నాళ్ళు పిల్లల బాధ్యతలు నువ్వే చూసుకున్నావు ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది ఇక దివ్య సంగతి నేను చూసుకుంటాను అంటాడు నందు. లాస్యని కాదని నువ్వు ఏ పని చేయలేవు అంటాడు పరాందామయ్య. అదంతా నేను చూసుకుంటాను అంటాడు నందు.

కూతురు కోసం కంగారు పడుతున్న తులసి..

ఆవేశం వద్దు ఏదైనా ఆలోచించి చేయండి అంటుంది తులసి. నా ఫ్రెండ్ చెప్తే ఎందుకు కాదంటాను నన్ను కంట్రోల్ చేయవలసింది నా ఫ్రెండే కదా అంటాడు నందు. మరోవైపు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ప్రియ జీవితం నిలబెట్టి మా అమ్మ పేరు నిలబెట్టాను అంటుంది దివ్య. నేను ఇలాంటి పనులు చేస్తే భయం వేసేది కాదు కానీ నువ్వు చేస్తుంటే ఎందుకో తెలియని భయం ఉంది.

పెద్దవాళ్ళని గొప్ప వాళ్ళని ఎదిరించడం మామూలు విషయం కాదు తెలియని రిస్క్ ఉంటుంది. వాళ్లు దీన్ని తేలిగ్గా తీసుకోరు అంటుంది తులసి. తప్పు వాళ్ళ వైపు ఉంది అంటుంది దివ్య. దాంతోపాటు డబ్బు బలం కూడా ఉంది. నా కూతురు క్షేమం గురించి నాకు భయంగా ఉంటుంది కదా అంటుంది తులసి. రాజ్యలక్ష్మి గారు తిరగబడితే ఏం చేసేదానివి ఆవిడ కన్నెర్ర చేస్తే మీ చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు అంటుంది.

రాజ్యలక్ష్మిని మెచ్చుకుంటున్న తల్లి, కూతుర్లు..

ఇప్పుడు ఏమంటావు ప్రియ పెళ్లికి కారణం రాజ్యలక్ష్మి గారి మంచితనమే కానీ నా తెగింపు కాదంట అంతేనా అంటుంది దివ్య. అలా అని కాదు రాజ్యలక్ష్మి గారు మంచితనం కూడా ఉంది అంటుంది తులసి. నిజమేనమ్మా రాజ్యలక్ష్మి గారు గొప్ప స్త్రీ మూర్తి అందుకే ప్రియని అర్థం చేసుకొని కోడలుగా స్వీకరించారు అంటుంది దివ్య. ఈ లోపు కొరియర్ వస్తుంది.

అది విక్రమ్ పంపించిన ఓకే అని గ్రహించిన దివ్య తులసికి తెలిసిపోతుందని తనే ఆ బోకే రిసీవ్ చేసుకుంటుంది. అంతలోనే తులసి వచ్చి ఎవరు పంపించారు అని అడుగుతుంది. పెళ్లి చేసిన దగ్గర నుంచి నాకు ఫ్యాన్స్ పెరిగిపోయారు అంటుంది దివ్య. మరోవైపు మా అత్తగారు చాలా మంచి అవ్వడం ఎందుకు సంజయ్ చెప్పటానికి భయపడ్డాడు అనుకుంటుంది ప్రియ.

రాజ్యలక్ష్మి నిజ స్వరూపం బయటపెట్టిన పనిమనిషి..

ఇంతలోనే పనిమనిషి భోజనం తీసుకుని వస్తుంది. ఆవిడ తెచ్చిన పచ్చడి అన్నాన్ని చూసి ఇదేంటి ఇంత ఆస్తిపరులు ఇలాంటి భోజనం చేస్తారా అని అడుగుతుంది. వాళ్లు విందు భోజనం చేస్తారు మాక్కూడా కాస్త మంచి అన్నమే పెడతారు. ఇది స్పెషల్ గా నీకోసం పంపించిన భోజనం అంటుంది పనిమనిషి. ఆవిడ మంచి భోజనం పంపించి ఉంటారు నిజం చెప్పు అంటుంది ప్రియ.

మీ అత్తగారు నువ్వు అనుకునే అంత మంచిదేమీ కాదు ఆవిడ కనిపించే దేవతేం కాదు కనిపించని రాక్షసి కూడా ఉంది. ముందు ముందు నీకు నరకం చూపిస్తారు పుట్టింటికి వెళ్ళిపో అంటుంది పనిమనిషి. అక్కడికి వెళ్తే ఇద్దరూ సవ్వాళ్ళని చూడాలి అందుకని ఇక్కడే తేల్చుకుంటాను. చనిపోతే నా శవమే అక్కడికి వెళుతుంది ఈ ఇంట్లో నా తరఫున పోరాడే వాళ్ళు ఎవరూ లేరా అంటుంది ప్రియ.

ప్రియ పీక పట్టుకున్న రాజ్యలక్ష్మి..

ఎందుకు లేరు విక్రమ్ బాబు ఉన్నారు ఆయన చాలా మంచివారు కానీ తల్లి మాటనే జవదాటరు అంటుంది పనిమనిషి. సంజయ్ మనస్సు మారేదాకా ఎదురు చూస్తాను అంటుంది ప్రియ. అది నీ తరం కాదు పోయిన నా పరువు ని తీసుకురా అప్పుడు అత్తగారిగా నా ప్రేమని చూపిస్తాను. దీనంతటికీ కారణం దివ్య కదా దానికి ఇంతకన్నా పెద్ద శిక్ష వేస్తాను అంటుంది రాజ్యలక్ష్మి.

ప్రియ కి సపోర్టుగా మాట్లాడినందుకు పని మనిషిని కూడా చివాట్లు పెడుతుంది రాజలక్ష్మి. మరోవైపు భర్తకి తెలియకుండా ఎవరికో డబ్బులు ఇచ్చి నందు కి తెలియనివ్వకు నాకన్నా నువ్వే బాగా ఇన్వెస్ట్ చేస్తావు కదా అంటుంది లాస్య. అప్పుడే వచ్చిన నందు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నా ఫ్రెండు ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగితే సలహా ఇస్తున్నాను అంటుంది లాస్య.

మనసులతో మాట్లాడుకుంటున్న దివ్య, విక్రమ్..

అలా ఏమి చేయకు ఒకవేళ లాస్ అయితే నిన్నే తిట్టుకుంటారు అంటాడు నందు. మరోవైపు బొకే చూసుకుంటూ ఏం చేస్తున్నావు విక్రమ్ అనుకుంటుంది దివ్య. అక్కడ విక్రమ్ కూడా దివ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు నీతో మాట్లాడాలని ఉంది కానీ దేవుడు ససేమీరా కుదరదు అంటూ గట్టిగా చెప్పాడు. అలా అయితేనే మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గట్టిపడుతుందని ఓపిక పట్టమన్నాడు అనుకుంటాడు విక్రమ్.

హద్దు దాటితే ఓపిక కోపంగా మారిపోతుంది అనుకుంటుంది దివ్య. నా అదృష్టంలో ఏముందో నీ ముందుకు వస్తేనే గాని తెలియదు అనుకుంటాడు విక్రమ్. నాకు ఇష్టమేనా రెడ్ రోజెస్ ని పంపించి నా హార్ట్ ని టచ్ చేసావు అనుకుంటుంది దివ్య. నీ మనసుతో నా మనసుని రాప్ చేస్తున్నావా అనుకుంటాడు విక్రమ్. నేను నీకు ఫోన్ చేస్తాను మాట్లాడతావా అనుకుంటుంది దివ్య.

సంజయ్ ని కోపంగా చూస్తున్న రాజ్యలక్ష్మి..

మాట్లాడుతాను కానీ ఒక్క 24 గంటలు ఆగితే ఎవరు మనసులో ఏముందో తెలిసిపోతుంది అప్పటివరకు ఈ ఆలోచనలు తప్పవు అనుకుంటాడు విక్రమ్. మరోవైపు 101 బిందెల అభిషేకం చేస్తూ ఉంటుంది ప్రియ. 101 రోజులు 101 బిందెలు అంటే మాటలు కాదు. ఈ లెక్క చాలు నీ రోజులు చెలిపోవడానికి. నా కొడుక్కి భార్య కావాలంటే అంత తేలిక కాదు అనుకుంటుంది.

అభిషేకం చేసేటప్పుడు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటుంది రాజ్యలక్ష్మి. అలాగే అత్తయ్య గారు అంటుంది ప్రియ. ఈ వెధవల్ల అడ్డమైన వాళ్ళ చేత అత్తయ్య గారు అనిపించుకోవాల్సి వస్తుంది అనుకుంటూ సంజీవైపు కోపంగా చూస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన విక్రమ్ అందరూ బయట ఏం చేస్తున్నారు నాకోసమే ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు. వీడొకడు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటాడు అనుకుంటాడు బసవయ్య.

Intinti Gruhalakshmi March 29 Today Episode ఆమెని అక్కడ చూసి షాకైన విక్రమ్..

వెళ్లిన పని ఏమైంది డాక్యుమెంట్స్ అన్ని ఓకేనా అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. అన్నీ చెక్ చేశాను ఎక్కడా ప్రాబ్లం లేదు అక్కడ హాస్పిటల్ నిర్మాణాన్ని ధైర్యంగా చెయ్యొచ్చు అంటాడు విక్రమ్. అంతలోనే నీళ్ల బిందెతో వస్తున్న ప్రియ ని చూసి నువ్వు మా హాస్పిటల్ లో పనిచేసే నర్స్ ప్రియ వి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ పూజలు ఏంటి అని అడుగుతాడు.

నేను చెప్తాను అంటూ అక్కడికి వచ్చిన విక్రమ్ వాళ్ల తాతయ్య ఇప్పుడు తన హోదా మారిపోయింది అని చెప్తాడు. తరువాయి భాగంలో దివ్యకి మరో బొకే వస్తుంది పేరు చూస్తాను అంటే కంగారుగా ఆమె దగ్గర లాక్కోబోతుంది దివ్య. పెనుగులాటలో అది తులసి ఒళ్లో పడుతుంది. పేరు చూసి ఇచ్చేస్తాను అంటుంది తులసి. అమ్మ ఇప్పుడు విక్రమ్ పేరు చూడబోతుంది అని కంగారు పడుతుంది దివ్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 29, 2023 at 8:17 ఉద.