Intinti Gruhalakshmi March 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ప్రియ హోదా మారిపోయింది తను ఇప్పుడు మీ మరదలు అని చెప్తాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఇది ఎలా సాధ్యం అంతా అయోమయంగా ఉంది అంటాడు విక్రమ్. తప్పు అంతా నాదే నేను ప్రియ విషయంలో తొందర పడ్డాను ఇప్పుడు తను తల్లి కాబోతుంది అంటాడు సంజయ్.

 

రాజ్యలక్ష్మి తిక్క కుదిర్చిన విక్రమ్..

 

మామ్ కి తెలిసి వెంటనే ప్రియ మెడలో తాళి కట్టించింది అంటాడు సంజయ్. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవు, పెద్దమనసుతో నువ్వు చేసిన మంచి పని తమ్ముడు చేసిన తప్పుని చిన్నది చేసింది అంటాడు విక్రమ్. అయినా తను అభిషేకం చేస్తుంది ఏంటి అంటాడు విక్రమ్. జరిగిందంతా చెప్తాడు బసవయ్య. దోషమంటే గుర్తొచ్చింది మొన్న ప్రవచనాల్లో విన్నాను.

 

భార్యాభర్తల్లో ఎవరికి దోషమున్నా ఇద్దరికీ వర్తిస్తుందంట తను అవుట్ హౌస్ లో ఉంటే సంజయ్ కూడా అవుట్ హౌస్ లోనే ఉండాలి ప్రియా కి తోడుగా ఉంటాడు అలాగే అభిషేకం విషయంలో కూడా హెల్ప్ చేస్తాడు అని చెప్పి ప్రియా వైపు తిరిగి నువ్వు ఇప్పుడు మా ఇంటి మనిషి నీకు ఏ కష్టం వచ్చినా అమ్మ, సంజయ్ అందుబాటులో లేకపోతే నాతో చెప్పు నేను చూసుకుంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.

 

నిజం తెలిసిపోతుందని కంగారు పడుతున్న దివ్య..

 

ఇరకాటంలో పడతాడు సంజయ్. మరోవైపు నీకు ఏదో బొకే వచ్చింది అంటుంది లాస్య. పేరు చూస్తాను అంటే ఆమె దగ్గర నుంచి బొకే లాక్కుపోతుంది దివ్య. లాస్య ఆ బొకేని తులసికిస్తుంది. తులసి దానిమీద పేరు చూద్దామనేసరికి ఫ్రెండ్ అని మాత్రమే ఉంటుంది. పేరేమీ లేదు కదా ఎందుకంత కంగారు పడ్డావు అంటుంది తులసి. నేనేమీ కంగారు పడలేదు మీరే ఏదేదో ఊహించుకున్నారు అంటుంది దివ్య.

 

ఇదంతా చూస్తున్న లాస్య నాకు కావలసింది కూడా అదే నువ్వు విక్రమ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవాలి అనుకుంటుంది. అదే సమయంలో తన ఫ్రెండ్ ఫోన్ చేసి మనం ఇన్వెస్ట్ చేసిన మనీ క్లాస్ అయిపోయాం అంటుంది. అది విని కంగారుపడిన లాస్య తెలియకుండా ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు తెలిస్తే నా పీక పిసికేస్తాడు నందుకి విషయం తెలిసేలోపు ఆ డబ్బు కూడబెట్టాలి అనుకుంటుంది.

 

జరిగిన సంగతి చెప్పలేక ఇబ్బంది పడుతున్న దేవుడు..

 

మరోవైపు అమ్మ మొహం ఎందుకో దిగులుగా ఉంది కోడలు వచ్చిందన్న ఉత్సాహమే లేదు, అయినా వచ్చి రాగానే దివ్య సంగతులు చెప్తావు అనుకున్నాను ఎందుకు అలాగా మౌనవ్రతం పట్టావు ఒంట్లో బాగోలేదా అని దేవుడిని అడుగుతాడు విక్రమ్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మీకు దివ్యమంటే అంటే ఇష్టం అడుగుతాడు దేవుడు. ఎంత ఇష్టం అంటే వినటానికి నీకు ఓపిక సరిపోదు మధ్యలో ఆపటానికి నా మనసు ఒప్పుకోదు.

 

ముగింపు లేని కథ అంటాడు విక్రమ్. ప్రేమకి ముగింపు పెళ్లే, ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు దివ్యమ్మని పెళ్లి చేసుకుంటారు కదా అంటాడు దేవుడు. అమ్మ తర్వాత అంత ఇష్టం దివ్య మాత్రమే అంటాడు విక్రమ్. అదే బాబు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఒక ఇష్టం ఇంకొక ఇష్టానికి అడ్డుపడుతుంది అమ్మ ప్రేమ దివ్య ప్రేమను దక్కనివ్వదేమో అనుకుంటాడు దేవుడు.

 

తనని టెన్షన్ పెట్టొద్దంటున్న విక్రమ్..

 

తన కోసం నేను డైమండ్ రింగ్ కూడా తీసుకొని వచ్చాను అలాంటిది ఇప్పుడు పెళ్లి విషయంలో ఎందుకు తగ్గుతాను అనుకున్నావు అంటాడు. దానికి మీ అమ్మ మీ అమ్మగారు ఒప్పుకోరేమో, అమ్మ ప్రేమ దివ్యమ్మ ప్రేమో ఎవరిదో ఒకరిదే కావాలి అంటే మీరు ఏం చేస్తారు అంటాడు దేవుడు. అలాంటి పరిస్థితి నేను అసలు ఊహించుకోలేదు.

 

నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అంటూ దివ్యకి ఫోన్ చేయడానికి వెళ్తాడు విక్రమ్. మరోవైపు కంటిన్యూస్గా చాటింగ్ చేస్తున్న దివ్యని టిఫిన్ చేస్తూ కూడా చాటింగ్ చేసుకోవచ్చు కదా అంటాడు పరంధామయ్య. ఇక్కడ చేస్తే మనందరికీ తెలిసిపోతుంది కదా అంటుంది లాస్య. వీళ్ళందరికీ ఏదో అనుమానం వచ్చినట్లుంది అనుకుంటుంది దివ్య. టిఫిన్ దగ్గర కూర్చునేటప్పుడు విక్రమ్ ఫోన్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది.

 

దివ్యని ఇరకాటంలో పెట్టిన విక్రమ్ ఫోన్..

 

అనుకుంటూ వైబ్రేషన్ మోడ్ లో పెట్టి ఫోన్ నడుము దగ్గర దాచేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. దివ్యతో మాట్లాడి 48 గంటలు అయింది ఇక మెసేజ్లు కాదు డైరెక్ట్ గా ఫోనే మాట్లాడాలి అంటూ ఫోన్ చేస్తాడు విక్రమ్. ఆ వైబ్రేషన్ సౌండ్ కి అందరూ దివ్య వైపే చూస్తారు. దివ్య కాల్ కట్ చేసినా మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు విక్రమ్. ఇక భరించలేక టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దివ్య.

 

రెండు రోజుల నుంచి ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజ్లు చేశానో తెలుసా అంటుంది దివ్య. అన్నీ తెలుసు అంటాడు విక్రమ్. అన్ని తెలిసి కూడా రిప్లై ఇవ్వలేదు దిస్ ఇస్ టూ మచ్ నాకు కోపం వచ్చింది నేను బుంగమూతి పెట్టుకుంటున్నాను దివ్య.నేను పక్కన లేనప్పుడు అలా చేయకండి మిమ్మల్ని బ్రతిమాలికొనే ఛాన్స్ మిస్ అవుతాను అయినా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది.

Intinti Gruhalakshmi March 30 Today Episode: దివ్య బండారం బయటపెట్టిన లాస్య..

 

మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్ లో కలుద్దాం అంటాడు విక్రమ్. అందుకు ఒప్పుకుంటుంది దివ్య. ఇదంతా లాస్య గమనిస్తుంది. దివ్య కూడా లాస్య అని చూస్తుంది కానీ కామ్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతలోనే రాజ్యలక్ష్మి, లాస్యకి ఫోన్ నీతో పని ఉంది మా ఇంటికి రా అంటుంది. నేను ఎవరో తెలుసా, అయినా నేనెందుకు మీ ఇంటికి రావాలి అంటుంది లాస్య.

 

మీకు లాభం వచ్చే పని నువ్వు చేయగలిగిన పని ఒకటి చెప్తాను అంటుంది రాజ్యలక్ష్మి. లాభం వచ్చే పని ఎప్పటికీ ఈ లాస్య వదులుకోదు అనుకుంటుంది లాస్య. తరువాయి భాగంలో డబ్బు లాస్య ముందు పెట్టి మనం కొట్టే దెబ్బ దివ్య జీవితంలో మర్చిపోకూడదు అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యని మీ పెద్ద కోడలు చేసుకోండి ఆల్రెడీ వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్ నడుపుతున్నారు అంటుంది లాస్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 30, 2023 at 9:17 ఉద.