Intinti Gruhalakshmi March 31 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భార్య మీద చిరాకు పడుతూ ఉంటాడు సంజయ్. మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను కదా ఇంకెందుకు చిరాకు అంటుంది ప్రియ. ఏదో సరదా పడితే నా జీవితాన్ని నాశనం చేసేసావు అని సంజయ్ అంటుండగానే రాజ్యలక్ష్మి వస్తుంది. నా కష్టాలు చూస్తూ కూడా ఊరుకుంటున్నావు నన్ను వదిలేస్తావా అని అడుగుతాడు సంజయ్.

 

అబద్ధం చెప్పి కొడుకుని సేవ్ చేసిన రాజ్యలక్ష్మి..

 

అన్నయ్య చూస్తే ఊరుకోడు అంటుంది రాజ్యలక్ష్మి. నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని సంజయ్ అంటే మీ అన్నయ్యకు నా మీద నమ్మకం పోయిందంటే మనం రోడ్డు మీద పడాలి అంటుంది రాజ్యలక్ష్మి. వంద రోజులు అవుట్ హౌస్ లో ఉండడం అంటే నా వల్ల కాదు అంటాడు సంజయ్. అంతలోనే అక్కడికి వచ్చిన విక్రమ్ కి నీ తమ్ముడు ప్రియ గురించి బాధపడుతున్నాడు.

 

తను అవుట్ హౌస్లో ఉండలేకపోతుందంట అంటుంది రాజ్యలక్ష్మి. ఏం చేస్తాం దోషమని నువ్వే చెప్పావు కదా అంటాడు విక్రమ్. అందుకే పంతులు గారిని అడిగాను వెనుక ద్వారం నుంచి ఇంట్లోకి రావచ్చు అని చెప్పారు అంటుంది రాజ్యలక్ష్మి. అలాగే చేద్దాం అంటాడు విక్రమ్. భార్యని ఎలా చూసుకోవాలో కూడా చెప్తాడు. పెళ్ళికి ముందే వీడు ఇన్ని సూక్తులు చెప్తున్నాడు.

 

ప్రియ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్యలక్ష్మి..

 

పెళ్లి చేస్తే నా కంట్లో నేనే పొడుచుకున్న దాన్ని అవుతానా అంటూ ఆలోచనలో పడుతుంది రాజ్యలక్ష్మి. నాకు మీలో దేవుడు కనబడుతున్నారు బావగారు అంటూ విక్రమ్ కాళ్ళకి దండం పెడుతుంది ప్రియ. నాకు హాస్పిటల్ కి వెళ్ళే మూడ్ లేదు నువ్వు వెళ్లి శాలరీ చెక్స్ ఇచ్చేయ్ అంటాడు సంజయ్. అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.

 

వెంటనే ప్రియ చంప చెల్లుమనిపించి నిజం చెప్పేసి బయట పడిపోదామనుకుంటున్నావేమో అది జరగని పని అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది రాజలక్ష్మి. అందంగా ముస్తాబైన దివ్య నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది తులసి. ఎందుకలా అడుగుతున్నావ్ అని అంటుంది దివ్య.

 

తల్లిగా ఇది నా బాధ్యత అంటున్న తులసి..

 

హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా అడగలేదు. ఈరోజు అడుగుతున్నావు అంటే నువ్వు హాస్పిటల్ కి వెళ్లడం లేదు అని అర్థమైంది అంటుంది తులసి. డ్రెస్ బాగుంది లేదో చెప్పమంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు అంటుంది దివ్య. నీ అంత అందంగా ఉంది. అయినా ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది. అమ్మ అనుమానిస్తుందని నిలదీస్తుందని అనుకోకు అడగడం తల్లిగా నా బాధ్యత.

 

ఈరోజు చాలా అందంగా ఉన్నావు నా అల్లుడు ఎక్కడ ఉన్నాడో కానీ చాలా మిస్ అవుతున్నాడు అంటుంది తులసి. నేను వెళ్ళేది అక్కడికి అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దివ్య. అంతలోనే హాస్పిటల్ నుంచి అర్జెంట్ కేసు ఉంది రమ్మంటూ ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఎలా నేను విక్రమ్ కి వస్తానని చెప్పాను అంటూ విక్రమ్ కి ఫోన్ చేసి కొంచెం లేటుగా వస్తాను అంటుంది.

 

లాస్య జాతకం చెప్తున్న రాజ్యలక్ష్మి..

 

అక్కడ విక్రమ్ కూడా దివ్యకి వస్తానని చెప్పాను ఎలా అని ఆలోచనలో పడతాడు ఇంతలోనే ఫోన్ చేసి దివ్య లేటుగా వస్తానని చెప్పడంతో ఆనందిస్తాడు. మరోవైపు రాజ్యలక్ష్మి ఇంటికి వచ్చిన లాస్య ఎందుకు పిలిపించారో చెప్పండి అంటుంది. పనేంటో చెప్పాక వెనక్కి తగ్గవని అనుకుంటున్నాను అంటుంది రాజ్యలక్ష్మి. పని ఏంటో చెప్పకుండా ఎలా మాటిస్తాను అంటుంది లాస్య.

 

ఇవ్వకపోతే నువ్వే నష్టపోతావు అంటూ డబ్బు పెట్టె ని చూపిస్తుంది. మీరు చెప్పిన పని చేయటానికి నేను సిద్ధం అంటుంది లాస్య. నువ్వు తులసికి సవతి కానీ సవతి అని తెలుసు ఆ ఇంట్లో నువ్వే తోపువి అనుకుంటావు కానీ ఏరి పారేసిన కరివేపాకు వి అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యని దెబ్బ కొట్టే విషయంలో నా హెల్ప్ కావాలి అంతే కదా అంటుంది లాస్య. బాగానే కనుకున్నావు కానీ నా దగ్గర ఎక్కువ టైం లేదు.

 

ఆ.. పనికి లాస్యతో డీలింగ్ కుదుర్చుకున్న రాజ్యలక్ష్మి..

 

పని వెంటనే అయిపోవాలి మనం కొట్టే దెబ్బకి దివ్య జీవిత కాలం ఏడుస్తూనే ఉండాలి ఏం చేస్తావో నాకు తెలియదు అంటుంది రాజ్యలక్ష్మి. మీ పెద్ద కొడుకు విక్రమ్ పెళ్లి చేస్తాను అంటుంది లాస్య. నీకేమైనా పిచ్చి పట్టిందా బ్రోకర్ పనులు చేయడానికి నిన్ను పిలిపించలేదు అంటుంది రాజ్యలక్ష్మి.హాస్పిటల్లో ఉంటేనే నన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది ఇంటికోడల్ని చేసుకుంటే ఇల్లు పీకి పందిరి వేస్తుంది అంటుంది రాజ్యలక్ష్మి.

 

మీరు ప్రియని ఇంటి కోడలుగా చేసుకున్నారు కానీ ప్రేమగా చూసుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే కదా అదే సీన్ ప్రియ విక్రమ్ ల మధ్య ఊహించుకోండి ఎందుకంటే విక్రం మీరు ఎలా చెప్తే అలా ఆడే తోలుబొమ్మ అందుకే అతని మైండ్ ని పొల్యూట్ చేయండి అంటుంది లాస్య. మీరు ఇదే కంటిన్యూ చేస్తే దివ్య జీవితాంతం మీ కాళ్ళ దగ్గర బానిసలాగా పడి ఉంటుంది.

 

నిజం చెప్పి రాజ్యలక్ష్మి కి షాక్ ఇచ్చిన లాస్య..

 

ఐడియా చెప్పాను నా పని అయిపోయింది అంటూ డబ్బు తీసుకోబోతుంది లాస్య. దివ్యని ఇంటికోడల్ని చేసాక అప్పుడు డబ్బు తీసుకో అంటుంది. అది ఎంత పని ఆ సంగతి నేను చూసుకుంటాను అయినా మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను ఆల్రెడీ విక్రమ్ దివ్య లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు అంటుంది లాస్య. ఆ మాటలకి షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి.

 

మీరు అలా కోప్పడకండి అంతా మనమంచికే అనుకోండి. వాళ్లని ప్రేమతో కట్టిపడేయండి పెళ్లి తర్వాత అసలు సినిమా చూపించవచ్చు అంటుంది లాస్య. నా చేతిలో అయిపోయావు నీ తలరాతని నేను తిరిగి రాస్తాను అనుకుంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు హాస్పిటల్ లో దివ్య రూమ్ లో ఉండదని తెలిసి ఆమె రూమ్ లోకి వెళ్లి ఆమె సీట్లో కూర్చుందామని అనుకుంటాడు విక్రమ్.

Intinti Gruhalakshmi March 31 Today Episode:  విక్రమ్ నమ్మకద్రోహి అంటున్న దివ్య..

 

ఇంతలో అటెండర్ వచ్చి సాలరీ చెక్స్ ఇస్తారా అని అడుగుతాడు. సరే పద అంటూ స్టాప్ అందరికీ సాలరీ చెక్స్ ఇచ్చేస్తాడు. తరువాయి భాగంలో నమ్మకద్రోహం అనే పదాన్ని విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని విక్రమ్ తో అంటుంది దివ్య. మీకు అలా అనిపిస్తే మీరు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను అంటాడు విక్రమ్.

 

మరోవైపు దివ్య కి మంచి సంబంధం తీసుకువచ్చాను అంటుంది లాస్య. కుర్రాడు ఏం చదువుకున్నాడు అంటాడు నందు. పెద్దగా ఏమీ చదువుకోలేదు అని లాస్య అంటే అయితే ఈ సంబంధం ఒప్పుకునేదే లేదు అంటాడు నందు. నీ కూతురు మనసు పడింది అన్నా కూడా నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకోవా అంటుంది లాస్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 31, 2023 at 7:57 ఉద.