Intinti Gruhalakshmi March 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అజయ్ కి ఇంతకుముందే పెళ్లయి ఉంటుంది వాళ్ళిద్దరు అభిప్రాయాలు కలవలేదు ఏమో విడిపోయారు అంటుంది లాస్య. ఇప్పుడు సమస్య అది కాదు నీకు విషయం తెలిసి ఎందుకు దాచావు అంటుంది తులసి. ఎందుకంటే టిఫిను వాళ్ళ సపోర్ట్ ఇస్తానన్నారు కాబట్టి నన్ను నమ్మటానికి ట్రై చేసింది అంటుంది దివ్య.

లాస్యకి చివాట్లు పెడుతున్న తల్లి, కూతుర్లు..

నేను నాకోసం ఆలోచించలేదు మీకోసమే ఆలోచించను నాలుగు తరాలు తిన్న తరగని ఆస్తి ఉంది ఆ ఇంటికి కోడలు అయితే ప్రిన్సెస్ లాగా బ్రతుకుతుంది కన్నతల్లి కన్నతల్లి అని గుండెలు బాదుకోవడం కాదు, కన్నతల్లి లాగా ఆలోచించు పనికిమాలిన సూక్తులు నేర్పించి దాని జీవితం కూడా మీ జీవితం లాగే నాశనం చేయకు అంటుంది లాస్య. ఆ మాటకి కోపంతో ఆమె మీద చేయి ఎత్తుతుంది తులసి.

కానీ ఆవేశం తగ్గించుకొని వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియని నువ్వు నా జీవితం గురించి మాట్లాడుతున్నావు అంటుంది. నీ భార్య మీద చెయ్యి ఎత్తుతుంటే ఊరుకున్నావేమి నిలదీవేమీ అంటూ నందుని రెచ్చగొడుతుంది లాస్య. తప్పు చేశావు తులసి చెంప పగలగొట్టకుండా తప్పు చేశావు అంటాడు నందు. నా విషయంలో ఎన్ని తప్పులు చేసినా సహిస్తాను కానీ నాకు ఇతర జీవితంతో ఆడుకుంటే సహించేది లేదు అంటాడు నందు.

తనని తాను సమర్ధించుకుంటున్న లాస్య..

ఏంటి నేను చేసిన తప్పు, అప్పులు చేసి దాన్ని ఎంబిబిఎస్ చదివించావు 500, వెయ్యి కన్సల్టేషన్ ఫీజు తీసుకొని తను ఎప్పటికి ఎదగాలనుకున్నాను, తనని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాలని దూరాలోచనతో చేశాను అంటుంది లాస్య. డబ్బు కోసం ఎంతకైనా దిగజారడం నీకు అలవాటు నా కూతురికి అలాంటి కర్మ పట్టలేదు నా కూతురుది నా రక్తం అందులో మంచితనం వాటికి కనీసం అర్థం కూడా నీకు తెలియదు అనుకుంటున్నాను.

డబ్బు కోసం కక్కుర్తి పడటం, జీవితాన్ని తాకట్టు పెట్టడం అనే లక్షణాలు నా కూతురి రక్తంలో లేవు నా కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు డబ్బును మహారాజు కానక్కర్లేదు మనసున్న మహారాజు అయితే చాలు అంటుంది. నా కూతుర్నే అడ్డం పెట్టుకొని బాగుపడలేని ప్రయత్నం మానమని మీ ఆవిడకు చెప్పండి అంటూ నందుకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది తులసి. దివ్య కూడా తండ్రికి అదే చెప్పి వెళ్ళిపోతుంది.

రాజ్యలక్ష్మి ని పొల్యూట్ చేస్తున్న ఆమె తమ్ముడు..

మరోవైపు రాజ్యలక్ష్మి కి కాఫీ తీసుకొని వస్తాడు ఆమె తమ్ముడు అదేంటి తమ్ముడు నువ్వు తీసుకువచ్చే పని వాళ్ళందరూ ఏమయ్యారు అంటే ఎంతమంది పని వాళ్ళు ఉన్నా నా చేత్తో కాఫీ ఇస్తే అదొక తృప్తి అంటాడు అతను. విక్రమ్ లేడా అని రాజ్యలక్ష్మి అడిగితే నీ పెంపుడు పిల్లి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అయినా వయసు వచ్చిన మగాన్ని అస్సలు నమ్మకూడదు టైం అలాంటిది ఎంత కంచే వేసి ఇంకా పాడిన గోడ దూకి పారిపోతారు అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు.

అంటే ఏంటి నీ ఉద్దేశం ఉంటుంది రాజ్యలక్ష్మి. విక్రమ్ మెడలు తాడేసి గుంజకి గట్టిగా కట్టేసుకున్న వయసు ఉంటే తెంచుకొని పారిపోతాడు. ఎవరితోనో చంకనేసుకొచ్చి ఈవిడ మా ఆవిడ అన్నా అంటాడు. అప్పుడు వాడు నెత్తిన అక్షింతలు వేయటం తప్పితే వేరే దారి ఉండదు అంటాడు ఆమె తమ్ముడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే విక్రమ్ కి పెళ్లి చేసేద్దాం అంటాడు.

తల్లి మాటలకి షాక్ అయిన విక్రమ్..

అంతలోనే అక్కడికి వచ్చిన పెళ్లిళ్ల పేరయ్య మీ అబ్బాయికి లేటెస్ట్ సంబంధాలు తీసుకొని వచ్చాను అంటాడు. అందుకు ఆశ్చర్యపోయిన రాజ్యలక్ష్మి తమ్ముడు నేను ఇంకా గడ్డి వేయడం దగ్గరే ఉన్నాను నువ్వు అప్పుడే పాలు పితికే వరకు వెళ్లిపోయావు, మా అక్కది మామూలు స్పీడు కాదు రేసుగుర్రం అంటాడు. అలా మార్కెట్ వరకు వెళ్లి ఫ్రూట్స్ తీసుకొస్తాను అంటే నువ్వెందుకు దేవుడు ఉన్నాడు కదా అంటుంది రాజ్యలక్ష్మి.

నీకోసం కదమ్మా నేనే స్వయంగా సెలెక్ట్ చేస్తాను అంటాడు విక్రమ్. నీకు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి త్వరలోనే పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఆయన సంబంధాలు కూడా తీసుకువచ్చారు అంటుంది. తల్లిగా అడగాలి కాబట్టి అడుగుతున్నాను నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే మొహమాటం లేకుండా చెప్పేసేయ్ అంటుంది రాజ్యలక్ష్మి.

నిజం తెలిసే వరకు దాగుడుమూతలు తప్పవంటున్న విక్రమ్..

ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిన విక్రమ్ పెళ్లి విషయంలో నీ ఇష్టమే నా ఇష్టం అంటాడు. తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుని నేను చూడలేదు కానీ తల్లి మాట జవదాటని శ్రీరామచంద్రుని ఇక్కడే చూస్తున్నాను అంటూ నక్క వినయాన్ని చూపిస్తాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. నీ మనసుకి నచ్చిన అమ్మాయిని నీకు భార్యగా తీసుకొస్తాను అంటుంది రాజ్యలక్ష్మి.

బయటికి వచ్చిన తర్వాత బంగారం లాంటి అవకాశాన్ని చేతికి వచ్చిన తర్వాత ఉపయోగించుకోవాలి కానీ ఇలా మీన మేషాలు లెక్కబడితే ఎలాగా అయినా మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నిజం చెప్పేయొచ్చు కదా అంటాడు దేవుడు. నా మనసులో తను ఉంది కానీ తన మనసులో నేను ఉన్నాను లేదో తెలియదు కదా అది తెలిసే వరకు తప్పవు అంటాడు దేవుడు.

పనిమనిషి ని కోడలుగా కావాలంటున్న రాజ్యలక్ష్మి..

మరోవైపు ఇందాకటి నుంచి చూపిస్తాను, చూపిస్తాను అంటున్నావు కదా ఇప్పుడు చూపించు అంటూ పెళ్లిళ్ల పేరయ్యకి చెప్తాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. అతను ఒక ఫోటో చూపించి వివరాలు చెప్తుండగా నాకు కావాల్సింది ఇలాంటిది కాదు అంటూ వీధిలో ఉన్న పనిమనిషిని చూపించి అలాంటి చదువు సంధ్యలేని చెత్తూడిచే మనిషి కావాలి తనకి బుర్ర ఉండకూడదు.

నా ఆలోచనలే తన ఆలోచనలు కావాలి అంటుంది రాజ్యలక్ష్మి. మా మేనల్లుడ్ని కంట్రోల్ లో పెట్టుకొని భార్యను కాదు నువ్వు చూడాల్సింది మా అక్క కంట్రోల్లో పెట్టుకునే కోడల్ని నువ్వు చూడాలి అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు. వాళ్ళ మాటలకి షాకైన సిద్ధాంతి గారు అలాగే అంటూ అలాంటి అమ్మాయి ఒకటి ఉంది అంటూ ఫోటో తీసి చూపిస్తాడు.

విక్రమ్ నా కాలికింది చెప్పు అంటున్న రాజ్యలక్ష్మి..

ఆ ఫోటో చూసిన రాజ్యలక్ష్మి తమ్ముడు ఈ అమ్మాయి ముఖంలో పనిమనిషి కళ ఉట్టిపడుతుంది అంటూ రాజ్యలక్ష్మి కి కూడా చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఆనందించిన రాజ్యలక్ష్మి ఏ మాత్రం చదువుకుంది అని అడుగుతుంది. అత్తెసరు ఆస్తి, అత్తెసరు చదువు అంటాడు పెళ్లిళ్ల పేరయ్య. పెళ్లిచూపులు కి ఎప్పుడు వెళ్దాం అని అడిగితే వాళ్ళింటికి మేము వెళ్ళటం వంటి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి చూపించమనండి అంటాడు రాజ్యలక్ష్మి తమ్ముడు.

విక్రమ్ ఒప్పుకుంటాడా అని అతని భార్య అడిగితే వాడు నా కాలికింది చెప్పు నేను చెప్పినట్లే వినాలి అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ ఇలాగ చేస్తావనుకోలేదు అంటుంది లాస్య. ఇంకేమీ మాట్లాడకు బతకడానికి డబ్బు అవసరం డబ్బు సంపాదించటానికి ఆరాటపడ్డాను కానీ నీకు లాగా తప్పుడు ఆలోచన చేయలేదు అంటాడు నందు.

నువ్వు తప్పు చేస్తున్నావని సంగతి నీకు తెలుసు అందుకే వాడికి పెళ్లయిందని విషయాన్ని దాచి పెట్టావు అంటాడు నందు. అయినా రెండో పెళ్లి వాడిని చేసుకోవడం తప్ప అని లాస్య అడిగితే ఇష్టపడి చేసుకుంటే పర్వాలేదు కానీ ఇలాగా నిజాన్ని దాటి దాచిపెట్టి చేస్తేనే తప్పు అంటాడు నందు. ఇదే నిజం పెళ్లయిన తర్వాత తెలిస్తే తను ఎంత బాధ పడుతుంది అని నందు అంటే ఏం కాదు రెండు రోజులు బాధపడుతుంది.

పిల్లల జోలికొస్తే నరసింహవతారం ఎత్తుతానంటున్న నందు..

తర్వాత తనకు దగ్గర మహారాణి వైభోగాన్ని ఎంజాయ్ చేస్తుంది అంటుంది లాస్య. ఇంత జరిగినా కూడా తప్పు అని ఒప్పుకోవటం లేదు కదా దివ్య చెప్పింది నిజమే కొందరికి సాఫ్ట్ గా చెప్తే అర్థం కాదు నీవల్ల నాకు ఎలాంటి నష్టం జరిగిన పర్వాలేదు కానీ నా పిల్లలకు నష్టం జరిగితే మాత్రం నరసింహవతారం ఎత్తుతాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు.

ఇలాంటి బెదిరింపులు ఇలా చూసింది నీ కూతురు పెళ్లి నీ ఇష్టమా, మరి ఇక్కడ నేను ఉండేది ఎందుకు ఎప్పటికైనా ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి జరిగి తీరుతుంది అనుకుంటుంది లాస్య. మరోవైపు మగవాళ్ళు అవసరానికి తగ్గట్టు మారిపోతూ ఉంటారా అని తల్లిని అడుగుతుంది దివ్య. ఎవరిని ఈ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావు అని తులసి అంటే ఇంకెవరిని నాన్నని అప్పుడు నువ్వు ఎంత అనిగిమనిగి ఉన్నా విడాకుల వరకు తీసుకొచ్చారు.

కూతుర్ని నిలదీస్తున్న తులసి..

కానీ ఇప్పుడు లాస్య ఎన్ని వెదవ వేసిన ఎందుకు భరిస్తున్నారు, ఎందుకు మెడ పట్టి బయటకు గెంటేయట్లేదు నువ్వెందుకు నిలదీయడం లేదు దివ్య. జరిగిపోయిన దాన్ని తప్పుకోవడం వల్ల ఇప్పుడు ఏంటి ప్రయోజనం ఉంటుంది తులసి. నీకు అడ్జస్ట్ అవ్వటం తప్పితే ఏమీ చేతకాదని నాకు అర్థమైంది నీలా ఆవేశాన్ని నడుచుకొని పైకి నవ్వుతూ ఉండలేను క్లాసిటికీ ఎందుకు డైవర్స్ ఇవ్వడం లేదు నాన్నని అడిగేస్తాను అంటుంది దివ్య.

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కబోర్డ్ తీస్తుంది తులసి అందులో ఆమెకి రెండు లక్షలు కనిపిస్తుంది. అబ్బో మనది కాదు అని దివ్య అంటే మనది కాని డబ్బు మన దగ్గర ఎందుకు ఉంది అంటుంది తులసి జరిగిందంతా చెప్తుంది దివ్య. తన తప్పు లేకుండా రెండు లక్షలు ఎందుకు ఇచ్చినట్లు అంటుంది తులసి. బాబుకి హెల్ప్ చేద్దామనుకున్నాడేమో అంటుంది దివ్య.

 

 

 

Intinti Gruhalakshmi March 7 Today Episode విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య..

నుదుటి మీద బొట్టు, పెదాలు మీద చిరునవ్వు, మొహం మీద ప్రశాంతత మనిషి చాలా మంచి వాడిలాగా అనిపించాడు. రాముడు మంచి బాలుడు అంటారు కదా ఆ టైపు అన్నమాట అంటుంది దివ్య. అంటే నచ్చాడా అంటూ కొంటెగా అడుగుతుంది తులసి. తరువాయి భాగంలో మొత్తానికి రాముడు మంచి బాలుడిని కలవబోతున్నాను అంటూ ఒక ప్లేస్ కి వస్తుంది దివ్య.

అక్కడ విక్రమ్ ఎవరో అమ్మాయితో మాట్లాడటం చూస్తుంది. ఇంకా నీ మాయమాటలు నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను విని విక్రమ్ ని అపార్థం చేసుకుంటుంది. నువ్వు రాముడు మంచి బాలుడు టైపు అనుకున్నాను కానీ జుత్తులమారి నక్క అనుకోలేదు అంటుంది దివ్య. మర్యాద లేకుండా ఇలా మాట్లాడిం బాగోలేదు అంటాడు విక్రమ్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీతో ఇంతకన్నా మర్యాదగా ఎలా మాట్లాడుతాను అంటుంది దివ్య.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 7, 2023 at 8:15 ఉద.