Intinti Gruhalakshmi March14 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు ఏరి అని అడుగుతుంది వాసుదేవ్ భార్య. పెద్దబ్బాయి కోడలు డాక్టర్లు అమెరికాలో ఉంటున్నారు రెండో కొడుకు కోడలు బెంగళూరు వెళ్లారు నాలుగు ఐదు రోజుల్లో వచ్చేస్తారు అంటుంది తులసి. మరి మూడో అమ్మాయి అని అడుగుతుంది ఆమె. తను కూడా డాక్టరే ఇక్కడే జాబ్ చేస్తుంది అంటుంది లాస్య. మరి నీ సంగతి ఏంటి అని అడుగుతాడు వాసుదేవ్.
లాస్యని ఉత్తమ తల్లి అంటున్న రాములమ్మ..
నాకు ఒక కొడుకు ఉన్నాడు హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను అంటుంది లాస్య. మొగుడిని పర్మినెంట్గా వదిలేసి కొడుకుని హాస్టల్ నుంచి నువ్వు మాత్రం ఇక్కడ టింగురంగామని తిరుగుతున్నావా అంటాడు వాసుదేవ్. అలా కాదండి మొగుడు వదిలేసిన ఆడది అంటే చులకన కదా అందుకే ఇష్టం లేకపోయినా ఆమె ఇక్కడే ఉండి తన కష్టాలకు దూరంగా కొడుకుని పెంచుతున్న మహాతల్లి మా లాస్యమ్మ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది రాములమ్మ.
దీనికి కూడా లోకువైపోయాను అనుకుంటుంది లాస్య. మరో వైపు కెఫెలో దివ్య కోసం వెయిట్ చేస్తుంటాడు విక్రమ్. పక్కనే ఉన్న దేవుడు ఆవిడ మాట్లాడాలనుకున్నది మీతో మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా అంటాడు. నువ్వు లేకపోతే సలహాలు ఎవరు ఇస్తారు విక్రమ్. నీ మనసులో ఉన్న మాటని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేయండి తర్వాత విషయాలన్నీ ఆ అమ్మాయి చూసుకుంటుంది అంటాడు దేవుడు.
విక్రమ్ కి సారీ చెప్పిన దివ్య..
అంతే అంటావా అంటూ ఒక్కడే వెళ్లి సీట్లో కూర్చుంటాడు విక్రమ్. అప్పుడే దివ్య అక్కడికి వస్తుంది. మనసులో మాటని చెప్పేయండి అన్నట్లుగా దూరం నుంచి సైగ చేస్తాడు దేవుడు. దివ్య సారీ చెప్తుంది. విక్రమ్ ఏమీ అనకపోవడంతో ఎందుకు అని అడగరా అంటుంది. మీరు చెప్పారు కదా అంటాడు విక్రమ్. ఆరోజు మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకుని తిట్టేసాను అంటుంది దివ్య.
అది మీ హక్కు అంటాడు విక్రమ్. నేను అనేసి మాటలు అంటుంటే మీరు ఎలా భరించారు అంటుంది దివ్య. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయండి వేరే ఏదైనా మాట్లాడండి అంటాడు విక్రమ్. అదే సమయంలో ఒక కస్టమర్ వెయిటర్ తో గొడవ పడుతూ ఉంటాడు నీకు చదువు లేదు కాబట్టే ఇలాంటి ఉద్యోగం ఇచ్చారు మీకెందుకు ఈ పని అంటూ వెయిటర్ ని కసరుకుంటాడు.
సంస్కారానికి కొలమానం చదువు కాదంటున్న దివ్య..
ఆ మాటలు విన్న దివ్య ఆవేశంతో ఊగిపోతూ అతని దగ్గరికి వెళ్లి మీరేం చదువుకున్నారు అని అడుగుతుంది. ఇంజనీరింగ్ చదువుకున్నాను అంటే అయితే ఏం లాభం అతనికి ఉన్న సంస్కారం మీకు లేదు మీరు ఎన్ని మాటలు అన్నా, ఒక మాట అనకుండా ఊరుకున్నాడు కానీ మీరు మాత్రం సంస్కారం వదిలిపోయి రెచ్చిపోతున్నారు అంటుంది దివ్య.
సంస్కారం లేకుండా చదువుకుంటే ఏం లాభం. మంచి మంచితనానికి, గొప్పతనానికి కొలమానం చదువు కాదు అంటూ వెయిటర్ ని అక్కడి నుంచి పంపించేస్తుంది దివ్య. మళ్లీ వచ్చి తన సీట్లో కూర్చుంటుంది. సారీ నా మూడు తో పాటు మీ మూడు కూడా పాడు చేశాను అంటుంది దివ్య. నేను వెళ్ళొస్తాను హనీ దివ్య బయలుదేరుతుంటే అప్పుడేనా అంటాడు విక్రమ్ ఏం ఇంకేమైనా చెప్పాలా అంటుంది దివ్య.
తులసితో ఏకాంతం కావాలంటున్న నందు..
మళ్లీ ఎప్పుడు కలుద్దాం అంటాడు విక్రం నేను డాక్టర్ని నన్ను మళ్ళీ మళ్ళీ కలవాలి అనుకోకూడదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య. కంగారుగా వచ్చిన దేవుడు పనిలో పని చదువు లేని వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందో లేదో అడిగియొచ్చు కదా అంటాడు అమ్మో అంటాడు విక్రమ్.మీ వల్ల కాదు గాని నేను వెళ్లి అడుగుతాను అంటూ దివ్య వెనుక పడతాడు దేవుడు.
మరోవైపు ఒంటరిగా ఉన్న తులసితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు నందు. ఎలా మాట్లాడాలా అంటూ తికమక పడుతుంటాడు. ధైర్యం చేసి లోపలికి వెళ్లి నేను తులసి తో కాస్త మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్ళు అని రాములమ్మ కి చెప్తాడు నందు. ఏకాంతం మొగుడు పెళ్ళానికి కావాలి కానీ మీకు తలసమ్మకి ఎందుకు అంటుంది రాములమ్మ.
నందుని ఓ ఆటాడుకుంటున్న రాములమ్మ..
ఏడిపించుకుని తింటుంది అని రాములమ్మ ని తిట్టుకుంటాడు నందు. అమ్మ, బాబు గారికి ఏకాంతం కావాలట నన్ను వెళ్ళమంటారా అని అడుగుతుంది రాములమ్మ చెప్పవలసిన సమాధానం నువ్వు చెప్పేసావ్ కదా అంటుంది తులసి. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నీ చేయి పట్టుకున్నాను అందుకే సారీ చెబుదామని వచ్చాను అంటాడు నందు. తప్పే కదా అంటుంది రాములమ్మ.
వాసుదేవ్ ని నమ్మించడానికి అలా చేశాను అంటే నమ్మించడం కోసం ఏమైనా చేసేస్తారా అంటుంది రాములమ్మ. ఆ మాటలకి ఇరిటేట్ అయిన నందు రాములమ్మ ని ఇన్వాల్వ్ కావద్దని చెప్పు తులసి నేను నీతో మాట్లాడాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నాకు సమాధానం చెప్పినట్లే అంటుంది తులసి. అయినా నాదేముంది అంతా మీ ఇష్టం, తులసమ్మ ఇష్టం నాకు అంత ఇబ్బంది అనిపిస్తే కళ్ళు మూసుకుంటాను అంటుంది రాములమ్మ.
నందు ప్రవర్తనకి నవ్వుకుంటున్న తులసి, రాములమ్మ..
కళ్ళు కాదు నోరు మూసుకో, ఏదైనా సమస్య ఉంటే నేను తులసి చూసుకుంటాంలే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. అతని ప్రవర్తనకి నవ్వుకుంటారు తులసి రాములమ్మ. ముక్కు మీద కోపం బాబు గారికి ఆయనతో పాతికేళ్ళు కలిసి ఎలా కాపురం చేశారు నిజాన్ని మనం ఎవరిని చెప్పక్కర్లేదు,ఆయనే ఎప్పుడో ఒకప్పుడు వాసుదేవ్ గారి దగ్గర బయటపడిపోతారు చూడండి అంటుంది రాములమ్మ.
మరోవైపు వెళ్ళిపోతున్న దివ్యని ఆగమని చెప్పి గుళ్లో గంట కొట్టినట్టు ఎంత గొప్పగా స్పీచ్ ఇచ్చారు చదువు సంస్కారం అంటూ బాగా మాట్లాడారు అంటాడు దేవుడు. ఓ కదా చదువురాని మొద్దు అంటూ ఇందాక ఎవరో మాట్లాడితే కోప్పడను అంటుంది దివ్య. ఎంత గొప్పగా చెప్పారు సౌండ్ రాకుండా చెంప చెళ్ళు మనిపించారు అంటాడు దేవుడు.
చదువు పెద్ద ప్రాబ్లం కాదు అంటున్న దివ్య..
ఏం మాట్లాడుతుందో అంటూ దొంగ చాటుగా వింటుంటాడు విక్రమ్. అందరికీ మాటలు కోటలు దాటిపోతాయి కానీ ఆచరణలో మాత్రం చేసి చూపించరు మీ విషయం ఏంటో కనుక్కుందామని వచ్చాను అంటాడు దేవుడు. చేసింది చెప్పటం, చెప్పింది ఆచరించడం నాకు అలవాటు ఇందులో తగ్గేదే లేదు అంటుంది దివ్య. ఒకవేళ అలాంటివి చదువు రాని వ్యక్తి మీ కంటపడితే పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు దేవుడు.
మిగతా అన్ని విషయాలు నచ్చితే చదువు పెద్ద ప్రాబ్లం కాదు అంటుంది దివ్య. ఆ మాటలకి ఆనందపడిపోతాడు విక్రమ్. వినబడుతుందా అని అంటాడు దేవుడు ఎవరిని అడుగుతున్నావ్ అంటూ భయం గా అడుగుతుంది దివ్య ఉన్నారండి ఒక అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయనకి వినబడితే చాలు కలలో కూడా పొర్లు దండాలు పెట్టేస్తారు అంటాడు దేవుడు.
మనసులో కుళ్ళుకుంటున్న లాస్య..
ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటూ వెళ్ళిపోతుంది అంటుంది దివ్య. తను వెళ్ళిపోయిన తర్వాత ఆనందంతో దేవుడు, విక్రమ్ ఇద్దరు తీన్మార్ డాన్స్ చేస్తారు. మరోవైపు ఇల్లు అంటే ఇలాగే ఎప్పుడూ సందడిగా ఉండాలి నాకు బాగా నచ్చింది అంటాడు వాసుదేవ్. ఉమ్మడి కుటుంబం ఇలాగే ఉంటుంది అంటుంది అతని భార్య.
ఏం కాదు మా చెల్లెమ్మ ఉంది కాబట్టే ఈ ఇల్లు ఇలాగ ఉంది, అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది చెప్పు అంటాడు వాసుదేవ్. వచ్చిన దగ్గరనుంచి తులసిని పొగిడేసరికే సరిపోతుంది అతనికి ప్రత్యేకించి ఈవెంట్స్ నుంచి అందుకే వచ్చినట్లు ఉన్నాడు అని మనసులో కుళ్ళుకుంటుంది లాస్య. వేడిగా కాఫీ తాగుతారా అని అడుగుతుంది తులసి.
లాస్యని అన్ని విషయాల్లోనూ దూరిపోవద్దంటున్న వాసుదేవ్..
భోజనాలు టైంలో కాఫీ ఏంటమ్మా కావాలంటే భోజనం తర్వాత ఆలోచిద్దాంలే, అయినా డిన్నర్ మెనూ ఏంటి లంచ్ లో లాగే డిన్నర్ కూడా అదిరిపోవాలి అంటాడు వాసుదేవ్. ఈ తిండి గోల ఏంటి వీడ్ని చూస్తే అమెరికా నుంచి కాదు ఏ కరువు ప్రాంతం నుంచో వచ్చినట్లు ఉన్నాడు అనుకుంటుంది లాస్య. ఇంకేంటి సంగతులు అని నందుని అడుగుతాడు వాసుదేవ్.
ఎలాగూ ఖాళీగానే ఉన్నారు కదా బిజినెస్ డీలింగ్ గురించి మాట్లాడుకుంటే అయిపోతుంది అంటుంది క్లాస్ నేను అందుకే వచ్చానని తనకు ఎలా తెలుసు అంటూ నందుని ప్రశ్నిస్తాడు వాసుదేవ్. మా ఇంట్లోనే ఉంటుంది కదా మేము మాట్లాడుకుంటుంటే విన్నట్టుంది అంటాడు నందు. మొగుడు వదిలేసాడని మావాడు జాలిపడి ఇంట్లో పెట్టుకున్నాడు. చంకనెక్కించుకున్నాడు కదా అని ప్రతి దాంట్లోను దూరిపోకు అంటూ మందలిస్తాడు వాసుదేవ్.
Intinti Gruhalakshmi March14 Today Episode లాస్యని వెనకేసుకొస్తున్న తులసి..
మనసులో ఎంత కక్ష పెట్టుకున్నాడో,ఛాన్స్ దొరికితే చెండాడేస్తున్నాడు అనుకుంటుంది లాస్య.మన ఇంట్లో ఉంటే ఎవరైనా మన ఇంటి మనిషే అవుతారు వాళ్ళకి కూడా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి కదా అంటుంది తులసి. మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు వాసుదేవ్. మీరేంట అంకుల్ అలా కామ్ గా ఉన్నారు అని పరంధామయ్య అని అడుగుతాడు వాసుదేవ్.
ఆయన అలా ఉంటేనే బాగుంటుంది మనం కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అని నవ్వుతుంది అనసూయ. ఆ మాటలు కి అందరూ నవ్వుతారు. అప్పుడే బయట నుంచి వచ్చిన దివ్యకి వాళ్ళ నవ్వులు బయటికి వినిపిస్తాయి. తరువాయి భాగంలో జీలకర్ర కలిపిన మజ్జిగ తెమ్మని లాస్యకి చెప్తాడు వాసుదేవ్. వాడు చెప్పిన పని చెయ్యు అని రిక్వెస్ట్ చేసినట్లుగా అడుగుతాడు నందు.
స్నేహితుడి ప్రశ్నకు షాక్ అయిన నందు..
నువ్వేంటి పెళ్ళాన్ని బ్రతిమాలినట్టు బ్రతిమాలుతున్నావ్ వాసుదేవ్. తరువాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతుంటే నీ పెళ్ళాం ఎవరు అని అడుగుతాడు అదేంటి అలా అడిగావు అని నందు అంటే తులసి గదిలోకి వెళ్ళకుండా లాస్య వెనకాల వెళ్తావ్ ఏంటి అని నిలదీస్తాడు వాసుదేవ్.