Intinti Gruhalakshmi: పెళ్లి చేసుకోవటానికి చదువుతో అవసరం లేదని, మంచి మనసు ఉంటే సరిపోతుందని నమ్మే ఒక డాక్టర్ కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఈవారం సీరియల్ లో ఏం జరిగిందో చూద్దాం.

దొంగ పూజలతో విక్రమ్ ని మోసం చేసి తను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకునేలాగా మాట తీసుకుంటుంది రాజ్యలక్ష్మి. ఇష్టం లేకపోయినా తల్లి కోసం మాటిస్తాడు విక్రమ్. మరోవైపు వెడ్డింగ్ అనివర్సరీ సెలబ్రేట్ చేస్తాడు వాసుదేవ్. ఇష్టం లేకపోయినా వాసుదేవ్ కోసం ఒప్పుకుంటారు నందు, తులసి. నందు, తులసికి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాడు.

లాస్యమ్మ కి ఇచ్చిన నెక్లెస్ కన్నా ఇది చాలా బాగుంది అంటూ నోరు జారుతుంది రాములమ్మ. నందు తులసికి గిఫ్ట్ ఇవ్వడాన్ని భరించలేక పోతుంది లాస్య. మరి తన భర్తని నువ్వు లాక్కునప్పుడు తనంత బాధపడాలి అంటూ రాములమ్మ లాస్యకి చివాట్లు పెడుతుంది. పార్టీలో తులసి గురించి ఏమైనా చెప్పమంటాడు వాసుదేవ్. తులసీ పట్ల తప్పుగా ప్రవర్తించానని, క్షమించమని అడగడం తప్పితే ఏమీ చేయలేనని చెప్తాడు నందు.

మరోవైపు దివ్య ఫోటో చూస్తూ పరిసరాలు మర్చిపోతాడు విక్రమ్. తను నా పక్కన ఉంటే మరి ఏమి అక్కర్లేదు అంటాడు. పెళ్లయితే వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి కదా అంటాడు దేవుడు. దివ్య నాది అంటాడు విక్రమ్. మీ అమ్మగారికి మాట ఇచ్చినప్పుడు దివ్యమ్మ మీది అని గుర్తు లేదా ఒంట్లో చివాట్లు పెడతాడు దేవుడు. నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ నువ్వు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అనలేదు అంటాడు విక్రమ్.

ప్రేమలో పడ్డాక మీ బ్రెయిన్ షార్ప్ అయింది అంటూ ఆట పట్టిస్తాడు దేవుడు. మరోవైపు మంచాన పడ్డ తులసికి నందు సేవలు చేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆమెకి సుఖాన్ని ఇవ్వటం లేదు అంటూ గిల్టీగా ఫీల్ అవుతాడు.నటించమంటే జీవిస్తున్నావు అంటూ నందుకి చివాట్లు పెడుతుంది లాస్య. నీకు ఎలాగూ భర్త లేడు వాళ్ళనైనా విడదీయొద్దు అంటాడు వాసుదేవ్.

నందు ఈరోజు రాడు కేఫ్ నువ్వే చూసుకో అంటాడు వాసుదేవ్. చేసేదిలేక కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు కూరగాయలు కొనడానికి వచ్చిన దివ్యతో కబుర్లలో పడతాడు విక్రమ్. అది గమనించిన భాగ్యం విషయాన్ని లాస్యకి చేరవేస్తుంది. తులసికి సేవలు చేస్తున్న నందుని మీరు మారిపోయారు బాబు కానీ ఒప్పుకోవటానికి ధైర్యం చాలడం లేదు.

తులసమ్మకి జ్వరం తగ్గకుండా ఉంటే బాగున్ను అంటూ కిచెన్ నుంచి బయటికి వచ్చేస్తుంది రాములమ్మ. మరోవైపు తల్లికి సేవలు చేస్తున్న తండ్రిని చూసి ఆనందిస్తుంది దివ్య. అమ్మ నాన్న ఇంత అన్యోన్యంగా ఉండడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం కానీ ఇది శాశ్వతం కాదని తెలిసి బాధనిపిస్తుంది అంటూ నానమ్మ తాతయ్యకి చెప్పుకుంటుంది దివ్య. ఇలాంటి మంచి భార్యని వదులుకున్నందుకు నంది మీద జాలి పడతారు అనసూయ దంపతులు.

మరోవైపు తులసి శకుంతలనే ఆవిడని పంపించి ఆవిడ సంగతి దివ్య ని చూడమని చెప్తుంది. విషయం తెలుసుకున్న దివ్య మేనేజ్మెంట్ తో ఫైట్ చేసి ఆవిడకి పది లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తుంది. దివ్య మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుంటుంది రాజ్యలక్ష్మి కానీ బయటకు మాత్రం మంచి దానిలాగా నటిస్తుంది. మరోవైపు కెఫీకి వెళ్లిన లాస్య, నందుతో తులసికి నక్లెస్ గిఫ్ట్ ఇవ్వవలసిన అవసరం ఏం వచ్చింది.

నాకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అని అంటుంది. నీ మాటలకి అర్థం లేదు. మేమిద్దరం భార్యాభర్తలు గా నటించాలన్న డెసిషన్ నీదే ఆ ప్రాసెస్ లో ఇలాంటివి జరుగుతుంటాయి ప్రతిదీ భూతద్దంలో చూడొద్దు నీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే దేవ్ కి నిజం చెప్పేయ్ అంటాడు నందు. మరోవైపు విక్రమ్ గురించిన హిస్టరీ ఎంత తెలుసుకొని లాస్యకి చెప్తుంది భాగ్యం. అలాంటి దురదృష్టవంతుడితో లాస్యకి ఫ్రెండ్షిప్ ఏంటో ఉంటుంది భాగ్యం.

అదంతా మన అదృష్టం అంటుంది లాస్య. మరోవైపు బైక్ పాడవడంతో ఒంటరిగా నడిచి వెళుతున్న దివ్యకి తోడుగా వస్తుంటాడు విక్రమ్. ఆ సమయంలో దివ్యని రౌడీలు ఏడిపిస్తే వాళ్ళని తన్ని పంపిస్తాడు. విక్రమ్ తెగింపు కి, విక్రం మాటలకి ఫ్లాట్ అయిపోతుంది దివ్య. మరోవైపు నా బాధిక సేవలు చేస్తున్న నందుని చూసి ఆనందిస్తారు వాసుదేవ్ దంపతులు.

మరోవైపు జ్వరం నుంచి కోలుకున్న తులసిని రెస్ట్ తీసుకో పనిచేయటానికి ఇంట్లో చాలామంది ఉన్నారు అంటాడు నందు. తనని పలకరించడానికి వచ్చిన వాసుదేవ్ దంపతులు నందు నీకోసం చాలా కష్టపడ్డాడు అని తులసి ముందు మెచ్చుకుంటారు. వాడు మారితే చాలు అనుకున్నాము ఇప్పుడు మారిన నందుని చూస్తే చాలా ఆనందంగా ఉంది మేము తృప్తిగా అమెరికా వెళ్ళిపోతాము అంటాడు వాసుదేవ్.

మరోవైపు గుడ్ మార్నింగ్ పెట్టిన దివ్యకి తన మనసులో మాట చెప్పేస్తాను అంటాడు విక్రమ్. అంతలోనే రాజ్యలక్ష్మి వచ్చి విజయవాడ వెళ్లి అక్కడ రెండు రోజులు ఉండాలి అంటుంది. ఇష్టం లేకపోయినా ఆ పని చేయటానికి ఒప్పుకుంటాడు విక్రమ్. అయితే మీరు ఈ అవకాశాన్ని మరో విధంగా వాడుకోండి ఈ రెండు రోజులు దివ్య ఫోన్ ఎత్తకండి. మీరు కూడా చేయకండి.

విరహాన్ని భరించలేక తనే తన ప్రేమను బయటపెడుతుంది అంటాడు దేవుడు. మరోవైపు సంజయ్ చేతిలో మోసపోయాను దయచేసి మేనేజ్మెంట్ తో నా తరఫున ఫైట్ చేయండి అంటూ హెల్ప్ అడుగుతుంది ప్రియ. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంటుంది దివ్య. మీ ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందేమో అంటుంది ప్రియ. నీకు జరిగే న్యాయం ముందు నా ఇబ్బంది ఏమాత్రం నా దగ్గర చదువు ఉంది ఎలాగైనా బ్రతుకుతాను అంటుంది దివ్య.

మరోవైపు విజయవాడ బయలుదేరిన విక్రమ్, దివ్య ఇంకా ఫోన్ చేయలేదు అంటూ దేవుడికి ఫోన్ చేసి సతాయిస్తూ ఉంటాడు. అదే సమయంలో దివ్య సంజయ్ అన్యాయం చేశాడు న్యాయం కావాలి అంటూ హాస్పిటల్ ముందు టెంట్ వేసి ధర్నా చేస్తుంది. నిజం చెప్తే ఎక్కడ విక్రం వెనక్కి వచ్చేస్తాడు అని తెలియకుండా మేనేజ్ చేస్తాడు దేవుడు. మరోవైపు అగ్రిమెంట్ పేపర్స్ నందు చేతిలో పెట్టి ఈ ప్రాజెక్టులో కూడా తులసి నీకు మంచి సపోర్ట్ ఇస్తుంది.ఈ డీలింగ్ కేవలం నేను తులసిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాను అంటాడు.

 

Intinti Gruhalakshmi దివ్య లవ్ స్టోరీ తో సీరియల్ ఇంకా బాగుంది అంటూ మరింత రేటింగ్ ఇస్తున్న ప్రేక్షకులు..

మోసం చేసి గెలిచిన గెలుపు గెలుపు కాదు నిజం చెప్పేద్దామనుకుంటున్నాను అంటూ వాసుదేవ్ కి నిజం చెప్తాడు నందు. ఇందులో తులసి తప్పులేదు కేవలం నాకోసమే సహాయం చేసింది అంటూ ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు. నిజం తెలుసుకున్న వాసుదేవ్, నందు కి ఫ్రాంచైజీ ఇస్తాడా? ప్రియ మెడలో సంజయ్ తాళి కడతాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మార్చి 26, 2023 at 8:05 ఉద.