Intinti Gruhalakshmi: భర్త తనకు విడాకులు ఇచ్చినా తనని కావాలి అనుకుంటున్న అత్తింటి వాళ్ల కోసం పోరాడుతున్న ఒక స్త్రీ కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి.ఈవారం ఏం జరిగిందో చూద్దాం

లాస్య మీద ఎదురు తిరుగుతారు శృతి, అంకితలు. వాళ్లతో గొడవపడ్డొద్దు అని పరంధామయ్య అంటే అతన్ని కూడా నానా మాటలు అంటుంది లాస్య. ఆ గొడవలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది శృతి. ఏం జరిగిందో అని కంగారుపడుతున్న కుటుంబ సభ్యులకి శృతి తల్లి కాబోతుందని అంకిత శుభవార్త చెప్తుంది. అదే విషయాన్ని తులసితో చెప్తే ఆమె సంతోష్ పడిపోతూ సారె తీసుకొస్తుంది.

ఆమెకి గుమ్మంలోని ఎదురైన లాస్య ఇంట్లో ఫేస్బుక్ కార్యమైన నా చేతుల మీదుగానే జరగాలి అంటూ తులసిని బయటకు పొమ్మంటుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన తులసికి ధైర్యం చెప్పి మీ కోడల్ని హత్తుకునే హక్కు మీకు ఉంది ధైర్యంగా వెళ్లి ఆ పని చేయండి మీ పక్కన నేను ఉంటాను అని స్ఫూర్తి నింపుతాడు సామ్రాట్. మరోవైపు ఇంట్లో జరిగిన గొడవనంతా నందు కి చెప్తారు కుటుంబ సభ్యులు. నందు మాత్రం లాస్యకే సపోర్ట్ చేస్తాడు.

సామ్రాట్ తో పాటు ఇంటికి వచ్చిన తులసిని నానా మాటలు అంటారు నందు దంపతులు. ఇది మా ఇంటి వ్యవహారం అంటూ సామ్రాట్ ని బయటకు పొమ్మంటారు. లాస్య బయటకు వెళ్తే నేను కూడా బయటికి వెళ్తాను అంటాడు సామ్రాట్. గొడవలు పెంచడం ఇష్టం లేదు అని తన ఇంటికి వెళ్ళిపోతుంది తులసి. ఆ వెనకే సామ్రాట్ కూడా వెళ్ళిపోతాడు. పార్షియాలిటీ చూపించిందని శృతిని మందలిస్తాడు నందు. ఆనందంగా జరుపుకోవాలని ఇలా అయినందుకు శృతికి సారీ చెప్తాడు ప్రేమ్.

అత్తయ్యని ఇక్కడికి రావద్దు అన్నారు కానీ మనం అక్కడికి వెళ్ళకూడదు అని లేదు కదా మనం అక్కడికే వెళ్లి సెలబ్రేట్ చేసుకుందాం అంటుంది శృతి. ఒక ఒక పరంధామయ్య దంపతులు తప్ప ఇంట్లో అందరూ తులసి దగ్గరికి వెళ్తారు. తులసి వల్లే మన పిల్లలు మన మాట వినటం లేదు, ఇప్పుడు తులసి లేదు కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్ ని మనం వాళ్ళని హోటల్ కి తీసుకెళ్లి సెలెబ్రేట్ చేద్దాం అని నందు తో చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ పిలవడానికి వెళుతుంది లాస్య.

కానీ అక్కడ ఎవరు కనిపించకపోవడంతో మావయ్య పుట్టినరోజు లాగా ఇప్పుడు కూడా చేశారేమో అని అనుమాన పడి అభి కి ఫోన్ చేస్తుంది. కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. దాంతో మామగారి ఫోన్ తో దివ్య కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసింది తాతయ్య ఏమో అనుకొని మేము అమ్మ వాళ్ళు ఇంట్లో అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీరు కూడా వచ్చేయండి అంటుంది దివ్య. ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన లాస్య జరిగిందంతా నందు కి చెప్తుంది. కోపంతో రగిలిపోయిన నందు తాడోపేడో తేల్చుకుంటాను అంటూ తులసి ఇంటికి బయలుదేరుతాడు.

మరోవైపు పార్టీలో ఎంజాయ్ చేస్తున్న శృతి బెలూన్ మీద కాల్ వేసి పడిపోతుంది. కడుపు నొప్పితో వెలవెల్లి ఆడుతున్న శృతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆవేశంతో తులసి ఇంటికి వచ్చిన నందుకి అక్కడ ఎవరూ కనిపించరు. పార్టీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు బయటికి తినడానికి వెళ్లిఉంటారు అంటూ నందుని రెచ్చగొడుతుంది లాస్య. ప్రతికి టెస్టులు చేసిన డాక్టర్ ని ఎలా ఉంది అంటే రిపోర్ట్స్ వచ్చాక చెప్తాము అంటుంది. అంతలోనే నందు అభికి ఫోన్ చేసి మీరంతా ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు.

అభి జరిగిందంతా చెప్తాడు. కోపంతో రగిలిపోయిన నందు హాస్పిటల్ కి వచ్చి తులసిని నానా మాటలు అంటాడు. ఆ మాటలు వింటూ భరించలేక సామ్రాట్ అడ్డుపడతాడు. సామ్రాట్ ని అసహ్యంగా మాట్లాడుతుంది లాస్య. నా వారసుడికి ఏమైనా జరిగిందంటే నాలోనే రాక్షసుడిని చూస్తావు అంటాడు నందు. నందు సామ్రాట్ లో వాదించుకుంటుంటే ఇప్పుడు సమయం కాదు ఊరుకోమంటుంది తులసి.

రూమ్ లోంచి బయటకు వచ్చినా డాక్టర్ శృతికి బానే ఉంది అని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసిస్తుంది. కోడల్ని చూడ్డానికి వెళ్ళబోతున్న నందుని ఆపి ఇందాక ఏదో చెప్తున్నారు కదా కంగారులో ఉన్నాను ఇప్పుడు మాట్లాడండి మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అంటూ నందుని కడిగిపారేస్తుంది తులసి. ప్రేమ్ ఇక నేను ఆ ఇంట్లో ఉండను మామ్ తో పాటు వెళ్లిపోతాను అంటాడు. నా గురించే సామ్రాట్ గురించి ఇంకొక్కసారి చెత్తగా మాట్లాడితే నీ సంగతి చూస్తాను అంటుంది తులసి.

Intinti Gruhalakshmi సామ్రాట్ నటన సీరియల్ కి హైలెట్ అంటున్న ప్రేక్షకులు..

హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో జరిగిందని గురించి మాట్లాడుకుంటారు సామ్రాట్ వాళ్ళు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది రేపు మీటింగ్ గురించి ఆలోచించండి బాధ్యత అంతా మీ మీదే పెట్టాను అంటాడు సామ్రాట్. మరోవైపు ఇంటికి తీసుకువచ్చిన శృతికి అత్తయ్య ఇచ్చారు అంటూ గ్లూకోజ్,టాబ్లెట్లు ఇస్తుంది అంకిత. ఇంట్లో అందరూ అస్తమానం తులసి గురించి మాట్లాడుతుంటే కోపంతో రగిలిపోతాడు నందు. ప్రేమ్ నిజంగానే తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడా? తులసి మీద పెట్టిన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తుందా? నందు,లాస్య నిజ స్వరూపం తెలుసుకుంటాడా ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జనవరి 1, 2023 at 10:15 ఉద.