Intinti Gruhalakshmi: ఓ ఆడపిల్ల తనని అవమానించినందుకు జీవితాంతం ఆమెకి శిక్ష విధించాలని నిర్ణయించుకొని కసితో ఇంటి కోడల్ని చేసుకొని హింసించాలని ప్రయత్నిస్తున్న ఒక అత్త కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఈవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

దివ్యకి సంబంధం చూసినందుకు లాస్యకి థాంక్యూ చెప్తుంది తులసి. రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అంటుంది లాస్య. తులసి ఒప్పుకోవడంతో అదే విషయాన్ని రాజ్యలక్ష్మి కి చెప్తుంది. పెళ్లి కూడా నీదే బాధ్యత అప్పుడే చేతికి వస్తుంది అంటుంది రాజ్యలక్ష్మి. తన ప్రేమ విషయం తల్లికి చెప్పకపోతే నాకు ముందే తెలుసు అందుకే పెళ్లిచూపులు కూడా ఏర్పాటు చేశాను అంటూ విక్రమ్ కి షాక్ ఇస్తుంది రాజ్యలక్ష్మి.

 

దివ్యని ఇంటి కోడలుగా తెచ్చుకొని తప్పు చేస్తున్నావేమో అంటాడు బసవయ్య. జీవితాంతం హింసించాలంటే ఇదే మార్గం అంటుంది రాజ్యలక్ష్మి. ఇదంతా చాటుగా విన్న ప్రియ ఎలాగైనా దివ్యకి విషయాన్ని చెప్పాలనుకుంటుంది . మరోవైపు దివ్య, అమ్మ నాన్న కలిసి నాకు కన్యాదానం చేయాలి అంటుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది తులసి.

 

మరోవైపు దివ్యకి విషయాన్ని చెప్పడం కోసం ప్రయత్నిస్తూ అత్తగారికి దొరికిపోతుంది ప్రియ. మళ్లీ ఇలా చేస్తే దివ్య ప్రాణానికి ప్రమాదం అంటూ హెచ్చరిస్తుంది రాజ్యలక్ష్మి. దివ్య పెళ్లి బాధ్యత నాది అంటూ బాధ్యత తీసుకుంటాడు నందు. తులసి అడ్డు చెప్పబోతే నా కూతురు కోసం నేను చేసే ఆఖరి అవకాశం ఇదే అంటాడు నందు. మరోవైపు దయచేసి దివ్యని వదిలేయండి కావాలంటే నా మీద కసి తీర్చుకోండి ఉంటుంది ప్రియ.

 

అలా కుదరదు తను ఈ ఇంటి కోడలు అవ్వాలి నీలాగే తను కూడా కన్నీటితో ప్రాధేయపడాలి అంటుంది రాజ్యలక్ష్మి. త్వరలోనే అందరిని వదిలి వెళ్ళిపోవాలి అంటూ బాధపడుతుంది దివ్య. పరంధామయ్య దంపతులు ఆమెకి ధైర్యం చెప్తారు. మన వైపు దివ్య చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆనందపడతాడు నందు.

 

అప్పుడే వచ్చిన తులసీతో మన ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేయి అన్నమాట నిజమే కానీ పిల్లల్ని ఎప్పుడూ దూరం చేసుకోవాలనుకోలేదు అంటాడు. ఆ మాటలు విన్న దివ్య ఎమోషనల్ అవుతుంది. మరోవైపు మా అత్తగారు అన్నందుకు దివ్యని ఆట పట్టిస్తుంది అనసూయ. ఆ మాటలకి కోప్పడుతుంది దివ్య. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకు ఎంత బాధ పడుతున్నావో అంతకంటే ఎక్కువ మీ నానమ్మ బాధపడుతున్నారు అంటూ దివ్యకి చెప్తుంది తులసి.

 

మరోవైపు రాజ్యలక్ష్మి గారి లాంటి అత్తగారు నీకు దొరుకుతున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆవిడ ప్రేమని చూస్తే నాకే ఈర్ష్యగా ఉంది అంటుంది తులసి. మరోవైపు విక్రంతో నిజం చెప్పటానికి ప్రయత్నిస్తూ బసవయ్యకి దొరికిపోతుంది ప్రియ. మరోవైపు పెళ్లి బట్టలు సెలెక్ట్ చేస్తున్న తల్లిదండ్రులను చూసి ఎమోషనల్ అవుతుంది దివ్య. దివ్య వాళ్ళు బట్టల షాప్ లో ఉన్నారని తెలుసుకుని విక్రమ్ కూడా షాప్ కి వస్తాడు.

 

డ్రెస్సింగ్ రూమ్ లో కలుసుకోవటానికి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి దొరికిపోయి అడ్డంగా బుక్ అయిపోతారు. పెళ్లయ్యే వరకు హద్దుల్లో ఉండండి అంటూ హెచ్చరిస్తుంది తులసి. మరోవైపు తులసికి ఫోన్ చేసి దివ్య ఇకనుంచి నా కూతురుతో సమానం తనని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. అతి త్వరలోనే దివ్య పులిబోనులోకి అడుగుపెట్టబోతుంది అంటూ ప్రియకి చెప్తుంది రాజలక్ష్మి.

 

నన్ను ఎలాగో ఇబ్బంది పెడుతున్నారు కనీసం దివ్యమైన వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ప్రియ. అయితే నా కొడుక్కి విడాకులు ఇచ్చేయి అంటుంది రాజ్యలక్ష్మి. ప్రియ కుదరదు అనడంతో అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు తులసి కోసం చీర గిఫ్ట్ తీసుకొస్తాడు నందు. అందరి ముందు ఇవ్వండి అది మీకు మంచిది నాకు మంచిది అంటుంది తులసి.

 

నెక్స్ట్ టైం అలాగే చేస్తాను ఈసారి కి తీసుకో అంటాడు నందు. మరోవైపు దివ్యతో మాట్లాడాలి అనుకున్న విక్రమ్ గోడదూకి దివ్య రూమ్ లోకి ప్రవేశిస్తాడు. అది గమనించని దివ్య దొంగ అనుకొని గట్టిగా అరుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఏమైంది అని అడుగుతారు. అప్పటికే వచ్చింది విక్రమ్ అని తెలుసుకున్న దివ్య పీడకల అంటూ అందరికీ సర్ది చెప్పి బయటికి పంపించేస్తుంది.అందరూ వెళ్ళిపోయిన తరువాత ఈ టైంలో రావడం మంచిది కాదు వెళ్లిపోండి అంటూ నెట్టేస్తుంది.

 

Intinti Gruhalakshmi   కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ కథలో ఏ మాత్రం పస తగ్గలేదంటూ మంచి రేటింగ్ ని ఇస్తున్న ప్రేక్షకులు.

 

 

ఆ హడావుడికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్లీ రూమ్ లోకి వస్తారు. అందరి ముందు అడ్డంగా బుక్ అయిపోతాడు విక్రమ్. నీ అవస్థ నాకు అర్థమైంది కానీ ఇది సరి అయిన సమయం కాదు అంటూ విక్రమ్ ని బయటికి తీసుకొళ్ళిపోతాడు నందు. మరోవైపు నందు ఇంట్లో పెళ్లి హడావుడి స్టార్ట్ అవుతుంది. పెళ్లి తర్వాత దివ్య జీవితం ఎలా మారిపోతుంది? భార్యకి విక్రమ్ అండగా నిలుస్తాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 9, 2023 at 8:13 ఉద.