Intinti Gruhalakshmi: డబ్బు కోసం సవతి కూతురు జీవితాన్ని తాకట్టు పెట్టి డబ్బు సంపాదించాలి అనుకుంటున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

 

ఈవారం ఎపిసోడ్ లో తులసి ఇంట్లో బంధువుల రాకతో పెళ్లి హడావిడి ప్రారంభమవుతుంది. ప్రేమ్ వస్తూ వస్తూనే చెల్లెల్ని ఆటపట్టిస్తాడు. మా అన్నయ్య కూడా ఇలాగే చేసేవాడు అంటూ ఎమోషనల్ అవుతుంది మాధవి. మరోవైపు తన పుట్టింటి వారు రానందుకు మాధవి దగ్గర బాధపడుతుంది తులసి.

 

ఆ మాటలు నిన్న నందు ఎలాగైనా అత్తగారిని ఇంటికి తీసుకురావాలని బయలుదేరుతాడు. అల్లుడ్ని గుమ్మం బయటే నిలబెట్టి నానా మాటలు అంటుంది సరస్వతి. నేను చేసిన తప్పుకి నా భార్య ని పిల్లలని శిక్షించవద్దు. వాళ్లకి మీ ప్రేమ కావాలి అంటూ అత్తగారి కాళ్ళ మీద పడతాడు నందు.

 

అల్లుడులో వచ్చిన మార్పుకి సంతోషించి కొడుకు కోడలు తో సహా బయలుదేరుతుంది సరస్వతి. మరోవైపు విక్రమ్ కొరియర్ పంపించాడని తెలుసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది దివ్య. తను టెన్షన్ పడినట్లుగానే ఆ కొరియర్ ప్రేమ్ చేతిలో పడుతుంది. విక్రమ్ రాసిన లెటర్ ని అందరి ముందు చదివి వినిపిస్తాడు ప్రేమ్.

 

అందరూ దివ్యని ఆటపాటిస్తారు. సిగ్గుతో దివ్య అక్కడ నుంచి పరిగెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంటికి తీసుకువచ్చిన దీపక్ వాళ్లకి మర్యాదలు చేయబోతే తను బంధువు కాదు పెళ్లికూతురు మేనమామ రేపు మీ కూతురిని బుట్టలో మోయవలసింది అతనే తను మర్యాదలు అందుకోవడానికి కాదు పెళ్లి పనులు చేయడానికి వచ్చాడు అంటుంది సరస్వతి.

 

సడన్ గా ఇంట్లో తల్లిని చూసి ఎమోషనల్ అవుతుంది తులసి. నందు పిలిస్తే వచ్చాము అని సరస్వతమ్మ చెప్పడంతో భర్త ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది తులసి. కూతురి పెళ్లి పేరు చెప్పుకొని మళ్ళీ చుట్టారికాలు స్టార్ట్ చేశారన్నమాట అని కోపంగా అనుకుంటుంది లాస్య. మనవరాలిని వెళ్లి పలకరిస్తే తను బుంగమూతి పెడుతుంది.

 

నిశ్చితార్థం అప్పుడు గుర్తు రాలేదు ఇప్పుడు వస్తే అలుగుతావా అంటూ మనవరాల్ ని ఆట పట్టిస్తుంది సరస్వతి. మరోవైపు తల్లిని తీసుకొచ్చినందుకు భర్తకి కృతజ్ఞతలు చెప్తుంది తులసి. అలాంటిదేమీ లేదు నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నం అంతే అంటాడు నందు.

తులసి ఇంట్లో పసుపు ఫంక్షన్ ప్రారంభమవుతుంది. అందరూ హడావుడిగా ఆ పని ప్రారంభిస్తారు.

 

బాధ్యతగా పనిచేస్తున్న తండ్రిని చూసి ఎమోషనల్ అవుతుంది దివ్య. నాకు అవసరమైనప్పుడు తండ్రి ప్రేమ దక్కలేదు ఇప్పుడు దక్కుతుంది అనే సమయానికి నేను ఇక్కడ ఉండటం లేదు అని తల్లితో చెప్తుంది. అనుకున్నప్పుడు అన్ని దొరకవు దొరికిన వాటితోనే సర్దుకోవాలి అంటుంది తులసి. మరోవైపు విక్రమ్ పెళ్లి ఘనంగా చేయటం లేదని కోడల్ని మందలిస్తాడు రాజ్యలక్ష్మి మామగారు.

 

వాడే వద్దన్నాడు అని రాజ్యలక్ష్మి చెప్పినా వినిపించుకోడు. అప్పుడే వచ్చిన బసవయ్య ముసలోడు నిన్ను రెచ్చగొడుతున్నాడు అంటాడు. అంతకుమించి ఏం చేయగలరు అంటూ మామ గారిని తీసి పారేస్తుంది రాజ్యలక్ష్మి. మరోవైపు పెళ్లి కూతురికి బట్టలని మాధవి వాళ్ళ చేత కాకుండా దీపక్ వాళ్ళ చేత ఇప్పిద్దాం అంటాడు నందు.

 

అందుకు ఆనందంగా ఒప్పుకున్నా మాధవి.. వాళ్లు నీకు ఎంతో నాకు అంతే అంటుంది. జీవం కోల్పోయిన బంధాలకి మళ్లీ ప్రాణం పోస్తున్నావు బావ అంటూ ఎమోషనల్ అవుతాడు దీపక్. మరోవైపు పెళ్లికూతురు ముస్తాబు అవుతున్న దివ్యకి విక్రమ్ వీడియో కాల్ చేస్తాడు. అక్కడ అందరూ ఉన్నారు అని చూసుకోకుండా ఏవేవో మాట్లాడేస్తాడు. తర్వాత తెలుసుకుని సిగ్గుపడి ఫోన్ పెట్టేస్తాడు.

 

దివ్యని కూడా అందరూ ఆటపట్టించడంతో సిగ్గు పడిపోతుంది.మరోవైపు విక్రమ్ చేత పూజ చేస్తున్న పంతులుగారు పువ్వులు దేవుని దగ్గర వేయమంటారు. విక్రమ్, రాజ్యలక్ష్మి పాదాల దగ్గర పెడతాడు. ఇదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది రాజ్యలక్ష్మి నాకు తల్లి తర్వాతే ఎవరైనా అంటాడు విక్రమ్. ఇప్పుడు అందరూ ఇలాగే అంటారు పెళ్లయితేనే అందర్నీ మార్పులు వస్తాయి అంటాడు బసవయ్య. నా జీవితంలో ఎప్పటికీ అలా జరగదు తల్లి తర్వాతే ఏ బంధమైనా రాసి పెట్టుకో మావయ్య అంటాడు విక్రమ్.

 

మరోవైపు విక్రమ్ ని తండ్రి దగ్గరికి తీసుకు వెళ్తాడు అతని తాతయ్య. నీకోసం తల్లిని తీసుకొని వస్తే ఆమె ఉన్న తండ్రిని దూరం చేసింది అంటాడు. ఎందుకు తాతయ్య అమ్మని అపార్థం చేసుకుంటావు మీరు మారరా అంటూ తాతయ్య మీద కోప్పడతాడు. అయినా అమ్మా నన్ను చాలా బాగా చూసుకుంటుంది నాన్న మీరు ఏమి నా గురించి బెంగ పెట్టుకోవద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.

 

వాడు మనం చెప్తే వినే పరిస్థితుల్లో లేడు మన ఆశలన్నీ వచ్చే కోడలు పిల్ల మీదే అని కొడుక్కి చెప్తాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. మరోవైపు పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న దివ్యని చూసి ఎమోషనల్ అవుతాడు నందు. ఆడపిల్ల పెళ్లయిపోతే బాధ్యత తీరిపోయింది అనుకుంటారు కానీ అసలైన బాధ్యత అప్పుడే మొదలవుతుంది అంటాడు.

 

కొడుకు మాటలకి సంతోషిస్తాడు పరంధామయ్య. మరోవైపు దివ్య కి ఎలాగైనా నిజం చెప్పాలనుకున్న ప్రియకి సంజయ్ ఫోన్ కనిపిస్తుంది. దాంతో దివ్యకి ఫోన్ చేద్దామని లోపు రాజ్యలక్ష్మి వచ్చి ఫోను లాక్కొని ఆమెని గదిలో పడేస్తుంది. పిచ్చిపిచ్చి వేషాలు వేసావంటే నీ ప్రాణాలతో పాటు నీ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయి అంటూ హెచ్చరిస్తుంది రాజ్యలక్ష్మి.

 

దివ్యని వదిలేయండి అంటూ ప్రియ బ్రతిమాలుతుంది. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అన్నీ బూడిదలో పోసిన పన్నీరు చేసింది అందుకే నేను దాని జీవితాన్ని బూడిది చేస్తాను అంటుంది రాజ్యలక్ష్మి. తర్వాత పని వాళ్ళతో నేను వెళ్ళాక ఈ గదిని తాళం వేయండి.

 

కాదు కూడదు అని వేరే విధంగా చేస్తే నా సంగతి తెలుసు కదా అంటూ వాళ్ళని కూడా బెదిరించి పెళ్లి మండపానికి బయలుదేరుతుంది రాజ్యలక్ష్మి. మరోవైపు పెళ్లి మండపంలో గౌరీ పూజ చేస్తున్న దివ్యకి గౌరీ పూజ విశిష్టత చెప్తుంది సరస్వతి. మగ పెళ్లి వాళ్ళని ఎదురెళ్లి ఆహ్వానిస్తారు ఆడపిల్ల వాళ్ళు.

 

లాస్య, రాజ్యలక్ష్మి తో రాసుకు పూసుకు తిరగడం గమనించిన నందు ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిస్తాడు. మరోవైపు గదిలో ఉన్న ప్రియ తలుపులు తీయండి దివ్యని కాపాడాలి లేకపోతే నేను చనిపోతాను అంటుంది.

Intinti Gruhalakshmi:    సీరియల్ ని ఎంత సాగదీసినా కథలో బలం తగ్గలేదంటూ మంచి రేటింగ్ ని ఇస్తున్న ప్రేక్షకులు..

 

కరిగిపోయిన పనిమనిషి తలుపు తీసి ఆడపిల్ల ఉసిరి పోసుకోవటం మంచిది కాదు ఇక్కడ పని పోతే వేరే పని వెతుక్కుంటాము వెళ్లి దివ్యని కాపాడు అంటూ ప్రియని పంపిస్తుంది. మరి ప్రియ, దివ్య జీవితాన్ని కాపాడగలుగుతుందా? తల్లిలో ఉన్న మనో మరో మనిషి గురించి విక్రమ్ తెలుసుకోగలుగుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 16, 2023 at 9:10 ఉద.