Intinti Gruhalakshmi: కుటుంబ సభ్యుల ముందు అవమానం పొందుతున్న మాజీ భర్తకి సాయం చేయబోయి భంగపడ్డ ఒక మాజీ భార్య కధ ఈ ఇంటింటి గృహలక్ష్మి.

దివ్య ని కిడ్నాప్ చేసిన తను ఫ్రెండ్స్ ఇద్దరూ వాళ్ళ రూమ్ కి తీసుకొని వెళ్ళిపోతారు. జిపిఎస్ యాప్ ద్వారా తన లొకేషన్ కనుక్కొని ఆమెని సేవ్ చేస్తుంది తులసి. తన పోలీస్ ఫ్రెండ్ ద్వారా ప్లేస్ ని కనుక్కొని నందు కూడా అక్కడికి వస్తాడు. కార్తీక్ కి చేతన్ కి నాలుగు చివాట్లు పెట్టి తన కూతురి పేరు బయటకు రాకుండా వాళ్ళని పోలీసులకి అప్పగిస్తుంది. ఇంటికి వచ్చిన దివ్య చాలా భయపడిపోతూ ఉంటుంది.

తను చాలా భయపడుతుంది ఈ ప్రస్తావన తన దగ్గర తేవద్దు అంటూ కుటుంబ సభ్యుల్ని వేడుకుంటుంది. కూతురు దగ్గరికి భోజనం తీసుకుని వెళ్లి మీకు తల్లి అంటే ఒక చులకన కానీ ఒక తల్లి విలువ మీరు తల్లి అయితే తెలుస్తుంది లేకపోతే ఇలాంటి సంఘటన జరిగితే తెలుస్తుంది అంటూ హితబోధ చేస్తుంది. ఇంకెప్పుడూ తన వల్ల ఇబ్బంది కలగదని మాట ఇస్తుంది దివ్య. బయటికి వచ్చిన తులసి నా పిల్లల విషయంలో జోక్యం చేసుకున్నామంటే ఊరుకునేది లేదు అంటూ లాస్యని హెచ్చరిస్తుంది.

మరోవైపు లాస్య, తులసి లాగా ఉత్తమ ఇల్లాలు అనిపించుకోవాలని ప్రయత్నించి విఫలమవుతుంది. కుటుంబ సభ్యుల ముందు నవ్వుల పాలవుతుంది. మారాలి అంటే మనసు మారితే చాలు వేషం మార్చక్కర్లేదు అంటూ భాగ్యం సలహా ఇస్తుంది. మరోవైపు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన లెటర్ చూసి నందు కోపంతో తులసి మీద రెచ్చిపోతాడు నందు. నేను ఎంత చేతకాని వాడినైతే మాత్రం చచ్చిపోలేదు కదా కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా అంటూ తులసిని నిలదీస్తాడు.

నీకు కూడా అక్కర్లేకపోయాను అంటూ కూతుర్ని అడుగుతాడు. నేను అంత దూరం ఆలోచించలేదు అంటూ తండ్రికి నచ్చ చెప్తుంది దివ్య. ఢిల్లీ యూనివర్సిటీలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి, అందులో చదివితే తన భవిష్యత్తు బాగుంటుంది నేను గ్యారెంటీ అంటూ అభి స్ట్రాంగ్ గా చెప్తాడు. మీ అందరికీ ఇష్టమైతే నేను మాత్రం ఎందుకు వద్దనాలి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు నందు. మరోవైపు బయటికి వెళ్తున్న నందు కారు లేదని విషయం గుర్తొచ్చి లోపలికి వచ్చి అభిని కారు అడుగుతాడు.

నాకు చాలా పని ఉంది మీకు ఏం పని అంటూ చులకనగా మాట్లాడుతారు కొడుకులు ఇద్దరు. లాస్య కూడా అతనికి కాఫీ ఇవ్వకుండా అవమానిస్తుంది. పరంధామయ్య తన కాఫీ కొడుకుకి ఇవ్వాలని చూస్తాడు కానీ ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్న నందు సంపాదన లేకపోతే నాకు విలువ లేదు అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు. నందుని అలా అవమానించడం నందు బాధపడటం తులసి. తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నందుని రికమెండ్ చేస్తుంది కానీ ఆ విషయం నందు కి తెలియనీయవద్దు అంటుంది.

ఈ మాటలు విన్న పరంధామయ్య నీ భర్త మీద ఇంకా అభిమానం పోలేదా అంటే నాకు అతని మీద ఎలాంటి అభిప్రాయము లేదు కానీ అతని ప్రవర్తనతో ఇంటిలిపాదిని బాధపెడుతున్నాడు అందుకే అని చెప్తుంది తులసి. ఆ వ్యక్తి నందు కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ కి రమ్మంటే షాక్ అవుతారు నందు దంపతులు. ముందు నమ్మరు కానీ అన్ని డీటెయిల్స్ చెప్తే రేపు ఇంటికి వస్తాను అంటాడు నందు. ఇంటర్వ్యూకి బయలుదేరబోతున్న నందుకి అప్పుడే ఇంటికి వచ్చిన మాధవి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. చెల్లెల్ని చూసిన నందు ఆరోజు ఎందుకు అలాగా మాట్లాడాను క్షమించు అంటూ దగ్గరికి తీసుకుంటాడు.

తులసి పిలిస్తే వచ్చిందని నందుకి తెలియనివ్వరు. నా పిలుపు మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం అంటూ ఆడపడుచుకి ఆమె భర్తకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది తులసి. నందు ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ముగ్గుల పోటీ పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్లిన నందు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు కానీ రికమండేషన్ ద్వారా వచ్చిందని తెలుసుకొని ఆ అపాయింట్మెంట్ లెటర్ ని ఆ మేనేజర్ మొఖానికి కొట్టి వచ్చేస్తాడు.

Intinti Gruhalakshmiకధ మన ఇంట్లోనే జరుగుతున్నట్లుగా, ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ ఓన్ చేసుకున్న ప్రేక్షకులు..

ఇంటికి వచ్చి భారీ మీద కేకలు వేస్తాడు నేను నిన్ను అడుక్కున్నాను. నేను అంతా పనికిమాలిన వాడినా,నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అంటూ నానా మాటలు అంటాడు.అనవసరంగా మాట తూలొద్దు అంటూ మాధవి భర్త,పరంధామయ్య ఎంత చెప్పినా వినిపించుకోరు. అతని మాటలకు మనసు విరిగిపోయిన తులసి బుద్ధి గడ్డి తిని మీ విషయంలో జోక్యం చేసుకున్నాను మరి ఎప్పుడు మీ జోలికి రాను అంటూ దండం పెట్టేస్తుంది. నందు, తులసిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? లాస్య ఉత్తమ ఇల్లాలు అవుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకు ఆగాల్సిందే.